సాక్షి, ఢిల్లీ: పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ బీఆర్‌ఎస్ పార్టీ (BRS Party).. సుప్రీంకోర్టు(Supreme Court)ను ఆశ్రయించింది. రెండు పిటిషన్లను బీఆర్‌ఎస్ దాఖలు చేసింది. ఏడుగురు ఎమ్మెల్యేల ఫిరాయింపు(Defections)పై రిట్ పిటిషన్ వేసింది. పోచారం, కాలె యాదయ్య, సంజయ్‌కుమార్, కృష్ణమోహన్‌రెడ్డి, మహిపాల్‌రెడ్డి, ప్రకాష్‌గౌడ్, గాంధీలపై రిట్ వేయగా, ముగ్గురు ఎమ్మెల్యేలపై ఎస్‌ఎల్పీ వేసింది. దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరిలపై ఎస్‌ఎల్పీ దాఖలు చేసింది.
పార్టీ ఫిరాయింపులపై స్పీకర్ స్పీకర్ కనీసం ఎమ్మెల్యేలకు నోటీసు ఇవ్వలేదని పిటిషన్‌లో బీఆర్‌ఎస్ పేర్కొంది. స్పీకర్ ఇంకా నిర్ణయం తీసుకోకపోవడంపై బీఆర్‌ఎస్.. సుప్రీంకోర్టును ఆశ్రయించింది. అనర్హత పిటిషన్లపై వెంటనే స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశించాలని బీఆర్‌ఎస్ కోరింది. కాగా, ప్రస్తుతం ఢిల్లీలోనే బీఆర్‌ఎస్ నేత హరీష్‌రావు ఉన్నట్లు సమాచారం.
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై నాలుగు వారాల్లో నిర్ణయం తీసుకోవాలని గత ఏడాది.. స్పీకర్ కార్యాలయానికి హైకోర్టు సూచించిన సంగతి తెలిసిందే. అయితే, మూడు నెలలు గడిచినా స్పీకర్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో ఎమ్మెల్యేల ఫిరాయింపు అంశంపై సుప్రీంకోర్టుకు వెళ్లింది.
2024లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 39 స్థానాల్లో విజయం సాధించగా, ఆ తర్వాత సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే లాస్య రోడ్డు ప్రమాదంలో మృతిచెందింది. ఉప ఎన్నికల్లో సిట్టింగ్ స్థానాన్ని బీఆర్‌ఎస్ పార్టీ కోల్పోయింది. దీంతో పార్టీ బలం 38 మంది ఎమ్మెల్యేలకు తగ్గింది. కాగా.. భద్రాచలం, బాన్సువాడ, ఖైరతాబాద్, స్టేషన్ ఘన్ పూర్, జగిత్యాల, చేవెళ్ల, గద్వాల్, రాజేంద్రనగర్, పటాన్ చెరువు, శేరిలింగంపల్లి అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరారు.
ఇదీ చదవండి: ఫార్ములా కేసులో ఈడీ ముందుకు కేటీఆర్..
Comments
Please login to add a commentAdd a comment