
సాక్షి, హైదరాబాద్: గోదావరి జలాల విషయంలో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. శుక్రవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ, తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే.. రేవంత్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సీఎం రేవంత్‌కు ఏపీని ఆపటం చేతకాకుంటే.. అఖిలపక్షాన్ని తీసుకుని పోవాలి. సీఎం రేవంత్ గురుదక్షిణ చెల్లించుకుంటున్నారన్న అనుమానం కలుగుతుందంటూ హరీష్‌రావు వ్యాఖ్యానించారు.
బంకచర్ల ద్వారా 200 టీఎంసీలను ఏపీ తరలించుకుపోతుంటే.. రేవంత్ మౌనంగా ఉండటానికి కారణమేంటి?. ప్రాజక్ట్ నిర్మాణం కోసం నిధులు కేటాయించాలని ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి ఉత్తరాలు రాస్తున్నారు. ఏపీ, కర్ణాటకలు గోదావరి జలాలు తరలించుకుపోతే దావోస్, ఢిల్లీ యాత్రల్లో బిజీగా ఉన్నారు. గోదావరి నీటిని ఏపీ.. తుంగభద్ర నీళ్లను కర్ణాటక తరలించుకుపోతున్నాయి. అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా నీటిని తరలించుకుపోతుంటే సీఎం, ఇరిగేషన్ మంత్రి ఎందుకు స్పందించరు?. ఇరిగేషన్ శాఖమంత్రిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫెయిల్. ఉత్తమ్‌కు చేతనైతే.. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలి’’ అంటూ హరీష్‌రావు డిమాండ్ చేశారు.
‘‘హక్కుగా రావాల్సిన నీటిని కూడా 13 నెలలుగా తెలంగాణ ప్రభుత్వం సాధించలేకపోయింది. ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంకు నుంచి 40వేల కోట్లు ఏపీకి ఇప్పిస్తామని నిర్మలా సీతారామన్ హామీ ఇచ్చారు. తుంగభద్ర నుంచి నీళ్లు రాకుండా కర్ణాటక అడ్డుకుంటోన్న సీఎం స్పందించటం లేదు.’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు.

Comments
Please login to add a commentAdd a comment