సాక్షి,చెన్నై : పీఎం కేర్ ఫండ్స్‌పై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండియా కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే పీఎం కేర్ ఫండ్స్ రహస్యాల్ని బహిర్గతం చేస్తామన్నారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన సందర్భంగా ఎంకే స్టాలిన్ మాట్లాడారు. ఎన్నికల్లో బీజేపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. కాబట్టే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేశారని అన్నారు.
ఎలక్టోరల్ బాండ్‌ల మాదిరిగానే
ఎలక్టోరల్ బాండ్‌ల మాదిరిగానే, ‘వారు (బీజేపీ, కేంద్రాన్ని ఉద్దేశిస్తూ) మరొక విధంగా నిధుల్ని సేకరించారు. దీనికి పీఎం కేర్స్ ఫండ్ అని పేరు పెట్టారు. ఈ ఏడాది జూన్‌లో ఇండియా కూటమి కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత ఫండ్‌కు సంబంధించిన అన్ని రహస్యాలు వెలికి తీస్తామని స్పష్టం చేశారు.
ఆయుష్మాన్ భారత్ సహా ఇతర సంక్షేమ కార్యక్రమాల్లో అవక తవకలు జరిగాయని కాగ్ నివేదిక తెలిపింది. ఆ నివేదికపై కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించ లేదని స్టాలిన్ ప్రశ్నించారు. తమిళనాడు కోసం అమలు చేసిన ఒక ప్రత్యేక పథకాన్ని ప్రధాని మోదీ చెప్పగలరా? అని తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ అడిగారు.
Comments
Please login to add a commentAdd a comment