LIVE Updates
గత ప్రభుత్వంలో మేడిగడ్డను ఎవ్వరినీ చూడనివ్వలేదు: సీఎం రేవంత్
- కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే విజిలెన్స్ విచారణ చేయించాము
- రీ డిజైన్ పేరుతో కేసీఆర్ వేల కోట్ల రూపాయల అవినీతికి పాల్పడ్డారు
- ప్రజల ముందు దోషిగా నిలబడాల్సిన పరిస్థితి వస్తుందనే నల్గొండ సభ పెట్టారు
- కేసీఆర్ కోటి ఒకటోసారి సావు నోట్లో తలకాయ పెట్టిన అని మరోసారి శుద్ధపూస లెక్క మాట్లాడుతుండు.
- కేసీఆర్ సావు నోట్లో తలకాయ పెడితే అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు.
- స్మిత్మా సభర్వాల్ కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లను అప్పగించినట్లు అసెంబ్లీలో బయటపెట్టాము.
- మేడిగడ్డ పర్యటనకు, అసెంబ్లీకి కేసీఆర్ రాలేదు
- కాలు విరిగిన కేసీఆర్ నల్గొండ జిల్లాకు ఎలా వెళ్లారు? అసెంబ్లీ దగ్గర ఉందా? నల్గొండ దగ్గర ఉందా?
- కేసీఆర్ చెప్పే మాటలను తెలంగాణ ప్రజలు నమ్మరు.
- కేసీఆర్ దోపిడీకి మేడిగడ్డ బలైపోయింది... అన్నారం సుందిల్లా సున్నం అయింది.
- మేడిగడ్డకు వచ్చిన వాళ్ళను కేసీఆర్ అవమానించారు.
- కృష్ణా బోర్డుకు ప్రాజెక్ట్ లు అప్పగించడం లేదని అసెంబ్లీ లో చేసిన తీర్మానానికి హరీష్‌రావు మద్దతు పలికారు.
- తీర్మానం పై లోపాలు ఉంటే కేసీఆర్ వచ్చి సవరించి ఉండేది.
- అఖిల పక్షం ఢిల్లీకి తీసుకుపోవాలని కేసీఆర్ అసెంబ్లీకి వచ్చి డిమాండ్ చెయ్యాలి
- కేసీఆర్ అసెంబ్లీకి ఎందుకు రావడం లేదు?
- కేసీఆర్ భేదిరించి, బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
- ఈ ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం... భయపెడితే భయపడం.
- మేము కేసీఆర్ లెక్క ఉద్యమం ముసుగులో ప్రభుత్వం ఏర్పాటు చెయ్యలేదు.
- కాళేశ్వరం అంశాన్ని తప్పుదోవ పట్టించాడానికి నల్గొండ సభను కేసీఆర్ పెట్టారు.
- కేసీఆర్ మనస్తత్వం ముందే తెలుస్తే ఈ ప్రతిపక్ష హోదా కూడా ప్రజలు ఇవ్వకపోదురు.
- అధికారం పోగానే మళ్ళీ కేసీఆర్ కు ప్లా్రైడ్ గుర్తుకు వచ్చిందా?
- ప్రపంచ అద్భుత్వం అంటూ న్యూ యార్క్ లో కాళేశ్వరం ప్రాజెక్టు ను చూపించారు
- కేసీఆర్ నల్గొండ లో మాట్లాడటం కాదు - అసెంబ్లీ కి రావాలి
- ఇరిగేషన్ పై రేపు శ్వేతపత్రం పెడతాం... కేసీఆర్ చర్చలో పాల్గొనాలి.
- అన్ని పాపాలకు కారణం కేసీఆర్ మాత్రమే.
- మేడిగడ్డ తప్పిద్దాల్లో కేసీఆర్ భాగస్వయం ఉంది.
- కేసీఆర్ భాగస్వామ్యం ఉంది కాబట్టే అంత నిర్లక్ష్యం గా మాట్లాడుతున్నారు.
- మేడిగడ్డ బ్యారేజ్ ఏ క్షణమైనా కూలిపోయే ప్రమాదంలో ఉంది
- రేపటి శాసన సభ సమావేశాల్లో పాల్గొని తన అనుభవాన్ని చెప్పాలి
- L AND T సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టాలా వద్దా అనేది కసీఆర్ సభలో చెప్పాలి.
- వందల మంది మరణించినా కేసీఆర్ రోడదెక్కలేదు... ఇప్పుడు అధికారం కోసం నల్గొండ జిల్లాకు వెళ్లారు.
- కుర్చీ దిగి 60 రోజులు కాలేదు... అప్పుడే ఓట్లు అడుక్కునే పరిస్థితి వచ్చింది.
- భయం అంటే తెలువని కేసీఆర్ సభకు వచ్చి మాట్లాడాలి.
- నల్గొండ సభకు మహబూబ్ నగర్ నుంచి ప్రజలను తీసుకెళ్లారు.
- కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు పర్యటన కాదు.. కాశి పర్యటన కు వెళ్ళాలి
- వస్తానన్న బీజేపీ MLA లను కిషన్ రెడ్డి అడ్డుకున్నారు.
- బీజేపీ BRS ఒకటే అని మళ్ళీ నిరూపీతం అయింది.
- బీజేపీ BRS చీకటి ఒప్పందం త్వరలోనే బయటపడుతుంది.
- *కేసీఆర్ అవినీతి ని బయటకు తియ్యడానికి బీజేపీ వైఖరి ఏంటో తెలియజేయాలి
కాళేశ్వరం పేరుతో రూ. లక్ష కోట్ల ప్రజాధనం దుర్వినియోగం అయ్యింది: మంత్రి శ్రీధర్ బాబు
- బీఆర్‌ఎస్ నేతలను ఆహ్వానించినా రాలేదు
- వాస్తవాలు తెలుస్తాయనే భయపడుతున్నారు
మేడిగడ్డ చేరుకున్న సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేల బృందం
- మేడిగడ్డ ప్రాజెక్టు కుంగిన పిల్లర్లను పరిశీలిస్తున్న సీఎం, మంత్రులు.
- ప్రాజెక్టు పరిస్థితిపై అధికారులను అడిగి తెలుసుకున్న సీఎం బృందం
- మేడిగడ్డ ప్రాజెక్టుపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్న అధికారులు.
మేడిగడ్డ పర్యటనకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
- అసెంబ్లీ నుంచి 4 ప్రత్యేక బస్సుల్లో సీఎం, మంత్రులు
- మరో గంటన్నరలో మేడిగడ్డకు చేరుకోనున్న సీఎం బృందం
- కాంగ్రెస్ సభ్యులతో కలిసి వెళ్లిన సీపీఐ, ఎంఐఎం ఎమ్మెల్యేలు
- మధ్యాహ్నం 3.30కు మేడిగడ్డ చేరుకోనున్న సీఎం, మంత్రులు
- మేడిగడ్డ ప్రాజెక్టు, కుంగిన పిల్లర్లను సందర్శించనున్న కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం
-
Hon’ble CM Sri. A.Revanth Reddy will participate in Medigadda Barrage site visit, Today https://t.co/o1kwK1stM5
— Telangana Congress (@INCTelangana) February 13, 2024
కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది: రేవంత్ రెడ్డి ట్వీట్
- మేడిగడ్డ కూలి నెలలు గడుస్తున్నా...కేసీఆర్ నోరు మెదపడం లేదు
- రూ. 97 వేల కోట్ల వ్యయం చేస్తే 97 వేల ఎకరాలకు నీళ్లు ఇవ్వలేదు.
- మేడిగడ్డ మరమత్తులకు పనికిరాదు.
తెలంగాణ ప్రజల కష్టార్జితంతో కట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్ ధన దాహానికి బలైంది.
— Revanth Reddy (@revanth_anumula) February 13, 2024
రూ. 97 వేల కోట్లు వ్యయం చేసి…
97 వేల ఎకరాలకు కూడా నీళ్లివ్వలేదని అధికారిక లెక్కలు చెబుతున్నాయి.
ప్రాజెక్టు డిజైన్ నుండి నిర్మాణం వరకు అన్నీతానై కట్టానని చెప్పిన కేసీఆర్,
మేడిగడ్డ కూలి నెలలు… pic.twitter.com/GPGGtBX8Lf
కాళేశ్వరం అంటే మేడిగడ్డ మాత్రమే కాదు: హరీష్ రావు
- మిగతా బ్యారేజీలు కూడా చూడాలి
- రాజకీయ లబ్ది కోసమే కాంగ్రెస్ సర్కార్ మేడిగడ్డ బ్యారేజీ సందర్శన
- బ్యారేజీ పిల్లర్లు కుంగితే ఇష్యూ చేస్తున్నారు
- గత ప్రభుత్వంపై బురద చల్లేందుకు కాంగ్రెస్ ప్రయత్నం
మేడిగడ్డకు బయల్దేరిన సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
- అసెంబ్లీ నుంచి ప్రత్యేక బస్సులో సీఎం, మంత్రులు
- రోడ్డుమార్గాన మేడిగడ్డకు సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు
సీఎం, మంత్రుల రాకతో మేడిగడ్డ పరిసర ప్రాంతాల్లో భారీ బందోబస్తు.
- బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో రాకపోకలపై ఆంక్షలు.
- మేడిగడ్డ సందర్శనకు సీపీఐ, ఎంఐఎం సభ్యులు.
- బీఆర్‌ఎస్, బీజేపీ దూరం.
సాక్షి, హైదరాబాద్: కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మించిన మేడిగడ్డ (లక్ష్మీ) బ్యారేజీని కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల బృందం నేడు సందర్శించనుంది. కాసేపట్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు బస్సుల్లో అక్కడికి వెళ్లనున్నారు. అసెంబ్లీ ప్రాంగణంలో బస్సులు సిద్ధంగా ఉన్నాయి.
అసెంబ్లీ నుంచి బస్సుల్లో నేరుగా మేడిగడ్డకు బయలుదేరి మధ్యాహ్నం 3 గంటల వరకు అక్కడికి చేరుకుంటారు. మధ్యాహ్నం 3.30 నుంచి 5 గంటల వరకు మేడిగడ్డ బ్రిడ్జి, కుంగిన పిల్లర్లను పరిశీలించనున్నారు. సాయంత్రం 5 గంటలకు అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వనున్నారు. 6 గంటలకు సీఎం రేవంత్, మంత్రుల మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నారు. 7 గంటలకు మేడిగడ్డ నుంచి బయలుదేరి.. హైదరాబాద్‌కు తిరుగు పయనం కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment