
తమిళనాట మారుతున్న రాజకీయం
రాత్రి నుంచి శశికళ రిసార్టులోనే ఉండిపోయారు. ఆమెకు గట్టి మద్దతుదారుగా ఉన్న లోక్‌సభ డిప్యూటీ స్పీకర్ తంబిదురై ఉదయాన్నే రిసార్టుకు వెళ్లి, శశికళతో మాట్లాడి, కాసేపటి తర్వాత మళ్లీ బయటకు వచ్చేశారు. తీర్పు నేపథ్యంలో గోల్డెన్ బే రిసార్టు వద్ద పటిష్ఠమైన బందోబస్తు ఏర్పాటుచేశారు. అల్లర్లు జరిగే అవకాశం ఉన్నట్లు నిఘా వర్గాల నుంచి సమాచారం రావడంతో పోలీసులు మరింత అప్రమత్తమయ్యారు.