సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటుపై విజిలెన్స్ విచారణకు తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కాళేశ్వరం ప్రాజెక్టు పరిధిలోని పలు ఇరిగేషన్ కార్యాలయాల్లో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. జలసౌధలోని తెలంగాణ ఇరిగేషన్ శాఖ కార్యాలయానికి విజిలెన్స్ అధికారులు వెళ్లి తనిఖీ చేస్తున్నారు. ఈఎన్‌సీ మురళీధర్ రావు ఆఫీస్‌లో విజిలెన్స్ అధికారుల సోదాలు చేస్తున్నారు. ఆఫీసులోని రెండు, నాలుగు అంతస్తుల్లో విజిలెన్స్ అధికారుల తనిఖీలు నిర్వహించారు.
హైదరాబాద్‌తో పాటు జిల్లా ఇరిగేషన్ కార్యాలయాల్లో పది ప్రత్యేక విజిలెన్స్ బృందాలతో తనిఖీలు చేపట్టారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్ట్ కార్యాలయాల్లో విజిలెన్స్ అండ్ ఫోర్స్‌మెంట్ తనిఖీలు చేస్తోంది. మహాదేవపూర్‌లోని ఇరిగేషన్ డివిజన్ కార్యాలయంలో రికార్డులు, విలువైన పత్రాలను అధికారుల బృందం పరిశీలిస్తోంది. మెడిగడ్డ బ్యారేజీ, కన్నేపల్లి పంప్‌హౌజ్‌లకు సంబంధించిన కార్యాలయాల్లో అధికారుల బృందాలు తనిఖీలు చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment