– 17న అధికార ప్రకటన
సాక్షి, చైన్నె: తమిళనాడు బీజేపీ అధ్యక్షుడిగా అన్నామలైకు మళ్లీ ఛాన్స్ దక్కబోతున్నట్టుగా ఆ పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. ఈనెల 17న అధికారిక ప్రకటన వెలువడనుంది. బీజేపీ సంస్థాగత ఎన్నికలు రాష్ట్రంలో తుది దశకు చేరిన విషయం తెలిసిందే. జిల్లాల అధ్యక్షుల ఎంపిక ప్రక్రియ ముగిసింది. అధిష్టానం ఆమోదంతో జాబితా వెలువడాల్సి ఉంది. ఆ తదుపరి రాష్ట్ర అధ్యక్షుడు, ఇతర కార్యవర్గ పదవుల ప్రక్రియ సాగాల్సి ఉంది.
ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా అన్నామలై వ్యవహరిస్తున్నారు. ఆయన పదవి చేపట్టిన తర్వాత రాష్ట్రంలో బీజేపీ బలం కొంత మేరకు పెరిగిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో విస్తృతంగాఅ న్నామలై పర్యటిస్తూ వస్తున్నారు. అదే సమయంలో అన్నాడీఎంకేతో వైర్యం పెట్టుకోవడం ఇతర బీజేపీ నేతలకు మింగుడు పడడం లేదు. ఈ వ్యవహారంలో సీనియర్ నేతలందరూ గుర్రుగానే ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన ప్రక్రియ ఈనెల 17వ తేది జరగబోతోంది. అధ్యక్ష ఎంపికకు నియంచిన కమిటీ బాధ్యతల్లో భాగంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి రంగంలోకి దిగనున్నారు.
ఈసారి అధ్యక్ష పదవి రేసులో మహిళా నేత, ఎమ్మెల్యే వానతీ శ్రీనివాసన్, శాసన సభా పక్ష నేత నైనార్ నాగేంద్రన్ సైతం రేసులో ఉన్నట్టుగా సమాచారాలు వెలువడ్డాయి. అయితే వారు సుముఖంగా లేనట్టు సంకేతాలు వెలువడ్డాయి. పార్టీ బలోపేతం దిశగా అన్నామలై పరుగులు తీస్తుండడం, అధిష్టానం మద్దతు పాటూ రాష్ట్రంలో కేడర్ అంతా ఆయన వైపు చూస్తుండడంతో మరోమారు అన్నామలై అధ్యక్ష పగ్గాలు చేపట్టడం ఖాయం అని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment