సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీ కుంగిపోవడానికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావే పూర్తి బాధ్యత వహించాలని, ఏమాత్రం నిజాయితీ ఉన్నా సీఎం పదవికి రాజీనామా చేయాలని బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. కాళేశ్వ రం ప్రాజెక్ట్ టెండర్ పిలిచినప్పటి నుంచి ఇప్పటిదాకా జరిగిన పరిణామాలపై శ్వేతపత్రం విడు దల చేయాలని కోరారు.
సోమవారం పార్టీ నేతలు కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, నరహరి వేణుగోపాల్‌రెడ్డి, మాజీ ఐఏఎస్ అధికారి రామచంద్రుడు, మాజీ ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్‌తో కలిసి ఈటల మీడియాతో మాట్లాడుతూ...సీఎం కేసీఆర్‌కు నష్టపోయిన ప్రా జెక్ట్ చూపించేందుకు గానీ, ఏమైందో చెప్పేందుకు నిపుణు ల కమిటీ వేసి దానిని బయటకు వివరించే దమ్ముగానీ లేదన్నా రు. ప్రజలకు సరైన సమాచారం ఇవ్వకుండా త ప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు.
ప్రజాధనంతో ప్రభుత్వం కట్టిన ప్రాజెక్టుకు ఏం జరిగిందో చెప్పాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరంపై గతంలో మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఇరిగేషన్ నిపుణులు అనేక అనుమానాలు వ్యక్తం చేసిన విషయా న్ని గుర్తు చేశారు. లక్ష్మీ బ్యారేజీని ఇసుక మీదనే ఫౌండేషన్ వేశారని, పిల్లర్ల కింద ఉన్న ఇసుక కొట్టుకుపోవటంతో ప్రాజెక్టు కుంగిపోయే పరిస్థితి వచ్చిందని వివరించారు. ప్రాజెక్టు నింపే సమ యంలో కూడా వన్ బై ఫోర్త్ మొదట, హాఫ్ ట్యాంక్ రెండవసారి నింపుతారని చెప్పారు. కానీ మొదటి రోజు నుంచి ఈ ప్రాజెక్టు లీక్ అవుతున్నా కూడా పట్టించుకోలేదని ఈటల ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment