సాక్షి, హైదరాబాద్: రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ బ్యారేజీ సందర్శన చేపట్టిందని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు. బ్యారేజీలో ఒకటి రెండు పిల్లర్లు కుంగితే కోడిగుడ్డుపై ఈకలు పీకే ప్రయత్నం చేస్తున్నారని దుయ్యబట్టారు. కాళేశ్వరం సమగ్ర రూపం చాలా మందికి తెలీదని అన్నారు. కాళేశ్వరం అంటే మూడు బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్‌స్టేషన్లు, 21 పంప్‌హౌజ్‌లు అని తెలిపారు.
కాళేశ్వరం ఫలితాలను రైతులను అడగండి చెబుతారని హరీష్ రావు అన్నారు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదని, మల్లన్నసాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక సాగర్, మిడ్ మానేరు రిజర్వయర్, అన్నపూర్ణ రిజర్వాయర్ ఉన్నాయని తెలిపారు. మిగతా బ్యారేజీలు కూడా చూడాలని సూచించారు. కర్ణాటక కాంగ్రెస్ నేతలు రంగనాయకసాగర్‌ను మెచ్చుకున్నారని గుర్తు చేశారు. కాంగ్రెస్ గతంలో అధికారంలో ఉన్నప్పుడు ఎందుకు ప్రాణహిత- చేవెళ్ల కట్టలేదుని ప్రశ్నించారు.
సభలో ప్రతిపక్షానికి మైక్ ఇవ్వలేదని మండిపడ్డారు. అధికార పక్షం మాత్రమే మాట్లాడిందన్నారు. సభా సంప్రదాయాలను అధికారపక్షం మంటగలుపుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్య విలువలను మంటగలిపే విధంగా ప్రభుత్వం ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. మీరు వెళ్లే దారిలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కూడెల్లి వాగు, పచ్చటి పోలాలు చూడాలంటూ కాంగ్రెస్ మంత్రులు, ఎమ్మెల్యేలకు హితవు పలికారు. తప్పు జరిగితే చర్య తీసుకోవాలని..పునుద్దరణ పనులు చేపట్టాలని చెప్పారు. దురుద్దేశంతోనే ప్రాజెక్టు పునరుద్దరణ చేపట్టడం లేదని విమర్శించారు.
చదవండి: మేడిగడ్డకు బయల్దేరిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం
Comments
Please login to add a commentAdd a comment