సాక్షి, హైదరాబాద్: మేడిగడ్డ కుంగుబాటుపై విజిలెన్స్ నివేదిక సిద్ధం చేసింది. వరదలు కారణంగా డ్యామేజ్ జరగలేదని మానవ తప్పిదం వల్లే మేడిగడ్డలో డ్యామేజ్ జరిగిందని విజిలెన్స్ అంచనాకు వచ్చింది. కాంక్రీట్, స్టీల్ నాణ్యత లోపం గుర్తించిన విజిలెన్స్.. ఒకటి నుంచి ఐదో పిల్లర్ వరకు పగుళ్లు ఉన్నట్లు పేర్కొంది. శాంపిల్స్‌ను అధికారులు ల్యాబ్‌కు పంపించారు. 2018 నుంచి మేడిగడ్డలో జరిగిన నిర్మాణంపై శాటిలైట్ డేటాను విజిలెన్స్ అడిగింది. రెండు మూడు రోజుల్లో విజిలెన్స్ చేతికి శాటిలైట్ డేటా రానుంది.
2019లోనే మేడిగడ్డ డ్యామేజ్ అయ్యిందన్న విజిలెన్స్.. ప్రారంభమయ్యాక వచ్చిన మొదటి వరదకే పగుళ్లు వచ్చాయని అనుమానం వ్యక్తం చేస్తోంది. మేడిగడ్డ డిజైన్‌కు, నిర్మాణానికి తేడాలు ఉన్నట్లు విజిలెన్స్ అధికారులు గుర్తించారు.
బ్యారేజ్ ప్రారంభమయ్యాక వచ్చిన మొదటి వరదకే పగుళ్లు బయటపడ్డాయి. పగుళ్లను రిపేర్ చేయాలంటూ వర్షాకాలానికి 10 రోజుల ముందే ఎల్‌అండ్ టీకి లేఖ రాయగా, ఎల్ అండ్ టీ నుంచి ఎలాంటి స్పందన లేదని విజిలెన్స్ గుర్తించింది. ప్రాజెక్టులకు సంబంధించి చాలా రికార్డులు కూడా మాయమయ్యాయని.. తనిఖీ చేసిన నివేదికలు కూడా లేవని విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఇప్పటివరకు మేడిగడ్డ నిర్మాణంపైనే విచారణ జరగ్గా, త్వరలో పంప్ హౌజ్‌లపై కూడా విజిలెన్స్ విచారణ చేపట్టనుంది.
ఇదీ చదవండి: మీ కౌంటర్‌లో పస లేదు!
Comments
Please login to add a commentAdd a comment