ప్రజల మనసెరిగిన అమ్మగా సంక్షేమ పథకాలతో వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తా...! అన్న నినాదంతో తమిళ సీఎం జయలలిత ముందుకు సాగారు. అందుకే 2011 ఎన్నికల్లో ఉచిత పథకాల మంత్రంతో మన్నలను అందుకున్నారు. జయ రాజకీయ గురువు ఎంజీ రామచంద్రన్ ఎప్పుడూ అనే ‘ఎన్ రత్తత్తిన్ రత్తమే(నా రక్తంలో రక్తంగా) అనే మాటలతో తన ప్రసంగాలను ప్రారంభించి జయ జయ ధ్వనాలు అందుకునేవారు. అలాగే జయలలిత సైతం 2016 ఎన్నికల్లో ‘ప్రజల కోసమే అమ్మ, అమ్మ కోసమే ప్రజలు’ అనే నినాదంతో ముందుకు సాగి అపూర్వమైన ఫలితాలతో దశాబ్దాల చరిత్రను తిరగరాశారు.
Published Tue, Dec 6 2016 8:39 AM | Last Updated on Thu, Mar 21 2024 7:52 PM
Advertisement
Advertisement
పోల్
Advertisement