
న్యూఢిల్లీ: డిజిటల్ కమ్యూనికేషన్ రంగంలో రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ ద్వారా వినూత్న టెక్నాలజీలు, సర్వీసులు, వ్యాపార మోడల్స్‌ను ప్రోత్సహించే దిశగా టెలికం రంగ నియంత్రణ సంస్థ ట్రాయ్ చర్చాపత్రాన్ని రూపొందించింది. లక్ష్యాలు, పరిధి, పాల్గొనే వారి అర్హతా ప్రమాణాలు, దరఖాస్తులను మదింపు చేసే ప్రక్రియ మొదలైన అంశాలను ఇందులో పొందుపర్చింది.
నియంత్రిత వాతావరణంలో కంపెనీలు, ఆవిష్కర్తలు తమ కాన్సెప్టులు, సర్వీసులను ప్రయోగాత్మకంగా పరీక్షించుకునేందుకు రెగ్యులేటరీ శాండ్‌బాక్స్ ఉపయోగపడుతుంది. కంపెనీలు తమ కొత్త ఉత్పత్తులను మార్కెట్లోకి విడుదల చేయడానికి ముందే వాటి సామరŠాధ్యలను పరీక్షించేందుకు అవసరమైన రియల్ టైమ్ నెట్‌వర్క్ వాతావరణం, ఇతర డేటాను పొందేందుకు శాండ్‌బాక్స్ ఉపకరిస్తుందని ట్రాయ్ పేర్కొంది. దీనిపై సంబంధిత వర్గాలు జూలై 17లోగా తమ అభిప్రాయాలను తెలపాల్సి ఉంటుంది. కౌంటర్ కామెంట్లను దాఖలు చేసేందుకు ఆగస్టు 1 ఆఖరు తేదీగా ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment