అమ్మ పరిస్థితి అత్యంత విషమం: అపోలో
అమ్మ పరిస్థితి అత్యంత విషమం: అపోలో
Published Mon, Dec 5 2016 12:52 PM | Last Updated on Mon, Sep 4 2017 9:59 PM
అమ్మ ఆరోగ్య పరిస్థితి ఇప్పటికీ చాలా విషమంగానే ఉందని అపోలో ఆస్పత్రి విడుదల చేసిన హెల్త్ బులెటిన్‌లో పేర్కొంది. సోమవారం మధ్యాహ్నం 12.45 గంటల సమయంలో ఈ బులెటిన్‌ను విడుదల చేసింది.
ఆదివారం సాయంత్రం నాలుగు గంటల సమయంలో కార్డియాక్ అరెస్టు వచ్చిన ఆమె.. ప్రస్తుతం ఎక్మో (ఎక్స్ట్రాకార్పోరియల్ మెంబ్రేన్ హార్ట్ అసిస్టెడ్ డివైజ్) తో పాటు ఇతర లైఫ్ సపోర్ట్ సిస్టంల మీద ఉన్నారని ఆ బులెటిన్‌లో తెలిపింది. ఆమెకు నిపుణుల బృందం చికిత్స అందిస్తూ జాగ్రత్తగా పరిశీలిస్తోందని ఆ బులెటిన్‌లో పేర్కొంది. అపోలో ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ సుబ్బయ్య విశ్వనాథన్ పేరు మీద ఈ బులెటిన్ విడుదలైంది.
Advertisement
Advertisement