సాక్షి, చెన్నై : మెర్సల్ చిత్ర డైలాగుల వివాదం రాజకీయ దుమారం రేగటం తెలిసిందే. మోదీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా వైద్యుడైన మారన్ పాత్రలో హీరో విజయ్ డైలాగులు చెప్పటం.. వెంటనే వాటిని తొలగించాలని బీజేపీ డిమాండ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి పి చిదంబరం తనదైన స్పందించారు.
‘‘నిర్మాతలకు ముఖ్యగమనిక. కొత్త చట్టం వచ్చింది. ఇకపై ప్రభుత్వాన్ని.. వాటి పథకాలను పొగుడుతూ చిత్రాలు నిర్మించాలి. లేకపోతే అంతే’’... అంటూ ఆయన శనివారం తన ట్విట్టర్‌లో తెలిపారు. వారు మెర్సెల్ విషయంలోనే ఇంత రాద్ధాంతం చేస్తున్నారు. ఒకవేళ పరాశక్తి సినిమా ఇప్పుడు రిలీజ్ అయి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో అని చిదంబరం పేర్కొన్నారు.
1950లో వచ్చిన హిందుత్వ సంప్రదాయాలను విమర్శిస్తూ పరాశక్తి సినిమా అనే సినిమా విడుదలై విజయం సాధించింది. ఇక ఇప్పుడు మెర్సల్ చిత్రంలో జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు, డిజిటల్ ఇండియా విధానాలను వ్యతిరేకించేలా విజయ్ నోటి నుంచి డైలాగులు రావటం బీజీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారనే వాదన వినిపిస్తోంది.
BJP demands deletion of dialogues in 'Mersal'. Imagine the consequences if 'Parasakthi' was released today.
— P. Chidambaram (@PChidambaram_IN) October 21, 2017
Notice to film makers: Law is coming, you can only make documentaries praising government's policies.
— P. Chidambaram (@PChidambaram_IN) October 21, 2017
Comments
Please login to add a commentAdd a comment