సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత శాసన మండలిలో తొలిసారిగా కాంగ్రెస్ పార్టీ ఆధిక్యతను సాధించనుంది. సాధారణంగా కొత్తగా అధికారంలోకి వచ్చే పార్టీకి ఎగువ సభలో తక్షణమే మెజారిటీ లభించదు. అంతకు ముందు అధికారాన్ని చెలాయించిన పార్టీ ఆధిక్యతలో ఉండడం ఆనవాయితీ. నామినేటెడ్ సభ్యుల నియామకం, శాసన సభ నుంచి ఎన్నికైన అభ్యర్థులతో కాంగ్రెస్ బలం పెరిగింది.
మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 75. వీరిలో ప్రస్తుతం బీజేపీకి 38, కాంగ్రెస్‌కు 19, జేడీఎస్‌కు 12 మంది సభ్యులున్నారు. చైర్మన్, ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులతో పాటు మూడు ఖాళీలున్నాయి. కొత్తగా నామినేట్ అయిన ఐదుగురిలో నలుగురు బుధవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఇటీవల ఎన్నికైన మరో 12 మంది జులై 1న ప్రమా ణ స్వీకారం చేయనున్నారు.
అనంతరం ఎగువ సభలో బలాబలాలు తారుమారవుతాయి. ప్రస్తుతం మండలి చైర్మన్‌గా డీహెచ్. శంకరమూర్తి, డిప్యూటీ చైర్‌పర్సన్‌గా విమలా గౌడ వ్యవహరిస్తున్నారు. వీరు పూర్వాశ్రమంలో బీజేపీకి చెందిన వారు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తమ వారిని ఆ స్థానాల్లో కూర్చోబెట్టడానికి ప్రయత్నాలను ప్రారంభించనుంది. నామినేటెడ్ సభ్యులు, శాసన సభ, ఉపాధ్యాయులు, పట్టభద్రుల నియోజక వర్గాల నుంచి ఎన్నికైన వారు ప్రమాణ స్వీకారం చేస్తే కాంగ్రెస్ బలం 28కి పెరుగుతుంది.
జేడీఎస్ బలం 13 వద్దే కొనసాగుతుంది. బీజేపీ హయాం లో నామినేట్ అయిన ఎండీ. లక్ష్మీనారాయణ కేజీపీలో తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. తద్వారా కాంగ్రెస్ బలం 29కి పెరిగి, బీజేపీ బలం 30కి తగ్గుతుంది. చిత్రదుర్గ స్థానిక సంస్థల నుంచి గెలుపొందిన రఘు ఆచార్, శాసన సభ నుంచి ఇండిపెండెంట్‌గా ఎన్నికైన బైరతి సురేశ్ ఇప్పటికే కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు.
దీంతో కాంగ్రెస్ బలం బీజేపీతో సమానంగా 31కి పెరిగినట్లయింది. ఇటీవల బీజేపీ, జేడీఎస్ మద్దతుతో శాసన సభ నుంచి ఏకగ్రీవంగా ఎన్నికైన డీయూ. మల్లిఖార్జున ఎటు వైపు మొగ్గుతారనే విషయమై సందిగ్ధత నెలకొం ది. ఆయన నిర్ణయంపైనే చైర్మన్, డిప్యూటీ చైర్మన్ పదవులను కాంగ్రెస్ కైవసం చేసుకునే వ్యూహం ఆధారపడి ఉంటుంది.
పెద్దల సభలో ఆధిక్యత దిశగా కాంగ్రెస్
Published Fri, Jun 27 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 9:26 AM
Advertisement
Advertisement