కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం: ఉత్తమ్‌ | Telangana Ministers Visit Medigadda Barrage Updates | Sakshi
Sakshi News home page

కాళేశ్వరం ప్రాజెక్టుపై జ్యుడీషియల్ విచారణ చేస్తాం: ఉత్తమ్‌

Published Fri, Dec 29 2023 10:34 AM | Last Updated on Fri, Dec 29 2023 5:59 PM

Telangana Ministers Visit Medigadda Barrage Updates - Sakshi

Updates:

 

ఈఎన్‌సీ చీఫ్ మురళీధర్‌ కామెంట్లు..
►  మేడిగడ్డ బ్యారేజ్‌లో మొత్తం నాలుగు పిల్లర్లు 18,19,20,21 కుంగినాయి
►  20వ పిల్లర్ ఎక్కువగా 1.256 మీటర్ల మేర కుంగింది
►  మూడు పిల్లర్లు పూర్తిగా తొలగించాల్సి వస్తుంది
►  ఆ పిల్లర్లు తొలగించడం కష్టతరంగా మారింది
►  ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్తు ఈ పిల్లర్లల మీదే ఆధారపడి ఉంది

కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణం తుగ్లక్ చర్య: కోమటిరెడ్డి వెంకటరెడ్డి
► కిందికి పోయినా వాటర్‌ను పైకి లిఫ్ట్ చేయడం ఏం పిచ్చి డిజైన్
► వేల కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేశారు
► ఇంజనీరింగ్ అధికారులు వాస్తవాలు బయట పెట్టాలి
► అసెంబుల్డ్ మోటార్లతో వేల కోట్ల డబ్బు దోచుకున్నారు
► అప్పటి పాలకులు చెప్పినట్లు ఇంజనీరింగ్ అధికారులు ఎందుకు తలూపారు
► మీ మాట వినకపోతే లీవ్ పెట్టి వెళ్లి పోవాల్సింది
► ఎకరానికి 12 వేల ఖర్చు వస్తుంది

రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కామెంట్లు
► ప్రజల్లో చర్చ జరుగుతుందే నేను అడుగుతున్నా
► 152 మీటర్ల వరకు ప్రాజెక్టు ఎత్తు ఉండేలా నిర్మాణం ఉండాలని మహారాష్ట్రతో చర్చలు జరుగుతున్నాయి
► రాష్ట్రం ఏర్పడిన తర్వాత 148 మీటర్లకే ప్రాజెక్టు కట్టేందుకు కేసీఆర్ ప్రభుత్వం ఒప్పుకుంది.
► కేసీఆర్ తన మార్క్ కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారు
► డయాఫ్రామ్ వాల్ కాంక్రీట్‌తో వేసి ఉంటే ఈ రోజు బ్యారేజ్‌లు డ్యామేజ్ అయ్యేవి కాదు.
► సీకెండ్ ఫైల్ ఫేలవ్వడం వల్లే బ్యారేజ్‌లు దెబ్బతిన్నాయి.
► ప్రాజెక్టు నిర్మాణంలో అప్ స్టీన్ కటాఫ్, డౌన్ స్టీన్ కటాఫ్‌ను ఎందుకు పరిగణలోకి తీసుకోలేదు
► ప్రమాదం ఉందని 2022 ఎప్రిల్ 28న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లేఖలు రాసాడు.. అయినా ఎందుకు చర్యలు తీసుకోలేదు. 
► టెండర్లు పిలవడానికి చూపిన ఇంట్రెస్ట్... సేఫ్టీకి ఎందుకు ప్రాధాన్యత ఇవ్వలేదు
► వరద ఉధృతిని అంచనా వేయకుండా పంప్ హౌస్‌ల నిర్మాణం ఎలా చేసారు
► బ్యారేజ్‌లో ఇసక తీయాల్సిన అవసరం ఏమోచ్చింది.. తీసిన ఇసుకను ఏం చేసారు
► మునిగిపోయిన పంప్‌ల స్థానంలో కొత్త వాటి కోసం బడ్జెట్ అలకేషన్ చేయాలని మళ్ళీ ఫైల్‌ను ఫైనాన్స్ డిపార్టుమెంట్‌లో పెట్టారు
► 3 టీఏంసీ లిఫ్ట్ కోసం టెండర్ల ద్వారా కాకుండా నామినేషన్ ద్వారా ఎలా కాంటాక్ట్ ఇచ్చారు
► కాళేశ్వరంకు మీడియాను ఎందుకు నియంత్రించారు

మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లు
 కాళేశ్వరం ప్రాజెక్ట్ విషయంలో మా కాంగ్రెస్ అభిప్రాయం ఒకటే 
► 38 వెల కోట్లతో 16.40 లక్షల ఎకరాల ఆయకట్టు కోసము వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ఆయకట్టు ప్రణాళిక రూపొందించడం జరిగింది
► కానీ ప్రభుత్వం మారడం వల్ల  ప్లాన్ మార్చి మేడి గడ్డ దగ్గర నిర్మించడం జరిగింది
► ఒక బ్యారేజ్ తుమ్మిడి హాట్టి  దగ్గర అనుకున్నాం కానీ.. అన్నారం, సుందిల్ల ఇలా ఎక్కువ ప్రాజెక్ట్ లు నిర్మించడం వల్ల వ్యాయం పెరిగింది
► ఆనాడు 38 వెల కోట్లతో 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఉంటే ఇప్పుడు 18 లక్షల ఎకరాల కు 80 వేల కోట్లు ఖర్చు చేశారు
► ప్రపంచం లోనే అతి పెద్ద ప్రాజెక్టు అని చెప్పారు.. అద్భుతం అన్నారు.
► కానీ మేడిగడ్డ డ్యామేజ్ కావడం దురదృష్టం
► అక్టోబర్ 21 నాడు ప్రాజెక్టు పెద్ద శబ్దంతో కుంగడం జరిగింది
► కానీ ఆనాటి ముఖ్యమంత్రి, ఇరిగేషన్ మంత్రి  కాళేశ్వరం ప్రాజెక్టు గురించి నోరు మెదపలేదు
► ఎక్కడ రివ్యూ చేయలేదు,స్టేట్ మెంట్ ఇవ్వలేదు
► మా ప్రభుత్వ అధికారంలోకి రాగానే ప్రాజెక్టు మొత్తం విషయంపై జ్యుడిషియల్ విచారణ చేపడతాం అని చెప్పాం చేపడతాం
► అన్ని విషయాలు క్షుణ్ణంగా తెలుసు కోవడానికి ఈ రోజు రావడం జరిగింది
► అధికారులతో రివ్యూ తరువాత తుది నిర్ణయం ప్రకటిస్తాం
► CWC అప్రోవల్ చేసింది రూ. 80 వెల కోట్లు కానీ ఇప్పుడు లక్షన్నర కోట్లు పెరిగింది.
► 38 వెల కోట్లు ప్రాజెక్ట్ ఈరోజు వరకు  సుమారు 95 వేల కోట్ల ఖర్చు జరిగింది.
► కంట్రోల్ ఆడిట్ జనరల్ కూడా ఈ ప్రాజెక్ట్ విషయంలో తీవ్రమైన ఆగ్రహం వ్యక్తం చేశారు.
► మేడి గడ్డ ఒక్కటే కాదు అన్నారం, కూడా నష్టం జరిగింది.. సుందిల్లను కూడా పరిశీలించాలి
► మూడు బ్యారేజీల రిపేర్‌కు అయ్యే ఖర్చు ప్రజల మీద భారమే అవుతుంది
► కాళేశ్వరం ప్రాజెక్టు మీద పెట్టిన డబ్బు మొత్తం వృధా
► పైగా ప్రజలపైన వడ్డీలు పడుతున్నాయి
► కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మాణంపై జ్యుడీషియల్ విచారణ చేయబోతున్నాం
► ప్రాజెక్ట్ నిర్మాణంలో లోపం జరిగింది
► డిజైన్ , నిర్మాణం ఫెయిల్ అయ్యాయి
► ENC మరోసారి రిటన్‌గా నివేదిక ఇవ్వాలి
► తుమ్మిడిహట్టి మరోసారి రీడిజైన్ చేయబోతున్నాం
► మాకు తుమ్మిడిహట్టి మీద పూర్తి అవగాహన ఉంది

ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కామెంట్లు
 అన్నారం, మేడిగడ్డ, సుంధిళ్ళ బ్యారేజ్‌లే కాళేశ్వరంకు కీలకం
 అందులో అన్నారం, మేడిగడ్డ బ్యారేజ్‌లు డ్యామేజ్ అయ్యాయి
 బాంబు దాడులను తట్టుకునే విధంగా ప్రాజెక్టుల ను నిర్మిస్తారు
 అలాంటిది మేడిగడ్డ బ్యారేజ్ బాంబు దాడి వల్ల డ్యామేజ్ అయిందని ఎలా భావిస్తున్నారు
 ఇరిగేషన్ శాఖ లో 8 నుంచి 9 వేల కోట్ల పెండింగ్ బిల్లులు ఉన్నాయి
 గత ప్రభుత్వం మాకు పెండింగ్ బిల్లులు వదిలిపెట్టి వెల్లింది

పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో ఉండే కీలక అంశాలు
 గోదావరిలో వాటర్ ఎంత లభ్యం అవుతుంది
► ప్రాణహితకు కాళేశ్వరంకు మధ్య తేడా ఏంటి?
► రీ డిజైన్ చేయడానికి గల కారణాలు ఏంటి?
► ప్రాణహిత ద్వారా ఎంత ఆయకట్టుకు నీళ్లు ఇవ్వడానికి అవకాశం ఉండేది
► కాళేశ్వరం నిర్మాణం పూర్తయిన తర్వాత ఎంత నీరు ఇచ్చారు
► ఇప్పటి వరకు కాళేశ్వరం విద్యుత్ ఖర్చు ఎంత?
► మేడిగడ్డ కుంగిపోవడానికి కారణం ఏంటి?
► మేడిగడ్డ బ్యారేజ్ సేఫ్టీకి ఇప్పుడు ఏం చేయాలి?

మేడిగడ్డకు మంత్రుల బృందం
► హైదరాబాద్ నుంచి మేడిగడ్డ బ్యారేజ్‌కు తెలంగాణ మంత్రుల బృందం బయలుదేరింది
► మంత్రుల్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి.
► మంత్రులతో పాటు కాంగ్రెస్‌ ఎమ్మెల్యే వివేకా వెంకట స్వామి.
► మేడిగడ్డకు కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ టీ.జీవన్‌రెడ్డి రోడ్డు మార్గంలో బయలుదేరారు. 

మీడియాతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి..
►అక్టోబర్ 21న మెడగడ్డ పిల్లర్ కుంగిపోయింది.
►నవంబర్ 30న ఎన్నికలు డిసెంబర్ 3న ఫలితాలు, డిసెంబర్ 7వరకు కేసిఆర్ సీఎంగా ఉన్నారు
►కానీ కాళేశ్వరంపై ఒక్కసారి మాట్లాడలేదు. ఇది చాలా సిగ్గుపడాల్సిన సంఘటన
►అన్ని విషయాలు నిర్దారణ చేస్తాం.నిజానిజాలు అన్ని మీడియాకు వెల్లడిస్తాం
►మూడేళ్లలో ఈ ప్రోజెక్ట్ కుంగటం సిగ్గు చేటు. ఎవరు కట్టారో వారే బాధ్యత వహించాలి
►లక్ష కోట్ల ప్రోజెక్ట్ లో ఇంత భారీ అవినీతి జరిగింది

► మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిన సమయం నుంచి బ్యారేజ్‌ చూడటానికి అనుమతి ఇవ్వడం లేదని అధికారులు తెలిపారు. మరో వైపు కుంగిన ప్రాంతాన్ని చూపిస్తామని చెప్పిన మంత్రులు మేడిగడ్డ పర్యటనకు బయలుదేరనున్నారు. అధికారులు బ్యారేజ్‌కు ఇరువైపులా బారికేడ్లతో మూసివేశారు. దీంతో మంత్రుల మేడిగడ్డ పర్యటన ఉత్కంఠగా మారింది.

జయశంకర్‌ భూపాలపల్లి: కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని  మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల సందర్శనకు తెలంగాణ మంత్రులు వెళ్లనున్నారు. దీంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా  స్థానిక అధికారులను ఆదేశించారు. మంత్రులు ఉత్తంకుమార్ రెడ్డి, శ్రీధర్ బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, పోన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి పర్యటించనున్నారు. హైదరాబాదు నుండి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి మేడిగడ్డకు చేరుకుంటారు.

అనంతరం​ E-IN-C ద్వారా కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ పైర్ ఫౌండేషన్ కుంగిపోవడం, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నష్టంపై సమీక్ష చేస్తారు. మేడిగడ్డ బ్యారేజీని సందర్శించి క్యాంపు కార్యాలయానికి తిరుగు ప్రయాణం కానున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement