Ravi Shankar Guruji
-
రవిశంకర్ గురూజీని కలిసిన తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్ - ఫోటోలు
వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో తాను పోటీ చేస్తానని, అయితే పార్టీ తీసుకునే ఏ నిర్ణయానికైనా కట్టుబడి ఉంటానని తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు కె అన్నామలై పేర్కొన్నారు. రాష్ట్రంలో పార్టీ ఎదుగుదల కోసం బీజేపీ నాకు కొంత బాధ్యతను అప్పగించిందని, తాను ఆ పని చేస్తున్నానని చెప్పారు. ఇదిలా ఉండగా ఈరోజు ఉదయం అన్నామలై కోయంబత్తూరులో గురుదేవ్ రవిశంకర్ ఆశీస్సులు పొందే అవకాశం లభించిందని తన ఎక్స్ (ట్విటర్) ఖాతాలో వెల్లడిస్తూ.. కోయంబత్తూరులో ‘డ్రగ్స్ ఫ్రీ ఇండియా ఫర్ ఏ హోలిస్టిక్ సొసైటీ' కోసం గురుదేవ్ చొరవ చాలా ముఖ్యమైందని అన్నారు. గురుదేవ్ రవిశంకర్ గురూజీని అన్నామలై కలిసిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. ఇందులో గురూజీ అన్నామలైను సత్కరించడం చూడవచ్చు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి. It was a divine morning to have had the opportunity to seek the blessings of Gurudev Sri Sri Ravi Shankar avl in Coimbatore today. Gurudev’s initiative for a ‘Drug-Free India for a holistic society’ in Coimbatore comes at a very important & appropriate time! pic.twitter.com/BYJ2OARdAr — K.Annamalai (@annamalai_k) March 3, 2024 -
ఆర్ట్ ఆఫ్ లివింగ్ రవిశంకర్‌కు అరుదైన గౌరవం
బోస్టన్: ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్‌కు అరుదైన గౌరవం దక్కింది. అమెరికా విశ్వవిద్యాలయం విశ్వ పౌరసత్వ రాయబారిగా విశేషమైన గుర్తింపు ఇచ్చింది. ప్రపంచ శాంతి యత్నాలు, మానవతావాద, ఆధ్యాత్మిక నాయకత్వ పటిమతో ప్రపంచ వ్యాప్తంగా వివిధ మతవిశ్వాసాల మధ్య సామరస్యం కోసం ఆయన చేస్తున్న కృషికి ఈ గౌరవం ఇస్తున్నట్లు ప్రకటించింది. అమెరికాలోని బోస్టన్‌లో ఉన్న నార్త్ వెస్టర్న్ విశ్వవిద్యాలయం ఆధ్యాత్మిక సలహాదారు, ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ అలెగ్జాండర్ లివరింగ్ కెర్న్ దీనిపై ప్రకటన విడుదల చేశారు. విశ్వమానవ రాయబారిగా గుర్తింపునిచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేందుకు, మొట్టమొదటగా రవిశంకర్ కంటే ఉత్తమమైన వ్యక్తిని తాము ఊహించలేకపోయామని పేర్కొన్నారు. ఎల్లప్పుడూ ఆనందంగా కనిపించే మానవతావాది అని కొనియాడారు. ఉత్తమ మానవతా విలువలకు ప్రతిరూపంగా నిలిచే రవిశంకర్‌తో చర్చా కార్యక్రమం ద్వారా వారి నుంచి జ్ఞానాన్ని పొందడంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని, దీనికి తాము సంతోష పడుతున్నట్లు తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలు, సంస్థలు, జాతుల మధ్య పరస్పర శాంతిని పెంపొందించేందుకు, చర్చలకు అనువైన వాతావరణాన్ని కల్పించేందుకు గురుదేవ్ అవిశ్రాంతంగా పాటుపడుతున్నట్లు వివరిస్తూ ఈ ప్రకటనను విడుదల చేశారు. -
అందరూ సేవాభావం అలవరుచుకోవాలి
యూనివర్సిటీక్యాంపస్ : అందరూ సేవాభావం అలవరుచుకోవాలని ఆధ్యాత్మిక గురువు రవిశంకర్ అన్నారు. ఏపీ పర్యాటకశాఖ ఆధ్వర్యంలో తిరుపతిలో రెండు రోజు లుగా నిర్వహిస్తున్న ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి ఎస్వీయూ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న జిల్లా యంత్రాంగం తరఫున ఆయనకు స్వాగతం పలికి, సన్మానం చేశారు. ఆయన్ని వేదికపైకి ఆహ్వానించారు. అనంతరం రవిశంకర్ సత్సంగం చేశారు. అందరూ ఆ«ధ్యాత్మికత, సేవాభావం అలవాటు చేసుకోవాలని అప్పుడే సంతోషంగా ఉం టారని చెప్పారు. ప్రతి మనిషిలోపల ఏడు చక్రాలు ఉంటాయన్నారు. ఏడుకొండలపై వెలసిన శ్రీవారు ఎంతో మహిమకలిగిన దేవుడు అన్నారు. అన్నమయ్య రచించిన ‘‘బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే’’ కీర్తనలోని పరామార్థాన్ని వివరించారు. దేశానికి ఆంధ్రప్రదేశ్, తిరుపతి సాంస్కృతిక హబ్‌గా తయారవుతుందన్నారు. ఆధ్యాత్మిక ఎడ్యుకేషన్ హబ్‌గా తిరుపతిని తీర్చిదిద్దే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాకు కలెక్టర్‌గా పనిచేస్తున్న ప్రద్యుమ్న నేతృత్వంలో తిరుపతి ఆధ్యాత్మిక ఆనంద నగరంగా తీర్చిదిద్దబడుతుందనడంలో సందేహం లేదన్నారు. అలరించిన అన్నమాచార్య కీర్తనలు ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా ఎస్వీ స్టేడియంలో జోతిర్మయి ఆలపించిన అన్నమాచార్య కీర్తనలు అలరించాయి. ప్రేక్షకులు భక్తిసాగరంలో మునిగి తేలారు. అనంతరం హాలీంఖాన్ బృందం కూచిపూడి నృత్యప్రదర్శన నిర్వహించింది. ఈ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రద్యుమ్న, ఆర్డీఓ కనకనరసారెడ్డి పర్యవేక్షించారు. నేటితో ముగియనున్న ఉత్సవాలు ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు జరిగిన కార్యక్రమాలు ఆదివారంతో ముగియనున్నాయి. ఆదివారం రాత్రి ఎస్వీ స్టేడియంలో శ్రీరామనవమి నాటకాన్ని ప్రదర్శించనున్నారు. అలాగే సినీనేపథ్య గాయకులు హేమచంద్ర, శ్రావణ భార్గవీ మ్యూజికల్ నైట్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాన్ని విబ్రీమీడియా పర్యవేక్షిస్తోంది. యోగాతో మానసిక శాంతి తిరుచానూరు: యోగాతోనే మానసిక శాంతి సాధ్యమని యోగా శిక్షకులు తెలిపారు. ప్రపంచ ఆధ్యాత్మిక ఉత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం ఉదయం శిల్పారామంలో యోగాపై ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ప్రతినిధులు యోగాలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ తరగతులకు పెద్ద ఎత్తున పిల్లలు, పెద్దలు తరలివచ్చారు. ఈ సందర్భంగా శిక్షకులు మాట్లాడుతూ ఒకప్పుడు జీవన విధానానికి, ప్రస్తుత జీవన విధానికి ఎంతో మార్పు వచ్చిందని తెలిపారు. -
అంతర్జాతీయ సమాజం మద్దతుతోనే ఉగ్రవాదానికి ఉరి
ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ బెంగళూరు : ప్రపంచ శాంతి, సౌభ్రాతృత్వాలకు పెను సవాలుగా పరిణమించిన ఉగ్రవాదాన్ని అంతమొందించేందుకు అంతర్జాతీయ సమాజం ముందుకు రావాలని ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు రవిశంకర్ గురూజీ పిలుపునిచ్చారు. సర్వమత సౌభ్రాతృత్వాన్ని చాటి చెప్పేందుకు గాను వివిధ మతాలకు చెందిన పెద్దలతో బెంగళూరులోని ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఇంటర్నేషనల్ సెంటర్లో గురువారం సాయంత్రం ఁస్నేహ మిలన* కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రవిశంకర్ గురూజీ మాట్లాడుతూ.. ప్రపంచమంతటా సోదర భావాన్ని పెంపొందించడం, శాంతి స్థాపనలకు గాను మత పెద్దలు, స్వచ్ఛంద సంస్థలు ఇలా అందరూ ముందుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో ప్రతి ఒక్కరూ అభద్రతా భావంతో ఎవరితోనూ కలవకుండా తమకు తామే కొన్ని పరిధులు గీసుకొని జీవనం సాగిస్తున్నారని చెప్పారు. ఇలా కాకుండా అందరమూ ఒకే కుటుంబమనే భావనతో ఒక్కటిగా చేరినప్పుడు ఈ అభద్రతా భావాలన్నీ పూర్తిగా తొలగిపోతాయని తెలిపారు. వివిధ పువ్వులను దండగా కూర్చేందుకు దారం ఉపయోగపడుతుందని, అదే విధంగా విభిన్న వర్గాలు, ప్రాంతాలకు చెందిన వ్యక్తులను మానవత్వం అనే దారంతో కూర్చాలని సూచించారు. ప్రతి ఒక్కరూ తమకు సాధ్యమైనంత వరకు ఇతరుల కన్నీళ్లు తుడిచి, వారి ముఖాల్లో చిరునవ్వులు చూసేందుకు శ్రమించాల్సిన అవసరం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా కార్యక్రమంలో పాల్గొన్న మత పెద్దలను రవిశంకర్ గురూజీ సత్కరించారు. ఁస్నేహ మిలన* కార్యక్రమంలో క్రైస్ట్ యూనివర్సిటీ వైస్ ఛాన్స్లర్ వి.ఎం.అబ్రహాం, ఇంటర్నేషనల్ సూఫీ సెంటర్ ప్రెసిడెంట్ సలీమ్ హజార్వీ, నెదర్లాండ్ మాజీ ప్రధాని రూద్లూబర్స్, జామియా మసీదు ప్రతినిధి అన్వర్ షరీఫ్, యూరోపియన్ పార్లమెంట్ సభ్యుడు లెనైన్ తదితరులు పాల్గొన్నారు.