తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రజాక్షేత్రంలోకి బయల్దేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్, తమిళనాడు మాజీ సీఎం దివంగత ఎంజీ రామచంద్రన్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ఓపీఎస్ తలపెట్టారు. ఇందుకోసం ఒక ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. మహీంద్రా జీపును కొంత మార్పు చేర్పులు చేయించుకుని ఆయన రెడీ చేయించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే బలపరీక్ష నిర్వహించి, పళని స్వామి నెగ్గినట్లుగా ప్రకటించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే.