అమ్మ... అమ్మ... అమ్మ... అమ్మ
అమ్మ అమ్మా మాయమ్మ అమ్మంటేనే నీవమ్మా.... అంటూ తమిళ తంబిలు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఏఐఏడీఎంకే అధ్యక్షురాలు, పురచ్చితలైవి కుమారి జయలలితను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. గత ఏడాది అత్యంత తక్కువ ధరకే ఇడ్లీ, సాంబారు అన్నం, పొంగల్ అంటూ ఆమె ప్రారంభించిన 'అమ్మ క్యాంటీన్' పథకం విజయవంతమైంది. ఈ నేపథ్యంలో జయలలిత అదే బాటలో పయనిస్తూ...'అమ్మ కూరగాయల మార్కెట్', 'అమ్మ మినరల్ వాటర్' పథకాన్ని కూడా ప్రారంభించారు. ఆ పథకాలు తమిళనాట ప్రజలను మరింత దగ్గర చేసింది. దీంతో జయలలిత ఇప్పుడు అమ్మ మెడికల్ షాపులను ప్రారంభించారు. దాదాపు 15 ఏళ్ల నుంచి అమ్మ అని పిలిపించుకుంటున్న జయలలిత ఈ 'అమ్మ కాన్సెఫ్ట్'తో తమిళనాడు ప్రజల మనసులు 'చోరీ' చేసింది.
అమ్మ కాంటీన్ ప్రారంభంతోనే జయలలిత అదృష్టం సునామీలా సుడి తిరిగింది. అందుకే తమిళనాట ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో రాష్ట్రంలో 39 లోక్సభ స్థానాలకు గాను 37 స్థానాలను కైవసం చేసుకుంది. తమిళనాడు రాష్ట్రం అవతరించిన తర్వాత ఒక పార్టీ ఇన్ని లోక్సభ స్థానాలను జయలలిత కైవసం ఇదే మొదటిసారి. అంత 'అమ్మ' చలవే అని పలువురు అభిప్రాయపడ్డుతున్నారు. అందుకే అమ్మకు తమిళ ప్రజలు ఓట్లు గుద్ది పారేశారు. దేశవ్యాప్తంగా మోడీ హావా నడుస్తున్నా... బీజేపీతో పాటు ఏఐఏడీఎంకే ప్రధాన ప్రత్యర్థి పార్టీ డీఎంకే సోదిలో లేకుండా పోయాయి.
ఇప్పుడు ఇంకే అమ్మ పథకం వస్తుందో అని తమిళ నాట ప్రజలు అతృతతో ఎదురు చుస్తున్నారు. అమ్మ ఇలా 'అమ్మ' కాన్సెఫ్ట్తో ముందుకు దూసుకుపోతే వచ్చే రాష్ట్ర శాసనసభకు జరిగే ఎన్నికల్లో ఏఐఏడీఏంకే విజయ ఢంకా మోగించడం ఖాయమని తమిళనాట తీవ్రంగా చర్చ జరుగుతుంది.