ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు | Derogatory Comments On Modi: Police Case Filed On TN Minister Anitha R Radhakrishnan | Sakshi
Sakshi News home page

ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. డీఎంకే మంత్రిపై కేసు

Published Mon, Mar 25 2024 2:58 PM | Last Updated on Mon, Mar 25 2024 3:38 PM

derogatory comments on modi police case filed on minister anitha r radhakrishnan - Sakshi

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన తమిళనాడు రాష్ట్ర మత్స్య శాఖ మంత్రి అనితా ఆర్‌ రాధాకృష్ణన్‌పై కేసు నమోదు అయింది. బీజేపీ ఫిర్యాదు మేరకు టుటికోరిన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కమల్‌ రాజు నిద్రిస్తున్న సమయంలో హత్య చేయడానికి ప్రయత్నించింది మీరు కాదా?. కమల్‌ రాజు మిమ్మల్ని కమల్‌ రాజు హత్తకున్నట్లు చెబుతున్నారని ప్రధాని మోదీపై విమర్శలు చేశారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

మంత్రి అనితా ఆర్‌ రాధాకృష్ణన్‌ చేసిన వ్యాఖ్యలను తమిళనాడు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై తీవ్రంగా ఖండించారు. ‘డీఎంకే నేతలు అసభ్య  వ్యాఖ్యలు చేయటంలో దిగజారిపోతున్నారు.   ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై క్షమించరని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఇది డీఎంకే నేత  స్థాయి.   డీఎంకే నేత కనిమోళి సమక్షంలోనే  మోదీపై ఇలాంటి అనుచిత వ్యాఖ్యలు చేసినా అడ్డుకోక పోగా ఆమె చూస్తూ ఉండిపోయారు. మేము  ఎన్నికల సంఘం, రాష్ట్ర డీజీపీ దృష్టికి తీసుకువెళతాం. డీఎంకే నేతపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరతాం’అని అన్నామలై  ఎక్స్‌ వేదికగా తెలిపారు. 

ఇటీవల ఎన్నికల ప్రచార ర్యాలీలో ప్రధాని మోదీ పాల్గొని దివంగత తమిళనాడు మాజీ సీఎం కమల్‌ రాజు తీసుకువచ్చిన పథకాలపై ప్రశంసలు కురిపించారు.  అదే విధంగా ఆయన ప్రవేశపెట్టిన మధ్యాహ్న భోజన పథ​కం తనకు ఎంతో స్పూర్తీ అని పేర్కొన్నారు. ఇక..గత నెల కులశేఖరపట్నంలో ‘ఇస్రో’ రాకెట్‌  లాంచ్‌ప్యాడ్‌ నిర్మాణానికి  శుంకుస్థాపన సందర్భంగా ప్రధాని మోదీకి స్వాగతం పలికే ఓ పత్రికా​ ప్రకటనలో చైనా జెండా ముద్రించటం  వివాదాస్పదమైన విషయం తెలిసిందే. ఆ పత్రికా ప్రకటన చేసింది కూడా మంత్రి అనితా ఆర్‌ రాధాకృష్ణ కావాటం గమనార్హం. అప్పుడు కూడా బీజేపీ నేతల చేత తీవ్ర విమర్శలు పాలయ్యారు అనిత రాధాకృష్ణన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement