సాక్షి, పెద్దపల్లి: సుందిళ్ల, అన్నారం, మేడిగ బ్యారేజీలు డ్యామేజ్ అయ్యాయని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. శుక్రవారం(జూన్7) మేడిగడ్డ బ్యారేజీని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ప్రత్యేక హెలికాప్టర్‌లో వచ్చి పరిశీలించారు. అనంతరం అక్కడి ఎల్‌అండ్‌టీ గెస్ట్‌హౌజ్‌లో మీడియాతో మాట్లాడారు.
‘నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ(ఎన్‌డీఎస్‌ఏ) నిర్మాణం మేరకే సుందిళ్ల, అన్నారం, మేడిగడ్డ బ్యారేజీలు రిపేర్ చేస్తున్నాం. బ్యారేజీల్లో నీటిని నిల్వ చేయడానికి వీలు లేదని ఎన్‌డీఎస్‌ఏ సూచించింది. వర్షాకాలం వచ్చినందున మరమ్మతు పనులు వేగవంతం చేస్తాం. తుమ్మిడి హట్టి దగ్గర కొత్త బ్యారేజి నిర్మిస్తాం
బీఆర్‌ఎస్ హయాంలోనే మేడిగడ్డ కుంగింది. రూ.94 వేల కోట్లప్రాజెక్టు కుంగిపోయింది. దాని కోసం చేసిన అప్పులకు వడ్డీలు చెల్లిస్తున్నాం. ఎన్నికల కోడ్ వల్ల మరమ్మతుల రివ్యూకు రాలేకపోయాం. అందుకే ఇప్పుడు వచ్చి పరిశీలించా’ అని ఉత్తమ్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment