58 రోజుల తర్వాత అమ్మ...
58 రోజుల తర్వాత అమ్మ...
Published Sat, Nov 19 2016 7:21 PM | Last Updated on Mon, Sep 4 2017 8:33 PM
తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో సెప్టెంబర్ 22వ తేదీన చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను.. 58 రోజుల తర్వాత వైద్యులు సీసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ఆమె ఆరోగ్యం చాలావరకు మెరుగుపడటంతో ఆమెను సాధారణ వార్డుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ అవసరం లేకుండానే రోజుకు 20 గంటల పాటు సహజంగా శ్వాసను తీసుకునే స్థాయికి ఆమె ఆరోగ్యం పుంజుకోగా, నిద్రపోయేటపుడు మాత్రమే కృత్రిమశ్వాసను అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆస్పత్రిలో పడకపై కూర్చుని టీవీలు చూస్తున్నారని, పత్రికలను చదువుతున్నారని కూడా అపోలో వర్గాలు తెలిపాయి.
కాగా, ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి నుంచే పరిపాలన సాగిస్తున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. జాలర్ల సమస్య, కావేరీ జల వివాదాలపై పార్లమెంటు సమావేశాల్లో స్పందించాల్సిన విధానంపై ఎంపీలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ కావాలో ఆమె అభీష్టానికే వదిలేసినట్లు అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే.
Advertisement
Advertisement