
సాక్షి, చెన్నై: తమిళనాడు మంత్రి కేకెఎస్ఎస్‌ఆర్ రామచంద్రన్ ఓ మహిళను కొట్టారని ఆరోపిస్తూ ట్విట్టర్‌లో వీడియో షేర్ చేసింది బీజేపీ. పేదలు, మహిళలు అంటే అధికార డీఎంకేకు గౌరవం లేదని ధ్వజమెత్తింది. ప్రజలు డీఎంకేకు ఏమైనా బానిసలా అని ప్రశ్నించింది. మహిళను కొట్టిన మంత్రి 48 గంటల్లోగా రాజీనామా చేయాలని, లేదంటే ఆయన ఇల్లును దిగ్బంధిస్తామని తమిళనాడు బీజేపీ చీఫ్ కే అన్నామలై హెచ్చరించారు.
மக்கள் என்ன உங்கள் அடிமைகளா?
— K.Annamalai (@annamalai_k) July 12, 2022
விருதுநகர்,பாலவனத்தம் கிராமத்தில் தீர்வு தேடி வந்த ஏழைத்தாயை அடித்த @arivalayam அமைச்சர் KKSSR ராமச்சந்திரன்
அடுத்த 48 மணி நேரத்திற்குள் அமைச்சர் பதவி விலக வேண்டும் அல்லது அவரது வீட்டை @BJP4TamilNadu முற்றுகையிடும் என்பதைத் தெரிவித்துக் கொள்கிறோம்! pic.twitter.com/iV4fyKLnXQ
అన్నామలై షేర్ చేసిన వీడియోలో ఓ మహిళ తన సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించింది. ఆ సమయంలో మరొకరితో మాట్లాడుతున్న ఆయన.. చేతిలో ఉన్న కాగితాలతో మహిళ తలపై కొట్టాడు. పలవనాథం గ్రామంలో ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు మంత్రి వెళ్లినప్పుడు ఈ ఘటన జరిగింది. దీన్నే ఆధారంగా చూపిన బీజేపీ.. అధికార డీఎంకేపై విమర్శలు గుప్పించింది.
అయితే మంత్రి రామచంద్రన్ ఈ ఘటనపై వివరణ ఇచ్చారు. ఆ మహిళ తనకు బంధువు అవుతుందని పేర్కొన్నారు. ఆమెను కొట్టలేదని, కాగితాలు మాత్రమే తాకాయని చెప్పారు. పింఛను సమస్య కోసమే ఆ మహిళ తనను కలిసేందుకు వచ్చిందని వివరించారు. దీన్ని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినట్లు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment