
హైదరాబాద్: తాను కేసీఆర్(KCR) క్యాబినెట్ లో ఐదేళ్లు మంత్రిగా చేశానని, మంత్రులకు ప్రగతి భవన్ లోకి ఎంట్రీ లేదని, అందుకు తానే సాక్ష్యమన్నారు మంత్రి జూపల్లి కృష్ణారావు. మంగళవారం సీఎల్పీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడిన జూపల్లి.. ‘ కేసీఆర్ మీటింగుల్లో కేసీఆర్ వచ్చేదాకా ఎవరూ మాట్లాడడానికి అవకాశం ఉండకపోయేది. కేజ్రీవాల్ ఓడిపోవడానికి కారణం ఎవరో అందరికీ తెలుసు. తెలంగాణలో ఆరిపోయింది కాకుండా ఢిల్లీలో అరిపోయారు. సెక్రటేరియట్ కట్టడం తప్పు పట్టడం లేదు కానీ, సెక్రటేరియట్ రాకపోవడం తప్పని ఆనాడే అన్నాను.
అమరవీరుల చిహ్నం, అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి పదేండ్లు పట్టిందా?, బీఆర్ఎస్(BRS) ఓడిపోవడానికి వాళ్ళ స్వయంకృపరాదమే కారణం. కేసీఆర్ పాలన రావాలని తెలంగాణ ప్రజలు తపిస్తున్నట్టు నిన్న ఆయన అనుచరులు ప్రచారం చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో కేసీఆర్ పాత్ర కూడా ఉంది. ఎంతో మంది ప్రాణత్యాగం, ఎంతోమంది పోరాటం, రాజకీయ సంఘర్షణలు తెలంగాణ రాష్ట్రం కోసం జరిగాయి. పది సంవత్సరాల తర్వాత కూడా కేసీఆర్ పాలన కావాలని ఎందుకు కోరుకుంటారు. గడిచిన 65 సంవత్సరాల్లో 18 మంది ముఖ్యమంత్రులు 65 వేల కోట్ల అప్పు చేశారు.
కేసీఆర్ పదేండ్ల అప్పుల పాలన గొప్ప పాలన ఎలా అవుతుంది?, ఆంధ్రవాళ్ళు అంద్రవాళ్ళు అన్న కేటీఆర్(KTR) ఆంధ్రా కాంట్రాక్టర్లకు దోచి పెట్టాడు. పది సంవత్సరాల్లో కేసీఆర్ ఒక్కసారైనా అంబేద్కర్ కి దండ వేశాడా?, ప్రజాస్వామ్యం గురించి మాట్లాడుతున్న కేసీఆర్ ఆనాడు ప్రతిపక్షాలకు సమయం ఇచ్చాడా?, రాష్ట్ర అప్పు 2 లక్షల కొట్లే అని అసెంబ్లీలో కేసీఆర్ అన్నారు. అదే నిజమని అనుకున్నాం. కేసీఆర్ శాసనసభకే రాలేదు. ఆయన పాలన కావాలని కోరుకుంటారు ఏంటి?, కేసీఆర్ వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేశాడు. కేటీఆర్ మాట్లాడితే నవ్వాలో ఏడ్వాలో అర్థం కావడం లేదు
సర్పంచులకి బిల్లులు ఇవ్వడం లేదని అనడానికి కేటీఆర్ కి సిగ్గు ఉందా?, కేసీఆర్ చేసిన పనికి....అప్పు కట్టడానికి అప్పు తేవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ కి వాత పెట్టారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా ప్రజలు కేసీఆర్ కి వాత పెడతారు. కేసీఆర్ ని విమర్శించే అర్హత ఎవరికీ లేదు’ అని జూపల్లి కృష్ణారావు స్పష్టం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment