
భోపాల్ : భోపాల్ బీజేపీ ఎంపీ సాధ్వీ ప్రజ్ఞాసింగ్ ఠాకూర్‌ను సజీవ దహనం చేస్తానని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ ఎమ్మెల్యే శుక్రవారం వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. గాంధీని హత్య చేసిన నాథూరాం గాడ్సే అసలైన దేశభక్తుడంటూ బుధవారం పార్లమెంటులో ఆమె వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ నడ్డాలు ఖండించారు. దీని ఫలితంగా రక్షణ మంత్రిత్వ సలహా కమిటీ నుంచి ప్రజ్ఞాను బీజేపీ తొలగించింది. ఈ నేపథ్యంలో ప్రజ్ఞాసింగ్ ఠాకూర్ మధ్యప్రదేశ్‌లో అడుగుపెడితే సజీవ దహనం చేస్తానని బయోరా ఎమ్మెల్యే గోవర్థన్ డంగీ ప్రకటించారు. మరోవైపు సాధ్వీ వ్యాఖ్యలకు నిరసనగా ఆమె నియోజకవర్గమైన భోపాల్‌లో గురువారం నిరసన ప్రదర్శనలు జరిగాయి. చదవండి : (లోక్‌సభలో ప్రజ్ఞా వివాదస్పద వ్యాఖ్యలు)