
సాక్షి, న్యూఢిల్లీ: బీజేపీకి ఓటేయలేదని తమిళ ప్రజలపై కేంద్రం వివక్ష చూపిస్తోందని డీఎంకే ఎంపీ దయానిధి మారన్ మండిపడ్డారు. తీవ్ర నీటి ఎద్దడితో తమిళనాడు గొంతు ఎండిపోతున్నా పట్టించుకోవడం లేదని మోదీ సర్కార్‌పై విరుచుకుపడ్డారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై చర్చ సందర్భంగా లోక్‌సభలో ప్రసంగించిన మారన్... కావేరీ జలవివాదం విషయంలో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. హిందీ, నీట్ వంటి అంశాలను బలవంతంగా రుద్దాలని ప్రయత్నించడం వల్లే తమిళులు బీజేపీని తిరస్కరించారన్నారు.