సాక్షి, మహబూబ్‌నగర్ : హైదరాబాద్- మహబూబ్‌నగర్-రంగారెడ్డి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికకు సర్వం సిద్ధమైంది. దాదాపు నెల రోజులపాటు సాగిన ప్రచార పర్వానికి తెరపడడంతో అధికార యంత్రాంగం రంగ ప్రవేశం చేసింది. ఎన్నికలు సవ్వయంగా జరగానికి రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ శాఖలు ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు.
జిల్లాలోని మొత్తం 68,491 మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవడానికి 114 పో లింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అదేవిధంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పా టు చేశారు. ఈ సందర్భంగా రెవెన్యూ, పోలీస్, ఎక్సైజ్ విభాగాల జిల్లా అధికారులు శుక్రవారం మహబూబ్‌నగర్ పట్టణంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ మేరకు వారు తీసుకుంటున్న చర్యలను వివరించారు.
గుర్తింపు కార్డు తప్పనిసరి: డీఆర్వో
ఎన్నికల్లో పాల్గొనే గ్రాడ్యుయేట్లు తప్పనిసరిగా గుర్తింపు కార్డు వెంట తెచ్చుకోవాలని డీఆర్వో రాంకిషన్ తెలిపారు. దాదాపు ఎనిమిది రకాల గుర్తింపు కార్డులను అనుమతించనున్నట్లు వెల్లడించారు. పాస్‌పోర్టు, ఆధార్, డ్రైవింగ్‌లెసైన్స్, పాన్‌కార్డు, ఉద్యోగ గుర్తింపు కార్డు, పీహెచ్‌సీ సర్టిఫికెట్, డిగ్రీ ఒరిజినల్ సర్టిఫికెట్లలో ఏదైనా ఒకటి తప్పనిసరిగా తీసుకురావాలని సూచిం చారు. అదేవిధంగా ప్రతి పోలింగ్‌బూత్ ఎదుట హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.
పోలింగ్ స్టేషన్లలో ఏజెంట్లుగా ఉండేందుకు ప్రజాప్రతినిధులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. ఏజెంట్లు శనివారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం 7గంటల లోపు ప్రిసైడింగ్ అధికారి వద్ద గుర్తింపుకార్డులు తీసుకోవాలని తెలిపారు. జిల్లాలోని మొత్తం 114 పోలింగ్ కేంద్రాల్లో కూడా వెబ్‌కాస్టింగ్ ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో ఒక ప్రిసైడింగ్ అధికారితో పాటు ఒక ఏపీఓ, మరో ముగ్గురు సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొననున్నట్లు వివరించారు. ఎన్నికల ప్రక్రియలో ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేయడం కోసం కలెక్టరేట్‌లో ప్రత్యేకంగా ఒక హెల్ప్‌డెస్క్‌ను ఏర్పాటు చేశామన్నారు. ఎవరికైనా అనుమానాలుంటే 08542-241200 నంబర్‌కు ఫోన్ చేయవచ్చని సూచించారు.
పటిష్టమైన పోలీస్ బందోబస్తు: ఎస్పీ విశ్వప్రసాద్
ఎమ్మెల్సీ ఎన్నికల సంబంధించి పటిష్టమైన పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ పి.విశ్వప్రసాద్ తెలిపారు. ఎన్నికల విధుల్లో తనతో పాటు ఒక అడిషనల్ ఎస్పీ, ఆరుగురు డీఎస్పీలు, 23 ఇన్‌స్పెక్టర్లు, 85మంది ఎస్‌ఐలు, 134మంది ఏఎస్‌ఐలు, 500మంది కానిస్టేబుళ్లు, 114 మహిళా కానిస్టేబుల్స్, హోంగార్డు, ఒక సీఆర్‌పీఎఫ్ బృందంతో పాటు 103మంది ఏఆర్ కానిస్టేబుళ్లు విధుల్లో పాల్గొననున్నారు. జిల్లాలో ఏడు బోర్డర్ చెక్‌పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. చె క్‌పోస్టులలో 24 గంటల పాటు గస్తీ ఉంటుందన్నారు.
బల్క్ ఎస్‌ఎంఎస్ పంపడం నిషేధం కాబట్టి వాటిపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు ప్రతి ఒక్క ఓటరును పూర్తిగా పరిశీలించిన తర్వాతే లోపలికి పంపుతామన్నారు. ఎన్నికల విధుల్లో భాగంగా జిల్లాలో 14 ప్లైయింగ్ స్కాడ్‌లు విధిగా పరిశీలిస్తాయన్నారు. శాంతిభద్రతలకు సంబంధించి ఒక కంట్రోల్ రూం ఏర్పాటు చేశామన్నారు. ఫోన్:9494600100నంబర్‌ను సంప్రదించాలని ఎస్పీ విశ్వప్రసాద్ తెలిపారు.
మద్యం అమ్మకాలు బంద్ :గోపాలకృష్ణ, ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్
ఎన్నికల నిబంధ నల ప్రకారం మద్యం అమ్మకాలను నిషేధించినట్లు ఎక్సైజ్ డిప్యూటీ క మిషనర్ గోపాలకృష్ణ తెలిపారు. మద్యం అ మ్మడం, పంచడం నిషేధం కాబట్టి షాపులు మూసివేసినట్లు వివరించారు. జిల్లాలో ఉన్న బార్లు, వైన్‌షాపులు, కల్లు దుకాణాలన్నింటినీ మూసివేయించామన్నారు.
సర్వం సన్నద్ధం
Published Sat, Mar 21 2015 3:13 AM | Last Updated on Sat, Sep 2 2017 11:09 PM
Advertisement
Advertisement