బీజేపీ మహిళా లీడర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. కాషాయ నేతపై వేటు | Tamil Nadu BJP OBC Wing Leader Surya Siva Suspended From Party | Sakshi
Sakshi News home page

బీజేపీలో కోల్డ్‌వార్‌: మహిళా నేతపై అసభ్యకర వ్యాఖ్యలు.. కాషాయ నేత సస్పెండ్‌

Published Fri, Nov 25 2022 5:06 PM | Last Updated on Fri, Nov 25 2022 5:07 PM

Tamil Nadu BJP OBC Wing Leader Surya Siva Suspended From Party - Sakshi

తమిళనాడుకు చెందిన బీజేపీ నేత.. తమ పార్టీకి చెందిన మహిళా నేతపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అనుచితంగా లైంగికంగా వేధించే కామెంట్స్‌ చేశాడు. కాగా, దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ వైరల్‌ కావడంతో బీజేపీ అధిష్టానం సదరు నేతపై సీరియస్‌ అయ్యింది. బీజేపీ నేతను ఆ పార్టీ సస్పెండ్‌ చేసింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. 

వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్ర ఓబీసీ విభాగం బీజేపీ నాయకుడు సూర్య శివ, ఆ పార్టీ మైనారిటీ విభాగానికి చెందిన మహిళా నాయకురాలు డైసీ సరన్‌పై ఇటీవల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను నరికేందుకు గుండాలను పంపుతానని షాకింగ్‌ కామెంట్స్‌ చేశాడు. అనంతరం, ఆమె ప్రైవేట్ భాగాలు కోసి మెరీనా బీచ్‌లో పడేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా శృతిమించిపోయి ఆమెపై అసభ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు కూడా చేశాడు. కాగా, దీనికి సంబంధించిన ఆడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. 

ఈ వ్యవహరంపై రంగంలోకి దిగిన బీజేపీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. వీరిద్దరినీ కమిటీ ముందుకు పిలిచి వారి మధ్య రాజీ కుదిర్చింది. ఈ క్రమంలోనే సూర్య శివకు షాకిచ్చింది. బీజేపీ క్రమ శిక్షణా చర్యల్లో భాగంగా సూర్య శివను ఆరు నెలల పాటు పార్టీ అన్ని పదవుల నుంచి సస్పెండ్‌ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే, డీఎంకే సీనియర్‌ నేత, ఎంపీ తిరుచ్చి శివ కుమారుడే సూర్య శివ. ఇక, సూర్య శివ ఈ ఏడాది మేలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతలోనే ఇలా కామెంట్స్‌ చేయడంతో బీజేపీ వేటు వేసింది. అయితే, సస్పెండైన సూర్య శివ పార్టీ వాలంటీర్‌గా కొనసాగవచ్చని తమిళనాడు బీజేపీ చీఫ్‌ కే అన్నామలై సూచించారు. ఈ క్రమంలో శివ ప్రవర్తనలో మార్పు కనిపిస్తే తిరిగి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement