సాక్షి, మహబూబ్‌నగర్ : దిశ కేసులో నిందితుల ఎన్‌కౌంటర్‌ను జాతీయ మానవ హక్కుల కమిషన్(ఎన్‌హెచ్‌ఆర్‌సీ) సుమోటోగా స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఇప్పటికే తెలంగాణ పోలీసులకు నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలోనే రేపు(శనివారం) ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధుల బృందం మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రికి రానుంది. అక్కడ ఎన్‌కౌంటర్‌లోని మృతిచెందిన నిందితుల మృతదేహాలను పరిశీలించనున్నారు. ఆ తర్వాతే వారి అంత్యక్రియలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులు కోరితే.. నిందితుల మృతదేహాలకు రీ పోస్టుమార్టమ్ నిర్వహించే అవకాశం ఉన్నట్టుగా పోలీసు వర్గాలు చెబుతున్నాయి.
కాగా, శుక్రవారమే నిందితుల మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహించాలని పోలీసులు భావించారు. ఓవైపు నిందితుల మృతదేహాలకు మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రిలో పోస్ట్‌మార్టమ్ జరుగుతుండగా.. మరోవైపు వారి స్వగ్రామంలో అంత్యక్రియలు పోలీసులు ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే ఎన్‌హెచ్‌ఆర్‌సీ ప్రతినిధులు రానున్న నేపథ్యంలో పోలీసులు అంత్యక్రియలను రేపు సాయంత్రం నిర్వహించాలనే నిర్ణయానికి వచ్చినట్టుగా తెలుస్తోంది. దీంతో నిందితులు మృతదేహాలను ఈ రాత్రికి మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలోనే ఉంచనున్నారు.
చదవండి : ఎన్‌కౌంటర్: చెన్నకేశవుల కుటుంబీకుల ఆందోళన
అందుకే కాల్పులు జరపాల్సి వచ్చింది : సజ్జనార్
ఎన్‌కౌంటర్‌పై తెలంగాణ పోలీసులకు నోటీసులు
దిశను చంపిన దగ్గరే ఎన్కౌంటర్..
మా బిడ్డకు న్యాయం జరిగింది: దిశ తల్లిదండ్రులు
దిశ నిందితుల ఎన్కౌంటర్: ఆ బుల్లెట్ దాచుకోవాలని ఉంది
దిశ కేసు: చాటింపు వేసి చెప్పండి
పోలీసులు జిందాబాద్ అంటూ పూల వర్షం
దిశకు న్యాయం జరిగింది.. మరి నిర్భయ?
‘సాహో సజ్జనార్’ అంటూ ప్రశంసలు..
Comments
Please login to add a commentAdd a comment