వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అయితే పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల కోసం బీజేపీ నాకు కొంత బాధ్యతను అప్పగించిందని, తాను ఆ పని చేస్తున్నానని చెప్పారు.
ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం అన్నామలై కోయంబత్తూరులో గురుదేవ్ రవిశంకర్ ఆశీస్సులు పొందే అవకాశం లభించిందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడిస్తూ.. కోయంబత్తూరులో ‘డ్రగ్స్ ఫ్రీ ఇండియా ఫర్ ఏ హోలిస్టిక్ సొసైటీ' కోసం గురుదేవ్ చొరవ చాలా ముఖ్యమైందని అన్నారు.
గురుదేవ్ రవిశంకర్ గురూజీని అన్నామలై కలిసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో గురూజీ అన్నామలైను సత్కరించడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
It was a divine morning to have had the opportunity to seek the blessings of Gurudev Sri Sri Ravi Shankar avl in Coimbatore today.
— K.Annamalai (@annamalai_k) March 3, 2024
Gurudev’s initiative for a ‘Drug-Free India for a holistic society’ in Coimbatore comes at a very important & appropriate time! pic.twitter.com/BYJ2OARdAr
Comments
Please login to add a commentAdd a comment