హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి ధ్వజమెత్తారు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. తెలంగాణ రాష్ట్రంలో మార్పు తీసుకొస్తామని ఎన్నికలకు ముందు ఊదరగొట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పాడ్డాక ఏం మార్పులు తీసుకొచ్చిందో అందరికీ తెలుసని ఎద్దేవా చేశారు. ఇప్పుడు హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటేనే బిల్డర్లు హడలిపోతున్నారని, ఇదేనా కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన మార్పు అంటూ నిలదీశారు.
తెలంగాణ రియల్టర్స్ ఫోరం సమావేశంకు మంగళవారం మధ్యాహ్నం హాజరైన కేటీఆర్.. రాష్ట్ర ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘ తెలంగాణలో ఎక్కడైనా ఎకరం భూమి ధర రూ. 15 లక్షల నుంచి రూ. 20 లక్షల కంటే తక్కువ లేదు.ఇవాళ తెలంగాణలో రియల్ ఎస్టేట్ మార్కెట్ ఎలా ఉందో అందరికి తెలుసు. మార్పు...మార్పు అని ఊదర కొట్టిండ్రు. మార్పు బాగుందా ?
నన్ను ఇటీవలే కల్సిన ఒక బిల్దర్ పరిస్థితులు బాగా లేవని అన్నారు, నాకు తెలిసిన ఒకే ఒక విద్య రియల్ ఎస్టేట్ అని ఎన్నికలకు ముందు రేవంత్ రెడ్డి అన్నారు. 11 నెలల నుంచి చూస్తున్న ఒక్క పాజిటివ్ నిర్ణయం లేదు ఇప్పుడు రియల్ ఎస్టేట్‌కు అనుమతులు గాలిలొ దీపం.హైడ్రా బ్లాక్ మెయిల్ చేసేoదుకు ఇవాళ ఎవరైనా లేక్ వ్యూ అని పెట్టుకోవాలంటే భయపడుతున్నారు. ప్రాజెక్టు లు రద్దు...ఒక్క కొత్త ప్రాజెక్టు వద్దు అన్నట్టు ఉంది కాంగ్రెస్ సర్కార్ పరిస్థితి’ అంటూ విమర్శించారు కేటీఆర్.
‘గత పదేళ్లలో తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారు కేసీఆర్. మేము మంచిగా చేసిన కరెంట్‌ను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేసింది. రైతులు మోస పోయినం అని అంటున్నారు.ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని కాంగ్రెస్ కార్యకర్తలే అంటున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment