regulatory system
-
డిజిటల్ కమ్యూనికేషన్లో కొత్త టెక్నాలజీలకు ప్రోత్సాహం
న్యూఢిల్లీ: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో రెగ్యులేటరీ శాండ్బాక్స్ ద్వారా వినూత్న టెక్నాలజీలు, సర్వీసులు, వ్యాపార మోడల్స్‌ను ప్రోత్సహించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. లక్ష్యాలు, పరిధి, పాల్గొనే వారి అర్హతా ప్రమాణాలు, దరఖాస్తులను మదింపు చేసే ప్రక్రియ మొదలైన అంశాలను ఇందులో పొందుపర్చింది. నియంత్రిత వాతావరణంలో కంపెనీలు, ఆవిష్కర్తలు తమ కాన్సెప్టులు, సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు రెగ్యులేటరీ శాండ్బాక్స్ ఉపయోగపడుతుంది. కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందే వాటి సామరŠాధ్యలను పరీక్షించేందుకు అవసరమైన రియల్ టైమ్ నెట్వర్క్ వాతావరణం, ఇతర డేటాను పొందేందుకు శాండ్బాక్స్ ఉపకరిస్తుందని ట్రాయ్ పేర్కొంది. దీనిపై సంబంధిత వర్గాలు జూలై 17లోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది. కౌంటర్ కామెంట్లను దాఖలు చేసేందుకు ఆగస్టు 1 ఆఖరు తేదీగా ఉంటుంది. -
జీఎస్టీలో 5 శాతం రేటుకు మంగళం?
న్యూఢిల్లీ: పరిహారం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా, జీఎస్టీ రేట్ల క్రమబద్ధీకరణతో ఆదాయం పెంచుకునే ఆలోచనతో రాష్ట్రాలు ఉన్నాయి. జీఎస్టీలో 5 శాతం రేటును ఎత్తివేసి.. అందులో ఉన్న వస్తు, సేవలను 3, 8 శాతం శ్లాబుల్లోకి మార్చేసే ప్రతిపాదనపై వచ్చే నెలలో జరిగే జీఎస్టీ కౌన్సిల్ సమావేశం నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పెద్ద ఎత్తున వినియోగంలో ఉన్న వాటిని 3 శాతం రేటులోకి, మిగిలిన వాటిని 8 శాతం రేటులోకి మార్చనున్నారు. ప్రస్తుతం జీఎస్టీలో 5, 12, 18, 28 శాతం రేట్ల విధానం అమల్లో ఉంది. దీనికి అదనంగా బంగారం, బంగారం ఆభరణాలపై 3 శాతం పన్ను రేటు విధిస్తున్నారు. బ్రాండెడ్ కాని, ప్యాక్ చేయని ఉత్పత్తులకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తోంది. ఇలా మినహాయింపు జాబితాలోని వస్తు, సేవలను తగ్గించేయాలన్నది జీఎస్టీ కౌన్సిల్ యోచన. కొన్ని ఆహారేతర ఉత్పత్తులను 3 శాతం పరిధిలోకి చేర్చే ప్రతిపాదనపై జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకోనుంది. జీఎస్టీ కౌన్సిల్లో కేంద్ర ఆర్థిక మంత్రితోపాటు.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండడం తెలిసిందే. 5 శాతం పన్ను పరిధిలో ఎక్కువగా ప్యాకేజ్డ్ ఆహారోత్పత్తులు ఉన్నాయి. ఈ రేటును ఒక శాతం పెంచినా రూ.50వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా -
తెలంగాణ రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్
ఎట్టకేలకు తెలంగాణ రియల్ ఎస్టేట్ రెగ్యులేటరీ అథారిటీ (టీ–రెరా) వెబ్సైట్ ప్రారంభమైంది. టీ–రెరాలో నమోదైన తొలి ప్రాజెక్ట్‌గా రాజక్షేత్ర నిలిచింది. ఏ వ్యాపారంలోనైనా కస్టమరే రాజు. అలాంటి రాజులకు రాజసంలా నిలిచే రాజక్షేత్ర.. రెరాలో మొదటి ప్రాజెక్ట్‌గా నమోదవ్వటం ఆనందంగా ఉందన్నారు రాజక్షేత్రను నిర్మిస్తున్న గిరిధారి హోమ్స్ ఎండీ ఇంద్రసేనా రెడ్డి. కిస్మత్పూర్లో నిర్మిస్తున్న ఆర్ట్ ప్రాజెక్ట్‌ను కూడా త్వరలోనే రెరాలో నమోదు చేయనున్నామని చెప్పారు. సాక్షి, హైదరాబాద్: 2017, జనవరి 1 తర్వాత జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ, డీటీసీపీ, టీఎస్ఐఐసీ పరిధిలో 500 చ.మీ. లేదా 8 ఫ్లాట్లు ప్రతి నివాస, వాణిజ్య సముదాయాలు రెరాలో నమోదు తప్పనిసరి. ఇవన్నీ 90 రోజుల్లోగా ఇవన్నీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలంగాణ రెరా సెక్రటరీ కే విద్యాధర్ రావు ‘సాక్షి రియల్టీ’కి తెలిపారు. ఇప్పటివరకు టీ–రెరాలో 57 ప్రాజెక్ట్‌లు డేటాను ఎంట్రీ చేశాయని, 173 మంది ప్రమోటర్లు, ఏజెంట్లు నమోదయ్యారని పేర్కొన్నారు. రెరాకు ముందు.. తర్వాత.. స్థిరాస్తి రంగాన్ని రెరాకు ముందు, తర్వాత అని విభజించే రోజులొచ్చాయి. గతంలో మార్కెట్ బాగున్నప్పుడు బుకింగ్ సొమ్ము చెల్లించేసి మళ్లీ కనబడని కస్టమర్లు తీరా మార్కెట్ ప్రతికూలంగా మారగానే నానా హంగామా చేసేవారు. కానీ, ఇప్పుడు బుకింగ్ సొమ్ము పట్టుకొచ్చే ప్రతి కస్టమర్‌కూ ఫ్లాట్లను విక్రయించరు. అర్ధంతరంగా నిర్ణయాన్ని వాయిదా వేస్తే ప్రాజెక్ట్ మీద ప్రభావం çపడుతుంది. కస్టమర్ల చరిత్ర, ఆర్థిక క్రమశిక్షణ పరిశీలించాక నిజమైన కొనుగోలుదారులతో మాత్రమే క్రయవిక్రయాలు జరుపుతారు. కొనుగోలుదారులే కాదు రియల్టీలో పెట్టుబడిదారులూ అంతే! మార్కెట్ బాగున్నప్పుడు అందరూ రియల్టీలో ఇన్వెస్ట్ చేస్తుంటారు. కాస్త నెమ్మదించగానే వైదొలుగుతారు. దీంతో స్థానిక మార్కెట్‌పై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది. కానీ, రెరాలో ప్రణాళిక ఉన్న పెట్టుబడిదారులకు మాత్రమే అవకాశముంటుంది. రెరాలో కస్టమరే బాహుబలి.. రెరాలో కొనుగోలుదారులూ నమోదు చేసుకునే వీలుంది. ఫ్లాట్ కొనేముందు ఎలాంటి అంశాలను పరిశీలించాలని తెలిపే చెక్ లిస్ట్, మార్గదర్శకాలను అందుకోవచ్చు. కొనుగోలుకు ముందే ప్రాజెక్ట్, డెవలపర్ల పుట్టుపూర్వోత్తరాలన్నీ తెలిసిపోతాయి. దీంతో తోకజాడించే బిల్డర్లు నిలబడలేరు. రెరా రాకముందు గడువులోగా గృహ ప్రవేశం చేయడమనేది సవాలే. కస్టమర్ల నుంచి వసూలు చేసిన సొమ్మును ఒక ప్రాజెక్ట్ నుంచి మరొక ప్రాజెక్ట్‌కు మళ్లించడంతో గడువలోగా పూర్తికాకపోవటం, మధ్యలోనే నిర్మాణం ఆగిపోవటం వంటివి జరిగేవి. కానీ, రెరాలో గడువులోగా నిర్మాణం పూర్తి చేయటం ప్రధాన నిబంధన. పారదర్శక లావాదేవీలతో పాటూ నిధులు మళ్లింపులకు ఆస్కారమే లేదు. ఏ ప్రాజెక్ట్‌లో వసూలు చేసే సొమ్మును అందులోనే వినియోగించాలి కాబట్టి గడువులోగా నిర్మాణం పూర్తవుతుంది. ఆర్ధిక క్రమ శిక్షణ కారణంగా డెవలపర్‌కు, కస్టమర్‌కు ఇద్దరికీ ప్రశాంతత. రెరాలో సక్సెస్ అయ్యేది ఎవరంటే.. రెరాలో సక్సెస్ అయ్యేది ఎవరంటే.. నిర్మాణంలో వేగం, నాణ్యత, వినూత్న పాటించే డెవలపర్లే! గడు వు, నాణ్యత విషయంలో డెవలపర్లు, చెల్లింపుల్లో కస్టమర్లు బాధ్యతగా వ్యవహరిస్తారు. దీంతో విలువలతో కూడిన పరిశ్రమ తయారవుతుంది. ఉత్పత్తుల వారంటీ, ఐదేళ్ల నిర్వహణ బాధ్యత వంటి కారణంగా 10–15 శాతం ధరలు వృద్ధి చెందుతాయని నిపుణులు చెబుతున్నారు. సింపుల్‌గా చెప్పాలంటే రెరాతో రియల్టీ పరిశ్రమ పునాది బలంగా ఉంటుంది. -
ఒకే రెగ్యులేటరీతో ఔషధ ధరలు తగ్గుతాయ్
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రపంచవ్యాప్తంగా ఒకే రెగ్యులేటరీ వ్యవస్థను తీసుకురావడం ద్వారా ఔషధ ధరలను నియంత్రించవచ్చని ఫార్మారంగ నిపుణులు పేర్కొన్నారు. ప్రస్తుతం వివిధ దేశాలకు ఒక్కొక్క రెగ్యులేటరీ విధానం ఉండటం వల్ల వ్యయాలు పెరుగుతున్నాయని వారు పేర్కొన్నారు. యునెటైడ్ స్టేట్స్ ఫార్మాకోపియల్ కన్వెన్షన్ (యూఎస్పీ) ఇండియా కార్యకలాపాలు ప్రారంభించి 10 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ‘ వేల్యూ ఆఫ్ ఇండియన్ ఫార్మాస్యూటికల్స్ ఫర్ గ్లోబల్ హెల్త్’ అనే అంశంపై ఏర్పాటు చేసిన ప్యానల్ డిస్కషన్లో ఫార్మా రంగ నిపుణులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫార్మెక్సిల్ జనరల్ డెరైక్టర్ పి.వి.అప్పాజీ మాట్లాడుతూ ఈ రెగ్యులేటరీ నిబంధనల వల్ల చిన్న ఫార్మా కంపెనీలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. సామాన్యులకు అందుబాటు ధరల్లో ఔషధాలను అందించడానికి ప్రవేశపెట్టిన ‘జన ఔషధి’ ఒక చక్కటి కార్యక్రమంగా పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యూఎస్ఎఫ్డీఏ ఇండియా డెరైక్టర్ మాథ్యూ థామస్, యూఎస్పీ సీఈవో డాక్టర్ రొనాల్డ్, ఆవ్రా ల్యాబరేటరీస్ సీఎండీ ఎ.వి.రామారావు తదితరులు పాల్గొన్నారు. -
అవినీతిని సహించేదిలేదు: రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ: అవినీతిని సహించేదిలేదని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు. దేశంలో అవినీతి అనేది పెద్ద సమస్యగా మారిందని, దేశ ప్రజలను పట్టిపీడుస్తున్న ఈ అవినీతి మహాంమారిని పారద్రోలాలంటూ రాహుల్ గాంధీ ఘాటుగా స్పందించారు. ఎఫ్ సీసీఐ సమావేశంలో శనివారం పాల్గొన్న ఆయన ఈ అవినీతిపై పోరాడేందుకు యూపీఏ ప్రభుత్వం లోక్ పాల్ బిల్లుకు ఆమోదం తెలిపిందని చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అవినీతి బారిన పడి దేశప్రజలు అల్లాడుతున్నారని, ఇకపై అవినీతిని సహించేదిలేదని తెలిపారు. యూపీఏ ప్రభుత్వం అవినీతిపై ఎన్నో విమర్శలను ఎదుర్కొందని చెప్పారు. కానీ దేశంలో ఏ ప్రభుత్వం చేయని రీతిలో కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిపై యుద్ధం చేస్తోందని రాహుల్ అన్నారు. మన దేశంలో అవినీతిని నియంత్రించే వ్యవస్థలను పునర్వ్యవస్థీకరించు కోవాల్సి ఉందని రాహుల్ తెలిపారు.