గువాహటి: బాలీవుడ్ స్టార్ హీరోయిన్, నిర్మాత అనుష్క శర్మపై గూర్ఖా కమ్యూనిటీ గ్రూపు జాతీయ మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు చేసింది. తాజాగా విడుదలైన పాతాళ్ లోక్ వెబ్ సిరీస్‌లో తమను కించపరిచే, వివక్ష పూరిత సన్నివేశాలు ఉన్నాయని ఆరోపిస్తూ ది అరుణాచల్ ప్రదేశ్ గూర్ఖా యూత్ అసోసియేషన్ ఈ మేరకు ఎన్‌హెచ్చార్సీని ఆశ్రయించింది. ఈ విషయం గురించి భారతీయ గూర్ఖా యువ పరిసంఘ్ అధ్యక్షుడు నందా కిరాటి దేవన్ మాట్లాడుతూ.. పాతాళ్ లోక్ వెబ్‌సిరీస్‌లో తమను అవమానపరిచే సన్నివేశాలు ఉన్నాయని.. సమాజంలో తమ ప్రతిష్టను దిగజార్చేలా వాటిని చిత్రీకరించారని ఆగ్రహం వ్యక్తం చేశాడు. సదరు సన్నివేశాలు ప్రసారం అవుతున్నపుడు మ్యూట్‌లో పెట్టి.. సబ్‌టైటిల్స్, డిస్‌క్లేమర్ వేసి తిరిగి అప్‌లోడ్ చేయాలని సూచించారు. లేని పక్షంలో చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని హెచ్చరించారు.(‘పాతాళ్ లోక్’ వెబ్ సిరీస్.. రివ్యూ కోసం క్లిక్ చేయండి)
ఇక మేఘాలయలో ఖాసీ తెగకు చెందిన ఓ యువతి... పాతాళ్ లోక్‌లో మహిళను అసభ్యంగా దూషిస్తూ, అభ్యంతరకర పదజాలాన్ని ఉపయోగించారని ఆరోపిస్తూ ఆన్‌లైన్‌లో పిటిషన్ దాఖలు చేసింది. వెబ్‌సిరీస్‌లోని సెకండ్ ఎపిసోడ్‌లో ఈ మేరకు సన్నివేశాలు ఉన్నాయని.. వాటిని తొలగించాలని కోరింది. కాగా అనుష్క శర్మ నిర్మాణ సారథ్యంలో అవినాష్– ప్రొసిత్ రాయ్ డైరెక్ట్ చేసిన పాతాళ్ లోక్ అమెజాన్ ఒరిజినల్స్‌లో స్ట్రీమ్ అవుతోంది. సుదీప్ శర్మ రచనకు దృశ్యరూపమైన ఈ వెబ్‌సిరీస్(మొత్తం 9 ఎపిసోడ్లు) ఉత్కంఠ రేపే క్రైమ్ థ్రిల్లర్‌లా సాగుతూనే మూసి ఉంచిన భారతీయ సమాజాన్ని, అందులోని చీకటి కోణాల్ని స్పృశించిందంటూ ప్రేక్షకుల నీరాజనాలు అందుకుంటోంది. (ఒళ్లు గగుర్పొడిచేలా టీజర్)
Comments
Please login to add a commentAdd a comment