జీఎస్‌టీలో 5 శాతం రేటుకు మంగళం? | GST Council may do away with 5percent rate | Sakshi
Sakshi News home page

జీఎస్‌టీలో 5 శాతం రేటుకు మంగళం?

Published Mon, Apr 18 2022 1:13 AM | Last Updated on Mon, Apr 18 2022 1:13 AM

GST Council may do away with 5percent rate - Sakshi

న్యూఢిల్లీ: పరిహారం కోసం కేంద్ర ప్రభుత్వంపై ఆధారపడకుండా, జీఎస్‌టీ రేట్ల క్రమబద్ధీకరణతో ఆదాయం పెంచుకునే ఆలోచనతో రాష్ట్రాలు ఉన్నాయి. జీఎస్‌టీలో 5 శాతం రేటును ఎత్తివేసి.. అందులో ఉన్న వస్తు, సేవలను 3, 8 శాతం శ్లాబుల్లోకి మార్చేసే ప్రతిపాదనపై వచ్చే నెలలో జరిగే జీఎస్‌టీ కౌన్సిల్‌ సమావేశం నిర్ణయం తీసుకోనుంది. ఈ విషయాన్ని విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. పెద్ద ఎత్తున వినియోగంలో ఉన్న వాటిని 3 శాతం రేటులోకి, మిగిలిన వాటిని 8 శాతం రేటులోకి మార్చనున్నారు. ప్రస్తుతం జీఎస్‌టీలో 5, 12, 18, 28 శాతం రేట్ల విధానం అమల్లో ఉంది.

దీనికి అదనంగా బంగారం, బంగారం ఆభరణాలపై 3 శాతం పన్ను రేటు విధిస్తున్నారు. బ్రాండెడ్‌ కాని, ప్యాక్‌ చేయని ఉత్పత్తులకు పన్ను నుంచి మినహాయింపు లభిస్తోంది. ఇలా మినహాయింపు జాబితాలోని వస్తు, సేవలను తగ్గించేయాలన్నది జీఎస్‌టీ కౌన్సిల్‌ యోచన. కొన్ని ఆహారేతర ఉత్పత్తులను 3 శాతం పరిధిలోకి చేర్చే ప్రతిపాదనపై జీఎస్‌టీ కౌన్సిల్‌ నిర్ణయం తీసుకోనుంది. జీఎస్‌టీ కౌన్సిల్‌లో కేంద్ర ఆర్థిక మంత్రితోపాటు.. రాష్ట్రాల ఆర్థిక మంత్రులు సభ్యులుగా ఉండడం తెలిసిందే. 5 శాతం పన్ను పరిధిలో ఎక్కువగా ప్యాకేజ్డ్‌ ఆహారోత్పత్తులు ఉన్నాయి. ఈ రేటును ఒక శాతం పెంచినా రూ.50వేల కోట్ల అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement