Telangana Real Estate
-
‘మార్పు, మార్పు అని ఊదర కొట్టిండ్రు.. మార్పు బాగుందా?’
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాడ్డాక ఏం మార్పులు తీసుకొచ్చిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటేనే బిల్డర్లు హడలిపోతున్నారని, ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు అంటూ నిలదీశారు.తెలంగాణ రియల్టర్స్ ఫోరం సమావేశంకు మంగళవారం మధ్యాహ్నం హాజరైన కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ తెలంగాణలో ఎక్కడైనా ఎకరం భూమి ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల కంటే తక్కువ లేదు.ఇవాళ తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో అందరికి తెలుసు. మార్పు...మార్పు అని ఊదర కొట్టిండ్రు. మార్పు బాగుందా ?నన్ను ఇటీవలే కల్సిన ఒక బిల్దర్ పరిస్థితులు బాగా లేవని అన్నారు, నాకు తెలిసిన ఒకే ఒక విద్య రియల్ ఎస్టేట్ అని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అన్నారు. 11 నెలల నుంచి చూస్తున్న ఒక్క పాజిటివ్ నిర్ణయం లేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్‌కు అనుమతులు గాలిలొ దీపం.హైడ్రా బ్లాక్ మెయిల్ చేసేoదుకు ఇవాళ ఎవరైనా లేక్ వ్యూ అని పెట్టుకోవాలంటే భయపడుతున్నారు. ప్రాజెక్టు లు రద్దు...ఒక్క కొత్త ప్రాజెక్టు వద్దు అన్నట్టు ఉంది కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి’ అంటూ విమర్శించారు కేటీఆర్.‘గత పదేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు కేసీఆర్. మేము మంచిగా చేసిన కరెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసింది. రైతులు మోస పోయినం అని అంటున్నారు.ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు. -
స్థలాలకు అద్దె వల.. రూ.3 లక్షలు పెడితే 6 లక్షలు.. 'రియల్' దగా..
‘‘మా ఫామ్‌ల్యాండ్‌లో రూ. 3 లక్షలుపెట్టి రెండు గుంటలు (242 గజాలు) కొంటే ప్రతి నెలా రూ. 15 వేల అద్దె చొప్పున 20 నెలల తర్వాత రూ. 3 లక్షల అసలు సహా మొత్తం రూ. 6 లక్షలు చెల్లిస్తాం. 4 గుంటల స్థలానికి రూ. 6 లక్షలు చెల్లిస్తే ప్రతి నెలా రూ.30 వేల చొప్పున 20 నెలల తర్వాత రూ. 12 లక్షలు ఇస్తాం. 8 గుంటలకు రూ. 12 లక్షలు కడితే నెలకు రూ. 24 వేల చొప్పున 20 నెలల్లో రూ.24 లక్షలు రిటర్న్ చేస్తాం’’ హైదరాబాద్‌కు 140 కి.మీ. దూరంలోని నారాయణ్‌ఖేడ్‌లో ఓ రియల్ ఎస్టేట్ సంస్థ ఫామ్‌ల్యాండ్ వెంచర్ పేరిట వినియోగదారులను ఆకర్షించేందుకు జోరుగా సాగిస్తున్న ప్రచారం ఇది. ప్రీలాంచ్ పేరిట గత కొన్నేళ్లుగా హైదరాబాద్ సహా ప్రధాన పట్టణాల్లో కొందరు బిల్డర్లు వేలాది మంది మధ్యతరగతి ప్రజల సొంతింటి కలలను కల్లలు చేసి సొమ్ము చేసుకుంటుంటే తాజాగా మరికొందరు రియల్ ఎస్టేట్ వ్యాపారులు ఖాళీ స్థలాలను వెంచర్ల పేరు చెప్పి బై బ్యాక్, రెంటల్ ఇన్‌కం, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ వంటి కొత్త పేర్లతో సామాన్యులను బురిడీ కొట్టిస్తున్నారు. ఏడాదిలో అద్దె సహా కట్టిన సొమ్మును వాపసు చేస్తామంటూ నమ్మించి ఫామ్ ప్లాట్లు, ఖాళీ స్థలాలను అక్రమ మార్గంలో విక్రయిస్తున్నారు. మార్కెట్ రేటు ప్రకారం గజానికి రూ. 5 వేలు కూడా పలకని ప్రాంతంలో గజం రూ. 10 వేలకుపైనే విక్రయించి ముందే డబ్బు వసూలు చేసుకుంటున్నారు. డీటీసీపీ, హెచ్ఎండీఏ నుంచి ఎలాంటి అనుమతులు, రెరాలో నమోదు చేసుకోకుండానే వెంచర్లలో ప్లాట్లను విక్రయిస్తున్నారు. నమ్మకస్తులే మధ్యవర్తులుగా.. గ్రామాలు, శివారు ప్రాంతాలలో టీచర్లు, ఎల్ఐసీ ఏజెంట్లు, రిటైర్డ్ ఉద్యోగులను రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా నియమించుకుంటున్నారు. గ్రాఫిక్స్ హంగులను అద్ది రంగురంగుల బ్రోచర్లను ముద్రించి ఫేస్బుక్, వాట్సాప్, ఇన్‌స్ట్రాగామ్ వంటి సామాజిక మాధ్యమాలలో విస్తృతంగా ప్రచారం చేస్తూ కొనుగోలుదారులను ఆకర్షిస్తున్నారు. ప్రతి నెలా స్టార్ హోటళ్లలో మధ్యవర్తులతో సమావేశం నిర్వహించి, ఎక్కువ విక్రయాలు చేసిన ఏజెంట్లకు విదేశీ టూర్లు, కార్లు, బంగారం వంటివి బహుమతులుగా అందజేస్తున్నారు. అసలుకు రెట్టింపు ఆశ చూపి... చట్ట నిబంధనల ప్రకారం ఫామ్‌ల్యాండ్ వెంచర్లను రియల్ ఎస్టేట్ సంస్థలు కనీసం అర ఎకరం, ఆపై మొత్తాల్లోనే విక్రయించాలి. అయితే అంత విస్తీర్ణంలోని భూముల ధరలు రూ. పదుల లక్షలు, ఆపైనే ఉంటాయి కాబట్టి సామాన్యులు అంత డబ్బు పెట్టి కొనే పరిస్థితి ఉండదనే ఉద్దేశంతో ఆయా సంస్థలు ఫామ్‌ల్యాండ్ వెంచర్లను గజాలు లేదా గుంటల లెక్కన విక్రయిస్తున్నాయి. నిరీ్ణత కాలం తర్వాత అసలుకు రెట్టింపు డబ్బు ఇస్తామని ఆశ చూపుతూ వినియోగదారులతో అగ్రిమెంట్లు చేసుకుంటున్నాయి. కొన్ని చోట్ల మాత్రం అధికారులకు లంచాలు ఇచ్చి ఆ స్థలాలను వ్యవసాయ భూములుగా రిజిస్ట్రేషన్లు చేస్తున్నారు. అయితే ఒకవేళ అగ్రిమెంట్ గడువు తర్వాత రియల్ ఎస్టేట్ మార్కెట్ పతనమై సంస్థ డబ్బు తిరిగి చెల్లించే పరిస్థితి లేకపోయినా లేదా కంపెనీ బోర్డు తిప్పేసినా కొనుగోలుదారులే మోసపోతున్నారు. తమకు కొసరు ఇవ్వకపోయినా పరవాలేదు అసలు సొమ్ము ఇస్తే చాలంటూ సంస్థల చుట్టూ తిరుగుతున్నారు. కానీ దీనిపై చాలా మంది బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సైతం వెనకాడుతున్నారు. అలా చేస్తే తమ పేర్లు బయటపడటంతోపాటు ఆయా సంస్థలు కోర్టులోనే తేల్చుకోమంటాయేమోనని భయపడుతున్నారు. ఈ పట్టణాల్లో కుప్పలుతెప్పలుగా... సదాశివపేట, నారాయణ్‌ఖేడ్, నందివనపర్తి, చేవెళ్ల, జనగాం, బచ్చన్నపేట, చౌటుప్పల్, యాదాద్రి వంటి హైదరాబాద్ నుంచి 100 కి.మీ. దూరంలో ఉన్న ప్రాంతాల్లో ఈ తరహా ప్రాజెక్టులు కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. రహదారులు, విద్యుత్, మురుగునీటి వ్యవస్థ వంటి కనీస మౌలిక వసతులు కూడా సరిగా లేని ప్రాంతాలలో వందలాది ఎకరాలలో ప్రాజెక్ట్‌లు చేస్తున్నామని మాయమాటలు చెబుతున్నాయి. కరోనా కాలంలో పుట్టుకొచ్చిన ఏవీ ఇన్ఫ్రాకాన్, జయ గ్రూప్, ఫార్చ్యూన్ 99 తదితర సంస్థలు ఈ మోసాలకు పాల్పడుతున్నాయి. బై బ్యాక్ పేరుతో మోసపోయా... జనగాం జిల్లాలోని పెంబర్తిలో 11 ఎకరాలలో ఓ సంస్థ వేసిన వెంచర్లో బై బ్యాక్ స్కీమ్ కింద రూ. 20 లక్షలకు 183.33 గజాల స్థలం కొన్నా. 12 నెలల తర్వాత లాభం రూ. 10 లక్షలు, మొదట్లో నేను కట్టిన రూ. 20 లక్షలు కలిపి మొత్తం రూ. 30 లక్షలు తిరిగి చెల్లిస్తామని సంస్థ నాతో అగ్రిమెంట్ చేసుకుంది. కానీ ఏడాది దాటినా సొమ్ము చెల్లించడం లేదు. – ఓ బాధితుడి ఆవేదన. స్కీమ్‌లలో తీసుకొని మోసపోవద్దు... ప్రీలాంచ్, బై బ్యాక్, రెంటల్ గ్యారంటీ అంటూ రకరకాల పేర్లతో సామాన్యులను కొందరు వ్యాపారులు ఆకర్షిస్తున్నారు. టీఎస్–రెరా, నిర్మాణ అనుమతులు లేని ఏ ప్రాజెక్ట్‌లలోనూ ప్రజలు స్థలాలు కొనుగోలు చేయకూడదు. రెరా రిజి్రస్టేషన్ లేని మధ్యవర్తులను నమ్మి మోసపోకూడదు. –విద్యాధర్, సెక్రటరీ, టీఎస్–రెరా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి... రియల్టీ మార్కెట్‌ను స్కీమ్‌ల పేరుతో కొందరు బిల్డర్లు చెడగొడుతున్నారు. స్థలం కొనుక్కోవాలనుకొనే సామాన్యుల ఆశలను ఆసరా చేసుకొని మోసం చేస్తున్నారు. స్కీమ్‌ల పేరుతో విక్రయించే స్థలాలను రిజిస్ట్రేషన్ చేయకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సునీల్ చంద్రారెడ్డి, అధ్యక్షుడు, నరెడ్కో తెలంగాణ చదవండి: బీఆర్ఎస్.. బందిపోట్ల రాక్షసుల సమితి -
తెలంగాణ రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్
ఎట్టకేలకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) వెబ్సైట్ ప్రారంభమైంది. టీ–రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్‌గా రాజక్షేత్ర నిలిచింది. ఏ వ్యాపారంలోనైనా కస్టమరే రాజు. అలాంటి రాజులకు రాజసంలా నిలిచే రాజక్షేత్ర.. రెరాలో మొదటి ప్రాజెక్ట్‌గా నమోదవ్వటం ఆనందంగా ఉందన్నారు రాజక్షేత్రను నిర్మిస్తున్న గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి. కిస్మత్పూర్లో నిర్మిస్తున్న ఆర్ట్ ప్రాజెక్ట్‌ను కూడా త్వరలోనే రెరాలో నమోదు చేయనున్నామని చెప్పారు. సాక్షి, హైదరాబాద్: 2017, జనవరి 1 తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, టీఎస్ఐఐసీ పరిధిలో 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్లు ప్రతి నివాస, వాణిజ్య సముదాయాలు రెరాలో నమోదు తప్పనిసరి. ఇవన్నీ 90 రోజుల్లోగా ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ రెరా సెక్రటరీ కే విద్యాధర్ రావు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ఇప్పటివరకు టీ–రెరాలో 57 ప్రాజెక్ట్‌లు డేటాను ఎంట్రీ చేశాయని, 173 మంది ప్రమోటర్లు, ఏజెంట్లు నమోదయ్యారని పేర్కొన్నారు. రెరాకు ముందు.. తర్వాత.. స్థిరాస్తి రంగాన్ని రెరాకు ముందు, తర్వాత అని విభజించే రోజులొచ్చాయి. గతంలో మార్కెట్ బాగున్నప్పుడు బుకింగ్ సొమ్ము చెల్లించేసి మళ్లీ కనబడని కస్టమర్లు తీరా మార్కెట్ ప్రతికూలంగా మారగానే నానా హంగామా చేసేవారు. కానీ, ఇప్పుడు బుకింగ్ సొమ్ము పట్టుకొచ్చే ప్రతి కస్టమర్‌కూ ఫ్లాట్లను విక్రయించరు. అర్ధంతరంగా నిర్ణయాన్ని వాయిదా వేస్తే ప్రాజెక్ట్ మీద ప్రభావం çపడుతుంది. కస్టమర్ల చరిత్ర, ఆర్థిక క్రమశిక్షణ పరిశీలించాక నిజమైన కొనుగోలుదారులతో మాత్రమే క్రయవిక్రయాలు జరుపుతారు. కొనుగోలుదారులే కాదు రియల్టీలో పెట్టుబడిదారులూ అంతే! మార్కెట్ బాగున్నప్పుడు అందరూ రియల్టీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాస్త నెమ్మదించగానే వైదొలుగుతారు. దీంతో స్థానిక మార్కెట్‌పై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ, రెరాలో ప్రణాళిక ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే అవకాశముంటుంది. రెరాలో కస్టమరే బాహుబలి.. రెరాలో కొనుగోలుదారులూ నమోదు చేసుకునే వీలుంది. ఫ్లాట్ కొనేముందు ఎలాంటి అంశాలను పరిశీలించాలని తెలిపే చెక్ లిస్ట్, మార్గదర్శకాలను అందుకోవచ్చు. కొనుగోలుకు ముందే ప్రాజెక్ట్, డెవలపర్ల పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిసిపోతాయి. దీంతో తోకజాడించే బిల్డర్లు నిలబడలేరు. రెరా రాకముందు గడువులోగా గృహ ప్రవేశం చేయడమనేది సవాలే. కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఒక ప్రాజెక్ట్ నుంచి మరొక ప్రాజెక్ట్‌కు మళ్లించడంతో గడువలోగా పూర్తికాకపోవటం, మధ్యలోనే నిర్మాణం ఆగిపోవటం వంటివి జరిగేవి. కానీ, రెరాలో గడువులోగా నిర్మాణం పూర్తి చేయటం ప్రధాన నిబంధన. పారదర్శక లావాదేవీలతో పాటూ నిధులు మళ్లింపులకు ఆస్కారమే లేదు. ఏ ప్రాజెక్ట్‌లో వసూలు చేసే సొమ్మును అందులోనే వినియోగించాలి కాబట్టి గడువులోగా నిర్మాణం పూర్తవుతుంది. ఆర్ధిక క్రమ శిక్షణ కారణంగా డెవలపర్‌కు, కస్టమర్‌కు ఇద్దరికీ ప్రశాంతత. రెరాలో సక్సెస్ అయ్యేది ఎవరంటే.. రెరాలో సక్సెస్ అయ్యేది ఎవరంటే.. నిర్మాణంలో వేగం, నాణ్యత, వినూత్న పాటించే డెవలపర్లే! గడు వు, నాణ్యత విషయంలో డెవలపర్లు, చెల్లింపుల్లో కస్టమర్లు బాధ్యతగా వ్యవహరిస్తారు. దీంతో విలువలతో కూడిన పరిశ్రమ తయారవుతుంది. ఉత్పత్తుల వారంటీ, ఐదేళ్ల నిర్వహణ బాధ్యత వంటి కారణంగా 10–15 శాతం ధరలు వృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే రెరాతో రియల్టీ పరిశ్రమ పునాది బలంగా ఉంటుంది. -
15 నుంచి రెరాలో నమోదు!
సాక్షి, హైదరాబాద్: ఈనెల 15 నుంచి తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా)లో ప్రాజెక్ట్‌ల నమోదు ప్రారంభం కానుంది. రెరా అధికారుల నియామకంతో పాటూ వెబ్సైట్ అభివృద్ధి దాదాపు పూర్తయిందని.. త్వరలోనే అందుబాటులోకి తీసుకొస్తామని డైరెక్టరేట్ ఆఫ్ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ (డీటీసీపీ), తెలంగాణ రెరా సెక్రటరీ కే విద్యాధర్ రావు చెప్పారు. 2017 జనవరి 1 తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, టీఎస్ఐఐసీ నుంచి అనుమతి పొందిన అన్ని రకాల నివాస ప్రాజెక్ట్‌లు రెరాలో నమోదు చేసుకోవాలి. 500 చ.మీ. లేదా 8 కంటే ఎక్కువ ఫ్లాట్లున్న ప్రతి ప్రాజెక్ట్ కూడా రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన చెప్పారు. ‘‘ప్రభుత్వ రికార్డుల ప్రకారం.. గతేడాది జనవరి 1 తర్వాత అనుమతి పొందిన ప్రాజెక్ట్‌లు తెలంగాణలో 5 వేలున్నాయి. ఇవన్నీ కూడా రెరాలో నమోదు చేసుకోవాలి. ఈనెల 15 నుంచి రెరా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ ప్రారంభమవు తుంది కాబట్టి అక్కడి నుంచి 3 నెలల గడువు ఇస్తాం. అయినా నమోదు చేసుకోకపోతే నోటీసులు అందిస్తాం. అప్పటికీ స్పందించకపోతే రెరా చట్టం ప్రకారం జరిమానాలు, ఇతరత్రా శిక్షలుంటాయని’’ హెచ్ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణ హెచ్చరించారు. ప్రాజెక్ట్ నమోదుకు నాలుగంచెలు.. శుక్రవారమిక్కడ కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) ఆధ్వర్యంలో రెరా అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా విద్యాధర్ రావు మాట్లాడుతూ.. ఒక్క ప్రాజెక్ట్ నమోదు కోసం నాలుగంచెలుంటాయి. రెరా రిజిస్ట్రేషన్ కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసిన డాక్యుమెంట్లను లెవల్–1 అధికారి పరిశీలించి.. లెవల్–2 అధికారికి పంపిస్తారు. ఇక్కడ ఏజెంట్, డెవలపర్ల డాక్యుమెంట్లను తనిఖీ చేసిన తర్వాత రెరా సెక్రటరీకి వెళుతుంది. ఆయా డాక్యుమెంట్లు, ఇతరత్రా వివరాలను క్షుణ్నంగా పరిశీలించిన తర్వాత చైర్మన్ ప్రాజెక్ట్‌ను నమోదుకు అనుమతిస్తారు. ఒక్క ప్రాజెక్ట్ నమోదు కోసం 30 రోజులు, ఏజెంట్ల నమోదుకు 24 గంటల సమయం పడుతుందని చెప్పారు. - తెలంగాణ రెరాలో ప్రాజెక్ట్, ఏజెంట్ల నమోదుతో పాటూ ఫిర్యాదు, నమోదు ఉపసంహరణ, రద్దు వంటి ప్రతి అంశాలకు సంబంధించిన ప్రమాణాలుంటాయని పేర్కొన్నారు. రెరా మీద కొనుగోలుదారులు, డెవలపర్లు ఇద్దరిలోనూ అవగాహన కల్పించాల్సిన అవసరముందని.. ప్రభుత్వంతో పాటూ డెవలపర్ల సంఘాలూ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అభినందనీయమన్నారు. రెరా అనేది నమోదు మాత్రమే అనుమతి కాదు.. రెరా అనేది ఒక రిజిస్ట్రేషన్ ప్రక్రియ మాత్రమే అనుమతి కాదని హెచ్ఎండీఏ డైరెక్టర్ బాలకృష్ణ అన్నారు. ప్రాజెక్ట్‌కు సంబంధించిన స్థానిక మున్సిపల్ శాఖ అనుమతులు, అగ్నిమాపక, పోలీసు, పర్యావరణ ఇతరత్రా అన్ని ప్రభుత్వ విభాగాల అనుమతులు వచ్చాకే రెరా వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అంతే తప్ప రెరాలో రిజిస్ట్రేషన్ చేసుకుంటే అనుమతులొచ్చినట్లు కాదని ఆయన వివరించారు. వాస్తవానికి తెలుగు రాష్ట్రాల్లో రెరా అవసరం పెద్దగా ఉండదని.. ఇక్కడి డెవలపర్లలో 95 శాతం నిర్మాణంలో, లావాదేవీల్లోనూ పారదర్శకంగా ఉంటారని చెప్పారు. - గడువులోగా నిర్మాణం పూర్తి చేయకపోయినా, లేక కొనుగోలుదారులకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయినా ఇతరత్రా ఉల్లంఘనలు చేపట్టినా సరే రెరా అథారిటీ నుంచి కఠినమైన శిక్షలుంటాయని.. అవసరమైతే ప్రాజెక్ట్, ఏజెంట్, డెవలపర్ల లైసెన్స్‌లూ రద్దు అవుతాయని హెచ్చరించారు. ఏసీగార్డ్స్‌లో డీటీసీపీ భవనంలోని క్రింది అంతస్తు తెలంగాణ రెరా కార్యాలయం. డీపీఎంఎస్ మాదిరి ఇబ్బందులొద్దు: క్రెడాయ్ క్రెడాయ్ తెలంగాణ ప్రెసిడెంట్ గుమ్మి రాంరెడ్డి, జనరల్ సెక్రటరీ సీహెచ్ రామచంద్రా రెడ్డిలు మాట్లాడుతూ.. ‘‘గతంలో జీహెచ్ఎంసీ ప్రవేశపెట్టిన డెవలప్మెంట్ పర్మిషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ (డీపీఎంఎస్) ప్రారంభంలో చాలా ఇబ్బందులు ఎదురయ్యాయి. డ్రాయింగ్స్, ఇతరత్రా డాక్యుమెంట్లు అప్లోడ్ అవ్వక 3–4 నెలల పాటు ఇబ్బందులొచ్చాయని.. రెరా వెబ్సైట్ అమలులో ఇవేవీ లేకుండా చూసుకోవాలని సూచించారు. అన్ని విధాలా పరీక్షించిన అనంతరమే అందుబాటులోకి తీసుకురావాలని కోరారు. మహారాష్ట్ర రెరా మాదిరిగానే తెలంగాణ రెరాను అభివృద్ధి చేశారు. మహారాష్ట్రలో మాదిరిగా ఇక్కడి కొన్ని విషయాలు అవసరం లేదు. స్థానిక డెవలపర్లకు సులువుగా, అనుకూలంగా ఉండేలా తెలంగాణ రెరాను అభివృద్ధి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో క్రెడాయ్ తెలంగాణలోని 10 చాప్టర్ల సభ్యులు, ఇతర డెవలపర్ సంఘాల ప్రతినిధులు హాజరయ్యారు. -
స్థిరాస్తుల కొనుగోళ్లకు ‘రెరా’ రక్షణ
సాక్షి, హైదరాబాద్: ప్లాట్లు, భవనాలు, అపార్ట్మెంట్ల వంటి స్థిరాస్తుల కొనుగోలుదారులకు రక్షణ కల్పించేందుకు త్వరలోనే తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (రెరా) ఏర్పాటు కానుంది. కొత్త రియల్ ఎస్టేట్ చట్టంలోని మార్గదర్శకాల అమలుపై పర్యవేక్షణతోపాటు కొనుగోలుదారుల ఫిర్యాదుల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఈ సంస్థను ఏర్పాటు చేయబోతోంది. రాష్ట్ర పురపాలక శాఖ అధికారుల బృందం ఇటీవల ఢిల్లీ, మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో పర్యటించి, ఆయా ప్రాంతాల్లో రెరా అథారిటీల పనితీరును అధ్యయనం చేసిన నివేదికను తాజాగా ప్రభుత్వానికి సమర్పించింది. మహారాష్ట్రలో అమలు చేస్తున్న మోడల్‌ను ఆదర్శంగా తీసుకుని రాష్ట్రంలో స్థిరాస్తి నియంత్రణ సంస్థను ఏర్పా టు చేయాలని, రిటైర్డు హైకోర్టు న్యాయమూర్తి నేతృత్వంతో అది పనిచేయాలని సూచించింది. ఈ ప్రతిపాదనలను పరిశీలిస్తున్న ప్రభుత్వం.. త్వరలోనే రాష్ట్రంలో రెరా అథారిటీని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయనుంది. కొనుగోలుదారుల ప్రయోజనాల కోసం.. ప్లాట్లు, భవనాలు, అపార్ట్మెంట్లు, ఇతర రియల్ ఎస్టేట్ ఆస్తుల కొనుగోలుదారుల ప్రయోజనాలను పరిరక్షించేందుకు కేంద్ర ప్రభుత్వం 2016లో కొత్త రియల్ ఎస్టేట్ చట్టాన్ని తీసుకువచ్చింది. అందులో కీలకమైన స్థిరాస్తి నియంత్రణ సంస్థ (రెరా)ను రాష్ట్రంలో ఏర్పాటు చేసుకోవడంలో ప్రభుత్వం తీవ్ర జాప్యం చేసింది. తాజాగా రెరా ఏర్పాటుకు చర్యలు ప్రారంభించింది. ‘రెరా’లో రిజిస్ట్రేషన్ తర్వాతే.. ప్లాట్లు, భవనాలు, అపార్ట్మెంట్లు తదితర అన్ని స్థిరాస్తి ప్రాజెక్టులను రియల్టర్లు తప్పనిసరిగా ‘రెరా’వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాతే సంబంధిత స్థిరాస్తుల విక్రయానికి సంబంధించిన వ్యాపార ప్రకటనలు జారీ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ప్రతి మూడు నెలలకోసారి ప్రాజెక్టు పురోగతి వివరాలను రెరాకు సమర్పించాలి. నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయకపోతే.. సరైన కారణాలు చూపి రిజిస్ట్రేషన్ గడువు పొడిగింపును కోరాల్సి ఉంటుంది. రెరా కింద ప్రతి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలతో ప్రత్యేక వెబ్‌సైట్‌ను ఏర్పాటు చేసి.. కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచుతారు. అదే విధంగా ఏజెంట్లు, కొనుగోలుదారులతో బిల్డర్లు, డెవలపర్లకు సమస్యలు ఏర్పడినా ఈ సంస్థకు ఫిర్యాదు చేసుకోవచ్చు. కొనుగోలుదారులు గడువులోగా చెల్లింపులు జరపని పక్షంలో.. జరిగిన ఆలస్యానికి సంబంధించిన వడ్డీని రాబట్టుకునేందుకు డెవలపర్లు నియంత్రణ సంస్థను ఆశ్రయించవచ్చు. కొనుగోలుదారులకు భద్రత - గడువులోగా స్థిరాస్తిని అప్పగించడంలో డెవలపర్ విఫలమైనా, ఒప్పందంలోని నిబంధనలను అమలు చేయడంలో విఫలమైనా కొనుగోలుదారులకు డబ్బులు తిరిగి ఇప్పించడంలో నియంత్రణ సంస్థ సహకరిస్తుంది. - ఈ చట్టం ప్రకారం డెవలపర్‌కు సంబంధించిన రిజిస్ట్రేషన్ రద్దు చేయబడినా, సస్పెన్షన్‌కు గురైనా, ప్రాజెక్టు నిర్మాణ పనులను నిలిపేసినా.. కొనుగోలుదారులు చెల్లించిన సొమ్మును రెరా తిరిగి ఇప్పించనుంది. - స్థిరాస్తి ప్రాజెక్టుకు సంబంధిత శాఖలు జారీ చేసిన అనుమతులు (అప్రూవ్డ్ ప్లాన్), ఇతర వివరాలను నియంత్రణ సంస్థ కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచుతుంది. - విక్రయ ఒప్పందం ప్రకారం ప్రాజెక్టు నిర్మాణంలో దశల వారీగా పూర్తి చేయాల్సిన నిర్మాణ పనుల వివరాలను అందుబాటులో ఉంచుతుంది. - డెవలపర్ ప్రాజెక్టు నిర్మాణంలో రియల్ ఎస్టేట్ చట్టాన్ని ఉల్లంఘిస్తే కొనుగోలుదారులు రెరాకు ఫిర్యాదు చేయవచ్చు. ప్రాజెక్టు నిర్మాణంలో లోపాలు బయటపడితే కొనుగోలుదారులకు పరిహారం అందేలా చర్యలు చేపడతారు. ఏజెంట్ల రిజిస్ట్రేషన్ కూడా తప్పనిసరి ప్రతి రియల్ ఎస్టేట్ ఏజెంటు కూడా తప్పనిసరిగా రెరా వద్ద తమ పేరును నమోదు చేసుకోవాలి. ఆ తర్వాతే స్థిరాస్తి లావాదేవీల్లో పాలుపంచుకోవాల్సి ఉంటుంది. ఏజెంట్లకు సంబంధించిన ఫీజులను కూడా నియంత్రణ సంస్థే ఖరారు చేస్తుంది. ఏజెంట్లు జరిపే లావాదేవీల్లో తప్పనిసరిగా తమ రిజిస్ట్రేషన్ నంబర్‌ను పొందుపర్చాల్సి ఉండనుంది. -
‘రియల్’ బూమ్‌కు రాయితీలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ వ్యాపారానికి మరింతగా ఊపు తెచ్చేందుకు ప్రభుత్వం పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇటీవల తెలంగాణ రియల్ ఎస్టేట్ డెవెలపర్స్ అసోసియేషన్(ట్రెడా) చేసిన విజ్ఞప్తి మేరకు స్టాంపు డ్యూటీకి సంబంధించి పలు రాయితీలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోంది. ఆస్తుల క్రయ విక్రయాల రిజిస్ట్రేషన్లపై ప్రస్తుతం 4 శాతం స్టాంపు డ్యూటీ చెల్లించే విధానం ఉంది. 2009 ఎన్నికలకు ముందు అప్పటి ప్రభుత్వం మహిళల పేరిట జరిగే రిజిస్ట్రేషన్లకు అందులో ఒక శాతం రాయితీని ప్రకటించింది. ఏడాది పాటు ఈ రాయితీ అమలైంది. తిరిగి అదే రాయితీని అమలు చేయాలని ఇటీవల ట్రెడా సీఎంను కలిసి విజ్ఞప్తి చేసింది. దీంతో పాటు భూముల అభివృద్ధి ఒప్పందాలు (డెవెలప్మెంట్ అగ్రిమెంట్లు) రిజిస్ట్రేషన్లకు స్టాంపు డ్యూటీని గరిష్ఠంగా రూ. 2 లక్షలకు పరిమితం చేయాలని కోరింది. ఈ రెండు అంశాలపై శనివారం(నేడు) జరిగే రాష్ట్ర మంత్రి మండలి సమావేశంలో చర్చ జరిగే అవకాశముంది. కొత్త ఏడాదిలో మొదటిసారిగా రాష్ట్ర మంత్రివర్గం భేటీ కానుంది. మూడు నెలల తర్వాత సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగే ఈ మంత్రివర్గ సమావేశంలో చర్చించేందుకు దాదాపు 40 అంశాలతో ఎజెండా సిద్ధమైంది. ‘గ్రేటర్’పై వరాలు... గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నేపథ్యంలో ఈ కేబినెట్ భేటీలో నగరవాసులపై వరాలు కురిపించేందుకు సర్కారు సిద్ధమవుతోంది. కరెంటు బిల్లు, నల్లా బిల్లుల బకాయిలను మాఫీ చేస్తామని ఇప్పటికే ముఖ్యమంత్రి హామీలిచ్చారు. దీనికి కేబినెట్ ఆమోద ముద్ర వేయనుంది. 8 లక్షల మందికి లబ్ధి చేకూర్చే రూ.2 వేల వరకు ఆస్తిపన్ను రద్దుకు ఉత్తర్వులు వెలువడ్డాయి. దీనికి సైతం కేబినెట్ ఆమోదం తీసుకోవాల్సి ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికలపై చర్చించి మంత్రులకు డివిజన్ల వారీగా బాధ్యతలు అప్పగించనున్నారు. బడ్జెట్‌పై చర్చ... వచ్చే బడ్జెట్ కేటాయింపులపై కేబినెట్లోనే సమగ్రంగా చర్చించాలని కేసీఆర్ నిర్ణయించారు. బడ్జెట్ సమావేశాల తేదీని ఖరారు చేసే అవకాశముంది. శాఖల వారీగా బడ్జెట్ ప్రతిపాదనలతో రావాలని మంత్రులకు సమాచారం అందించారు. వీటితోపాటు గాంధీ మెడికల్ కాలేజీ ఆధునికీకరణ, గతంలో ఉన్న స్పోర్ట్స్ అథారిటీ(శాప్)ను తెలంగాణకు అన్వయింపు, వాటర్‌గ్రిడ్(మిషన్ భగీరథ) పనులను సకాలంలో పూర్తి చేసిన కాంట్రాక్టర్లకు ప్రోత్సాహకం తదితర అంశాలను ప్రధానంగా చర్చించనున్నారు. వీటితో పాటు కొత్త సంవత్సరంలో అమలు చేయాల్సిన ఎజెండా, డబుల్ బెడ్రూం లబ్ధిదారుల ఎంపిక, మిషన్ కాకతీయ పర్యవేక్షణపై ప్రధానంగా చర్చించనున్నారు. ప్రభుత్వ పథకాల అమలుపై మంత్రులు, అధికారులకు పలు లక్ష్యాలను నిర్దేశించనున్నారు. డీఎస్సీ, కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్... రాష్ట్రంలో టీచర్ పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేయాలని సీఎం ఆదేశించారు. కేబినెట్ ఆమోదం తర్వాత నోటిఫికేషన్ జారీ కానుంది. మరోవైపు రాష్ట్రంలో 25 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్దీకరణ, మరో 20 వేల మందికిపైగా అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వేతనాల పెంపు అంశాలు కేబినెట్ ఎజెండాలో ఉన్నాయి.