general ward
-
ఐసీయూ నుంచి సాధారణ వార్డుకు మంత్రి విశ్వరూప్
సాక్షి, అమలాపురం టౌన్: ముంబై ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ ఆస్పత్రిలో గుండె శస్త్ర చికిత్స చేయించుకున్న రాష్ట్ర మంత్రి పినిపే విశ్వరూప్‌ను ఐసీయూ నుంచి సాధారణ వైద్యానికి స్పెషల్ రూమ్‌కు గురువారం సాయంత్రం మార్చారు. ఈ విషయాన్ని ముంబై నుంచి మంత్రి కుమారుడు డాక్టర్ శ్రీకాంత్ తెలిపారు. చదవండి: (AP Govt: వీఆర్వోలకు ఏపీ ప్రభుత్వం గుడ్‌న్యూస్) -
రాత్రయితే ఒక్కరే..
పెద్దాస్పత్రిని నమ్ముకుని చాలా మంది పేదలు జిల్లా మొత్తం నుంచి వైద్యం కోసం వస్తుంటారు. వారందరికీ సేవలు అందించాల్సిన బాధ్యత ఆస్పత్రిదే. సిబ్బంది అరకొరగా ఉండడంతో రాత్రయితే నర్సులు లేక రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. సుమారు 70 మంది రోగులకు ఒక్కరే నర్సు ఉండడం.. అందరికీ ఆమె సేవలు అందించలేకపోవడంతో పేషంట్ల అవస్థలు వర్ణనాతీతం.. విజయనగరం ఫోర్ట్: రెండు వార్డుల్లో సుమారు 60 నుంచి 70 మంది రోగులు ఉంటారు. రాత్రి వేళ ఒకే స్టాఫ్ నర్సు ఉండడంతో వారందరికి సేవలు అందించడం ఆమె ఒక్కర్తికే భారంగా ఉంటుంది. ఒక వార్డులో సేవలు అందిస్తున్న సమయంలో మరోవార్డులో అత్యవసరం అయితే పరుగులు పెట్టాల్సిన పరిస్థితి. దీంతో రోగులు ఇబ్బందులు పడుతున్నారు. రెండు వార్డులకు ఒకే స్టాఫ్ నర్సు: ఒక్కో వార్డులో 28 నుంచి 35 మంది వరకు రోగులు ఉంటారు. నిబంధన ప్రకారం 15 మంది రోగులకు ఒక స్టాఫ్ నర్సు ఉండాలి. పోనీ ఒక వార్డుకు ఒక స్టాప్ నర్సు ఉన్నా కాస్త ఊరటగా ఉంటుంది. రాత్రి వేళ రెండు వార్డులకు ఒక స్టాఫ్ నర్సు ఉండడం వల్ల వైద్య సేవలు సకాలంలో అందక రోగులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. స్టాఫ్‌నర్సుల సంఖ్య పెంచాల్సి ఉంది.. జిల్లాలో అతిపెద్ద ఆస్పత్రి కావడంతో రోగులు అధికంగా వస్తారు. అదే స్థాయిలో సిబ్బంది కూడా ఉండాలి. వార్డుకు ముగ్గురు స్టాఫ్ నర్సులు చొప్పన ప్రతి సిఫ్టుకూ విధుల్లో ఉండాల్సిన అవసరం ఉంది. అలా అయితే సేవలు సకాలంలో రోగులకు అందుతాయి. ఆస్పత్రిలో స్టాఫ్ నర్సుల సంఖ్య పెంచాల్సి ఉంది. రాత్రి అయితే ఒక్క నర్సే.. రాత్రి వేలలో కేంద్రాస్పత్రి అధికారులు రెండు వార్డులకు ఒకే స్టాఫ్ నర్సును ఉంచుతున్నారు. దీంతో అత్యవసర సమయాల్లో రోగులు ఆర్తనాదాలు చేయాల్సిన పరిస్థితి. ఒకే నర్సు ఉండడం వల్ల సేవలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. ఇది ఒక్కోసారి రోగుల ప్రాణాల మీదకు తెస్తోంది. ఎన్ని వార్డులున్నాయంటే... కేంద్రాస్పత్రిలో ఎమర్జన్సీ, ఆరోగ్యశ్రీ, పేవార్డు, పిల్లల వార్డు, మహిళల ఫీవర్ వార్డు, శస్త్రచికిత్సల వార్డు, పురుషుల మెడికల్ వార్డు, శస్త్రచికిత్సల వార్డు, టీడీ వార్డు, బర్నంగ్ వార్డు ఉన్నాయి. వీటన్నింటికీ సరిపడా సిబ్బంది కావాలి. గుండెనొప్పితో బెడ్‌పై ఇబ్బంది పడుతున్న శాంతి ఈ ఫోటోలో కనిపిస్తున్న మహిళ పేరు శాంతి. ఈమెది పట్టణంలోని రెల్లి వీధి. శనివారం ఉదయం జ్వరం వచ్చిందని ఆస్పత్రికి వస్తే వైద్యులు ఇన్‌పేషేంట్‌గా ఫీవర్ వార్డులో జాయిన్ చేశారు. రాత్రి 7 గంటల ప్రాంతంలో ఆమెకు గుండెనొప్పి రావడంతో బెడ్‌పై ఉండలేక నరకయాతన అనుభవించింది. ఈ విషయాన్ని సహాయకులుగా వచ్చిన వారు స్టాఫ్ నర్సుకు చెప్పగా ఆమె వచ్చి ఇంజిక్షన్ చేసి వెరే వార్డులో రోగికి ట్రీట్మెంట్ ఇవ్వడానికి వెళ్లింది. ఇంజిక్షన్ చేసినప్పటికీ నొప్పి తగ్గకపోవడంతో పెద్ద కేకలు వేసింది. ఈ విషయాన్ని సూపరింటెండెంట్ దృష్టికి సాక్షి తీసుకెళ్లగా ఆయన ఆస్పత్రిలో అత్యవసర విభాగానికి మార్చి చికిత్స అందజేశారు. ఇటువంటి పరిస్థితి ఇక్కడ నిత్యం జరుగుతుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. చర్యలు తీసుకుంటాం.. సిబ్బంది కొరత వల్ల రాత్రి వేల రెండు వార్డులకు ఒకే స్టాఫ్ నర్సు ఉంటున్నారు. ప్రతి వార్డుకు ఒక స్టాఫ్ నర్సు ఉండే విధంగా చర్యలు తీసుకుంటాం.-సీతారామరాజు, సూపరింటెండెంట్ -
58 రోజుల తర్వాత అమ్మ...
తీవ్రమైన జ్వరం, డీహైడ్రేషన్‌తో చెన్నై అపోలో ఆస్పత్రిలో సెప్టెంబర్ 22వ తేదీన చేరిన తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను.. 58 రోజుల తర్వాత వైద్యులు సీసీయూ నుంచి సాధారణ వార్డుకు తరలించారు. ఆమె ఆరోగ్యం చాలావరకు మెరుగుపడటంతో ఆమెను సాధారణ వార్డుకు తరలించినట్లు వైద్యులు తెలిపారు. వెంటిలేటర్ అవసరం లేకుండానే రోజుకు 20 గంటల పాటు సహజంగా శ్వాసను తీసుకునే స్థాయికి ఆమె ఆరోగ్యం పుంజుకోగా, నిద్రపోయేటపుడు మాత్రమే కృత్రిమశ్వాసను అందిస్తున్నట్లు చెబుతున్నారు. ఆస్పత్రిలో పడకపై కూర్చుని టీవీలు చూస్తున్నారని, పత్రికలను చదువుతున్నారని కూడా అపోలో వర్గాలు తెలిపాయి. కాగా, ముఖ్యమంత్రి జయలలిత ఆస్పత్రి నుంచే పరిపాలన సాగిస్తున్నట్లు అన్నాడీఎంకే వర్గాలు పేర్కొన్నాయి. జాలర్ల సమస్య, కావేరీ జల వివాదాలపై పార్లమెంటు సమావేశాల్లో స్పందించాల్సిన విధానంపై ఎంపీలకు సూచించినట్లు ప్రచారం జరుగుతోంది. మరోవైపు ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రి నుంచి ఎప్పుడు డిశ్చార్జ్ కావాలో ఆమె అభీష్టానికే వదిలేసినట్లు అపోలో ఆసుపత్రి చైర్మన్ ప్రతాప్ సీ రెడ్డి చెప్పిన విషయం తెలిసిందే. -
జనరల్ వార్డుల్లో త్రిముఖ పోరు
వికారాబాద్ , న్యూస్‌లైన్: రోజురోజుకూ రాజకీయ సమీకరణాలు మారుతుండటంతో మున్సిపల్ ఎన్నికలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. ఎవరు ఎవరికి ఓటేస్తారు అనే విషయమై ఒక అంచనాకు రాలేకపోతున్నారు. 28 వార్డుల్లో 17వ వార్డు ఏకగ్రీవం కావడంతో మిగిలిన 27 వార్డుల్లో బరిలో ఉన్న 120 మంది అభ్యర్థుల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. సీనియర్ రాజకీయ నేతలను సంప్రదించి వ్యూహాలు రచిస్తున్నారు. మొన్నటి వరకు రెబల్స్‌పై దృష్టి సారించిన అభ్యర్థులు నామినేషన్ దాఖలు గడువు ముగియడంతో ఇక ఓటర్లను ఆకట్టుకునే పనిలో పడ్డారు. పోటీదారుల ఎత్తులను తెలుసుకునేందుకు అభ్యర్థులు ఒకరిపై మరొకరు షాడోను ఏర్పాటు చేసుకున్నారు. అభ్యర్థులు ఎక్కడికి వెళ్లి ఎవరితో మాట్లాడుతున్నారనే విషయాన్ని ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ వ్యూహాలు రచిస్తున్నారు. త్రిముఖ పోరు.. పట్టణంలో ముఖ్యంగా 3, 4, 10, 12, 24 వార్డుల్లో నిల్చున్న అభ్యర్థుల మధ్య పోటీ తీవ్రంగా ఉంది. మూడవ వార్డులో టీడీపీ అభ్యర్థి ఊరడి ఆంజనేయులు, ఎంఐఎం నుంచి హమీరుద్దీన్, కాంగ్రెస్ నుంచి మేక చంద్రశేఖర్‌రెడ్డి, టీఆర్ఎస్ నుంచి వర్కల నర్సింహులు బరిలో ఉన్నారు. ఇక్కడ త్రిముఖపోరు నెలకొనే అవకాశం ఉంది. అదేవిధంగా 4వ వార్డులో టీఆర్ఎస్ నుంచి శుభప్రద్‌పటేల్, కాంగ్రెస్ నుంచి ఎల్.లక్ష్మీకాంత్‌రెడ్డి, సీపీఎం నుంచి మహీపాల్‌రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా హెచ్.హరికృష్ణ బరిలో ఉన్నారు. అయితే వీరిలో కేవలం ఇద్దరి మధ్యనే గెలుపు కోసం పోటీ ఉంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. అలాగే 10వార్డులో కాంగ్రెస్ నుంచి మధుకర్(సూర్య గ్యాస్), టీఆర్ఎస్ నుంచి ఎండీ జమీర్, టీడీపీ నుంచి సి.రామస్వామి, ఎంఐఎం నుంచి అతిక్‌పాషా బరిలో ఉండగా త్రిముఖ పోటీ ఉంటుందని విశ్లేషకుల అభిప్రాయం. 12వ వార్డులో కాంగ్రెస్ నుంచి వి.సత్యనారాయణ, టీడీపీ నుంచి సి.అనంత్‌రెడ్డి, ఎంఐఎం నుంచి ఫైయాజ్‌ఖాన్, స్వతంత్ర అభ్యర్థిగా జాదవ్‌మోహన్ బరిలో ఉండగా ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొనే అవకాశం ఉన్నట్లు స్థానికులు భావిస్తున్నారు. 24 వార్డులో టీఆర్ఎస్ నుంచి కె.విజయ్‌కుమార్, టీడీపీ నుంచి సి.రమేశ్‌కుమార్, కాంగ్రె స్ నుంచి సుధాకర్‌రెడ్డి, సీపీఎం అభ్యర్థిగా ఎన్. అంబిక, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక్కడ కూడా త్రిముఖ పోటీ ఉంటుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. వీరంతా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వార్డుల్లోని ప్రతి ఒక్కరి ఇంటికి వెలుతూ తనకే ఓటు వేయాలని ప్రాధేయపడుతున్నారు. తనను గెలిపిస్తే 24 గంటలూ అందుబాటులో ఉంటూ, వార్డును అన్ని విధాలా అభివృద్ధి చేస్తానని హామీల వర్షం గుప్పిస్తున్నారు.