controversal diologues
-
బీజేపీ మహిళా లీడర్‌పై అసభ్యకర వ్యాఖ్యలు.. కాషాయ నేతపై వేటు
తమిళనాడుకు చెందిన బీజేపీ నేత.. తమ పార్టీకి చెందిన మహిళా నేతపై అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అనుచితంగా లైంగికంగా వేధించే కామెంట్స్ చేశాడు. కాగా, దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ వైరల్ కావడంతో బీజేపీ అధిష్టానం సదరు నేతపై సీరియస్ అయ్యింది. బీజేపీ నేతను ఆ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ ఘటన తమిళనాడులో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. తమిళనాడు రాష్ట్ర ఓబీసీ విభాగం బీజేపీ నాయకుడు సూర్య శివ, ఆ పార్టీ మైనారిటీ విభాగానికి చెందిన మహిళా నాయకురాలు డైసీ సరన్పై ఇటీవల అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఆమెను నరికేందుకు గుండాలను పంపుతానని షాకింగ్ కామెంట్స్ చేశాడు. అనంతరం, ఆమె ప్రైవేట్ భాగాలు కోసి మెరీనా బీచ్‌లో పడేస్తానని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆగకుండా శృతిమించిపోయి ఆమెపై అసభ్యకరమైన లైంగిక వ్యాఖ్యలు కూడా చేశాడు. కాగా, దీనికి సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వ్యవహరంపై రంగంలోకి దిగిన బీజేపీ క్రమశిక్షణ కమిటీ చర్యలకు దిగింది. వీరిద్దరినీ కమిటీ ముందుకు పిలిచి వారి మధ్య రాజీ కుదిర్చింది. ఈ క్రమంలోనే సూర్య శివకు షాకిచ్చింది. బీజేపీ క్రమ శిక్షణా చర్యల్లో భాగంగా సూర్య శివను ఆరు నెలల పాటు పార్టీ అన్ని పదవుల నుంచి సస్పెండ్ చేస్తున్నట్టు పేర్కొంది. అయితే, డీఎంకే సీనియర్ నేత, ఎంపీ తిరుచ్చి శివ కుమారుడే సూర్య శివ. ఇక, సూర్య శివ ఈ ఏడాది మేలో బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇంతలోనే ఇలా కామెంట్స్ చేయడంతో బీజేపీ వేటు వేసింది. అయితే, సస్పెండైన సూర్య శివ పార్టీ వాలంటీర్‌గా కొనసాగవచ్చని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై సూచించారు. ఈ క్రమంలో శివ ప్రవర్తనలో మార్పు కనిపిస్తే తిరిగి బాధ్యతలు అప్పగిస్తామని స్పష్టం చేశారు. Tamil Nadu BJP's OBC wing leader Surya Siva has been suspended from all party posts for 6 months. (@PramodMadhav6) #TamilNadu #News https://t.co/mGmymGzVZP — IndiaToday (@IndiaToday) November 25, 2022 -
వివాదంలో మరో బాలీవుడ్ చిత్రం, ఎఫ్ఐఆర్ నమోదు
చాలా గ్యాప్ తర్వాత నటి అదా శర్మ నటిస్తున్న బాలీవుడ్ లేటెస్ట్ మూవీ ‘ది కేరళ స్టోరీ’. తాజాగా ఆ మూవీ చిక్కుల్లో పడింది. ఇటీవల విడుదలైన టీజర్లో అదా చెప్పిన ఓ డైలాగ్ కేరళనాట ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతోంది. కేరళ వాసుల ఈ మూవీపై తీవ్ర వ్యతీరేకత వస్తోంది. అసలు సంగతేంటంటే.. ఆదా శర్మ ప్రధాన పాత్రలో ది కేరళ స్టోరీ రూపొందుతుంది. నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాలో అదా అపహరణ గురై బలవంతపు మత మార్పిడికి గురైన షాలిని ఉన్ని కృష్ణన్ అనే యువతి పాత్ర పోషించింది. ఈ నేపథ్యంలో రీసెంట్గా రిలీజైన ఈ మూవీ టీజర్లో అదా బుర్ఖ ధరించి కనిపించింది. చదవండి: తన స్థానంలోకి కొత్త యాంకర్ ఎంట్రీ.. స్పందించిన రష్మీ గౌతమ్ ఇందులో అదా మాట్లాడుతూ.. ‘ఆమె నర్సు కావాలని కలలు కనేది. కానీ కిడ్నాప్‌కి గురవుతుంది. ప్రస్తుతం ఆ అమ్మాయి ఆఫ్ఘనిస్తాన్లోని జైలులో ఉగ్రవాదిగా ఉంది’ అంటూ తన కథ చెబుతూ కన్నీటీ పర్యంతరం అవుతుంది. అంతేకాదు తను మాత్రమే కాదని తనలాంటి మరో 32 వేల మంది కేరళ అమ్మాయిలను ఇస్లాంలోకి మార్చి విదేశాలకు పంపించి ఉగ్రవాద కార్యకలాపాలకు ఉపయోగిస్తున్నారంటూ అదా చెప్పుకొచ్చింది. దీంతో టీజర్లో ఆమె వ్యాఖ్యలు ఇప్పుడు కేరళనాట తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఈ అంశంపై కొందరు అభ్యంతరం తెలుపుతూ కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఫిర్యాదు చేశారు. ఈ సినిమాను వెంటనే ఆపేయాలని, తప్పుడు లెక్కలతో కేరళ యువతుల పట్ల తప్పుడు ప్రచారం చేస్తున్న ఈ మూవీ టీంపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. చదవండి: ఆసక్తిగా గీతూ రాయల్ పారితోషికం.. 9 వారాలకు ఎంత ముట్టిందంటే! దీంతో ఆ రాష్ట్ర డీజీపీ అనిల్ కాంత్ ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణకు ఆదేశించారు. ఇదిలా ఉంటే కేరళ మాజీ సీఎం వీఎస్ అచ్యుతానంద గతంలో ఇచ్చిన ఓ ప్రసంగాన్ని తప్పుగా సబ్ టైటిల్స్ వేసి చూపిస్తున్నట్లుగా ఆరోపణలు వస్తున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కాగా ఈ సనిమా సుదీప్తో సేన్ దర్శకత్వం వహిస్తున్నారు ఈ సినిమాను పుల్ అమృత్లాల్ షా నిర్మిస్తున్నారు. కేరళలో అపహరణకు గురైన 32వేల మంది (యూనిట్ పేర్కొన్న లెక్క) మహిళల మత మార్పిడి, ఉగ్రవాదులుగా మార్చడం తదితర అంశాల నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వచ్చే ఏడాది విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే మూవీ టీం ప్రకటించింది. Fun fact: We also found another promo for #TheKeralaStory where Sen has misrepresented the words of another former CM VS Achuthanandan. The promo shows a 17-second clip of former CM VS Achuthanandan. Guess what? The eng subtitles had no similarities with what was being said. pic.twitter.com/neCBAri2N5 — Shinjinee Majumder (@shinjineemjmdr) November 8, 2022 -
చిక్కుల్లో కాంగ్రెస్ నేత.. వీడియో వైరల్
దేశంలో కాంగ్రెస్ పార్టీ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. సీనియర్లు ఒక్కొక్కరుగా పార్టీనీ వీడుతున్నారు. మరోవైపు.. బీజేపీపై విమర్శలు చేస్తూ కాంగ్రెస్ సీనియర్ నేత చిక్కుల్లో పడ్డారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వివరాల ప్రకారం.. కాంగ్రెస్ సీనియర్ నేత రణ్‌దీప్ సింగ్ సుర్జేవాలా గురువారం మీడియాతో మాట్లాడుతూ.. ప్రజాస్వామ్య వ్యవస్ధలను, ఈడీ, సీబీఐ, ఐటీ వంటి దర్యాప్తు ఏజెన్సీలను కేంద్ర ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోందని అన్నారు. ఈ క్రమంలో మహాభారతంలో ద్రౌపది వస్త్రాపహరణాన్ని ప్రస్తావించబోయి పొరపాటున సీతాదేవి పేరును చెప్పడం వివాదాస్పదంగా మారింది. అయితే, రాజ్యాంగ వ్యవస్ధలను నిర్వీర్యం చేస్తూ వాటి ప్రాధాన్యతకు కేంద్రం తూట్లుపొడుస్తోందని సూర్జేవాలా ఆరోపించారు. ఈ క్రమంలో సీతాదేవి వస్త్రాపహరణం తరహాలోనే బీజేపీ ప్రజాస్వామ్య విలువలను ఊడదీయాలని కాషాయ పార్టీ కోరుకుంటోందని రణ్‌దీప్ దుయ్యబట్టారు. బీజేపీ ప్రయత్నాలు ఫలించబోవని, రాజ్యసభ ఎన్నికల్లో బీజేపీకి భంగపాటు తప్పదని ఆయన కామెంట్స్ చేశారు. కాగా, కౌరవ సభలో పాండవుల సమక్షంలో ద్రౌపది వస్త్రాపహరణం గురించి ప్రస్తావించబోయిన సుర్జేవాలా పొరపాటున సీతాదేవీ పేరును పలికారు. ఈ క్రమంలో కాంగ్రెస్ నేత వ్యాఖ్యలపై బీజేపీ నేతలు మండిపడ్డారు. ఇక, సూర్జేవాలా వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో నెటిజన్లు సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. #WATCH | Udaipur, Rajasthan | "..Truth, democracy, law & morals will win. BJP wants to do 'cheer haran' of democracy, just like 'cheer haran' of Goddess Sita. But they'll lose (in RS polls) & their masks will fall off," Congress leader Randeep Surjewala said in a press conference pic.twitter.com/xYXk2N5uJf — ANI MP/CG/Rajasthan (@ANI_MP_CG_RJ) June 9, 2022 ఇది కూడా చదవండి: రాజ్యసభ ఎన్నికలు: ఎన్సీపీ నేతలకు షాక్.. -
తాలిబన్లది స్వాతంత్య్ర పోరాటం.. ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
సంభాల్/లక్నో: ఉత్తరప్రదేశ్‌లో సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ఒకరు తాలిబన్లకు అనుకూలంగా మాట్లాడడం వివాదాస్పదంగా మారింది. ఆయనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సంభాల్ నియోజకర్గ ఎంపీ షఫీక్ ఉర్ రెహ్మాన్ బర్ఖ్ తాజాగా అఫ్గాన్ పరిణామాలపై తాజాగా మీడియాతో మాట్లాడారు. అఫ్గాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకోవడాన్ని భారత స్వాతంత్య్ర పోరాటంతో పోల్చారు. భారతీయుల పోరాటం, తాలిబన్ల పోరాటం దాదాపు సమానమేనని అన్నారు. తాలిబన్లది ఒకరకంగా స్వాతంత్య్ర పోరాటమేనని చెప్పారు. తమ దేశానికి స్వేచ్ఛ కావాలని తాలిబన్లు కోరుకున్నారని, అనుకున్నది సాధించారని చెప్పారు. అయినా అదంతా అఫ్గానిస్తాన్ అంతర్గత వ్యవహారమని స్పష్టం చేశారు. సమాజ్‌వాదీ ఎంపీ షఫీక్ ఉర్ వ్యాఖ్యలను సీఎం యోగి ఆదిత్యనాథ్ తప్పుపట్టారు. ప్రతిపక్ష ఎంపీ సిగ్గులేకుండా తాలిబన్లను సమర్థిస్తున్నారని విమర్శించారు. తాలిబన్లను సమర్థించడం అంటే వారి రాక్షసకాండను సైతం సమర్థించినట్లేనని అన్నారు. మానవత్వానికి మచ్చగా మారిన వారికి మద్దతుగా మాట్లాడుతున్నారంటే అసలు మనం ఎక్కడి వెళ్తున్నట్లు? అని ఆవేదన వ్యక్తం చేశారు. -
సీఏఏ ఆందోళనలపై ఆర్మీ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్య
న్యూఢిల్లీ/కోల్‌కతా: పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై చెలరేగిన ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి నేతలే కారణమంటూ ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై రాజకీయ పక్షాలు భగ్గుమన్నాయి. సీఏఏను ఉపసంహరించుకునే దాకా నిరసనలను ఆపేది లేదని బెంగాల్ సీఎం మమత అన్నారు. అది నాయకత్వ లక్షణం కాదు ‘సీఏఏకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో ప్రజలు హింసాత్మక ఘటనలకు పాల్పడ్డారు. నిరసన కారుల్లో ఎక్కువమంది విద్యార్థులు కూడా ఉన్నారు. ఇలా ప్రజలను హింసకు ప్రేరేపించడం నాయకత్వ లక్షణం కాదు’అని ఆర్మీ చీఫ్ జనరల్ బిపిన్ రావత్ వ్యాఖ్యానించారు. గురువారం ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. ‘నాయకుడంటే సరైన దిశలో నడిపించేవాడు. మంచి సూచనలిస్తూ మన సంక్షేమం పట్ల శ్రద్ధ తీసుకునేవాడు. అతడు ముందు వెళ్తుంటే ప్రతి ఒక్కరూ అనుసరిస్తారు. అయితే, ఇది అనుకున్నంత సులువు కాదు. చాలా క్లిష్టమైన వ్యవహారం.’అని తెలిపారు. అయితే, రాజకీయ పరమైన వ్యవహారాల్లో జనరల్ రావత్ తలదూర్చడం కాంగ్రెస్ సహా పలు రాజకీయ పార్టీలు స్పందించాయి. ‘ఆయన చెప్పింది నిజమే. అయితే, ప్రధాని పదవిపై ఆశతోనే ఇలా మాట్లాడుతున్నారని అనిపిస్తోంది’ అని ఉద్యమకారుడు యోగేంద్ర యాదవ్ పేర్కొన్నారు. ‘ఇలాంటి వ్యాఖ్యలు చేసే అవకాశం పాకిస్తాన్, బంగ్లాదేశ్ సైనికాధికారులకు మాత్రమే ఉంటుంది. ఆయనకు ఇలాగే మాట్లాడే అవకాశం ఇస్తే సైనిక తిరుగుబాటుకు కూడా దారిచూపినట్లవుతుంది’ అని కాంగ్రెస్ ప్రతినిధి బ్రిజేష్ కాలప్ప ట్విట్టర్లో పేర్కొన్నారు. జనరల్ రావత్ తన పరిధి తెలుసుకోవాలని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. కాంగ్రెస్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందిస్తూ.. ‘జనరల్ రావత్‌తో ఏకీభవిస్తున్నా. మత విద్వేషాలు రెచ్చగొట్టి, రక్తపాతానికి పాల్పడిన వారు కూడా నాయకులు కాదుకదా?’అని ప్రశ్నించారు. బీజేపీ మిత్రపక్షం జేడీయూ కూడా జనరల్ రావత్ వ్యాఖ్యలను ఖండించింది. ఈ పరిణామంపై ఆర్మీ స్పందించింది. ఆర్మీచీఫ్ వ్యాఖ్యలు కేవలం సీఏఏ ఆందోళనలనుద్దేశించి చేసినవి కావని పేర్కొంది. ఆయన ఏ రాజకీయ పార్టీని కానీ, వ్యక్తిని కానీ ప్రస్తావించలేదు. విద్యార్థులను గురించి మాత్రమే జనరల్ రావత్ మాట్లాడారు. కశ్మీర్ లోయకు చెందిన యువతను వారు నేతలుగా భావించిన వారే తప్పుదోవపట్టించారు’ అని ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ నెల 31వ తేదీతో రావత్ పదవీ కాలం ముగియనుంది. ఆందోళనలు ఆపేదిలేదు: మమతా బెనర్జీ పౌరసత్వ సవరణ చట్టా(సీఏఏ)న్ని ఉపసంహరించుకోనంత కాలం ఆందోళనలను కొనసాగిస్తామని పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రకటించారు.సీఏఏకి వ్యతిరేకంగా గురువారం సెంట్రల్ కోల్‌కతాలో ఆమె భారీ ర్యాలీ చేపట్టారు. ఆందోళనలను కొనసాగించాలని విద్యార్థులను కోరారు. ‘మీరు దేనికీ భయపడకండి. మీకు అండగా నేనుంటా. నిప్పుతో ఆటలు వద్దని బీజేపీని హెచ్చరిస్తున్నా’అని అన్నారు. సీఏఏ, ఎన్నార్సీలపై పోరాడుతున్న జామియా మిల్లియా, ఐఐటీ కాన్పూర్ తదితర వర్సిటీల విద్యార్థులకు ఆమె సంఘీభావం ప్రకటించారు. ప్రజలకు తిండి, బట్ట, నీడ ఇవ్వలేని బీజేపీ ప్రభుత్వం అక్రమ చొరబాటుదారులను కనిపెట్టే పని మాత్రం చేపట్టిందన్నారు. ప్రతిపక్షాలు ప్రజల్లో అయోమయం సృష్టిస్తున్నాయి సీఏఏపై కాంగ్రెస్ సహా ప్రతిపక్షాలు అయోమయం సృష్టిస్తున్నాయని హోం మంత్రి అమిత్ షా విమర్శించారు. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ(డీడీఏ) నిర్వహించిన ఓ కార్యక్రమంలో అమిత్ షా ప్రసంగించారు. ‘పౌరసత్వ చట్టం సవరణ బిల్లుపై పార్లమెంట్లో చర్చ సందర్భంగా ఒక్క ప్రతిపక్ష నేత కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత ఈ చట్టంపై ప్రజల్లో గందరగోళం సృష్టిస్తూ ఢిల్లీ ప్రశాంతతను దెబ్బతీస్తున్నారు’ అని పేర్కొన్నారు.కాగా కాంగ్రెస్ నేత చిదంబరం మాట్లాడుతూ.. ప్రభుత్వం తీసుకువచ్చిన జాతీయ జనాభా పట్టిక(ఎన్పీఆర్)తో, 2010నాటి ఎన్పీఆర్కు పోలికే లేదన్నారు. ఎన్నార్సీతో సంబంధం లేకుండా, 2010 నాటి ఎన్పీఆర్ చేపట్టాలని తమ పార్టీ కోరుతోందన్నారు. ఈ విషయంలో బీజేపీ దురుద్దేశంతో దుష్ప్రచారం సాగిస్తోందని ఆరోపించారు. సీఏఏకు వ్యతిరేకంగా గురువారం మైసూరులో జరిగిన భారీ ప్రదర్శన -
సారీ.. రెండోసారి!
న్యూఢిల్లీ: నాథూరాం గాడ్సేను దేశభక్తుడంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు బీజేపీ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్ శుక్రవారం రెండుసార్లు లోక్‌సభకు క్షమాపణ చెప్పారు. తాను గాడ్సేను దేశభక్తుడని అనలేదని ఆమె స్పష్టం చేశారు. ఆమె మొదటి సారి క్షమాపణలు చెప్పినప్పుడు ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. ఆమె అలా చెప్పే బదులు చెప్పకపోతే నయమన్నట్టుగా ఉన్నాయని విపక్షాలు గగ్గోలు పెట్టాయి. ‘నా వ్యాఖ్యలతో కొందరి మనోభావాలు దెబ్బ తిన్నందుకు చాలా విచారిస్తున్నాను. అందుకు క్షమాపణ చెబుతున్నా. అయితే సభలో నేను చేసిన వ్యాఖ్యల్ని వక్రీకరించారు. తప్పుగా అర్థం చేసుకున్నారు’అని ఆమె అన్నారు. తనని ఉగ్రవాది అని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన ట్వీట్‌ని ఆమె తప్పు పట్టారు. కోర్టు తనని దోషిగా నిర్ధారించకుండా ఉగ్రవాది అని ఎలా అంటారని ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలు మహిళలు, సా«ధ్విలను అవమానపరచడమేనని అన్నారు. దీంతో ప్రతిపక్షాలు సభా కార్యక్రమాల్ని అడ్డుకున్నాయి. మరోవైపు బీజేపీ రాహుల్‌కి హక్కులు నోటీసు ఇవ్వాలని పట్టుబట్టింది. ఆ తర్వాత స్పీకర్ ఓం బిర్లా చాంబర్లో అన్ని పార్టీల లోక్‌సభ పక్ష నాయకులు హాజరై మరోసారి ప్రజ్ఞా క్షమాపణలు చెప్పాలని తీర్మానించారు. దీంతో ముందుగా తయారు చేసిన క్షమాపణ ప్రకటనను ఆమె చదివి వినిపించారు. ‘నవంబర్ 27న ఎస్పీజీ సవరణ బిల్లుపై చర్చ సందర్భంగా నేను చేసిన వ్యాఖ్యలు ఎవరినైనా బాధిస్తే క్షమాపణ కోరుకుంటున్నా’అని అన్నారు. అయితే తాను గాడ్సేని దేశభక్తుడని అనలేదని మళ్లీ స్పష్టం చేశారు. మహాత్మాగాంధీని తాను ఎప్పుడూ గౌరవిస్తానని, జాతికి ఆయన చేసిన సేవలు సదా స్మరణీయమని అన్నారు. దీంతో సభలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయి. కాగా, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎంపీ ప్రజ్ఞా సభా హక్కుల ఉల్లంఘన నోటీసుని లోక్‌సభ స్పీకర్‌కి సమర్పించారు. రైతు కుటుంబాలకు సాయం లేదు ఆత్మహత్యలకు పాల్పడిన రైతులకు చెందిన కుటుంబాలకు సాయం అందించే నిబంధనలేవీ ప్రస్తుత చట్టాల్లో లేవని కేంద్రం ప్రకటించింది. శుక్రవారం రాజ్యసభ ప్రశ్నోత్తరాల సమయంలో వ్యవసాయం, రైతుల సంక్షేమ శాఖ మంత్రి పురుషోత్తం రుపాలా ఈ విషయం తెలిపారు. అయితే, రైతుల పరిస్థితులను మెరుగుపరిచేందుకు రుణాల మంజూరు వంటి అనేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. వైద్యుల కొరత లేదు ► ఆరోగ్యమంత్రి హర్షవర్ధన్ దేశంలో వైద్యుల కొరత, నర్సుల కొరత లేదని ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ లోక్‌సభలో వెల్లడించారు. విదేశాలకు వెళ్ళే వైద్యులను బలవంతంగా అడ్డుకోవడం కుదరదన్నారు. క్రమంగా రైల్వే విద్యుదీకరణ పర్యావరణ పరిరక్షణ కోసం భవిష్యత్‌లో అన్ని రైల్వేలైన్లను క్రమేణా విద్యుదీకరిస్తామని రైల్వే మంత్రి పీయూష్ గోయల్ రాజ్యసభకు చెప్పారు. ప్రైవేటు బిల్లులు బుధవారం? ప్రైవేటు బిల్లులను శుక్రవారం బదులు బుధవారం సభలో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకోవాలంటూ పలువురు ఎంపీలు స్పీకర్‌ను కోరారు. జాతీయ స్థాయి అంశాలు ఉంటే తప్ప ప్రైవేటు బిల్లుల చర్చ కోసం సమయాన్ని తగ్గించకూడదని డిమాండ్ చేశారు. శుక్రవారం ఎంపీలంతా తమ నియోజకవర్గాలకు వెళ్లే హడావిడిలో ఉంటారు గనుక చర్చ పూర్తి స్థాయిలో జరగదని వారు చెప్పారు. -
‘ఆమెను సజీవ దహనం చేస్తా’ : ఎమ్మెల్యే
భోపాల్ : భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను సజీవ దహనం చేస్తానని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే అసలైన దేశభక్తుడంటూ బుధవారం పార్లమెంటులో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు ఖండించారు. దీని ఫలితంగా రక్షణ మంత్రిత్వ సలహా కమిటీ నుంచి ప్రజ్ఞాను బీజేపీ తొలగించింది. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్‌లో అడుగుపెడితే సజీవ దహనం చేస్తానని బయోరా ఎమ్మెల్యే గోవర్థన్ డంగీ ప్రకటించారు. మరోవైపు సాధ్వీ వ్యాఖ్యలకు నిరసనగా ఆమె నియోజకవర్గమైన భోపాల్‌లో గురువారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. చదవండి : (లోక్‌సభలో ప్రజ్ఞా వివాదస్పద వ్యాఖ్యలు) -
అందుకే వాళ్ల కోటల్లో గబ్బిలాలు; క్షమించండి!
భోపాల్ : మధ్యప్రదేశ్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే గురువారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ప్రతిపక్ష బీజేపీ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో దిగి వచ్చిన ఎమ్మెల్యే క్షమాపణలు కోరుతూ ఓ ప్రకటన విడుదల చేశారు. వివరాలు.. సబల్గర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే బైజ్నాత్ కుష్వాహా గురువారం ఓ ప్రైవేట్ పాఠశాలలో బాలల దినోత్సవ వేడుకలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా పిల్లలకు నాలుగు మంచి మాటలు చెబుతూ మద్యం వల్ల కలిగే దుష్పరిమాణాలను వివరించారు. దీనికి ఉదాహరణగా.. ‘ఢిల్లీ రాజు ఫృథ్వీరాజ్ చౌహాన్, మహోబా రాజు పరిమల్, కనౌజ్ రాజు జయచంద్‌లు మద్యానికి అలవాటుపడి తమ రాజ్యాలను పోగొట్టుకున్నారు. వాళ్లు నిర్మించిన కోటలలో ఇప్పుడు గబ్బిలాలు తిరుగుతున్నాయి’ అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అనంతరం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరలై విమర్శలు రావడంతో.. ‘నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధించి ఉంటే బేషరతుగా క్షమాపణలు చెప్తున్నా’నంటూ ప్రకటించారు. దీనిపై బీజేపీ అధికార ప్రతినిధి రజనీష్ అగర్వాల్ మాట్లాడుతూ.. చరిత్రలోని గొప్ప రాజులు, నాయకులు, వ్యక్తుల పట్ల కాంగ్రెస్ పార్టీ వైఖరి ఇలాగే ఉంటుందని విమర్శించారు. ఆ పార్టీ నాయకులకు గాంధీ కుటుంబసభ్యులు తప్ప వేరే వాళ్లు గొప్పగా కనపడరని ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యలకు క్షమాపణలు బయట చెబితే సరిపోదని, సదరు ఎమ్మెల్యే ఆ పాఠశాలకే వెళ్లి తాను ప్రసంగించిన విద్యార్థుల ముందు క్షమాపణలు కోరాలని డిమాండ్ చేశారు. ఈ ఉదంతంపై రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి పంకజ్ చతుర్వేది స్పందిస్తూ.. కుష్వాహా ఇప్పటికే క్షమాపణలు చెప్పినందున బీజేపీ డిమాండ్‌లో అర్థం లేదని కొట్టిపారేశారు. -
ఉత్తరాది వారిలో నైపుణ్యం లేదు
లక్నో: దేశంలో తగిన ఉపాధి అవకాశాలు ఉన్నాయని.. వాటికి కావాల్సిన నైపుణ్యాలు ఉత్తరాది ప్రజల్లో ఉండటం లేదని కేంద్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఉత్తర భారతదేశాన్ని సందర్శించే రిక్రూటర్లు ఇదే విషయంపై తనకు ఫిర్యాదు చేస్తున్నారని తెలిపారు. రాయ్‌బరేలీలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘ఇటీవలి కాలంలో నిరుద్యోగం గురించి వార్తలు వస్తున్నాయి. వీటిని విశ్లేషణ చేశాను. దేశంలో ఉద్యోగాలకు కొరత లేదు. కానీ కావాల్సిన అర్హులే ఉండటం లేదు. ఇదే విషయంపై పలువురు రిక్రూటర్లు నాకు ఫిర్యాదు చేశారు’అని అన్నారు. ఈ వ్యాఖ్యలపై విపక్షాలు విరుచుకుపడ్డాయి. ఆర్థిక మందగమనం వల్ల జాబుల సంఖ్య తగ్గిపోతుందనే విషయం నుంచి తప్పించుకునేందుకే కేంద్రం ఇలాంటి ఆరోపణలు చేస్తోందని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా ఆరోపించారు. కేంద్ర మంత్రి నిరుద్యోగంపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని బీఎస్పీ అధినేత్రి మాయావతి వ్యాఖ్యానించారు. -
ప్రొఫెసర్ అసభ్యకర వ్యాఖ్యలు
తిరువనంతపురం: ప్రపంచ వ్యాప్తంగా ప్రకంపనలు పుట్టిస్తున్న ‘మీ టూ’ ఉద్యమ సెగ ఓ వైపు కొనసాగుతుండగా.. తాజాగా కేరళలో వాటర్ మిలన్ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతోంది. అసలు ఈ ఉద్యమం ఏంటో.. ఎందుకు జరుగుతుందో ఓసారి చూద్దాం. విద్యాబుద్ధులు నేర్పాల్సిన కొందరు గురువులు కీచకులుగా మారి విద్యార్థుల జీవితాలను నాశనం చేస్తుంటే.. మరికొందరు అసభ్యకరమైన వ్యాఖ్యలతో తమ వికృతరూపాన్ని బయటపెడుతున్నారు. తాజాగా కేరళకు చెందిన ప్రొఫెసర్ ముస్లిం విద్యార్థినుల గురించి అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇపుడు సోషల్‌మీడియాలో ప్రకంపనలు పుట్టిస్తున్నాయి. ప్రొఫెసర్ వ్యాఖ్యలపై అన్నివర్గాల నుంచి ఆగ్రహం వ్యక్తమవుతోంది. వివరాల్లోకి వెళితే... కొజికోడ్‌లోని ఫారూక్ ట్రెయినింగ్ కాలేజీలో సోషల్ సైన్స్ టీచర్‌గా పనిచేస్తున్న జౌహర్ మునవీర్.. ‘మా కాలేజీలో 80శాతం మంది అమ్మాయిలే. వారు లెగ్గింగ్స్ ధరిస్తారు. కాళ్లు కనపడేలా పర్దాను పైకెత్తి పట్టుకుంటారు. సున్నితమైన శరీర భాగాల్నికప్పుకునేందుకు ముస్లింలు హిజాబీ(స్కార్ఫ్ వంటిది) ధరిస్తారు. కానీ ఛాతీ భాగం కనపడేట్లుగా చాలా మంది అమ్మాయిలు ఎక్స్పోజింగ్ చేస్తారు.. అలా చేయడం వల్ల మగవారు వారిపైపు ఆకర్షితులవుతారు.. వారు అంతటితో ఆగలేరు’ అంటూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు. అంతటితో ఆయనగారి ప్రకోపం చల్లారలేదు. ‘వాటర్ మిలన్ పండిందో లేదో తెలుసుకోవాలంటే ఒక చిన్న ముక్క కోసి చూస్తారు’ అంటూ అమ్మాయిల శరీర భాగాల గురించి అసభ్య పదజాలంతో రెచ్చిపోయాడు. అసలు అలా ప్రవర్తించడం ఇస్లాంకు విరుద్ధం అంటూ వివాదానికి తెర తీశాడు. ఒక వార్తాసంస్థ ఈ వివాదాన్ని వెలుగులోకి తేవడంతో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో మహిళా సంఘాలు, పలు విద్యార్థి సంఘాలు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తున్నాయి. కేరళకు చెందిన మహిళా కార్యకర్తలు దీనికి నిరసనగా వాటర్ మిలన్ ఉద్యమం చేపట్టి ఆందోళన చేస్తున్నారు. ఆర్తీ అనే 25 ఏళ్ల వివాహిత.. ‘అమ్మాయిలు ఆకర్షణీయంగా ఉన్నంత మాత్రాన వారి శరీరం గురించి మాట్లాడే హక్కు ఎవరికీ ఉండదు’ అంటూ కొచ్చి నుంచి 200 కిలోమీటర్లు ర్యాలీ చేస్తూ వాటర్‌మిలన్ ఉద్యమం చేస్తోంది. ఈ వివాదంపై ఫారూక్ కళాశాల ప్రిన్సిపాల్ స్పందించారు. ‘3 నెలల క్రితం జౌహర్ ఒక ప్రైవేటు మీటింగ్‌లో భాగంగా ఈ వ్యాఖ్యలు చేశారు. వాటితో మా కాలేజీకి ఎలాంటి సంబంధం లేదు. ఆయనపై ఎవరూ ఫిర్యాదు చేయలేదు కనుక మేము ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోలేమని’ వివరణ ఇచ్చారు. -
‘అలా చూపిస్తే అమ్మాయిలు రేప్ కోరుకున్నట్లే’
రాయ్‌పూర్ : కేంద్ర విద్యాలయంలో పాఠ్యాంశాలు బోధించే బయాలజీ టీచర్ ఒకరు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అందాన్ని చూపించే వస్త్రాలు ధరిస్తే తమపై లైంగిక దాడికి ఆహ్వానించినట్లేనంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. పొట్టి వస్త్రాలు వేసుకుంటే, అందాన్ని ప్రదర్శిస్తే నిర్భయలాంటి ఘటనలు జరుగుతాయని, ఇష్టం వచ్చినట్లు బయట తిరిగే వాళ్లకు నిర్భయకు పట్టిన గతే పడుతుందంటూ వ్యాఖ్యానించారు. ఈ సంచలన సూచనలతో భయపడిన విద్యార్థులు ఈ విషయాన్ని తమ తల్లిదండ్రులకు చెప్పడంతో వారంతా కలిసి ఆ టీచర్‌పై స్కూల్ ప్రిన్సిపాల్‌కు ఫిర్యాదు చేశారు. వివరాల్లోకి వెళితే.. రాయ్‌పూర్‌లోని ఓ కేంద్రీయ విద్యాలయంలో స్నేహలత శంఖ్వార్ అనే బయాలజీ టీచర్ తొమ్మిది, ఇంటర్ ఫస్టియర్ చదివే విద్యార్థులకు ఇచ్చే కౌన్సెలింగ్ సెషన్ నిర్వహించారు. ఈ క్రమంలో విద్యార్థినులకు ఆమె సలహాలు ఇస్తూ అమ్మాయిలు జీన్స్ వేసుకుంటే, లిప్‌స్టిక్ పెట్టుకుంటే ప్రమాదం అన్నారు. అలా చేసేవారిపై నిర్భయ దాడి ఘటనలు జరుగుతాయని, పరోక్షంగా వారే లైంగిక దాడికి ఆహ్వానించిన వాళ్లవుతారని అన్నారు. ‘అందమైన ముఖాలు లేనప్పుడు మాత్రమే అమ్మాయిలు తమ శరీరాన్ని బయటకు చూపించాలి. అమ్మాయిలు మరీ సిగ్గు లేకుండా తయారవుతున్నారు. తన భర్త కూడా కానీ ఒకబ్బాయితో నిర్భయ అంతరాత్రి వేళ ఎందుకు బయటకు వెళ్లాల్సి వచ్చింది? ఇలాంటివి ఎందుకు చేస్తారో అర్థం చేసుకోవడానికే కష్టంగా ఉంది. ఎజెన్సీ ప్రాంతాల్లోనే అలాంటి ఘటనలు తరుచుగా జరుగుతుంటాయి. రాత్రిపూట నిర్భయతల్లి ఆమెను బయటకు వెళ్లనీయొద్దు. నా ఉద్దేశంలో తప్పు నిర్భయదే.. అలా చేసే అమ్మాయిలదే.. అబ్బాయిల తప్పుకాదు. ఇలాంటి సంఘటనలు ఒకవేళ అమ్మాయిలు ఎదుర్కొంటున్నారంటే అది వారు చేసిన పాపాలకు అనుభవించే శిక్ష తప్ప మరొకటి కాదు. ఏ అమ్మాయి తన శరీరాన్ని బయటకు చూపాలని ఆరాటపడుతుందో ఆ అమ్మాయిని ఒకబ్బాయి క్యారెక్టర్ లేని అమ్మాయనే అనుకుంటాడు’ అంటూ పలు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాగా, పూర్తి వివరాలు తెలుసుకొని ఆ టీచర్‌పై చర్యలు తీసుకుంటామని పోలీస్ కమిషనర్ కూడా హామీ ఇచ్చారు. -
నిర్మాతలకు ముఖ్య గమనిక
సాక్షి, చెన్నై : మెర్సల్ చిత్ర డైలాగుల వివాదం రాజకీయ దుమారం రేగటం తెలిసిందే. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైద్యుడైన మారన్ పాత్రలో హీరో విజయ్ డైలాగులు చెప్పటం.. వెంటనే వాటిని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనదైన స్పందించారు. ‘‘నిర్మాతలకు ముఖ్యగమనిక. కొత్త చట్టం వచ్చింది. ఇకపై ప్రభుత్వాన్ని.. వాటి పథకాలను పొగుడుతూ చిత్రాలు నిర్మించాలి. లేకపోతే అంతే’’... అంటూ ఆయన శనివారం తన ట్విట్టర్లో తెలిపారు. వారు మెర్సెల్ విషయంలోనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఒకవేళ పరాశక్తి సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని చిదంబరం పేర్కొన్నారు. 1950లో వచ్చిన హిందుత్వ సంప్రదాయాలను విమర్శిస్తూ పరాశక్తి సినిమా అనే సినిమా విడుదలై విజయం సాధించింది. ఇక ఇప్పుడు మెర్సల్ చిత్రంలో జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ ఇండియా విధానాలను వ్యతిరేకించేలా విజయ్ నోటి నుంచి డైలాగులు రావటం బీజీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది. BJP demands deletion of dialogues in 'Mersal'. Imagine the consequences if 'Parasakthi' was released today. — P. Chidambaram (@PChidambaram_IN) October 21, 2017 Notice to film makers: Law is coming, you can only make documentaries praising government's policies. — P. Chidambaram (@PChidambaram_IN) October 21, 2017 -
టీడీపీ ఎంపీ వివాదాస్పద వ్యాఖ్యలు
కాకినాడ: ఇస్రో రాకెట్ ప్రయోగానికి ముందు తిరుపతికి వెళ్లి కొబ్బరికాయ కొట్టడంపట్ల టీడీపీ ఎంపీ రవీంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దేవుడు ముఖ్యమా? రాకెట్ లాంచింగ్ ముఖ్యమా అని ప్రశ్నించారు. పండగల్లాంటివి భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని అన్నారు. వినాయక చవితి, దీపావళి పేరుతో నీటిని, వాతావరణాన్ని కాలుష్యం చేస్తున్నామని చెప్పారు. ఆదివారం ఏఎంజీ పాఠశాలలో జిల్లా సైన్స్ ఫేర్ ఎగ్జిబిషన్‌ను ఎంపీలు తోట నర్సింహం, రవీంద్రబాబు ప్రారంభించారు. ఈ సందర్భంగా రవీంద్రబాబు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఓ రకంగా ఇటువంటి పండుగలు భారతదేశంలో ఉండటం దురదృష్టకరమని చెప్పారు. రాష్ట్రంలో బడ్జెట్ లేనందున పండుగలను కంట్రోల్ చేద్దామని చెప్పారు.