MG Ramachandran
-
Kangana Ranaut: ‘తలైవి’ మూవీ రివ్యూ
టైటిల్ : తలైవి జానర్: బయోపిక్ నటీనటులు : కంగన రనౌత్, అరవింద్ స్వామి, నాజర్, భాగ్యశ్రీ, సముద్రఖని, మధుబాలా తదితరులు నిర్మాణ సంస్థలు: విబ్రి మీడియా, కర్మ మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ నిర్మాతలు : విష్ణు వర్ధన్ ఇందూరి కథ: విజయేంద్ర ప్రసాద్ దర్శకత్వం : ఏఎల్ విజయ్ సంగీతం : జీవీ ప్రకాష్ కుమార్ విడుదల తేది : సెప్టెంబర్ 10,2021 లేడి ఓరియెంటెండ్ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తోంది బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్. వరుసగా నాయికా ప్రాధాన్యమున్న సినిమాలు చేస్తూ చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ భామ తాజాగా నటించిన మరో లేడి ఓరియెంటెండ్ మూవీ ‘తలైవి’. నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితాధారంగా దర్శకుడు ఎ.ఎల్. విజయ్ రూపొందించిన చిత్రమిది. టైటిల్ పాత్రని కంగనా పోషించగా.. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవింద్ స్వామి నటించారు. పాన్ ఇండియా స్థాయిలో రూపుదిద్దుకున్న ఈ చిత్రం సెప్టెంబరు 10న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ‘తలైవి’ప్రేక్షకుల మనసును ఏ మేరకు దోచుకుందో రివ్యూలో చూద్దాం. ‘తలైవి’కథేంటంటే: దర్శకుడు ముందుగా చెప్పినట్టే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత సినీ జీవితం ప్రారంభం నుంచి ఆమె సీఎంగా బాధ్యతలు చేపట్టే వరకు సాగే కథే ‘తలైవి’. ఓ పెద్దింటి కుటుంబంలో పుట్టినా జయలలిత(కంగనా రనౌత్) కొన్ని పరిస్థితుల కారణంగా పేదరికంలోకి వస్తుంది. అయితే వాళ్లమ్మ మాత్రం ఎంతో కష్టపడి పెంచి పెద్ద చేస్తుంది. 16 ఏళ్ల వయసులోనే జయను హీరోయిన్ను చేస్తుంది. అతి చిన్న వయసులోనే ఎంజీ రామచంద్రన్ అలియాస్ ఎంజీఆర్ (అరవింద్ స్వామి) లాంటి స్టార్‌తో నటించే అవకాశం చేజిక్కించుకుంటుంది. ఆ తర్వాత కోలీవుడ్‌లో వాళ్లది సూపర్ హిట్ జోడీ అయిపోతుంది. ఈ క్రమంలో ఎంజీఆర్‌తో జయలలితకు ఎలాంటి అనుబంధం ఏర్పడుతుంది? సినీ నటిగా వరుస సినిమాలతో బిజీగా ఉన్న జయ.. రాజకీయాల్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? తను ఎంతో అభిమానించే ఎంజీఆర్ మరణం తర్వాత తమిళనాడు ఎలాంటి రాజకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి? జయలలిత ముఖ్యమంత్రి పీఠం చేపట్టే క్రమంలో ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి? తెలియాలంటే ‘తలైవి’ చూడాల్సిందే. ఎవరెలా చేశారంటే.. జయలలిత పాత్రలో కంగన ఒదిగిపోయారు. తెరపై జయలలిత కనిపిస్తుందే తప్ప.. కంగాన రనౌత్ ఏ మూలాన కనిపించదు. ఆమెను జాతియ ఉత్తమ నటి అని ఎందుకు అంటారో ఈ సినిమా చూస్తే అర్థమవుతంది. ఎంజీఆర్‌తో దూరమయ్యే సన్నివేశాల్లో చక్కటి భావోద్వేగాన్ని పలికించింది. ఇక కంగన తర్వాత ఈ చిత్రంలో బాగా పండిన పాత్ర అరవింద్ స్వామిది. ఎంజీఆర్ పాత్రలో ఆయన జీవించేశాడు. స్టార్ హీరోగా, రాజకీయ నాయకుడిగాను ప్రత్యేక హావభావాలను పలికించాడు. ఎంజీఆర్ అనుచరుడు వీరప్పన్ పాత్రకు సముద్రఖని ప్రాణం పోశాడు. కరుణ పాత్రలో నాజర్ మరోసారి తన అనుభవాన్ని తెరపై చూపించాడు. జయ తల్లి పాత్రలో అలనాటి నటి భాగ్య శ్రీ, ఎంజీఆర్ భార్య పాత్రలో మధుబాల, శశికల పాత్రలో పూర్ణతో మిగిలిన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఎలా ఉందంటే..? ‘అమ్మ’గా తమిళ ప్రజల గుండెల్లో పదిలమైన చోటు దక్కించుకున్న దివంగత మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన చిత్రం తలైవి. జయ జీవితంలో అతి కీలకమైన 1965 నుంచి మొదటి సారి ఆమె ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన 1991 మధ్య జరిగే కథను మాత్రమే తెరపై చూపించాడు దర్శకుడు ఏఎల్ విజయ్. ఓ సినిమాకి కథ ఎంపికతోపాటు క్యారెక్టర్ సెలక్షన్ కూడా చాలా ముఖ్యం. ఇదే సినిమా సక్సెస్‌ను నిర్ణయిస్తుంది. ఎప్పుడైతే జయలలిత పాత్రకు జాతీయ ఉత్తమ నటి కంగనాను ఎంపిక చేశారో.. అప్పుడే ఈ సినిమా సగం సక్సెస్ సాధించింది. ఫస్టాఫ్‌లో జయ లలిత సినీ జీవితాన్ని చూపించిన దర్శకుడు.. సెకండాఫ్ మొత్తం ఆమె రాజకీయ జీవితాన్ని చూపించాడు. ఎంజీఆర్ పాత్రను హైలైట్ చేస్తూనే.. అదే సమయంలో జయలలిత పాత్ర ప్రాధాన్యత తగ్గకుండా జాగ్రత్త పడ్డాడు దర్శకుడు. జయ-ఎంజీఆర్ మధ్య ఉన్న బంధాన్ని కూడా తెరపై చాలా చక్కగా చూపించారు. రాజకీయాలే వద్దనుకున్న జయ.. పాలిటిక్స్‌లోకి ఎందుకు రావాల్సి వచ్చిందో తెలిపే సీన్స్‌ని చాలా చక్కగా డిజైన్ చేసుకున్నాడు. అలాగే జయలలితను తమిళ ప్రజలు ‘అమ్మ’అని ఎందుకు ముద్దుగా పిలుసుకుంటారో తెలియజేసే సీన్ కూడా చాలా అద్భుతంగా తీర్చిదిద్దాడు. ఒక రాజకీయాల్లో వచ్చి తర్వాత జయ జీవితం ఎలాంటి మలుపు తిరిగిందే విషయాన్ని కూడా ఉన్నది ఉన్నట్లు చూపించారు. సొంత పార్టీ నేతలే జయపై కుట్ర చేయడం, ఆమెను రాజ్య సభకి పంపడం లాంటి సీన్స్ కూడా హత్తుకునేలా తీర్చి దిద్దారు. ఎంజీఆర్ మరణం తర్వాత చోటు చేసుకునే పరిణామాలను ఉత్కంఠభరితంగా తెరకెక్కించారు. ‘నమ్మి వస్తే అమ్మ.. లేదంటే ఆదిశక్తి’ అంటూ జయలో ఉన్న రెండో కోణాన్ని కూడా తెరపై చూపించారు. ఈ సినిమాకు మరో ప్రధాన బలం జీవి ప్రకాశ్ కుమార్ సంగీతం. పాటలు అంతగా ఆకట్టుకోలేవు కానీ, నేపథ్య సంగీతం అదిరిపోయింది. విశాల్ విట్టల్ సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఎడిటింగ్ పర్లేదు. ఫస్టాఫ్‌లో కొన్ని సీన్స్‌కి కత్తెర పడాల్సింది. నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగినట్టుగా ఉన్నాయి. - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
తలైవర్‌ని గుర్తు చేసుకుంటూ..
ప్రముఖ నటుడు, మాజీ తమిళనాడు ముఖ్యమంత్రి యంజీ రామచంద్రన్ (యంజీఆర్) వర్ధంతి గురువారం. ఈ సందర్భంగా ‘తలైవి’ సినిమా నుంచి అరవింద్ స్వామి చేసిన యంజీఆర్ పాత్ర లుక్‌ను విడుదల చేశారు. జయలలిత జీవితం ఆధారంగా ఏఎల్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘తలైవి’. కంగనా రనౌత్ టైటిల్ రోల్ చేస్తున్నారు. ఈ సినిమాలో యంజీఆర్‌గా చేయడం గురించి అరవింద్ స్వామి మాట్లాడుతూ – ‘‘పురట్చి తలైవర్ (విప్లవ నాయకుడు) యంజీఆర్ పాత్రను చేయడం నాకు దక్కిన గొప్ప గౌరవంలా భావిస్తున్నాను. అలానే పెద్ద బాధ్యతలా భావించాను. ఈ అవకాశం ఇచ్చిన దర్శక–నిర్మాతలకు ధన్యవాదాలు. తలైవర్‌ను గుర్తు చేసుకుంటూ ఈ ఫొటోలను షేర్ చేస్తున్నాను’’ అన్నారు. -
కల నెరవేరింది
తమిళ ప్రఖ్యాత నవల ‘పొన్నియిన్ సెల్వన్’ని సినిమాగా తీసుకురావాలన్నది దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి యంజీఆర్ (యంజీ రామచంద్రన్) కల. ఈ నవలను సినిమాగా తీయాలని పలుమార్లు ప్రయత్నించినప్పటికీ కుదర్లేదు. ఇప్పుడు యంజీఆర్‌ను యానిమేషన్ రూపంలో ‘పొన్నియిన్ సెల్వన్’ రూపొందిస్తోంది చెన్నైకు సంబంధించిన శనీశ్వరన్ యానిమేషన్ స్టూడియో ఇంటర్నేషనల్. ఈ సంస్థే నిర్మాణాన్ని కూడా చూసుకుంటోంది. ‘వందియదేవన్: పొన్నియిన్ సెల్వన్ 1’ పేరుతో ఈ భారీ బడ్జెట్ యానిమేషన్ చిత్రాన్ని దర్శకుడు దవచెల్వాన్ తెరకెక్కిస్తున్నారు. నాలుగేళ్లుగా ఈ సినిమాపై వర్క్ చేస్తోందట ఈ యానిమేషన్ స్టూడియో. ఇటీవల యంజీఆర్ జయంతి సందర్భంగా ఈ సినిమాలో తొలి పాటను విడుదల చేశారు. విశేషం ఏంటంటే ఈ సినిమాలో హీరోయిన్గా జయలలిత పాత్ర ఉండబోతోందట. ఆమె పాత్ర కూడా యానిమేషన్లోనే ఉంటుంది. త్వరలోనే ఈ సినిమా విడుదల కానుంది. ఈ సంగతి అలా ఉంచితే ‘పొన్నియిన్ సెల్వన్’ నవల ఆధారంగా దర్శకుడు మణిరత్నం ప్రస్తుతం ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీ, ‘జయం’ రవి, ఐశ్వర్యా రాయ్, త్రిష ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. -
వెండితెర ఎంజీఆర్
దివంగత నటి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత జీవితం ఆధారంగా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో తెర కెక్కుతోన్న చిత్రం ‘తలైవి’. (హిందీలో ‘జయ’). ఎ.ఎల్ విజయ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని విష్ణు ఇందూరి, శైలేష్ ఆర్ సింగ్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో దివంగత నేత కరుణానిధి పాత్రలో ప్రకాశ్‌రాజ్, దివంగత నటుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎం.జి రామచంద్రన్ (ఎంజీఆర్) పాత్రలో అరవిందస్వామి నటిస్తున్నారు. ఈ సినిమా తాజా షెడ్యూల్ చిత్రీకరణ ఇటీవల చెన్నైలో ప్రారంభమైంది. ఇవాళ ఎం.జి రామచంద్రన్ జయంతి సందర్భంగా ఈ సినిమాలోని అరవింద స్వామి లుక్‌ను విడుదల చేశారు. ‘‘ఆల్రెడీ విడుదల చేసిన కంగనా రనౌత్ ఫస్ట్ లుక్, టీజర్లకు మంచి స్పందన లభిస్తోంది. ఎంజీఆర్ పాత్రలో ఒదిగిపోయి అద్భుతంగా నటిస్తున్నారు అరవిందస్వామి’’ అని చిత్రబృందం పేర్కొంది. ‘తలైవి’ చిత్రం ఈ ఏడాది జూన్‌లో విడుదల కానుంది. -
రూపాయి విలువ తెలుసా?
న్యూఢిల్లీ: అఖిల భారత అన్నా డీఎంకే వ్యవస్థాపక నాయకుడు ఎంజీ రాంచంద్రన్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం వంద రూపాయలు, ఐదు రూపాయల నాణాలను తీసుకొస్తున్న విషయం తెల్సిందే. మన కరెన్సీ నాణాలకు 67 ఏళ్ల చరిత్ర ఉంది. మొట్టమొదటి సారిగా స్వాతంత్య్రానంతరం 1950, ఆగస్లు 15వ తేదీనా భారత నాణాలను తీసుకొచ్చారు. అప్పటి వరకు బ్రిటీష్ ఇండియన్ కరెన్సీపై నున్న బ్రిటిష్ రాజు బొమ్మను తొలగించి నాలుగు సింహాలు, అశోక చక్రం ముద్రతో మొదటి భారత రూపాయి బిళ్లను దేశంలో ప్రవేశ పెట్టారు. అప్పట్లో రూపాయి అంటే సరిగ్గా దాని విలువ వంద పైసలు ఉండేది కాదు. రూపాయి అంటే అరు అణాలు, 64 పైసలు ఉండేది. ఒక దశలో అది 182 పైసలకు కూడా వెళ్లింది. ఒకప్పుడు భారత నాణాలను సిల్వర్, కాపర్, నికిల్ ఏదో ఒక లోహాన్ని ఉపయోగించి నాణాలను తయారు చేయగా ఆ తర్వాత రెండేసి లోహాలను ఉపయోగించి నాణాలను తయారు చేయడం ప్రారంభమైంది. ప్రస్తుతం అమల్లో ఉన్న నాణాలను హస్త ముద్ర సిరీస్ కింద 2007లో తీసుకొచ్చారు. అందులోనే కొత్త సీరిస్‌ను 2011లో ప్రవేశపెట్టారు. ఇప్పుడు ఎంజీ రామచంద్రన్ శత జయంతి ఉత్సవాలను పురస్కరించుకొని వచ్చే ఏడాది జనవరి 17వ తేదీన తీసుకరానున్న ఐదు, వంద రూపాయల నాణాలను సిల్వర్, కాపర్, నికిల్తోపాటు జింక్‌ను కూడా కలిపి తీసుకొస్తున్నారు. -
త్వరలో 100 రూపాయిల కాయిన్: కేంద్రం
సాక్షి, న్యూఢిల్లీ : త్వరలో కొత్తగా వంద రూపాయిల కాయిన్లను విడుదల చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. ఎంజీ రామచంద్రన్ జయంతి సందర్భంగా ఆయన జ్ఞాపకార్థం రూ. 100, రూ. 5 నాణెలను ముద్రిస్తున్నట్లు పేర్కొంది. రూ. 100 కాయిన్ వ్యాసం 44 మిల్లీమీటర్లు ఉంటుందని తెలిపింది. రూ. 100 కాయిన్‌పై నాలుగు సింహాల అశోకుని స్థూపం ఉంటుందని వివరించింది. వంద రూపాయిల కాయిన్ వెనుక భాగంలో ఎంజీ రామచంద్రన్ బొమ్మ ఉంటుందని తెలిపింది. కాయిన్ బరువు 35 గ్రాములు ఉంటుందని, దీన్ని తయారు చేయడానికి వెండి, రాగి, నికెల్, జింక్‌ల మిశ్రమాన్ని వినియోగిస్తున్నట్లు వెల్లడించింది. 23 మిల్లీమీటర్ల వ్యాసార్థంతో ఉండే రూ.5 కాయిన్ బరువు 6 గ్రాములు ఉంటుందని చెప్పింది. ఎంజీ రామచంద్రన్ జయంతి సందర్భంగా కాయిన్స్, పోస్టల్ స్టాంపులను విడుదల చేయాలని తమిళనాడు ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన విషయం తెలిసిందే. -
విలీనమా..వ్యూహమా!
► స్పందించని చిన్నమ్మ ► వేటుపై దినకరన్ సానుకూల ధోరణి ► అన్నాడీఎంకేలో పరిణామాలపై అనుమానాలు ► విలీనం ఒక డ్రామా అంటున్న కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ అమ్మ మరణం తరువాత చీలికలు పేలికలై అనేక మలుపులు తిరిగిన అన్నాడీఎంకే తాజాగా వైరివర్గాల విలీనం దశకు చేరుకుంది. పార్టీలో ముసలానికి ప్రధాన కారణమైన శశికళ కుటుంబంపై వేటువేయడం ద్వారా అన్నాడీఎంకేకు పూర్వవైభవం తెస్తామని చాటుకుంటూ సాగుతున్నది చిత్తశుద్ధితో కూడిన విలీనమా మరేదైనా వ్యూహమా అనే అనుమానాలు నెలకొన్నాయి. సాక్షి ప్రతినిధి, చెన్నై: తమిళనాడులో ఎంజీ రామచంద్రన్ స్థాపించిన అన్నాడీఎంకే శకం ఇక ముగిసిపోయిందని అందరూ తీర్మానించుకోగా, తాజాగా చోటుచేసుకున్న అనూహ్యమైన పరిణామాల వల్ల పార్టీతోపాటూ రెండాకుల చిహ్నం కూడా చేరువకాగలదని ఇరువర్గాలు నమ్ముతున్నాయి. అయితే విలీనం వెనుక కేవలం పార్టీ ప్రయోజనాలేనా..ఇరువర్గాల విలీనం విశ్వసనీయమైనదేనా అనే చర్చ మొదలైంది. అమ్మ మరణం తరువాత అనా«థగా మారిన అన్నాడీఎంకేకు అండగా నిలవ డం ద్వారా తమిళనాడుల వేళ్లూనుకోవాలని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పావులు కదిపింది. సీఎం పన్నీర్‌సెల్వంకు బాసటగా నిలుస్తూ రాజకీయంగా రాజబాట వేసుకోవాలని భావించింది. అయితే బీజేపీ అంచనాలు తారుమారుకాగా శశికళ వర్గం అధికారంలోకి వచ్చింది. ఆస్తుల కేసులో శశికళ జైలుకెళ్లినా పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారకపోగా రాజకీయంగా పన్నీర్‌సెల్వం మరింత బలహీనపడిపోయారు. ఇక పూర్తిగా కార్యాచరణలోకి దిగిన కేంద్రం అదనుకోసం వేచిచూడటం ప్రారంభించింది. సరిగ్గా ఈసమయంలో దినకరన్ పలు కేసుల్లో ఇరుక్కోవడం కేంద్రానికి అయాచిత వరాలుగా మారాయి. అవినీతి ఆరోపణల్లో అధికార పార్టీ అడ్డంగా దొరికిపోవడం రాష్ట్రపతి పాలనకు దారితీస్తుందనే భయం శశికళ వర్గంలో నెలకొంది. ఈ భయానికి ఊతమిస్తూ ఇన్చార్జ్ గవర్నర్ విద్యాసాగర్‌రావు నాలుగురోజుల క్రితం అకస్మాత్తుగా చెన్నైకి చేరుకున్నారు. పన్నీర్‌సెల్వం దూరమైన నాటి నుండే తమిళనాడు ప్రభుత్వాన్ని కేంద్రం టార్గెట్ చేసిందని శశికళ వర్గం అనుమానిస్తోంది. ఈ పరిణామాలను తనకు అనుకూలంగా మలుచుకునేందుకు డీఎంకే ఒకవైపు పొంచి ఉంది. మధ్యంతర ఎన్నికలు ముంచుకొస్తే మనుగడ లేదని శశికళ వర్గానికి తెలుసు. చేజేతులా అధికారాన్ని చేజార్చుకునే కంటే శశికళ, దినకరన్‌లపై వేటువేయడం ద్వారా పన్నీర్ సెల్వంతో రాజీపడితే కేంద్రంతో సత్సంబంధాలు, ఎంజీఆర్ స్థాపించిన అన్నాడీఎంకే, రెండాకుల చిహ్నం కూడా దక్కుతాయని ఎడపాడి పన్నాగంగా ఉంది. కేంద్రం కల్పించిన కష్టాల నుండి గట్టెక్కేందుకు పన్నీర్‌సెల్వంను శశికళ వర్గం పావుగా వాడుకుంటున్నట్లు అనుమానిస్తున్నారు. తనను బహిష్కరిస్తే ప్రభుత్వాన్ని కూల్చివేసే ఎమ్మెల్యేల బలం ఉందని రెండురోజుల క్రితం హెచ్చరించిన దినకరన్ వేటుకు వంతపాడటం, శశికళ నోరుమెదపక పోవడం వెనుక అంతరార్థం ఈ వ్యూహంలో భాగమేనని తెలుస్తోంది. ఇదిలా ఉండగా బీజేపీ వ్యూహం మరోలా ఉంది. తమిళనాడులో రాష్ట్రపతి పాలన విధిస్తే ఆ తరువాత వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో డీఎంకే గెలుపు నల్లేరుమీద నడకకాగలదు. కాంగ్రెస్ మిత్రపక్ష డీఎంకే అధికారంలోకి వచ్చేకంటే అస్తవ్యస్తంగా తయారైన అన్నాడీఎంకేను దారికితెచ్చుకుని తనకు అనుకూలంగా మలుచుకోవడం మేలనే ఆలోచనతోనే తమిళనాడు ప్రభుత్వంపై బీజేపీ పలుకోణాల్లో వత్తిడిపెంచినట్లు తెలుస్తోంది. రాబోయే అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల నాటికి అన్నాడీఎంకేను మిత్రపక్షంగా చేసుకుని తమిళనాడులో అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నమే వీలీనం వెనుక వ్యూహమని భావించవచ్చు. రాష్ట్రపతి పాలన ప్రమాదం నుంచి గట్టేక్కేందుకు శశికళ వర్గం, తమిళనాడులో జెండా పాతేందుకు బీజేపీ..విలీనానికి వ్యూహకర్తలుగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. విలీనం ఒక నాటకం: కేంద్ర మంత్రి పొన్ కాగా, అన్నాడీఎంకేలోని రెండువర్గాల విలీనం పథకం ప్రకారం ఆడుతున్న నాటకమని కేంద్ర మంత్రి పొన్ రాధాకృష్ణన్ వ్యాఖ్యానించారు. నాగర్‌కోవిల్‌లో మంగళవారం రాత్రి మీడియాతో మాట్లాడుతూ, ఏ కారణం చేత విడిపోయారు, నేడు ఏ కారణం చేత విలీనం అవుతున్నారని ఆయన ప్రశ్నించారు. జయ మరణ మిస్టరీపై విచారణ కమిషన్ వేస్తానని పన్నీర్‌సెల్వం చేసిన ప్రకటన విలీనం తరువాత నీరుగారిపోవడమో లేదా కంటితుడుపు కమిషన్‌గా మారడమో జరుగుతుందని ఆయన అన్నారు. అన్నాడీఎంకేలో చీలికలు తేవడం ద్వారా లబ్ది పొందాల్సిన అగత్యం బీజేపీ లేదని ఆయన వ్యాఖ్యానించారు. -
గుర్తు పట్టాలని!
► చేజారకుండా శశి వర్గం జాగ్రత్తలు ► తమకే దక్కుతుందని పన్నీర్ ధీమా ► దీప సైతం ఎదురుచూపులు ► ఎన్నికల కమిషన్ నిర్ణయం కీలకం రాష్ట్రంలోని అనేక ద్రవిడ పార్టీల్లో ప్రధానమైన అన్నాడీఎంకేపై రసవత్తర చర్చ మొదలైంది. ఆర్కేనగర్ ఉప ఎన్నికలో రెండాకుల చిహ్నం ఏవర్గానికి దక్కేనో, మరెవరి వర్గం వైపు మొగ్గేనో అని ఆసక్తికరమైన విశ్లేషణలో పార్టీలు మునిగితేలుతున్నాయి. రెండాకుల గుర్తును నిలబెట్టుకునేందుకు శశికళ, సాధించుకునేందుకు పన్నీర్ పాటుపడుతుండగా, అనుకూల పవనాల కోసం జయ మేనకోడలు దీప కాచుకుని ఉన్నారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: 1972 అక్టోబరు 17వ తేదీన ఎంజీ రామచంద్రన్ స్థాపించిన ఈ పార్టీకి 1.50 కోట్ల సభ్యత్వంతో బలమైన క్యాడర్ ఉంది. ఎంజీఆర్ బొమ్మ, అమ్మ ఫొటోలు అన్ని ఎన్నికల్లో అతి ప్ర ధాన ఆకర్షణలు. వీటికి తోడు పార్టీ రెండాకుల చిహ్నం కనపడితేచాలు బ్యాలెట్ పేపర్‌పై ముద్రవేసే ఓటు బ్యాంక్ అన్నాడీఎంకేకు సొంతం. పార్టీకి ఆనేతలు ఎంత బలమో ప్రజల హృదయాల్లో నాటుకుపోయిన రెండాకుల చిహ్నం కూడా అంతేబలం. అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత మరణం, శశికళ బాధ్యతల స్వీకరణ, పన్నీర్‌సెల్వం తిరుగుబాటు, జయకు అసలైన రాజకీయ వారసురాలిని తానేనంటూ ఆమె మేనకోడలు దీప గళమెత్తారు. దీంతో అన్నాడీఎంకే అనుచరులు మూడుగా చీలిపోయారు. సభ్యులు సైతం ఎవరికి నచ్చిన చోట వారు చేరిపోయారు. 1.50 కోట్ల పార్టీ సభ్యత్వం సైతం మూడు వర్గాలుగా మారిపోయింది. అన్నాడీఎంకేలోని మూడు వర్గాలూ అమ్మ బొమ్మ చూ పించే ఎన్నికల బరిలో దిగ డం తప్పనిసరి. అయితే వీటన్నికం టే గెలుపు గుర్రం ఎక్కించే రెండాకుల చిహ్నం ఇంకా ఎంతో ముఖ్యం. అమ్మ మెచ్చిన నేత అనే సెంటిమెంట్ బలాన్ని పన్నీర్‌సెల్వం కలిగి ఉన్నా, జయ మేనకోడలిగా అసలైన రాజకీయ వారసురాలు అనే ముద్ర దీప సొంతమైనా ఇవన్నీ బ్యాలెట్ పేపరులో ప్రతిబంబించవు. బ్యాలెట్ పేపరులో ఓటరుకు కనపడేది రెండాకుల చిహ్నం మాత్రమే. రెండాకుల చిహ్నం కనపడితే చాలు ఆవేశంతో ఊగిపోయినట్లుగా బ్యాలెట్‌పై ఓటరు తన రాజ ముద్రను వేసేస్తారని ఒక డీఎంకే నేతనే అంగీకరించాడు. ఓటర్లపై అంతటి ప్రభావం చూపగలిగిన సత్తా కలిగి ఉండటం వల్లే రెండాకుల చిహ్నం కోసం ముగ్గురూ పోటీపడుతున్నారు. ఐదేళ్ల సభ్యత్వం లేని కారణంగా ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపిక చెల్లదని పన్నీర్‌సెల్వం ప్రధాన ఎన్నికల కమిషన్ వద్ద సవాల్ చేసి ఉన్నారు. పన్నీర్ వాదనతో ఎన్నికల కమిషన్ ఏకీభవించినపక్షంలో శశికళ పదవీచ్యుతురాలు కాగలరు. తద్వారా పార్టీ పగ్గాలు, రెండాకుల గుర్తు తన చేతికి వస్తాయని పన్నీర్ ఆశిస్తున్నారు. అయితే సీఈసీ నిర్ణయం ప్రతికూలంగా మారినపక్షంలో పార్టీ చేజారిపోకుండా తన వర్గంలో ఉండే ఐదేళ్ల సభ్యత్వ సీనియారిటి కలిగి ఉన్న వ్యక్తిని శశికళ తన స్థానంలో నిలిపే అవకాశం ఉంది. తన రాజకీయ ప్రవేశ లక్ష్యం పార్టీని, రెండాకుల చిహ్నన్ని స్వాధీనం చేసుకోవడమేని దీప ఇప్పటికే ప్రకటించి ఉన్నారు. రెండాకుల చిహ్నం దక్కించుకోవడంలో దీపకు ఇప్పట్లో సాధ్యం కాదు. అయితే రెండాకుల చిహ్నం శశికళకా, పన్నీరుకా ఎవరికి సొంతం అనే అంశంపై సీఈసీ తీసుకునే నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది. శశికళ ఎంపిక చెల్లదని సీఈసీ ప్రకటించినట్లయితే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆమె చేసిన నియామకాలు, తీసుకున్న నిర్ణయాలన్నీ రద్దయిపోతాయి. ఎన్నికల పోలింగ్‌లోగా సీఈసీ తన నిర్ణయాన్ని ప్రకటించని పక్షంలో పరిస్థితి మరోరకంగా మారుతుంది. అన్నాడీఎంకే తరపున ఆర్కేనగర్లో పోటీచేసే అభ్యర్దులకు తగిన వ్యక్తి బీఫాంపై సంతకం చేసినపుడే రెండాకుల చిహ్నం కేటాయించబడుతుంది. సర్వసభ్య సమావేశం ద్వారా ఎంపికైన శశికళ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి మాత్రమే కాబట్టి బీఫాంపై ఆమె సంతకం చెల్లదని పన్నీర్ వర్గం వాదిస్తోంది. అంతేగాక శాశ్వత కార్యదర్శి హోదాలో జయ చేత నియమితులైన ప్రిసీడియం చైర్మన్ మదుసూధనన్ సంతకంతో బీఫారాలు జారీచేస్తామని కూడా పన్నీర్ అనుచరులు చెబుతున్నారు. ఆర్కేనగర్ ఉప ఎన్నికపై మరో రెండు రోజుల్లో నామినేషన్లను స్వీకరించనున్న తరుణంలో రెండాకుల చిహ్నం వివాదం కీలకంగా మారింది. ఇంతటి గందరగోళ పరిస్థితుల్లో రెండాకుల చిహ్నం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సిందే. -
ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగే పన్నీర్ సెల్వం కూడా!
-
తమిళనాట ముగియని రాజకీయ సంక్షోభం
-
ఎన్టీఆర్, ఎంజీఆర్ లాగే పన్నీర్ సెల్వం కూడా!
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం ప్రజాక్షేత్రంలోకి బయల్దేరుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్, తమిళనాడు మాజీ సీఎం దివంగత ఎంజీ రామచంద్రన్ తరహాలోనే రాష్ట్రవ్యాప్తంగా భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించాలని ఓపీఎస్ తలపెట్టారు. ఇందుకోసం ఒక ప్రచార రథాన్ని కూడా సిద్ధం చేసుకున్నారు. మహీంద్రా జీపును కొంత మార్పు చేర్పులు చేయించుకుని ఆయన రెడీ చేయించుకున్నారు. తమిళనాడు అసెంబ్లీలో ప్రతిపక్షం లేకుండానే బలపరీక్ష నిర్వహించి, పళని స్వామి నెగ్గినట్లుగా ప్రకటించడం పట్ల ఆయన తీవ్ర అభ్యంతర వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. దివంగత ముఖ్యమంత్రి జయలలిత మంత్రివర్గంలో పనిచేయడంతో పాటు ఆమెకు అత్యంత విశ్వాసపాత్రుడైన పన్నీర్ సెల్వాన్ని స్వయంగా అమ్మే ముఖ్యమంత్రిగా నియమించారు. అయినా ఆమె కుర్చీలో కూర్చోకుండా.. అందులో జయలలిత ఫొటోను మాత్రం ఉంచి, ఆయన పక్కన వేరే కుర్చీలో కూర్చున్న సంగతి తెలిసిందే. పన్నీర్ సెల్వానికి ప్రజల్లో మంచి స్పందన లభించింది. సామాన్య ప్రజలు ఆయన పట్ల ఆదరణ కనబర్చినా, ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోలేకపోవడం.. అసెంబ్లీలో పరిణామాలు చకచకా మారిపోవడంతో పన్నీర్ సెల్వం తన పదవిని కోల్పోవాల్సి వచ్చింది. దాంతో ఇప్పుడు ప్రజల్లోకి వెళ్లి, వాళ్ల మద్దతు కూడగట్టుకోవాలని ప్రయత్నిస్తున్నారు. -
ఘన నివాళి
► ఎంజీఆర్ శత జయంతి వేడుకలు ►ఎంజీఆర్ నివాసంలో విగ్రహావిష్కరణ ►ప్రత్యేక తపాలా బిళ్ల విడుదల ► ప్రసంగాల జోలికి వెళ్లని సీఎం పన్నీర్, శశికళ అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ శత జయంతి వేడుకలు మంగళవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. అన్నాడీఎంకే పాలనలో ఎంజీఆర్ శతజయంతి రావడంతో రాష్ట్రవ్యాప్తంగా అధికార లాంఛనాలతో అట్టహాసంగా నిర్వహించారు. ఎంజీఆర్ శత జయంతి వేడుకలను ఏడాది పొడవునా నిర్వహించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ పిలుపునిచ్చారు. సాక్షి ప్రతినిధి, చెన్నైః చెన్నై రాయపేటలోని అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో జరిగిన ఎంజీఆర్ శత జయంతి ఉత్సవాల ప్రారంభోత్సవ వేడుకకు పార్టీ ప్రధాన కార్యదర్శి శశికళ హాజరయ్యారు. ముందుగా పార్టీ కార్యాలయ ప్రాంగణంలోని ఎంజీఆర్ విగ్రహానికి ఆమె పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత ఎంజీఆర్ శత జయంతి ప్రత్యేక సంచికను విడుదల చేశారు. ఎంజీఆర్ ప్రత్యేక తపాలా బిళ్లను సీఎం పన్నీర్‌సెల్వం ఆమెకు అందజేశారు. పది నిమిషాలపాటూ పార్టీ కార్యాలయంలో గడిపిన శశికళ అక్కడి నుంచి ఎంజీఆర్ నివాసం రామాపురంతోటకు వెళ్లి అక్కడ కొత్తగా నెలకొల్పిన ఎంజీఆర్ విగ్రహాన్ని, పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రసంగాలు లేని శత జయంతి తమిళనాడు సినీ, రాజకీయాల్లో ఎంతో ఘనచరిత్ర కలిగిన ఎంజీ రామచంద్రన్ ను కీర్తిస్తూ కనీస ప్రసంగాలు లేకుండానే మంగళవారం నాటి కార్యక్రమాలను ముగించారు. ఎంజీఆర్ ప్రత్యేక తపాలా బిళ్లను ఆవిష్కరించే కార్యక్రమం చెన్నై గిండిలోని డాక్టర్ ఎంజీఆర్ వైద్య వర్సిటీలో జరిగింది. సీఎం పన్నీర్‌సెల్వం ముఖ్యఅతి«థిగా హాజరై అక్కడి ఎంజీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తరువాత ప్రత్యేక తపాలా బిళ్ల ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తపాలాశాఖ సంచాలకులు డి. మూర్తి తపాలా బిళ్లను ఆవిష్కరించగా ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం అందుకున్నారు. పలువురు మంత్రులు, ఉన్నతాధికారులు పాల్గొనగా ఎంజీఆర్ జీవిత పయనం, రాజకీయ విజయాలపై సీఎం పన్నీర్‌సెల్వం ప్రసంగిస్తారని ఆహూతులంతా ఆశించారు. అయితే అందరినీ ఆశ్చర్యపరుస్తూ తపాలా బిళ్ల ఆవిష్కరణ కార్యక్రమాన్ని 15 నిమిషాల్లోనే ముగించుకుని నిష్క్రమించడం చర్చనీయాంశంగా మారింది. అన్నాడీఎంకే ప్రధాన కార్యాలయంలో ప్రధాన కార్యదర్శి శశికళ ఎంజీఆర్ణు ఉద్దేశించి ప్రసంగిస్తున్నారని, ఆమె ప్రసంగమే హైలైట్ కావాలన్న ఉద్దేశంతో సీఎం ప్రసంగంపై నిషే««దlం విధించారని అన్నాడీఎంకే శ్రేణులు గుసగుసలాడుకున్నారు. ఇదిలా ఉండగా, పార్టీ ప్రధాన కార్యాలయంలో శశికళ సైతం ఎంజీఆర్ గురించి నాలుగు మాటలు కూడా మాట్లాడకుండానే కేవలం పదినిమిషాల్లో వెళ్లిపోయారు. సత్యమూర్తి భవన్ లో తమిళనాడు కాంగ్రెస్ కమిటి రాష్ట్ర కార్యాలయమైన సత్యమూర్తి భవన్ లో సైతం ఎంజీఆర్ శత జయంతి వేడుకలను నిర్వహించడం విశేషంగా మారింది. టీఎన్ సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ తమ కార్యాలయంలో ఎంజీఆర్ చిత్రపటాన్ని ఉంచి పూలమాలవేసి నివాళులర్పించారు. ఎంజీఆర్ శత జయంతిని పురస్కరించుకుని తమిళ మానిల కాంగ్రెస్ అధ్యక్షుడు జీకే వాసన్ ప్రజలకు, అన్నాడీఎంకేకు శుభాకాంక్షలు తెలిపారు. ఎంజీఆర్ చదువుకున్న తంజావూరు జిల్లా కుంభకోణంలోని పాఠశాలలో సైతం శతజయంతి జరిపారు. ఎంజీఆర్ శతజయంతి ఉత్సవాల కోసం పొన్నేరిలో కట్టిన బ్యానర్లోని శశికళ బొమ్మను కొందరు చించివేశారు. దీంతో పోలీసులు హడావిడిగా అక్కడికి చేరుకుని అగంతకులను గుర్తించే ప్రయత్నం చేసినా వారు దొరకలేదు. కొత్త పార్టీ ఆవిర్భావం అన్నా ఎంజీఆర్ ద్రవిడ మున్నేట్ర కళగం పేరుతో చెన్నైలో మంగళవారం కొత్త పార్టీ వెలిసింది. జయలలిత మరణం తరువాత అన్నాడీఎంకేను సరైన దిశలో నడిపించే నాయకత్వం లేకపోవడంతో ఎంజీఆర్ శత జయంతి రోజున ఈ పార్టీని స్థాపించామని వ్యవస్థాపక అధ్యక్షులు మురుగన్ తెలిపారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా తంగమారియప్పన్, కోశాధికారిగా కరుణానిధి అనే వ్యక్తులను నియమించినట్లు ఆయన చెప్పారు. -
అందరికీ ‘అమ్మ’గా...
-
నాడు ఎంజీఆర్.. నేడు జయ
-
హైదరాబాద్‌లో జయలలితకు గెస్ట్ హౌజ్
హైదరాబాద్ : జయలలితకు హైదరాబాద్ లోని కుత్బుల్లాపూర్‌తో ప్రత్యేక అనుబంధం ఉంది. జీడిమెట్ల గ్రామ పరిధిలోని సర్వే నెంబరు 52లో నాలుగు ఎకరాలు, పేట్‌బషీరాబాద్ సర్వే నెంబరు 93లో ఏడు ఎకరాల భూమి 44వ జాతీయ రహదారిని ఆనుకుని ఉంది. ఈ భూములు 40 ఏళ్లుగా జయలలిత గ్రీన్ గార్డెన్‌గా ఆమె పేరుపైనే ఉన్నారుు. 11 ఎకరాలున్న ఈ గార్డెన్ చుట్టూ 12 అడుగుల ఎత్తులో సోలార్ పెన్సింగ్ ఏర్పాటు చేశారు. తమిళనాడుకు చెందిన వారే ఇక్కడ పని చేస్తున్నారు. ఇదివరకు ఆమె ఏడాదికి ఒకసారి ఇక్కడికి వచ్చి రెండు రోజుల పాటు విడిది చేసి వెళ్లేవారు. అప్పట్లో బేగంపేట విమానాశ్రయం నుంచి కట్టుదిట్టమైన భద్రత మధ్య వచ్చేవారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత రెండు సార్లు మాత్రమే వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం కృష్ణంరాజు అనే వ్యక్తి ఎకరానికి రూ.25 వేల చొప్పున లీజుకు తీసుకుని కూరగాయలు పండిస్తున్నారు. ఇక్కడి సిబ్భంది రెండు రోజుల క్రితం జయలలిత ఆరోగ్య పరిస్థితిపై ఆందోళనతో చెన్నైకి వెళ్లినట్లు తెలిసింది. రాధిక కాలనీలో జయ జ్ఞాపకాలు సికింద్రాబాద్ సమీపంలోని వెస్ట్ మారేడుపల్లి రాధిక కాలనీలో ఫ్లాట్ నెంబర్ 16లో జయలలితకు ఇల్లు ఉంది. ఈ ఇల్లు ఆమె స్నేహితురాలు ఎన్ శశికళ పేరుతో ఉంది. ప్రస్తుతం ఇంటి పన్ను రూ.35,424 బకాయి ఉందని కంటోన్మెంట్ అధికారులు తెలిపారు. 2001 నుండి 2003 మధ్య కొంత కాలం జయ ఈ ఇంట్లో ఉండిందని కాలనీ సెక్రెటరి సురేన్ పొరురి తెలిపారు. జయలలిత వచ్చిన సమయంలో సందడిగా ఉండేదని, పార్టీ నేతలు, అభిమానులు భారీగా వచ్చేవారన్నారు. రెండేళ్లుగా ఆ ఇల్లు ఖాళీగా ఉందని, ఇటీవలే శుభ్రపరిచామని సురేన్ పొరురి తెలిపారు. ప్రస్తుతం కాలనీ వాసులంతా జయలలిత జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటున్నారన్నారు. నాడు ఎంజీఆర్.. నేడు జయ నాయకత్వంతోపాటు అనారోగ్యంలోనూ ఇద్దరిదీ అదే శైలి సాక్షి ప్రతినిధి, చెన్నై: అన్నాడీఎంకే వ్యవస్థాపక అధ్యక్షుడు, దివంగత సీఎం ఎంజీ రామచంద్రన్, జయలలిత అనేక అంశాల్లో ఒకే ఒరవడిని సృష్టించుకున్నారు. ఆవిర్భావం నుంచి పార్టీని అప్రతిహతంగా పరుగులు పెట్టించిన ఆనాటి ఎంజీఆర్ రాజకీయ వారసురాలు జయలలిత పార్టీని విజయకేతనంలో నడిపించడంలోనే కాదు, అనారోగ్యంలోనూ వారసురాలిగా నిలిచారు. వివరాల్లోకి వెళితే...ఎంజీఆర్, జయలలిత ఇద్దరూ సినిమా నేపథ్యం నుంచే రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఎంజీఆర్ పురట్చి తలైవర్(విప్లవ నాయకుడు), జయలలిత పురట్చితలైవీ(విప్లవ నాయకి)గా పేరుగాంచారు. అన్నాడీఎంకే అధికారంలో ఉండగా అస్వస్థతకు లోనైన ఎంజీఆర్ 1984 అక్టోబరు 5న అపోలో ఆస్పత్రిలో అడ్మిట్ అయ్యారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బందితోనే ఆయన ఆడ్మిట్ అయ్యారని, ఇది స్వల్ప అస్వస్థతగా అపోలో ప్రకటించింది. అరుుతే, గుండెపోటుకు గురి కావడం వల్లనే ఎంజీఆర్ అపోలోలో చేరినట్లు కొన్ని రోజుల తరువాత గానీ వెల్లడికాలేదు. ఆస్పత్రిలో ఎంజీఆర్ చికిత్స పొందుతున్న ఫొటోలు విడుదల చేయాలని అన్నాడీఎంకే శ్రేణులు పట్టుపట్టాయి. దీంతో ఎంజీఆర్ చికిత్స పొందుతున్న ఫొటోతోపాటూ ఆయన ఆడియోను కూడా పార్టీ విడుదల చేసింది. అపోలోలో ఆరోగ్యం కుదుటపడక పోవడంతో 45 రోజుల తరువాత అమెరికాలోని బ్లూకిన్ ఆస్పత్రికి ఎంజీఆర్‌ను తరలించారు. అమెరికాలో చికిత్స పొందుతూనే ఎన్నికల్లో నామినేషన్ వేసి గెలిచిన ఎంజీఆర్.. ఆ తరువాత బాగా కోలుకుని ముఖ్యమంత్రి పీఠం ఎక్కారు. తర్వాత మూడేళ్లకు 1987లో అనారోగ్యంతో అమెరికాలో మరణించారు. నేడు జయ... ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆస్పత్రిలో చేరడంతో 32 ఏళ్ల కిందటి చరిత్ర దాదాపు ఒకే పోలికతో పునరావృతమైంది. ఎంజీఆర్ లాగానే జయలలిత కూడా సినిమా నేపథ్యం నుంచే రాజకీయాల్లోకి వచ్చారు. ముఖ్యమంత్రిగా ఉన్న పుడే జయలలిత జ్వరం, డీహైడ్రేషన్ వంటి స్వల్ప అస్వస్థను కారణంగా చూపుతూ సెప్టెంబరు 22న అపోలో ఆస్పత్రిలో చేరారు. కొన్ని రోజుల తరువాతనే ఆమె అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తేలింది. జయ కూడా గుండెపోటుకు గురయ్యారు. అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జయ ఫోటోలను విడుదల చేయాలని అన్నాడీఎంకే శ్రేణులు పట్టుబట్టారు. అరుుతే అది నెరవేరలేదు. ఎంజీఆర్ ఆస్పత్రిలో ఉన్నపుడు అప్పటి ఆర్థికమంత్రి నెడుంజెళియన్ ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా వ్యవహరించారు. అలాగే జయ రెండు సార్లు జైలుకెళ్లినపుడు ఆమె కేబినెట్లోని ఆర్థికమంత్రి పన్నీర్‌సెల్వం ముఖ్యమంత్రి బాధ్యతలను నిర్వర్తించారు. -
అందరికీ ‘అమ్మ’గా...
సాక్షి, చెన్నై: ప్రజల మనసెరిగిన అమ్మగా సంక్షేమ పథకాలతో వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తా...! అన్న నినాదంతో తమిళ సీఎం జయలలిత ముందుకు సాగారు. అందుకే 2011 ఎన్నికల్లో ఉచిత పథకాల మంత్రంతో మన్నలను అందుకున్నారు. జయ రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్ ఎప్పుడూ అనే ‘ఎన్ రత్తత్తిన్ రత్తమే(నా రక్తంలో రక్తంగా) అనే మాటలతో తన ప్రసంగాలను ప్రారంభించి జయ జయ ధ్వనాలు అందుకునేవారు. అలాగే జయలలిత సైతం 2016 ఎన్నికల్లో ‘ప్రజల కోసమే అమ్మ, అమ్మ కోసమే ప్రజలు’ అనే నినాదంతో ముందుకు సాగి అపూర్వమైన ఫలితాలతో దశాబ్దాల చరిత్రను తిరగరాశారు. తన రాజకీయ ప్రస్థానంలో ఏ మేరకు ప్రతిష్టను పెంచుకున్నారో, అదే స్థారుులో అప్రతిష్టను కూడా మూటగట్టుకున్నారు. అవినీతి కేసుల్లో జైలు శిక్షను ఎదుర్కొన్న మహిళా సీఎంగా అపఖ్యాతి పొందారు. సంక్షేమ పథకాల విస్తృతం తమిళనాట అందరి నోట అమ్మగా పిలిపించుకునే జయలలిత రా ష్ట్ర ప్రజలందర్నీ బిడ్డలుగా భావిస్తారు. తొలి సారి సీఎం పగ్గాలు చేపట్టిన అనంతరం(1991-1996) ‘తొట్టిల్ కుళందై’(ఉయ్యాల బేబి) పేరున శిశు సంరక్షణ పథకంతో శ్రీకారం చుట్టారు. మహిళల భద్రతను కాంక్షిస్తూ, మహిళా పోలీసు స్టేషన్లను నెలకొల్పిన ఘనత అమ్మదే. రాష్ట్ర ప్రగతికి దోహదకారిగా ఉన్న సేతు సముద్రంను వ్యతిరేకించినా, జాలర్ల సంక్షేమం లక్ష్యంగా కచ్చదీవుల్ని స్వాధీనం చేసుకోవడం కోసం గళం విప్పిన వీరనాయకీ. శ్రీలంక ఆధీనంలో ఉన్న కచ్చదీవులను భారత్ తిరిగి సొంతం చేసుకోవాలని కోరుతూ అసెంబ్లీలో తీర్మానాన్ని కూడా ఆమె ఆమోదింపజేశారు. గతంలో ప్రవేశపెట్టిన పథకాలు ఓ మచ్చుక మాత్రమే. అమ్మ పథకాలు దేశానికే ఆదర్శం 2011లో సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత శ్రీకారం చుట్టిన బృహత్తర ‘అమ్మ’ పథకాలు తమిళ ప్రజలకే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచారుు. ఇందులో పేదల కడుపు నింపడం లక్ష్యంగా చౌక ధరకే ఆహారం నినాదంతో నెలకొల్పిన ‘అమ్మ ఉనవగం’(అమ్మ క్యాంటిన్) అనేక రాష్ట్రాలు తామూ సైతం అంటూ ఏర్పాటు చేసే పనిలో నిమగ్నం కావడం విశేషం. ప్రజల్ని ఏ క్షణాన ఎలా ఆదుకోవాలో తెలిసిన రాజకీయ నేర్పరి. అందుకే అన్ని అమ్మ పథకాలన్నీ ఆదరణ పొందారుు. పప్పు ధాన్యాలు, కూరగాయల ధరలు ఆకాశాన్ని అంటుతున్న సమయంలో ‘తోట పచ్చదనం, కో ఆపరేటివ్ సొసైటీ దుకాణాల’తో చౌక ధరకే అన్నింటినీ అందించి పేద, మధ్య తరగతి వర్గాల నెత్తిన ఆర్థిక భారం పడకుండా చేసి అందర్నీ ఆకర్షించిన ఘనత ఆమెకే దక్కుతుంది. తదుపరి అమ్మ పథకాల పర్వం వేగం పెరగడం విశేషం. అమ్మ వాటర్, అమ్మ సిమెంట్, అమ్మ ఉప్పు, అమ్మ ఫార్మసీలు ఇప్పటికే జనాదరణ పొందారుు. అమ్మ వార సంతలు, అమ్మ థియేటర్లు, ‘అమ్మ కల్యాణ మండపాలు’ ప్రజలకు చేరువకావాల్సి ఉంది. ఇక, నిర్విరామంగా ఉచిత బియ్యం పంపిణీ, ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం పథకం దిగ్విజయవంతమైన అమ్మ పరిపాలనా దీక్షాదక్షతలకు ప్రతీక. యువతుల పెళ్లి పెద్ద అమ్మే శిశు మరణాల కట్టడి లక్ష్యంగా, గర్భిణీ స్త్రీలకు పౌష్టికాహారం లక్ష్యంగా ముందుకు సాగి, యుక్త వయస్సు వచ్చిన పేద యువతుల పెళ్లి ఖర్చులకు తాను ఉన్నానని చాటుతూ ప్రవేశ పెట్టిన పథకం ‘తాళికి బంగారం’. లక్షలాది మంది యువతులకు 2011 నుంచి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరింది. తాళి బొట్టుకు నాలుగు గ్రాముల బంగారం ఇవ్వడమే కాకుండా, పెళ్లి ఖర్చులకు రూ. 25 వేలు ఇచ్చిన ఘనత అమ్మదే. తాజాగా మళ్లీ అధికారంలోకి రాగానే, నాలుగు గ్రాముల బంగారం ఎనిమిది గ్రాములకు పెంచిన పెళ్లి పెద్ద అమ్మే. అన్నదానం.. భక్తి భావం.. అమ్మకు భక్తి భావం ఎక్కువే. అందుకే రాష్ట్రంలోని ఆలయాలను దేవాదాయ శాఖ పరిధిలోకి తెచ్చారు. 35 వేల ఆలయాలను ప్రభుత్వ గొడుగు కిందకు తీసుకొచ్చి, నిధులు లేని ఆలయాలకు ప్రత్యేక కేటారుుంపులతో నిత్య కై ంకర్యాలతో పాటుగా అన్నదానం పథకం నిర్విరామంగా సాగేలా చేసిన భక్తురాలు. దేవుడి సేవలో ఉన్న పూజారుల్ని ఫించన్లు, ఆలయాల అభివృద్ధికి నిధులతో పాటుగా మానస సరోవరంలోని ముక్తినాథ్ యాత్రకు ప్రభుత్వం తరపున మార్గాన్ని చూపించిన ఘనత అమ్మదే. ఇక, అన్ని మతాలు తనకు సమానం అని చాటే విధంగా మసీదుల అభివృద్ధి, మత పెద్దలకు(ఇమామ్) ఫించన్లు, ప్రతి ఏటా హజ్ యాత్ర కోటా పెంపుతో పాటుగా ప్రతి ఏటా క్రమం తప్పకుండా రంజాన్ మాసంలో గంజి తయారీకి బియ్యం పంపిణీ చేయడం, చర్చ్‌ల అభివృద్ధి, క్రైస్తవ సోదరుల కోసం జెరూసలం యాత్రకు చర్యలు చేపట్టిన సర్వమత ప్రేమికురాలు. అన్నదాతకు అండగా.. ఇక రుణాలు మాఫీ చేసినా, అన్నదాతకు అండగా పథకాలను ప్రవేశ పెట్టినా, పేత మహిళా రైతుల ఆర్థిక ప్రగతి పెంపునకు ఉచితంగా పశువులు, మేకల పంపిణీ, అన్నదాతలకు పనిముట్లను తక్కువ రుసుంకు అద్దెకు ఇవ్వడంలో, ఆది ద్రావిడ, గిరిజన సంక్షేమార్థం ముందుకు సాగినా అవన్నీ ప్రజాహితమే. ఎన్నికల సమయంలో ఇచ్చినా, ఇవ్వని హామీలను ఆచరణలో పెట్టడంలో జయలలితకు సాటి మరొకరు లేరు. -
వియ్యంకుడి అప్పుతో రజనీకి తిప్పలు
ఆవేదనలో సూపర్‌స్టార్ డబ్బు కాజేసేందుకు కుట్రని ఆరోపణ మద్రాసు హైకోర్టులో రజనీకాంత్ పిటిషన్ చెన్నై, సాక్షి ప్రతినిధి:వెండితెరపై అందరి కష్టాలు తీర్చే హీరోగా పేరుగాంచిన సూపర్‌స్టార్ రజనీకాంత్ నిజజీవితంలో తానే కష్టాల్లో పడ్డాడు. ‘ఒకసారి చెబితే వందసార్లు చెప్పినట్టే’ అని నిఖార్సుగా పలికే రజనీ పదేపదే సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితులను వరుసగా ఎదుర్కొంటున్నాడు. కోలివుడ్ సూపర్‌స్టార్‌గా పేరుగాంచినా వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు కలిగిన ధ్రువనక్షత్రంగా రజనీ పేరుగాంచారు. ఒకప్పుడు ఎంజీ రామచంద్రన్ సాధించిన ఫాన్ ఫాలోయింగ్‌ను నేడు రజనీకాంత్ ఆస్వాదిస్తున్నారు. అయితే దురదృష్టవశాత్తు ఇటీవల కాలంలో ఆవేదనలో రజనీ హిట్లు కంటే వివాదాలే ఎక్కువగా ఆయనను చుట్టుముట్టుతున్నాయి. మూడేళ్ల క్రితం వచ్చిన రోబో తరువాత రజనీ సినిమాలేవీ రాణించలేదు. ఇందుకు తోడు ఆర్థిక వివాదాలు ఆయనను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి. రజనీ హీరోగా కుమార్తె సౌందర్య దర్శకత్వంలో విడుదలైన కొచ్చడయాన్ యానిమేషన్ చిత్రం ప్లాప్ అయింది. అంతేగాక ఆ చిత్ర నిర్మాత ఒక ఫైనాన్సర్ నుంచి అప్పు తీసుకునేందుకు రజనీ భార్య తన ఆస్తులను తనఖా పెట్టిందనే వార్తలు వచ్చాయి. సినిమా దె బ్బతినడం వల్ల తాను, కుమార్తె, భార్య అందరూ బాధపడాల్సి వచ్చిందని రజనీ ఆవేదనకు గురైనారు. ఈ వివాదం నుండి తేరుకోక ముందే లింగా విడుదలై భారీ పరాజయం పాలు కావడం రజనీని కృంగదీసింది. నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్లకు సొమ్మును తిరిగిచ్చే సంప్రదాయం (బాబా సినిమాతో) ప్రారంభించిన రజనీ మెడకు మళ్లీ చుట్టుకుంది. లింగా వల్ల నష్టపోయిన సొమ్మును నిర్మాత చెల్లించాలని, ఇందుకు రజనీకాంత్ చొరవతీసుకోవాలని డిస్ట్రిబ్యూటర్లు రోడ్డెక్కారు. ఒక దశలో రజనీ ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. లింగా అగ్గి ఇంకా చల్లారక ముందే మరో వివాదం రజనీ మానసిక స్థితిని అల్లకల్లోలం చేసింది. మద్రాసు హైకోర్టులో పిటిషన్ వేసేలా చేసింది. తాజాగా మరో వివాదం: హీరో ధనుష్ రజనీకాంత్ అల్లుడన్న సంగతి అందరికీ తెలిసిందే. ధనుష్ తండ్రి, సినీ దర్శకుడు కస్తూరీరాజా 2012లో చేసిన అప్పు రజనీకాంత్‌ను మరోసారి వివాదాల్లో లాగింది. చెన్నైకి చెందిన ఫైనాన్షియర్ ముకున్ చంద్ బోత్రా 2012లో కస్తూరీరాజాకు రూ.65 లక్షలు అప్పుగా ఇచ్చాడు. అప్పుతీసుకునే క్రమంలో రజనీకాంత్‌ను పూచికత్తుగా పెట్టినట్లు ముకున్ చంద్ చెబుతున్నాడు. ఒక వేళ తాను అప్పు చెల్లించలేని పక్షంలో తన కుమారుడు ధనుష్ మామగారైన రజనీకాంత్ అప్పు తీరుస్తాడని లిఖితపూర్వకంగా రాసిచ్చాడు. అప్పుకు చెల్లింపుగా కస్తూరీరాజ్ ముకున్చంద్కు ఇచ్చిన చెక్‌లు బౌన్స్ అయ్యాయి. ఇదే సమయంలో మే హూ రజనీకాంత్ అనే బాలివుడ్ చిత్రంపై నిషేధం విధించాలని రజనీకాంత్ కోర్టులో పిటిషన్ వేశాడు. తన అనుమతి లేకుండా పేరును వాడుకునే హక్కు ఎవరికీ లేదని, అలా వాడుకుంటే చట్టపరమైన చర్యలు తప్పవని రజనీ తన పిటిషన్లో పేర్కొన్నారు. చెక్కులు బౌన్స్ కావడం వల్ల తన అప్పు రాబట్టుకునేందుకు బాలివుడ్ సినిమాపై రజనీ వేసిన పిటిషన్‌ను ముకున్‌చంద్ అవకాశంగా మలుచుకున్నాడు. అనుమతి లేకుండా పేరును వాడుకునే వారిపై చర్యలు తీసుకుంటానని రజనీ ప్రకటించినందున ఆయన వియ్యంకుడు కస్తూరీరాజాపై చట్టపరమైన చర్యలు చేపట్టేలా రజనీని ఆదేశించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ఇటీవల పిటిషన్ దాఖలు చేశాడు. ఈ పిటిషన్ బుధవారం విచారణకు రాగా రజనీకాంత్ న్యాయవాది బదులు పిటిషన్ దాఖలు చేశారు. ముకున్‌చంద్ బోత్రాకు తనకు మధ్య ఎటువంటి ఆర్థిక లావాదేవీలు లేవని రజనీ పేర్కొన్నారు. తన నుండి అక్రమంగా డబ్బు రాబట్టుకునేందుకు పన్నిన పన్నాగమని అన్నారు. పిటిషన్‌దారుని వైఖరి తన పేరు, ప్రతిష్టలకు కళంకం తెచ్చేలా ఉందని, తను ఎంతో మనస్థాపానికి గురిచేసిందని ఆవేదన చెందారు. కస్తూరీ రాజాపై ముకున్ చంద్ గతంలో జార్జి టౌన్ పోలీసు స్టేషన్లో పెట్టిన కేసును కొట్టివేశారని చెప్పారు. దురుద్దేశంతో దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాల్సిందిగా రజనీకాంత్ కోరారు. ఇరుపక్షాల వాదనను విన్న న్యాయమూర్తి రవిచంద్రబాబు, రజనీవాదనపై బదులు పిటిషన్ దాఖలు చేయాల్సిందిగా ఆదేశిస్తూ కేసును నాలుగువారాలపాటూ వాయిదావేశారు. -
జయలలితకు వెన్నిరాడై నిర్మల ప్రచారం
తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితతో కలిసి ఒకేసారి తమిళ సినిమాల్లో ప్రవేశించిన వెన్నిరాడై నిర్మల.. ఇప్పుడు అన్నా డీఎంకే తరఫున ప్రచారం చేయబోతున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో అన్నాడీఎంకే తరఫున స్టార్ ప్రచారకర్తల్లో ఆమె కూడా ఒకరు కాబోతున్నారు. మొత్తం 19 మందితో కూడిన స్టార్ ప్రచారకుల జాబితాను అన్నాడీఎంకే విడుదల చేసింది. అందులో పలువురు సినిమా, టీవీ నటులు, దర్శకులు ఉన్నారు. దర్శకుడు, నటుడు రామరాజన్, వింధ్య, కమెడియన్లు సెంథిల్, గుండు కళ్యాణం, సింగముత్తు, కుయిలీ, టీవీ న్యూస్ రీడర్, నటి ఫాతిమా బాబు, విలన్లు ఆనందరాజ్, పొన్నాంబళం తదితరులున్నారు. ఇంకా ఈ జాబితాలో అన్నా డీఎంకే ప్రచార కార్యదర్శి నంజిల్ సంపత్, శశికళా పుష్ప, పరితి ఇళంవళుతి, విజిలా సత్యానంద్ కూడా ఉన్నారు. 1986లో, వెన్నిరాడై నిర్మలను తమిళనాడు శాసనమండలికి పంపాలని అన్నాడీఎంకే వ్యవస్థాపకుడు ఎంజీ రామచంద్రన్ భావించారు. కానీ అంతకుముందు ఓ కోర్టు ఆమె దివాలా తీసినట్లు ప్రకటించడంతో సాంకేతికంగా అది సాధ్యం కాలేదు. ఆమె ఈనెల 11వ తేదీ నుంచి ప్రచారం చేస్తారని అన్నాడీఎంకే తెలిపింది.