ఎట్టకేలకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) వెబ్‌సైట్ ప్రారంభమైంది. టీ–రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్‌గా రాజక్షేత్ర నిలిచింది. ఏ వ్యాపారంలోనైనా కస్టమరే రాజు. అలాంటి రాజులకు రాజసంలా నిలిచే రాజక్షేత్ర.. రెరాలో మొదటి ప్రాజెక్ట్‌గా నమోదవ్వటం ఆనందంగా ఉందన్నారు రాజక్షేత్రను నిర్మిస్తున్న గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి. కిస్మత్‌పూర్‌లో నిర్మిస్తున్న ఆర్ట్ ప్రాజెక్ట్‌ను కూడా త్వరలోనే రెరాలో నమోదు చేయనున్నామని చెప్పారు.
సాక్షి, హైదరాబాద్: 2017, జనవరి 1 తర్వాత జీహెచ్‌ఎంసీ, హెచ్‌ఎండీఏ, డీటీసీపీ, టీఎస్‌ఐఐసీ పరిధిలో 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్లు ప్రతి నివాస, వాణిజ్య సముదాయాలు రెరాలో నమోదు తప్పనిసరి. ఇవన్నీ 90 రోజుల్లోగా ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ రెరా సెక్రటరీ కే విద్యాధర్ రావు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ఇప్పటివరకు టీ–రెరాలో 57 ప్రాజెక్ట్‌లు డేటాను ఎంట్రీ చేశాయని, 173 మంది ప్రమోటర్లు, ఏజెంట్లు నమోదయ్యారని పేర్కొన్నారు.
రెరాకు ముందు.. తర్వాత..
స్థిరాస్తి రంగాన్ని రెరాకు ముందు, తర్వాత అని విభజించే రోజులొచ్చాయి. గతంలో మార్కెట్ బాగున్నప్పుడు బుకింగ్ సొమ్ము చెల్లించేసి మళ్లీ కనబడని కస్టమర్లు తీరా మార్కెట్ ప్రతికూలంగా మారగానే నానా హంగామా చేసేవారు. కానీ, ఇప్పుడు బుకింగ్ సొమ్ము పట్టుకొచ్చే ప్రతి కస్టమర్‌కూ ఫ్లాట్లను విక్రయించరు. అర్ధంతరంగా నిర్ణయాన్ని వాయిదా వేస్తే ప్రాజెక్ట్ మీద ప్రభావం çపడుతుంది. కస్టమర్ల చరిత్ర, ఆర్థిక క్రమశిక్షణ పరిశీలించాక నిజమైన కొనుగోలుదారులతో మాత్రమే క్రయవిక్రయాలు జరుపుతారు. కొనుగోలుదారులే కాదు రియల్టీలో పెట్టుబడిదారులూ అంతే! మార్కెట్ బాగున్నప్పుడు అందరూ రియల్టీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాస్త నెమ్మదించగానే వైదొలుగుతారు. దీంతో స్థానిక మార్కెట్‌పై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ, రెరాలో ప్రణాళిక ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే అవకాశముంటుంది.
రెరాలో కస్టమరే బాహుబలి..
రెరాలో కొనుగోలుదారులూ నమోదు చేసుకునే వీలుంది. ఫ్లాట్ కొనేముందు ఎలాంటి అంశాలను పరిశీలించాలని తెలిపే చెక్ లిస్ట్, మార్గదర్శకాలను అందుకోవచ్చు. కొనుగోలుకు ముందే ప్రాజెక్ట్, డెవలపర్ల పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిసిపోతాయి. దీంతో తోకజాడించే బిల్డర్లు నిలబడలేరు. రెరా రాకముందు గడువులోగా గృహ ప్రవేశం చేయడమనేది సవాలే. కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఒక ప్రాజెక్ట్ నుంచి మరొక ప్రాజెక్ట్‌కు మళ్లించడంతో గడువలోగా పూర్తికాకపోవటం, మధ్యలోనే నిర్మాణం ఆగిపోవటం వంటివి జరిగేవి. కానీ, రెరాలో గడువులోగా నిర్మాణం పూర్తి చేయటం ప్రధాన నిబంధన. పారదర్శక లావాదేవీలతో పాటూ నిధులు మళ్లింపులకు ఆస్కారమే లేదు. ఏ ప్రాజెక్ట్‌లో వసూలు చేసే సొమ్మును అందులోనే వినియోగించాలి కాబట్టి గడువులోగా నిర్మాణం పూర్తవుతుంది. ఆర్ధిక క్రమ శిక్షణ కారణంగా డెవలపర్‌కు, కస్టమర్‌కు ఇద్దరికీ ప్రశాంతత.
రెరాలో సక్సెస్ అయ్యేది ఎవరంటే..
రెరాలో సక్సెస్ అయ్యేది ఎవరంటే.. నిర్మాణంలో వేగం, నాణ్యత, వినూత్న పాటించే డెవలపర్లే! గడు వు, నాణ్యత విషయంలో డెవలపర్లు, చెల్లింపుల్లో కస్టమర్లు బాధ్యతగా వ్యవహరిస్తారు. దీంతో విలువలతో కూడిన పరిశ్రమ తయారవుతుంది. ఉత్పత్తుల వారంటీ, ఐదేళ్ల నిర్వహణ బాధ్యత వంటి కారణంగా 10–15 శాతం ధరలు వృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే రెరాతో రియల్టీ పరిశ్రమ పునాది బలంగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment