సాక్షి, జయశంకర్ భూపాలపల్లి: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ బ్యారేజీని ముఖ్యమంత్రి కేసీఆర్ మంగళవారం సందర్శించారు. అధికారులు, ఇంజనీర్లతో కలిసి బ్యారేజీ వద్ద గోదావరి వరదను పరిశీలించారు. ఆయన వెంట మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ఈటెల రాజేందర్, రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ కూడా ఉన్నారు. ఇక మేడిగడ్డ సందర్శన అనంతరం కేసీఆర్ గోలివాడ పంపుహౌజ్, ఆ తర్వాత ఎల్లంపల్లి బ్యారేజీ వద్దకు చేరుకోనున్నారు. అనంతరం ధర్మపురి చేరుకుని లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పూజలు నిర్వహించనున్నట్లు సమాచారం.
కాగా ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనకు నిరసనగా.. ‘మా నీళ్లు మాకు ఇచ్చిన తరువాతే ఇతర ప్రాంతాలకు తరలించాలి’ అని డిమాండ్ చేస్తూ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ధర్మపురి ఇంచార్జి కన్నం అంజన్న వెల్గటూరులో ధర్నాకు పిలుపునిచ్చారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయనను అరెస్టు చేసి స్టేషనుకు తరలించారు. ఇక ధర్మపురి ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత కేసీఆర్ విలేకరులతో మాట్లాడనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment