SIDDIPET
-
ఆ మూడు జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం
సిద్దిపేట: మళ్లీ ఎన్నికలు వస్తే అధికారం తమదేనని అంటున్నారు బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్. పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న తరుణంలో రజతోత్సవ సంబరాలకు బీఆర్ఎస్(టీఆర్ఎస్) సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో వరుసగా జిల్లాల ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశమవుతున్నారు. దీనిలోభాగంగా ఈరోజు(శనివారం) ఉమ్మడి మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం జిల్లా నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. సిద్ధిపేట జిల్లా ఎర్రవల్లి ఫాంహౌస్ లో ఈ మూడు జిల్లాల నేతలతో కేసీఆర్ సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా వారితో కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిపోయింది. రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్ల కూడా తగ్గిపోయాయి. రైతులకు ఎలాంటి మేలు జరగడం లేదు. కాంగ్రెస్ సర్కార్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చింది. మళ్లీ ఎన్నికల్లో అధికారం మనదే’ అని కేసీఆర్ శ్రేణులకు ధైర్యం నూరిపోశారు. వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించే భారీ బహిరంగ సభకు ఎలా సన్నద్ధం కావడంపై కేసీఆర్ పార్టీ నాయకులకు వివరించినట్లు తెలుస్తోంది. పార్టీ నాయకులతో పాటు ప్రజలను బహిరంగ సభకు తరలించే అంశాలను ప్రధానంగా చర్చించినట్లు సమాచారం. -
కాంగ్రెస్ సర్కార్ అసమర్థ పాలనతోనే రైతులకు కష్టాలు: హరీష్‌రావు
సాక్షి, సిద్దిపేట: అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను తక్షణమే ఆదుకోవాలని ప్రభుత్వాన్ని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు డిమాండ్ చేశారు. నారాయణరావుపేట మండలం లక్ష్మీదేవి పల్లి గ్రామంలో నిన్న(శనివారం) రాత్రి కురిసిన వర్షాలు, వడగండ్ల కారణంగా దెబ్బతిన్న పంటలను ఆదివారం ఆయన పరిశీలించారు.అనంతరం హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను దగా చేస్తోందన్నారు. రెండు లక్షల రుణమాఫీ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని మండిపడ్డారు. రైతు బంధు రూపంలో కేసీఆర్ రైతులకు నేరుగా సాయం చేశారు. వానా కాలం యాసంగి రైతుబంధు రూ. 15 వేలు వెంటనే విడుదల చేయాలి. పంటల బీమా ఉండే రైతులకు ఇంత నష్టం ఉండేది కాదు. రైతులకు మూడు పంటల బీమా రాలేదు. రుణమాఫీ చేయలేదు ఇచ్చామని.. అబద్ధాలు ఆడుతున్నారు’’ అని కాంగ్రెస్‌పై హరీష్‌రావు మండిపడ్డారు.‘‘రేవంత్ రెడ్డి అన్ని అబద్ధాలు ఆడుతున్నారు. ఎండల వల్ల పంటలు ఎండటం లేదు. కాంగ్రెస్ అసమర్థ పాలన వల్ల నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయి. వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతులను వెంటనే ఆర్థిక సాయం చేసి అందుకోవాలి. వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించాలి’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు. -
బీఆర్ఎస్ నేతలతో భేటీ.. కేసీఆర్ కీలక నిర్ణయం
సాక్షి, సిద్ధిపేట: ఎర్రవెల్లి వ్యవసాయ క్షేత్రంలో బీఆర్ఎస్ నేతలతో కేసీఆర్ సమావేశమయ్యారు. పలు అంశాలపై ఆయన చర్చించారు. ఎమ్మెల్సీగా ఎవర్ని నిలపాలన్న విషయంపై అభిప్రాయాలను కేసీఆర్ తీసుకున్నారు. యాసంగి పంటకు సాగునీరు అందించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడానికి నిర్ణయించారు. హామీల అమలుకై పోరాటాలకు కార్యాచరణ రూపొందించాలని కేసీఆర్ సూచించారు.బహిరంగ సభపై పార్టీ నేతలతో చర్చించిన కేసీఆర్.. ఏప్రిల్ 27న వరంగల్ వేదికగా బీఆర్ఎస్ ఆవిర్భావ సభ నిర్వహించాలని నిర్ణయించినట్లు సమాచారం. కేసీఆర్‌తో బీఆర్ఎస్ నేతల సమావేశం సుదీర్ఘంగా కొనసాగింది. పార్టీ ప్లీనరీ, బహిరంగ సభ, ఎమ్మెల్సీ అభ్యర్థి, అసెంబ్లీ సమావేశాలపై చర్చ జరిగింది. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందన్న కేసీఆర్.. కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందన్నారు. నిత్యం ప్రజల్లో ఉండాలని బీఆర్ఎస్ నేతలను కేసీఆర్ ఆదేశించారు. అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై రేవంత్ సర్కార్‌ను నిలదీయాలని కేసీఆర్ సూచించారు. -
వాష్‌రూంలో టూత్‌బ్రష్.. మీ పళ్లు మటాష్!!
‘మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా?’.. అంటూ వచ్చే టీవీ యాడ్‌ను చూసే ఉంటారుగా.. దృఢమైన దంతాలు, చిగుళ్ల కోసం ఉప్పున్న తమ పేస్ట్‌నే వాడాలంటూ ఓ ప్రముఖ టూత్‌పేస్ట్ కంపెనీ చేసుకొనే ప్రచారం అది. మరి మీ టూత్‌బ్రష్‌లు వాష్‌రూంలో ఉంటాయా? బ్రష్ చేసుకొని తిరిగి వాటిని అక్కడే ఉంచుతారా? అయితే మీకు పంటి సమస్యలు తప్పవని తాజా అధ్యయనం తేల్చిచెబుతోంది!! సాక్షి, సిద్దిపేట: దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే సరైన టూత్‌పేస్ట్‌ను ఎంపిక చేసుకోవడం ఒక్కటే సరిపోదని.. టూత్‌బ్రష్‌లను సరైన చోట ఉంచడం కూడా ముఖ్యమని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు చేపట్టిన పరిశోధన తేల్చిచెబుతోంది. టూత్‌బ్రష్‌లపై ప్రధానంగా మూడు రకాల బ్యాక్టీరియాలు ఉంటున్నాయని.. బ్రష్‌ల వినియోగంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే అనారోగ్యాలకు గురికావాల్సి వస్తుందని హెచ్చరిస్తోంది. వాష్‌రూంలలో ఉంచితే అంతే.. అటాచ్డ్ వాష్‌రూంలు ఉన్న ఇళ్లలో నివసించే వారిలో చాలా మంది తమ టూత్‌బ్రష్‌లను భద్రపరుస్తుండటం సహజమే. అయితే అలా వినియోగిస్తున్న టూత్‌బ్రష్‌లపై భారీగా సూక్ష్మజీవులు పేరుకుపోతున్నాయని సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థుల అధ్యయనంలో తేలింది. టూత్ బ్రష్‌లను వాష్‌రూంలో ఉంచడం వల్ల ఫ్లష్ చేసిన ప్రతిసారీ కమోడ్ నుంచి నీటితుంపర్లు ఎగిరిపడతాయని.. తద్వారా కమోడ్‌లో ఉండే బ్యాక్టీరియా నీటితుంపర్ల ద్వారా గాల్లో వ్యాపిస్తూ అక్కడ ఉండే బ్రష్‌లపైకి ఎక్కువగా చేరుతున్నాయని నిర్ధారణ అయింది. అదే వాష్‌రూంకు దూరంగా, కాస్త గాలి, ఎండ తగిలే చోట టూత్‌బ్రష్‌లను ఉంచిన చోట సూక్ష్మక్రిములు నశిస్తున్నట్లు పరిశోధనలో వెల్లడైంది. అలాగే ఇంట్లోని అందరి టూత్‌బ్రష్‌లను కూడా ఒకే దగ్గర పెట్టడం అంత సురక్షితం కాదని నిరూపితమైంది. 45 రోజులపాటు సాగిన పరిశోధన టూత్ బ్రష్‌ల శుభ్రత, సూక్ష్మక్రిముల నుంచి సంరక్షణ అనే అంశంపై సిద్దిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైక్రోబయాలజీ విభాగం ఆధ్వర్యంలో ద్వితీయ, తృతీయ సంవత్సరం విద్యార్థులు పరిశోధన చేపట్టారు. కళాశాల సూక్ష్మ జీవశాస్త్ర ఇన్చార్జి, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మదన్ మోహన్ పర్యవేక్షణలో 45 రోజులపాటు పరిశోధన చేశారు. కళాశాలకు చెందిన విద్యార్థులు, ఆధ్యాపకులు వినియోగిస్తున్న టూత్‌బ్రష్‌ల నుంచి 100 నమూనాలను శ్వాబ్‌ల ద్వారా సేకరించారు. వాటిలో బ్యాక్టీరియా ఉందా? ఉంటే ఏయే రకాల సూక్ష్మక్రిములు ఉన్నాయనే దానిపై పరిశోధన చేపట్టారు. మూడు రకాల బ్యాక్టీరియాల గుర్తింపు శాంపిల్స్ సేకరించిన టూత్బ్రష్లలో ప్రధానంగా మూడు రకాల బ్యాక్టీరియాలు ఉన్నట్లు విద్యార్థులు గుర్తించారు. స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ రకం బ్యాక్టీరియా 50 శాతం, స్టెఫైలోకోకస్ ఆర్‌యస్ 40 శాతం, ఎస్చెరిషియా కోలి (ఈ–కొలి) బ్యాక్టీరియా 20 శాతం ఉన్నట్లుగా తేల్చారు. పిప్పిపళ్లు, దంతాల క్షీణత, అరుగుదలకు స్ట్రెప్టోకోకస్ మ్యుటాన్స్ బ్యాక్టీరియా కారణమవుతుందని చెప్పారు. అలాగే స్టెఫైలోకోకస్ ఆర్‌యస్ వల్ల గొంతు సమస్యలు, మౌత్ అల్సర్, ఈ–కోలి బ్యాక్టీరియా వల్ల జీర్ణసంబంధ సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందన్నారు.యూవీ లైట్‌తో బ్యాక్టీరియా మాయంబ్యాక్టీరియా ఉన్న బ్రష్‌లను ఆయా విద్యార్థులు సొంతంగా తయారు చేసిన యూవీ లైట్బాక్స్లో పెట్టి పరీక్షించగా వాటిపై ఎలాంటి క్రిములు లేవని తేలింది. టూత్ బ్రష్‌లను వినియోగించే ముందు యూవీ లైట్ బాక్స్‌లో 5 నుంచి 10 నిమిషాలపాటు ఉంచడం ద్వారా బ్రష్ శానిటైజ్ అవుతుందన్నారు. మరోవైపు ఒకవేళ బ్రష్‌లను ఒకేచోట పెట్టాల్సి వస్తే వాటికి క్యాప్‌లను పెట్టాలని ఈ ప్రయోగంలో పాలుపంచుకున్న విద్యార్థులు సూచిస్తున్నారు. ప్రతిరోజూ వేడినీటితో బ్రష్‌ను శుభ్రం చేశాకే వాడాలని.. మూడు నెలలకోసారి టూత్ బ్రష్‌ను తప్పనిసరిగా మార్చాలని చెబుతున్నారు. ప్రజలకు అవగాహన కల్పించేందుకే ప్రిన్సిపాల్ సునీత సూచనలతో సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మదన్మోహన్ పర్యవేక్షణలో టూత్‌బ్రష్‌ల శుభ్రత, సూక్ష్మక్రిముల నుంచి సంరక్షణపై పరిశోధన చేశాం. ప్రజలకు అవగాహన కల్పించాం. యూవీ బాక్స్‌ను సైతం తయారు చేశాం. – విద్యార్థినులు.. మౌనిక, షారోన్, నాగలక్ష్మి, సిద్ద, స్నేహ, సుష్మిత ప్రభుత్వ జిజ్ఞాస పోటీలకు పంపుతాం.. ప్రతి సంవత్సరం ఏదో ఒక అంశంపై పరిశోధన చేస్తాం. రాష్ట్ర స్థాయిలో ప్రభుత్వం నిర్వహించే జిజ్ఞాస పోటీలకు పంపిస్తున్నాం. టూత్ బ్రష్‌ల ద్వారా బ్యాక్టీరియా వ్యాప్తి చెందుతోందన్న విషయమై ప్రజలకు అవగాహన కల్పించేందుకు పరిశోధన చేపట్టాం. – డాక్టర్ మదన్ మోహన్, సూక్ష్మజీవశాస్త్ర విభాగాధిపతి -
పట్నాల మల్లన్నకు పదివేల దణ్ణాలు
తెలంగాణలోని ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటైన సిద్దిపేట జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. భక్తులు కోరిన కోర్కెలు తీర్చే కొంగు బంగారంగా విరాజిల్లుతోంది. మల్లికార్జున స్వామి ఆయన సతీమణులు లింగ బలిజల ఆడబిడ్డ అయిన బలిజ మేడలమ్మ, యాదవుల ఆడబిడ్డ అయిన గొల్లకేతమ్మలు నిత్యం పూజలందుకుంటున్నారు. ప్రతీ యేడాది మూడు నెలల పాటు జాతర జరుగుతుంది. రెండు పద్దతుల్లో స్వామి వారికి కళ్యాణం నిర్వహిస్తారు. మార్గశిర మాసం చివరి ఆదివారం వీరశైవ ఆగమ పద్దతి ప్రకారం స్వామి వారి కళ్యాణం, మహాశివరాత్రి సందర్బంగా యాదవ సాంప్రదాయం ప్రకారం స్వామి వారి కళ్యాణం నిర్వహించనున్నారు. జనవరి 19 నుంచి మార్చి 24వ తేదీ వరకు తెలుగురాష్ట్రాలతో పాటు ఒడిశా, చత్తీస్çగడ్, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలి రానున్నారు. పది ఆదివారాలు జాతర వారాలుగా నిర్వహిస్తారు. ఇదే విధంగా తెలంగాణలో ఐనవోలు, ఓదెలలో సైతం ఇదే విధంగా పట్నాలు వేసి మొక్కులు చెల్లించుకోవడం కొన్ని సంవత్సరాలుగా కొనసాగుతున్న ఆనవాయితీ.కొమురవెల్లి మల్లన్నకు ప్రకృతి సిద్దమైన ఐదు రంగులను ఉపయోగించి పట్నం వేస్తారు. ఇందుకోసం పసుపు, కుంకుమ, గులాబీరంగు(బుక్క గులాల్), ఆకుపచ్చ పొడి (తంగేడు, చిక్కుడు ఆకులను ఎండబెట్టి పొడి చేస్తారు) తెల్ల పిండి (బియ్యం పిండి)ని వాడుతారు. పట్నాలు వేసేందుకు పసుపు, కుంకుమ, భక్తులు బస చేసిన ప్రాంతాల్లో వేసేది చిలక పట్నం. ఆలయంలోని గంగిరేణి చెట్టు వద్ద వేసేది నజర్ పట్నం. ఆలయం లోపల వేసేది ముఖ మండప పట్నం. మల్లన్నకు ప్రతి ఏడాది లేదా రెండు లేదా మూడేండ్లకు ఒకసారి పట్నాలు వేసి భక్తులు మొక్కులు చెల్లించుకుంటారు. మహాశివరాత్రి సందర్బంగా కొమురవెల్లిలోని తోట బావి దగ్గర పెద్ద పట్నం వేస్తారు. ఈ పెద్ద పట్నం 41 వరుసలతో దాదాపు 50 గజాల్లో వేస్తారు. జానపద రూపాల్లో ఒగ్గు పూజారులు కథను చెబుతూ పట్నం వేస్తారు. పట్నంలోకి మల్లికార్జునుడిని ఆహ్వానించి కల్యాణం చేసి తమ కోరికలను విన్నవించుకుంటారు. నుదుటిన బండారి పెట్టి కంకణాలు కట్టి ఒగ్గు పూజా కతువు నిర్వహిస్తారు. అలాగే స్వామివారి చరిత్రను సైతం వివరిస్తుంటారు. కొందరు ఇంటి వద్ద సైతం మల్లన్న పట్నాలు వేసి ఓ పండుగ లాగ బంధువులను పిలిచి చేస్తారు.పట్నంలో ఒకే కొమ్ము ఉన్న శూలంపెద్ద పట్నం వేసే ముందు ఒగ్గు పూజారులు తమ ఆచారం ప్రకారం గర్భాలయంలోని మూల విరాట్‌కు పట్టువస్త్రాలను సమర్పిస్తారు. స్వామివారిని పల్లకిలో ఊరేగింపుగా తీసుకువెళ్లి, కోనేట్లో స్నానం ఆచరింపజేస్తారు. పట్నం వేసే ప్రదేశంలో సుంకు పట్టిన తర్వాత, గొంగళిలో బియ్యం పోసి మైలపోలు తీస్తారు. స్వామివారు ధరించే ఒకటే కొమ్ము ఉన్న శూలం (ఒరగొమ్ము), డమరుకాన్ని నెలకొల్పుతారు. పసుపు, కుంకుమ, తెల్ల పిండి, సునేరు, పచ్చ రంగులను ప్రమథ గణాలుగా సమ్మిళితం చేసి, నిమ్మకాయతో చిత్ర కన్ను నెలకొల్పి శివలింగాన్ని చిత్రిస్తారు. రకరకాల డిజైన్లతో సర్వాంగ సుందరంగా పట్నాన్ని తీర్చిదిద్దుతారు.పట్నం దాటడం....ఆ తర్వాత ఉత్సవ విగ్రహాలను తీసుకొని పట్నం పై పెట్టి పూజారులు పూజలు నిర్వహిస్తారు. తర్వాత.. శివసత్తులు పట్నం దాటుతారు.. ఈ వేడుకను చూసేందుకు, పట్నం ముగ్గుపొడిని సేకరించుకొనేందుకు భక్తులు పోటీ పడతారు. ఈ ముగ్గును పొలాల్లో చల్లితే పంటలు బాగా పండుతాయని నమ్ముతారు. పట్నాల మొక్కుల తర్వాత భక్తులు అగ్ని గుండాల కార్యక్రమంలో నిప్పుల మీద నడుస్తారు. అనంతరం స్వామివారిని దర్శించుకుంటారు.– గజవెల్లి షణ్ముఖ రాజుసాక్షి, సిద్ధిపేట -
వెయ్యి పడకలేనా!
సిద్దిపేటలో చేపట్టిన వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణ పనులు పూర్తికాకపోవడంతో రోగులు పూర్తిస్థాయి వైద్య సేవలకు నోచుకోలేకపోతున్నారు. వెయ్యి పడకల ప్రభుత్వాసుపత్రి భవనంలో మౌలిక వసతులు కల్పించకపోవడం, అవసరమైన వైద్యులు, సిబ్బందిని నియమించకపోవడంతో ప్రజలకు వైద్య సేవలు అందడం లేదు. దీంతో పేద ప్రజలు చికిత్స నిమిత్తం హైదరాబాద్ వంటి దూర ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారు. - సిద్దిపేట కమాన్అప్పటి సీఎం కేసీఆర్‌తో ప్రారంభం సిద్దిపేట అర్బన్ మండలం ఏన్సాన్పల్లి గ్రామ శివారులో రూ.324 కోట్ల అంచనా వ్యయంతో వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి భవన నిర్మాణానికి అప్పటి సీఎం కేసీఆర్ 2020 డిసెంబర్లో శంకుస్థాపన చేశారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మాజీ ఆర్థిక, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు సంబంధిత అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్ష నిర్వహిస్తూ భవన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేశారు. ఐదు అంతస్తులతో ప్రజలకు అన్ని రకాల వైద్య సేవలు ఒకేచోట అందుబాటులోకి తెచ్చేలా భవనాన్ని నిర్మించారు. మొదట ఆసుపత్రిలోని గ్రౌండ్ ఫ్లోర్లో డెంటల్ విభాగాన్ని అందుబాటులోకి తెచ్చారు. వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రిని మాజీ మంత్రి హరీశ్‌రావు 2023 అక్టోబర్‌లో ప్రారంభించారు. నిధుల్లేక ముందుకు సాగని పనులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అనంతరం నిధులు కేటాయించకపోవడంతో ప్రభుత్వాసుపత్రి పెండింగ్ పనులు ముందుకు సాగడం లేదు. ప్రస్తుతం సిద్దిపేట ప్రభుత్వ వైద్య కళాశాలకు అనుబంధంగా.. 300 పడకలతో ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కొనసాగుతోంది. వెయ్యి పడకల ప్రభుత్వాసుపత్రి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే.. పేద ప్రజలకు అన్ని విభాగాల్లో మరింత మెరుగైన వైద్య సేవలు అందనున్నాయి. త్వరలో డెంటల్ విభాగం మూసివేత? ప్రస్తుతం వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్‌లోని డెంటల్ విభాగంలో వైద్య సేవలు అందిస్తున్నారు. గ్రౌండ్ ఫ్లోర్లో ఓపీడీ సాధారణ శస్త్ర చికిత్స, ఓపీడీ ఆర్థోపెడిక్, బ్లడ్ శాంపిల్స్ సేకరణ, అత్యవసర విభాగం, ఫార్మసీ విభాగాలను, మొదటి అంతస్తులో ఓపీడీ కన్ను, ఓపీడీ చెవి, ముక్కు, గొంతు, డయాలసిస్ వార్డు, క్యాథ్‌ల్యాబ్, రెండో అంతస్తులో క్షయ, ఛాతీవ్యాధి వార్డు, డీవీఎల్ వార్డు, జనరల్ వార్డులను ఏర్పాటు చేశారు. రూ.లక్షల విలువైన పరికరాలను సైతం భవనంలోని అందుబాటులోకి తీసుకొచ్చారు. కానీ మౌలిక వసతులు ఏర్పాటు చేయకపోవడం, సిబ్బందిని నియమించకపోవడం, మెషీన్లను ఏర్పాటు చేయకపోవడంతో భవనం ప్రారంభోత్సవానికే పరిమితమైంది. డెంటల్ విభాగంలో సహాయకులుగా, సెక్యూరిటీ, శానిటేషన్ సిబ్బంది మొత్తం 20 మంది విధులు నిర్వహిస్తున్నారు. వీరికి ప్రభుత్వాసుపత్రి ఫండ్ ద్వారా జిల్లా కలెక్టర్ ప్రతి నెల వేతనాలు చెల్లిస్తున్నారు. కాగా, బడ్జెట్ లేనందున వచ్చే నెల నుంచి వీరికి వేతనాలు చెల్లించలేమని ఉన్నతాధికారులు స్పష్టం చేసినట్టు సమాచారం. దీంతో సంబంధిత ఏజెన్సీ నిర్వాహకులు.. వేతనాలు చెల్లించలేమని.. విధులకు రావద్దని శానిటేషన్, సెక్యూరిటీ సిబ్బందికి సూచించినట్టు సమాచారం. ప్రస్తుతం కొనసాగుతున్న డెంటల్ విభాగాన్ని సైతం మూసివేసి ఫిబ్రవరి మొదటివారంలో భవనాన్ని మూ సివేయనున్నట్లు వి శ్వసనీయ సమాచారం. దీనికి ప్రధాన కారణం నిధులు, బడ్జెట్ కొరతని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. బడ్జెట్ కేటాయించి వెయ్యి పడకల ప్రభుత్వ ఆసుపత్రిని అందుబాటులోకి తీసుకురావాలని కోరుతూ కలెక్టర్, డీఎంఈ, రాష్ట్ర హెల్త్ సెక్రటరీలకు ఇప్పటికే వినతి పత్రాలు అందజేసినట్టు ప్రభుత్వ ఆసుపత్రి ఆర్ఎంవో ప్రవీణ్ తెలిపారు. ప్రభుత్వ పరిధిలోది..వెయ్యి పడకల ప్రభు త్వ ఆసుపత్రి భవనాన్ని అందుబాటులోకి తీసుకురావడం ప్రభుత్వ పరిధిలోని అంశం. రాష్ట్ర ప్రభుత్వం, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విధులు నిర్వహిస్తున్నాం. త్వరలోనే ఆస్పత్రిని అందుబాటులోకి తీసుకొస్తాం. - డాక్టర్ విమలాథామస్, సిద్దిపేట -
ఇదేనా రైతురాజ్యం: హరీష్‌రావు
సిద్దిపేట జిల్లా: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్‌రావు మరోసారి ధ్వజమెత్తారు. రైతులకు అది చేస్తా.. ఇది చేస్తాం అని రైతులను ముంచాడన్నారు. ఈరోజు(ఆదివారం) సిద్ధిపేట ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో హరీష్ మీడియా సమావేశంలో పాల్గొన్నారు. ‘ తెలంగాణ సీఎం రేవంత్.. రైతులను ముంచుండు, మోసం చేసిండు, ఇదే విషయంలో కాంగ్రెస్ నాయకుల్ని గ్రామాల్లో నిలదీస్తున్నారు. రాహుల్ గాంధీ చెప్పిన హామీని కూడా నిలబెట్టుకోలేదు.. చర్చకు సిద్ధం.ఎకరాకు రూ. 9 వేలు ఎగబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఎకరానికి రూ. 15 వేలు ఇచ్చే వరకూ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను నిలదీయండి. రేవంత్‌రెడ్డి మూడు పంటలకు రైతుబంధు ఇస్తానని చెప్పి.. కౌలు రైతులకు ఎందుకు ఇవ్వడం లేదు.గొంతు మూగబోయింది. ఇదేనా రైతు రాజ్యం.. కౌలు రైతు రైతుబంధు ఎగబెట్టినందకుకు పాలాభిషేకం చేయాలా?, కాంగ్రెస్ నాయకులను ఎక్కడికక్కడ నిలదీయాలి. ఎన్నికలు అప్పుడు మాటలు కోటలు దాటాయి.. ఇప్పుడు కోతలు పెడుతున్నారు. ఒక ఎకరం భూమి ఉన్నా వ్యవసాయ కూలీలుగా గుర్తించాలి. వారికి రూ. 12వేలు ఇవ్వాలి. ఐదు గంటలు ఉంటే వ్యవసాయ కూలీలకు ఇచ్చే పథకం వర్తించక నష్టపోతున్నారు. ఇదేమీ పథకం. మెడకాయ మీద తలకాయ ఉన్నవాడు ఇలా చేస్తాడా, మట్టి పనికి పోయే ఒక కోటి మందికి వ్యవసాయ కూలీ పథకం ఇవ్వాలి. చాలా మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రేవంత్‌రెడ్డి రుణమాఫీ అయిపోయిందని సంకలు గుద్దుకుంటున్నారు. దీనికి సమాధానం చెప్పాలి. కనపడ్డ దేవుళ్ల మీద ఒట్టు పెడితివి. లక్ష రుణమాఫీ ఉన్న రైతులకు కూడా కాలేదు. నారాయణ ఖేడ్ రైతు భీముని అంజయ్య రుణమాఫీ కాలేదు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. రేవంత్‌రెడ్డిని అడిగితే గూండాలను నా ఇంటికి మీదకి పంపుతాడు. పంటల బీమా పథకం అటకెక్కింది. రూ. 15 వేల కోట్లు ఇంకా రుణమాఫీ పెండింగ్‌లో ఉంది. ఏ ముఖం పెట్టుకుని పాలాభిషేకం చేయమంటారు’ అని ప్రశ్నించారు హరీష్.అందుకే ఈ దాడులు..అన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి. అన్ని రంగాల్లో ప్రజలు దృష్టి మరల్చడానికి నా కార్యాలయం మీద, కేటీఆర్, అల్లు అర్జున్ మీద దాడులు చేస్తోంది. రేవంత్‌రెడ్డి హింస రాజకీయాలను ప్రోత్సహిస్తోంది. శాంతి భద్రతల సమస్యను రేవంత్‌రెడ్డి సృష్టిస్తున్నారు. శాంతి భద్రతల సమస్యను రేవంత్ సృష్టిస్తున్నారు’ అని విమర్శించారు. -
సిద్దిపేటలో విషాదం.. కానిస్టేబుల్ ఫ్యామిలీ ఆత్మహత్యాయత్నం
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. పోలీస్ కానిస్టేబుల్ బాలకృష్ణ తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. ఈ క్రమంలో బాలకృష్ణ మృతిచెందగా.. భార్య, పిల్లలు ప్రాణాల కోసం ఆసుపత్రిలో పోరాడుతున్నారు.వివరాల ప్రకారం.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కలకుంట కాలనీలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. 17వ బెటాలియన్ చెందిన ఏఆర్ కానిస్టేబుల్ బాలకృష్ణ.. తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా ఆత్మహత్యాయత్నం చేసుకున్నాడు. వారందరికీ ముందు పురుగుల మందు ఇచ్చిన తర్వాత తాను ఉరివేసుకుని బాలకృష్ణ ఆత్మహత్య చేసుకున్నాడు.ఈ క్రమంలో బాలకృష్ణ మృతిచెందాడు. పురుగుల మందు తాగిన ఆయన భార్య, పిల్లలను స్థానికులు గుర్తించడంతో వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారి ఆరోగ్యం విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే, వీరి ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న వన్ టౌన్ పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు. -
కొమురవెల్లి మల్లికార్జునస్వామి మూలవిరాట్ దర్శనాలు నిలిపివేత
-
సిద్దిపేట ‘శిల్ప’విలాపం!
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో పర్యాటక కేంద్రంగా సిద్దిపేట ఇప్పటికే ప్రసిద్ధి చెందింది. అయితే దీనికి పర్యాటకంగా మరిన్ని సొబగులు అద్దేందుకు గత ప్రభుత్వం నిధులు కేటాయించింది. కోమటి చెరువు దగ్గర శిల్పారామం, నెక్లెస్‌రోడ్ పనుల పూర్తి, రంగనాయకసాగర్ దగ్గర పర్యాటకులను ఆకట్టుకునే విధంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించారు. కానీ ఆ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. సంవత్సరం నుంచి ముందుకు సాగడం లేదు. పిల్లర్ల దశలోనే కాటేజీలుచిన్నకోడూరు మండలం చంద్లాపూర్‌లో 3 టీంఎంసీల సామర్థ్యంతో నిర్మించిన రంగనాయకసాగర్ రిజర్వాయర్‌ను టూరిజం స్పాట్‌గా తయారు చేసేందుకు రూ.100 కోట్లను గత ప్రభుత్వం కేటాయించింది. నీటిలో తేలియాడే కాటేజీలు, వాటర్ షోలు, పెద్ద బంకెట్ హాల్ వంటి ఎన్నో నిర్మాణాలు చేపట్టేందుకు ప్రణాళికలు రూపొందించారు.కాటేజీల నిర్మాణం పనులు పిల్లర్ల దశలోనే నిలిచి పోయాయి. ఇప్పటికే రంగనాయకసాగర్‌ను చూసేందుకు దేశం నలుమూలల నుంచి పర్యాటకులు వస్తున్నారు. ఈ పనులు పూర్తయితే మరింత అభివృద్ధి చెందుతుందని పర్యాటకులు, ప్రజలు ఎదురు చుస్తున్నారు. 10 ఎకరాల్లో శిల్పారామం కోమటి చెరువు సమీపంలో దాదాపు 10 ఎకరాల విస్తీర్ణంలో రూ.23 కోట్లతో శిల్పారామం ఏర్పాటుకు శ్రీకారం చుట్టారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునేందుకు వీలుగా అలాగే చేనేత హస్తకళా ప్రదర్శన, పలు కుల వృత్తులకు చేయూతనందించేందుకు పనులను ఏప్రిల్, 2023లో ప్రారంభించారు. శిల్పారామం పనులు డిసెంబర్ 2023 వరకు వేగంగా సాగాయి. తర్వాత అర్ధంతరంగా నిలిచిపోయాయి. క్రాఫ్ట్, మ్యూజియం, ఆర్ట్ గ్యాలరీ ఇలా అన్ని రకాలు ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు రూపొందించారు. నిలిచిన ఆర్టిఫిషియల్ బీచ్ సిద్దిపేట శిల్పారామంలో ఆర్టిఫిషియల్ బీచ్ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. బీచ్ నిర్మాణం పూర్తయితే సముద్రం బీచ్ దగ్గర పొందే అనుభూతి సిద్దిపేటలో లభిస్తుందని పర్యాటకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ ఆ పనులు కూడా నిలిచిపోయాయి. అలాగే కోమటి చెరువు నెక్లెస్‌రోడ్ పూర్తి నిర్మాణం కోసం రూ.15 కోట్లను కేటాయించారు. ఆ పనులూ ఆగిపోయాయి. సిద్దిపేటలో మహతి ఆడిటోరియం కోసం రూ.50 కోట్లను మంజూరు చేశారు. ఈ నిధుల మంజూరును కూడా ప్రభుత్వం రద్దు చేసింది. ఇప్పటికైనా మంత్రులు స్పందించి ని«ధులు మంజూరు చేసి పనులు వేగంగా పూర్తయ్యే విధంగా కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు. కాంట్రాక్టర్లు తప్పుకున్నారు పలు పనులకు సంబంధించిన పాత కాంట్రాక్టర్లు తప్పుకున్నారు. పనులు జరుగుతుంటే రన్నింగ్ బిల్లులు రాకపోవడంతో పనులను మధ్యలోనే నిలిపివేశారు. అలాగే కాంట్రాక్టర్ అగ్రిమెంట్ సమయం కూడా ముగిసింది. – నటరాజ్, డీఈ, పర్యాటక శాఖ -
TG: హిట్ అండ్ రన్.. ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి
సాక్షి, గజ్వేల్: తెలంగాణలో మరో హిట్ అండ్ రన్ కేసు వెలుగు చూసింది. ఈ ప్రమాదంలో ఇద్దరు కానిస్టేబుల్స్ మృతి చెందారు. మృతిచెందిన కానిస్టేబుళ్లను పరందాములు, వెంకటేశ్‌గా గుర్తించారు.వివరాల ప్రకారం.. సిద్దిపేట-జాలిగామ బైపాస్‌లో ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో ఇద్దరు కానిస్టేబుళ్లు మృతిచెందారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన కానిస్టేబుళ్లను పరందాములు, వెంకటేశ్‌గా గుర్తించారు. వీరిలో పరందాములు రాయపోలు పీఎస్‌లో, వెంకటేశ్ దౌల్తాబాద్ పీఎస్‌లో విధులు నిర్వహిస్తున్నారు. అయితే, వీరిద్దరూ మారధాన్ కోసం వెళ్తున్నట్టు తెలిసింది. -
కోకాకోలా ఫ్యాక్టరీ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి
సిద్దిపేట(తెలంగాణ)లోని బండ తిమ్మాపూర్‌లో 'హిందూస్థాన్ కోకాకోలా బెవరేజెస్' (HCCB) గ్రీన్‌ఫీల్డ్ ఫ్యాక్టరీని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మంత్రులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖతో పాటు.. హెచ్‌సీసీబీ సీఈఓ జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ మొదలైనవారు పాల్గొన్నారు.49 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఈ ఫ్యాక్టరీ నిర్మాణానికి మొత్తం రూ.2,091 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఇందులో రూ.1,409 కోట్లు ఇప్పటికే ఉపయోగించినట్లు తెలుస్తోంది. ఇది పూర్తయిన తరువాత 410 మందికి ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఇప్పటికే సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో కూడా ఓ హెచ్‌సీసీబీ కర్మాగారం ఉంది. మొత్తం మీద రాష్ట్రంలో హెచ్‌సీసీబీ తన ఉనికిని వేగంగా విస్తరిస్తోంది.హెచ్‌సీసీబీ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలో వ్యాపార వృద్ధికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టించడానికి మేము కట్టుబడి ఉన్నాము. ప్రపంచ పారిశ్రామిక పెట్టుబడులకు తెలంగాణ కేంద్రంగా నిలుస్తోందనటానికి హెచ్‌సీసీబీ పెట్టుబడులు ఓ ఉదాహరణ. హెచ్‌సీసీబీని మేము అభినందిస్తున్నాము. తెలంగాణ ఆర్థిక అభివృద్ధికి ఈ సంస్థ దోహదపడమే కాకుండా ఉద్యోగాలను కూడా సృష్టిస్తుందని అన్నారు.హిందుస్థాన్ కోకా కోలా బెవరేజెస్ సీఈఓ జువాన్ పాబ్లో రోడ్రిగ్జ్ పెట్టుబడుల గురించి మాట్లాడుతూ.. కంపెనీ వృద్ధి చెందే ప్రయాణంలో ఇది ఒక ముఖ్యమైన అడుగు. ఫ్యాక్టరీ కార్యకలాపాలకు కావలసిన సహాయ సహకారాలను రాష్ట్ర ప్రభుత్వం అందించిందని అన్నారు. -
చైతన్య లహరి
చదువులో ‘శభాష్’ అనిపించుకున్న లహరి చదువే ప్రపంచం అనుకోలేదు. సమకాలీన సమాజం నుంచి కూడా ఎన్నో విషయాలను పాఠాలుగా నేర్చుకుంటోంది. విద్యార్థి దశ నుంచే సామాజిక స్పృహతో ముందడుగు వేస్తోంది.‘మన కోసం మనమే కాదు ఇతరుల కోసం మనం’ అనే స్పృహతో రకరకాల సామాజిక సేవా కార్యక్రమాల్లో భాగం అవుతున్న సిద్దిపేట జిల్లా తడకపల్లికి చెందిన బండోజీ లహరి బ్యాంకాక్‌లో జరిగిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సులో ప్రసంగించింది...‘ఇది ఆడవాళ్లకు సాధ్యం కాదు’ అనే మాట ఎన్నోచోట్ల విన్నది లహరి. ‘ఎందుకు సాధ్యం కాదు?’ అని ధైర్యంగా అడిగే వయసు కాదు. అయితే చిన్న వయసులోనే రకరకాల సందర్భాలలో శక్తిమంతమైన మహిళల గురించి విన్న లహరికి ‘మహిళలకు సాధ్యం కానిది లేదు’ అనే సత్యం బోధపడింది.‘ప్రతిభావంతులతో పోటీ పడితే మనలోని ప్రతిభ కూడా మెరుగుపడుతుంది’ అనే పీటీ ఉష మాట ప్రభావంతో ఆటలపై ఆసక్తి పెంచుకుంది. ఎన్నో ఆటల్లో భాగం అయింది.మదర్ థెరెసా గురించి విన్నప్పుడల్లా ఆమె చేసిన అపారమైన సేవా కార్యక్రమాలలో ఏ కొంచెం చేసినా జీవితం ధన్యం అయినట్లే అనుకునేది. ‘ఇతరుల కోసం జీవించని జీవితం జీవితం కాదు’ అనే మదర్ మాట లహరి మనసులో నాటుకుపోవడమే కాదు సామాజికసేవా కార్యక్రమాలపై ఆసక్తి పెంచుకునేలా చేసింది. కరాటే...కిక్ బాక్సింగ్బాసర ట్రిపుల్‌ఐటీలో ఆర్జీయూకేటీలో ఈసీఈ ఫైనలియర్ చదువుతోంది లహరి. ఎప్పుడూ ఏదో నేర్చుకోవాలనే తపనతో ఉండే లహరి కరాటేలో బ్లాక్‌బెల్ట్ సాధించింది. కిక్ బాక్సింగ్‌లో ప్రాపావీణ్యం సాధించింది. ‘ఖేలో ఇండియా’లో ఉషూ ప్లేయర్‌గా సత్తా చాటింది.అత్యవసరంగా రక్తం అవసరమున్నవారికి సహాయం అందించేందుకు సిద్ధిపేటలో ‘లహరి బ్లడ్ ఫౌండేషన్ ’ ఏర్పాటు చేసింది. మిత్రులతో కలిసి రక్తదానాలు చేయడం, చేయించేలా ప్రోత్సహించడం చేస్తోంది. కోవిడ్ టైమ్‌లోనూ రిస్క్ తీసుకుని సేవలందించింది. తాను నేర్చుకున్న ఆత్మరక్షణ విద్యలను విద్యార్థినులకు నేర్పిస్తోంది. బాసర ఆర్జీయూకేటీలోనూ స్టూడెంట్ గవర్నింగ్ కౌన్సిల్ (ఎస్జీసీ) కౌన్సిల్ మెంబర్‌గా ఉంది. ట్రిపుల్ ఐటీలో ఆపదలో ఉన్న విద్యార్థులకు అండగా నిలిచేందుకు ఏర్పాటు చేసిన ఈ ‘హోప్హౌజ్ ఫౌండేషన్’’ కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటోంది.ఇటీవల బ్యాంకాక్‌లో నిర్వహించిన ‘ఏషియా యూత్ ఇంటర్నేషనల్ మోడల్ యునైటెడ్ నేషన్స్’ సదస్సుల్లో పాల్గొంది. 36 దేశాల నుంచి 699 మంది పాల్గొన్న ఈ సదస్సుకు మన దేశం నుంచి హాజరైన అయిదుగురిలో లహరి ఒకరు. ఈ సదస్సులో ‘ఉమెన్ ట్రాఫికింగ్ అండ్ మైగ్రేషన్ స్మగ్లింగ్’ అనే అంశంపై మాట్లాడిందామె.నాన్నలాగే సైన్యంలో చేరి దేశసేవ చేయాలనేది లహరి లక్ష్యం. ఆమె లక్ష్యం నెరవేరాలని ఆశిద్దాం. లెట్స్ షేప్ ఏ బెటర్ వరల్డ్కొత్త ప్రదేశం అంటే భౌగోళిక విషయాల పరిచయం మాత్రమే కాదు. ఎన్నో విషయాలను తెలుసుకునే పుస్తక సముద్రం. ‘యూత్ సమ్మిట్’లో పాల్గొనడానికి బ్యాంకాక్‌కు వెళ్లిన లహరి ‘ఇక్కడ ప్రసంగించి వెళ్లిపోతే తన బాధ్యత పూర్తయిపోతుంది’ అనుకోలేదు. ఇటీవల థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్‌లో ‘లెట్స్ షేప్ ఏ బెటర్ వరల్డ్’ నినాదంతో మొదలైన అంతర్జాతీయ యువ సమ్మేళనంలో వివిధ దేశాల నుంచి వైబ్రెంట్ డెలిగేట్స్ పాల్గొన్నారు. పర్యావరణ సంక్షోభం నుంచి సాంస్కృతిక విశేషాల వరకు ఎన్నో అంశాలపై ఎంతోమంది డెలిగేట్స్‌తో లహరి మాట్లాడింది. ఉద్యమ ప్రయాణంలో వారి అనుభవాలతో స్ఫూర్తి పొందింది. ‘బ్యాంకాక్ సమ్మిట్‌లో పాల్గొనడం గొప్ప అనుభవం’ అంటుంది లహరి. – రాసం శ్రీధర్, సాక్షి, నిర్మల్ -
బీరులో చెత్త, చెట్నీలో బొద్దింక
-
మధురానగర్ లో డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుబడ్డ ఏసీపీ సుకుమార్
-
డ్రంక్ అండ్ డ్రైవ్‌లో చిక్కిన ఏసీపీ.. పోలీసులతో వాగ్వాదం!
సాక్షి, హైదరాబాద్: రోడ్డు ప్రమాదాలను అరికట్టడానికి ట్రాఫిక్ పోలీసులు మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలకు దిగుతుంటే.. మరోవైపు అదే ట్రాఫిక్ పోలీస్ అధికారి మద్యం తాగి అడ్డంగా బుక్కయ్యాడు. అంతటితో ఆగకుండా తాను మద్యం తాగలేదని బుకాయిస్తూ బ్రీత్ అనలైజర్‌కు సహకరించలేదు. అనంతరం సినిమా రేంజ్ ట్విస్ట్‌తో మద్యం తాగి డ్రైవింగ్ చేస్తున్న ఏసీపీ సుమన్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.వివరాల ప్రకారం..హైదరాబాద్‌లోని ఎస్ఆర్నగర్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్న పోలీసులకు సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ చిక్కారు. ఆ సమయంలో యూనిఫామ్‌లో లేకపోవడంతో ట్రాఫిక్ పోలీసులు ఆయన వాహనాన్ని ఆపి బ్రీత్ ఎనలైజర్ ముందు ఊదమన్నారు. అందుకు ఆయన నిరాకరించాడు. అంతటితో ఆగకుండా తాను కూడా పోలీసు డిపార్ట్మెంట్ అంటూ అక్కడున్న వారిపై మండిపడ్డారు. దీంతో అక్కడ డ్యూటీ నిర్వహిస్తున్న ట్రాఫిక్ పోలీసులు లా అండ్ ఆర్డర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి చేరుకున్న పోలీసులు వెంటనే సుమన్‌కు అదుపులోకి తీసుకున్నారు. -
గ్రూప్-1 సమస్యపై రాహుల్ గాంధీ స్పందించాలి: హరీష్ రావు
సిద్దిపేట, సాక్షి: గ్రూప్-1 అభ్యర్థుల ఆర్తనాదాలు కాంగ్రెస్‌కు వినిపించటం లేదా? అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు ప్రశ్నించారు. ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడారు. ‘‘గ్రూప్-1 అభ్యర్థులు సమస్యలపై రాహుల్ గాంధీ స్పందించాలి. జీవో 29లో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యర్థులు అన్యాయం అవుతారు. రైతులు, ఉద్యోగులను నిరుద్యోగులను దగా చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాలను మోసం చేస్తోంది. ఈ ఖరీఫ్ సీజన్‌కు రైతు భరోసా ఇవ్వలేమని మంత్రి తుమ్మల నాగేశ్వర రావు చావు కబురు చల్లగా చెప్పారు. .. సీఎం రేవంత్ రెడ్డి నువ్వు ముక్కు నేలకు రాయాలి. మాట తప్పినందుకు. మూసి కోసం రూ. లక్షా 50 వేలు ఉంటాయి. కానీ రైతులకు రూ. 15 వేలు ఇవ్వలేవా? రుణమాఫీ విషయంలో మోసం చేశావు. బోనస్ విషయంలో మోసం చేశావు. ఇప్పుడు రైతు బంధు విషయంలో మోసం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎక్కడిక్కడ నిలదీయాలని పిలుపునిస్తున్నాం’’ అని అన్నారు.చదవండి: కేటీఆర్ వల్లే బీఆర్ఎస్కు ఇలాంటి పరిస్థితి: బండి సంజయ్ -
నలుగురు కూతుళ్ళకు MBBS సీట్లు
-
బాలికపై అత్యాచారం..నిందితుడి ఇల్లు తగలబెట్టిన గ్రామస్తులు
-
సిద్దిపేట మీదుగా ఫోర్వే
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట మీదుగా నాలుగు వరుసల సరికొత్త జాతీయ రహదారి రూపుదిద్దుకోనుంది. సిద్దిపేట సమీపంలోని దుద్దెడ నుంచి సిరిసిల్ల వరకు రూ.1,100 కోట్ల వరకు వ్యయం రోడ్డు నిర్మించడానికి జాతీయ రహదారుల విభాగం అంచనా వేస్తోంది. ప్రస్తుతం కన్సల్టెన్సీ సంస్థ డీపీఆర్ సిద్ధం చేస్తోంది. వచ్చేనెలలో కేంద్ర ఉపరితల రవాణాశాఖకు జాతీయ రహదారుల విభాగం దానిని సమర్పించనుంది. ఇప్పటికే ఈ రోడ్డుకు కేంద్ర ప్రభుత్వం అనుమతించగా, అలైన్మెంట్ కూడా ఖరారైంది. ఎన్‌హెచ్ 365 బీకి కొత్త రూపు.. సూర్యాపేట నుంచి సిరిసిల్ల వరకు 184 కి.మీ. మేర ఉన్న 365బీ రోడ్డును కేంద్రం విస్తరిస్తోంది. దీనిని జాతీయ రహదారిగా గుర్తించినా, చాలా ఇరుకుగా ఉండి రోడ్డు ప్రమాదాలకు కారణమవుతోంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని కేంద్రం విస్తరిస్తోంది.సూర్యాపేట నుంచి రాజీవ్ రహదారి మీద ఉన్న దుద్దెడ వరకు రెండు వరుసలుగా రోడ్డుగా 10 మీటర్లకు విస్తరించింది. సూర్యాపేట నుంచి జనగామ వరకు పనులు గతంలోనే పూర్తి కాగా, జనగామ నుంచి చేర్యాల మీదుగా దుద్దెడ వరకు పనులు ఇప్పుడు పూర్తి అవుతున్నాయి.ఇక రాజీవ్ రహదారి నుంచి ఈ రోడ్డుకు కొత్తరూపు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. దీన్ని నాలుగు వరుసలుగా 20 మీటర్ల వెడల్పునకు విస్తరించాలని నిర్ణయించింది. ఇప్పుడు ఈ పనులకు శ్రీకారం చుట్టబోతోంది. ఈ భాగం 365బీలో అంతర్భాగమే అయినా, ఇందులో సింహభాగం గ్రీన్‌ఫీల్డ్ హైవేగా పూర్తి కొత్త రోడ్డుగా ఏర్పడబోతోంది. రాజీవ్ రహదారి మీదుగా కాకుండా.. ప్రస్తుతం 365బీ జాతీయ రహదారి చేర్యాల మీదుగా వచ్చి దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిలో కలుస్తుంది. దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ఆ రోడ్డులోనే భాగంగా కొనసాగుతోంది. ఇప్పుడు దాన్ని పూర్తిగా విడదీసి కొత్తరోడ్డుగా నిర్మించేందుకు సిద్ధమయ్యారు. దుద్దెడ వద్ద రాజీవ్ రహదారిని క్రాస్ చేసి సిద్దిపేట కలెక్టర్ కార్యాలయం వెనక ఉన్న సామాజిక అటవీ భాగం వెనుక నుంచి కోమటి చెరువు పక్క నుంచి సిద్దిపేటకు చేరుతుంది. పట్టణ వెనుక భాగం నుంచి కోటిలింగేశ్వర దేవాలయ సమీపం మీదుగా ముందుకు సాగి రామంచ గ్రామం వద్ద ప్రస్తుతం ఉన్న 365బీ జాతీయ రహదారితో అనుసంధానమవుతుంది. అక్కడి వరకు కొత్త అలైన్‌మెంటుతో రహదారిగా నిర్మిస్తారు. ఆ తర్వాత జక్కాపురం, రామచంద్రాపూర్, నేరెళ్ల, సారంపల్లి, తంగళ్లపల్లి గ్రామాల వద్ద బైపాస్‌లతో రోడ్డుగా రూపొందనుంది. అనంతరం సిరిసిల్ల పట్టణం వద్ద మానేరు నదిని దాటుతుంది. అక్కడ దీనికోసం వంతెన నిర్మిస్తారు. ప్రస్తుతం నేరుగా సిరిసిల్లలోకి చేరే పాత హైవేను కాదని, సిరిసిల్ల బైపాస్ రోడ్డుతో పట్టణం దాటిన తర్వాత బైపాస్ కూడలి వద్ద ఇతర రోడ్లతో అనుసంధానమవుతుంది. 100 మీటర్లు – 150 మీటర్ల వెడల్పు.. ఇలా రెండు ప్రణాళికలను డీపీఆర్‌లో చేర్చనున్నారు. వీటిల్లో కేంద్రం దేనికి మొగ్గుచూపితే అంత వెడల్పుతో రోడ్డుకు భూమిని సేకరిస్తారు. డీపీఆర్ ఆమోదం తర్వాతే వివరాలు వెల్లడవుతాయి. రాజీవ్ రహదారిని క్రాస్ చేసే చోట, సిరిసిల్ల వద్ద మానేరు మీద ఫ్లైఓవర్లు ప్లాన్ చేస్తున్నారు. మధ్యలో కొన్ని చిన్న వంతెనలు కూడా నిర్మిస్తారు. డీపీఆర్‌కు ఆమోదం తర్వాతనే వీటిల్లో వేటికి కేంద్రం ఆమోదం తెలిపిందో స్పష్టత వస్తుందని ఓ అధికారి వ్యాఖ్యానించారు. -
స్పీడ్ తక్కువ.. సమయం ఎక్కువ
గజ్వేల్: మనోహరాబాద్ మీదుగా సిద్దిపేటకు వచ్చే రైలు స్పీడ్ తక్కువగా ఉండటం, ప్రయాణానికి సమయం ఎక్కువ తీసుకోవడంతో ఈ రైలు ఎక్కేందుకు ప్రయాణికులు పెద్ద ఆసక్తిగా చూపడం లేదు. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లడానికి రైలులో మూడున్నర నుంచి నాలుగు గంటల వరకు సమయం పడితే...బస్సులో అయితే సుమారు రెండు గంటల సమయమే పడుతోంది. దీంతో మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో ప్రయాణికులు లేక రైలు వెలవెలబోతోంది. 8 బోగీలతో నడుస్తున్న ఈ రైలులో ఒకటి గార్డు, ఇతర అవసరాలుపోగా, ఏడింటిలో మొత్తంగా ఒక్క ట్రిప్పులో 644 మంది ప్రయాణం చేయొచ్చు. రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు నడుస్తున్నా, వందమందికి మించి ప్రయాణించడం లేదు. రైలు వేగం కేవలం 60 కిలోమీటర్లకే పరిమితమై సికింద్రాబాద్ వరకు ప్రయాణ సమయం 4 గంటలు పట్టడమే ఇందుకు ప్రధాన కారణం. మనోహరాబాద్ టు కొత్తపల్లి మెదక్ జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి వరకు 151.36 కిలోమీటర్ల పొడవున ఈ న్యూబ్రాడ్‌గేజ్ లైన్ నిర్మాణం జరుగుతుండగా, రూ. 1160.47 కోట్లు వెచి్చస్తున్నారు. 2017లో ఈ పనులు ప్రారంభమయ్యాయి. ఈ లైన్ సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి మనోహరాబాద్ మీదుగా కొత్తపల్లి వరకు, అక్కడి నుంచి పెద్దపల్లి గ్రాండ్ ట్రంక్ లైన్‌తో అనుసంధానం కానుంది. ఫలితంగా ఈ లైన్ హైదరాబాద్, న్యూఢిల్లీ, కోల్కత్తా లాంటి మహానగరాలను కలుపుతూ జాతీయ లైన్‌గా ఆవిర్భవించనున్నది. మనోహరాబాద్– కొత్తపల్లి రైల్వేలై¯Œన్ పూర్తయితే.. ప్రయాణికులకు దూరభారం తగ్గుతుంది. మొత్తానికి ఈలైన్తో ఉత్తర తెలంగాణలోని సిద్దిపేట జిల్లాతో పాటు మెదక్, సిరిసిల్ల, కరీంనగర్ జిల్లాలకు భారీ ప్రయోజనం చేకూరుతుంది. రోజుకు రెండు అప్ అండ్ డౌన్ ట్రిప్పులు ప్రతి బుధవారం మినహా మిగిలిన ఆరు రోజుల్లో ప్యాసింజర్ రైలు రోజుకూ రెండు అప్ అండ్ డౌన్ టిప్పులు నడుస్తోంది. ఉదయం 6.45 గంటలకు సిద్దిపేటలో బయలుదేరి.. దుద్దెడ, లకుడారం, కొడకండ్ల, గజ్వేల్, అప్పాయిపల్లి, నాచారం, మేడ్చల్, బొల్లారం, కవల్రీ బ్యారేక్స్(అల్వాల్), మల్కాజిగిరి, సికింద్రాబాద్ వరకు ఉదయం 10.15 గంటలకు చేరుకుంటోంది. తిరిగి సికింద్రాబాద్ నుంచి ఉదయం 10.35 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 నిమిషాలకు చేరుతుంది. అన్నీ సజావుగా సాగితే సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు వెళ్లాలన్నా అక్కడి నుంచి సిద్దిపేటకు రావాలన్నా 3.30 గంటల ప్రయాణం తప్పదు. కానీ ట్రైన్ లేటయినా, సిగ్నల్స్ సమస్య ఉత్సన్నమైనా ఆలస్యం అవుతోంది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు బస్సులో వెళితే కేవలం 2 గంటల సమయయే పడుతుంది. ఈ కారణం వల్ల ఈ రైలుపై ఆసక్తి చూపడంలేదు. మనోహరాబాద్ టు సికింద్రాబాద్ వరకు రద్దీ..: ఇదే రైలు మనోహరాబాద్ స్టేషన్ వెళ్లగానే అక్కడి నుంచి సికింద్రాబాద్‌కు 100 కిలోమీటర్ల వేగంతో వెళుతుండగా, ఈ మార్గంలో రద్దీ భారీగానే ఉంటుంది. కేవలం మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు మాత్రమే అతి తక్కువ ప్రయాణికులతో వెళుతోంది. ప్రస్తుతం సిద్దిపేట నుంచి సికింద్రాబాద్ వరకు 117 కిలోమీటర్లు ప్రయాణిస్తున్న రైలు మనోహరాబాద్ వరకు 74 కిలోమీటర్లు అతి తక్కువ ప్రయాణికులతో, ఆ తర్వాత మనోహారాబాద్ నుంచి సికింద్రాబాద్వరకు 43 కిలోమీటర్లు రద్దీగా వెళుతోంది. ఇదే మార్గంలో గజ్వేల్ వరకు 2022 జూన్ 27న రైల్వేశాఖ గూడ్స్ రైలు సేవలను దక్షిణ మధ్య రైల్వేశాఖ రేక్ పాయింట్ కోసం ప్రారంభించింది. దీని ద్వారా రైల్వేశాఖకు మంచి ఆదాయం కూడా సమకూరుతోంది. స్పీడ్ పెరిగితేనే మెరుగు.. మనోహరాబాద్–గజ్వేల్–సిద్దిపేట మార్గంలో వేగం తక్కువగా ఉండటం వల్ల సమయం ఎక్కువగా పడుతుంది. ఇక్కడి నుంచి సికింద్రాబాద్ వెళ్లడానికి ప్రయాణికులు కొంత వెనుకంజ వేస్తున్నట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ లైన్ స్పీడ్ పెరిగి, ప్రయాణానికి సమయం తగ్గనుంది. దీని ద్వారా ప్రయాణికుల సంఖ్య కూడా పెరగుతుంది. కొత్తపల్లి వరకు లింకు పూర్తయితే ఇక భారీగా పుంజుకుంటుంది. – దక్షిణ మధ్య రైల్వే ఇంజినీర్ జనార్దన్ -
Komuravelli Mallanna: జాతర నాటికి పనులు పూర్తయ్యేనా!
సాక్షి, సిద్దిపేట: ప్రముఖ శైవక్షేత్రాల్లో ఒకటి సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో వెలసిన శ్రీ మల్లికార్జున స్వామి దేవాలయం. కోరమీసాల మల్లన్నగా ప్రసిద్ధి. ప్రతి ఏడాది మూడు నెలల పాటు జాతర జరుగుతుంది. ఈ దేవాలయానికి తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి పట్నం, బోనం, స్వామి వారికి మొక్కులు చెల్లిస్తుంటారు. మరో మూడు నెలల్లో జాతర ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. జాతర సమయంలో రోజుకు 30 వేలకు పైగా, సాధారణ సమయంలో ఆదివారం, బుధవారాల్లో 20 వేలకు పైగా భక్తులు వస్తుంటారు.ఆరేళ్లుగా కొనసాగుతున్న గదుల నిర్మాణంకొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయ పరిసరాల్లో దాతల సహకారంతో 128 గదులు కొన్నేళ్ల కిందట నిర్మించారు. అందులో 18 గదులు పూర్తిగా శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇక మిగిలినవి 110 గదులు మాత్రమే. అందులో నుంచే జాతర సమయంలో పోలీసులకు, ఇతర అవసరాలకు దాదాపు 50 వరకు వినియోగిస్తారు. ఇక 60 గదులే భక్తులకు అందుబాటులో ఉంటాయి. జాతర మూడు నెలల పాటు జరుగుతుంది. బుధ, ఆదివారాల్లో రోజుకు 50 వేలకు పైగా మిగతా రోజుల్లో 30 వేలకు పైగా భక్తులు వస్తుంటారు. జాతర సమయంలో ప్రైవేట్ అద్దె గదుల యజమానులు ఇష్టారాజ్యంగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఒక్కో గదికి 12 గంటలకు రూ.3 వేల నుంచి రూ.6 వేల వరకు వసూలు చేస్తున్నారు. డబ్బులు వెచ్చించలేని భక్తులు చెట్ల కిందనే బోనం వండి దేవాలయంలో బోనం, పట్నం చెల్లిస్తున్నారు. భక్తులకు ఇబ్బందులు ఎదురవుతుండటంతో 2018 సంవత్సరంలో 50 గదుల నిర్మాణంను ప్రారంభించారు. రూ.10.65 కోట్ల వ్యయంతో జీ ప్లస్ టుతో నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి పనులు ఆగుతూ సాగుతూ వస్తున్నాయి. ఆరేళ్లు పూర్తవుతున్నా ఇంకా గదుల నిర్మాణం పూర్తి కాలేదు. ఈ గదుల నిర్మాణం త్వరగా పూర్తి చేసి ఈ జాతరకు అందుబాటులోకి వచ్చేలా చేసి, ఇంకా 150కి పైగా గదుల నిర్మాణం చేపట్టేందుకు ప్రభుత్వం కృషి చేయాలని భక్తులు కోరుతున్నారు.క్యూ కాంప్లెక్స్ పూర్తయ్యేనా?మల్లికార్జున స్వామి దర్శనం కోసం భక్తులు భారీ సంఖ్యలో వస్తుంటారు. కర్రలతో క్యూలైన్లను ప్రతి జాతర సమయంలో ఏర్పాటు చేస్తారు. దర్శనానికి బుధ, ఆదివారాల్లో 3 నుంచి 4 గంటల సమయం పడుతుంది. ఒక్కసారి క్యూలైన్లో ప్రవేశిస్తే మళ్లీ బయటకు వెళ్లలేని పరిస్థితి ఉంటుంది. వృద్ధులు, షుగర్ వ్యాధిగ్రస్తులు, చిన్నారులు మూత్రంకు వెళ్లాలంటే ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల వినతుల మేరకు క్యూ కాంప్లెక్స్‌లను నిర్మించాలని నిర్ణయించారు. రూ.12 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులను 2023, అక్టోబర్‌లో ప్రారంభించారు. ఇప్పటి వరకు స్లాబ్‌లు వేశారు. లోపల క్యూలైన్లు, మూత్రశాలలు నిర్మించాలి.జాతర నాటికి పనులు పూర్తయ్యేనా?మరో మూడున్నర నెలల్లో స్వామి వారి కల్యాణంతో జాతర ప్రారంభం కానుంది. ఉగాది వరకు జాతర జరగనుంది. జాతర సమయంలో రోజుకు వేలాది మంది భక్తులు వస్తుంటారు. దేవాలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెరిగితేనే జాతర నాటికి పనులు పూర్తయ్యే అవకాశం ఉంటుంది. లేకపోతే భక్తుల ఇబ్బందులు తప్పవు. ఇప్పటికైనా దేవాదాయ శాఖ, జిల్లా యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టి పనులు పూర్తి చేయాలని కోరుతున్నారు.పూర్తయ్యేందుకు కృషి చేస్తాంక్యూ కాంప్లెక్స్‌కు మూడు స్లాబ్‌లు వేశాం. 50 గదుల నిర్మాణం పంచాయతీరాజ్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వారు చేస్తున్నారు. ఈ జాతర నాటికి పనులు పూర్తయ్యేందుకు కృషి చేస్తాం. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తాం.– బాలాజీ, ఈఓ -
సీఎం రేవంత్ తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లు లేరు: హరీష్ రావు
సాక్షి, సిద్దిపేట: రాష్ట్రంలో నడుస్తుంది ప్రజా పాలన కాదని, రాక్షస పాలన అని మాజీ మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. సీఎం రేవంత్ రెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడే వాళ్లెవరూ లేదరని తేల్చిచెప్పారు. వరద బాధితులకు సహాయం చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమయిందని ఆయన విమర్శించారు. ప్రభుత్వం ముందుగా మేల్కొంటే మరింత ప్రాణనష్టం తగ్గే అవకాశం ఉండేదన్నారు.ఈ మేరకు సిద్దిపేట క్యాంపు కార్యాలయంలో గురువారం ఖమ్మం వరద బాధితులకు సరుకులు పంపే వాహనాలను హరీష్ రావు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఖమ్మం, మహబూబాబాద్‌లో వర్షానికి తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. సిద్దిపేట నుంచి ఉడుతా భక్తిగా సహాయం చేస్తున్నామన్నారు. మానవ సేవయే మాధవ సేవ అని అందరూ ముందుకు వచ్చి వరద బాధితులకు సహాయం చేయాలని పిలుపునిచ్చారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు నెల వేతనం వరద బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. తమలాగే బీజేపీ, మిగతా పార్టీల నాయకులు సహాయం చేయడానికి మందుకు రావాలని కోరారు. తాము వరద సహాయం చేయడానికి ఖమ్మం వెళ్తే తమపై దాడి చేసి కేసులు నమోదుచేస్తున్నారని ఆరోపించారు. అక్కడి ప్రజలు ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారని చెప్పారు తమకు వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే దాడులు చేస్తున్నారని విమర్శించారు. బాధితులకు అన్నం, నీళ్లు ఇవ్వలేకపోయారని చెప్పారు. నీళ్లలో ఇళ్లు మునిగిపోయినవారికి రూ.2 లక్షలు ఇచ్చి ఆదుకోవాలన్నారు. -
వరదలో చిక్కుకున్న ట్రాక్టర్
-
సిద్దిపేటలో ఫ్లెక్సీ వార్
సాక్షి, సిద్దిపేట: కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య సిద్దిపేటలో మొదలైన ఫ్లెక్సీ వివాదం చినికిచినికి గాలివానలా మారింది. కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు చేపట్టిన నిరసన కార్యక్రమాలు, సవాళ్లతో సిద్దిపేట శనివారం రణరంగంగా మారింది. పరిస్థితులను అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు స్వల్ప లాఠీచార్జి చేయాల్సి వచ్చింది. ఇరుపార్టీలకు చెందిన నేతలను అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ నిరసన ర్యాలీ: రైతులకు రూ.2 లక్షల రుణమాఫీని ఆగస్టు 15 కల్లా పూర్తి చేసినందున ఎమ్మెల్యే పదవికి హరీశ్‌రావు రాజీనామా చేయాలంటూ సిద్దిపేటలో కాంగ్రెస్ కార్యకర్తలు పలుచోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వీటిని తొలగించాలంటూ బీఆర్ఎస్ నాయకులు శుక్రవారం రాత్రి నిరసన చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అరెస్ట్ చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించి, తెల్లవారుజామున వదిలి పెట్టారు. మరోవైపు శుక్రవారం అర్ధరాత్రి కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు అత్తు ఆధ్వర్యంలో కాంగ్రెస్ శ్రేణులు ఎమ్మెల్యే హరీశ్ క్యాంప్ కార్యాలయంలోకి చొరబడ్డాయి.అక్కడ కేసీఆర్, హరీశ్‌రావు చిత్రాలతో ఉన్న ఫ్లెక్సీని చించేశాయి. దీంతో శనివారం సిద్దిపేటలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ విషయం తెలిసిన వెంటనే బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అక్కడి నుంచి పాత బస్టాండ్ చౌరస్తా వరకు నిరసన ర్యాలీని నిర్వహించారు. హరీశ్ రాజీనామాను డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీని దగ్ధం చేశారు. తర్వాత బీజేఆర్ చౌరస్తాలో ఉన్న ఫ్లెక్సీలను బీఆర్ఎస్ నాయకులు చించివేసేందుకు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో బీఆర్ఎస్ కార్యకర్తలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. పోలీసులు లాఠీలను ఝుళిపించారు. బీఆర్ఎస్ నాయకులను అదుపులోకి తీసుకుని వారిపై కేసు నమోదు చేశారు.ర్యాలీగా కాంగ్రెస్: ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో సీఎం రేవంత్ ఫ్లెక్సీని ఏర్పాటు చేసేందుకు నియోజకవర్గ ఇన్చార్జి హరికృష్ణ కార్యాలయం నుంచి ర్యాలీగా బయల్దేరిన కాంగ్రెస్ శ్రేణులను బీజేఆర్ చౌరస్తాలో పోలీ సులు అడ్డుకున్నారు. పోలీసుల కన్నుగప్పి క్యాంప్ ఆఫీస్ వైపు చొచ్చుకొచ్చేందుకు కాంగ్రెస్ కార్యకర్తలు యత్నించారు. క్యాంప్ ఆఫీస్ గేట్ వద్దకు చేరు కున్న కాంగ్రెస్ నాయకుడు మహేందర్‌పై బీఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేయ డంతో పరిస్థితి చేయిదాటిపోతుందనే ఆందోళన నెలకొంది. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ఇరుపార్టీలు పరస్పర ఫిర్యాదులతో పోలీసులు కేసులు నమోదు చేశారు. -
రేవంత్ ఫ్లెక్సీ ఫినాయిల్ తో వాష్
-
లగ్జరీ కంటైనర్ ఇల్లు ధర తెలిస్తే ఆశ్చర్యపోతారు
-
ఆ ప్రభుత్వ పాఠశాల ఎందుకంత ఫేమస్ ?
-
సర్కార్ బడికి క్యూ
సాక్షి, సిద్దిపేట: ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన ఉపాధ్యాయులు ఇంటింటికీ తిరిగి మీ పిల్లలను మా పాఠశాలలో జాయిన్ చేయించాలని తల్లిదండ్రులను కోరుతుంటారు. కానీ ఈ ప్రభుత్వ పాఠశాలలో సీన్రివర్స్గా మారింది. తల్లిదండ్రులే తమ పిల్లలను ఈ ప్రభుత్వ పాఠశాలలోనే చదివించాలని ప్రవేశాల కోసం క్యూ కడుతున్నారు. అది ఎక్కడ అనుకుంటున్నారా సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నతపాఠశాల. ఈ పాఠశాలను మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు దత్తత తీసుకున్నారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా విద్యాబోధన అందిస్తుండటంతో ప్రవేశాలకు డిమాండ్ పెరుగుతోంది. ఈ పాఠశాలలో 1,208 మంది విద్యార్థులున్నారు. రాష్ట్రంలోనే మూడో అతి పెద్ద ప్రభుత్వ పాఠశాలగా దీనికి గుర్తింపు వచ్చింది. 6 నుంచి 10వ తరగతి వరకు.. ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో ఈ విద్యా సంవత్సరానికిగాను 6 నుంచి పదో తరగతి వరకు ప్రవేశాలకు ఈ నెల 12వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించారు. 6వ తరగతిలో 200 సీట్లు ఖాళీగా ఉన్నాయి. అదే పాఠశాల ప్రాంగణంలోని ప్రాథమిక పాఠశాల విద్యార్థులు 5వ తరగతి పూర్తి చేసి.. 6వ తరగతి ప్రవేశం కోసం 61 మంది వచ్చారు. ఇంకా 129 సీట్లకు ఇతర పాఠశాలలకు చెందిన విద్యార్థులను ఎంపిక చేస్తారు. 6 నుంచి 10వ తరగతి వరకు 161 సీట్లు ఖాళీగా ఉండగా 630 మంది విద్యార్థులు దరఖాస్తు చేశారు. దీంతో ప్రతిభ ఉన్న వారికి అవకాశం కలి్పంచాలనే ఉద్దేశంతో ఈ నెల 13న విద్యార్థులకు ప్రవేశపరీక్ష నిర్వహించారు. ఇఫ్లూ దత్తతఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైదరాబాద్‌కు చెందిన ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్) యూనివర్సిటీ దత్తత తీసుకుంది. 9వ తరగతి విద్యార్థులకు స్పాని‹Ù, ఫ్రెంచ్, స్పోకెన్ ఇంగ్లిష్ నేరి్పస్తున్నారు. 150 మంది విద్యార్థులకు వివిధ భాషలు నేరి్పంచారు. ఈ ఏడాది మరో 150 మందికి నేరి్పంచేందుకు ప్రణాళికలు రూపొందించారు. గురు, శుక్ర వారాల్లో ఆన్లైన్లో బోధిస్తుండగా, తరగతిగదిలో శనివారం ప్రొఫెసర్లు నేరుగా వచ్చి బోధిస్తున్నారు. విద్యార్థులు ధారాళంగా స్పాని‹Ù, ఫ్రెంచ్ భాషల్లో మాట్లాడుతున్నారు. డ్రామా, స్కిట్లు, సాంగ్స్ కూడా పాడుతున్నారు.రోబోటిక్స్... ఇందిరానగర్ పాఠశాలలో రోబోటిక్స్ విద్యను హైదరాబాద్‌కు చెందిన సోహం అకడమిక్ హ్యూమన్ ఎక్సలెన్స్ అనే స్వచ్ఛంద సంస్థ అందిస్తోంది. మూడు సంవత్సరాలుగా ప్రతీ ఏడాది 100 మంది విద్యార్థులకు నేరి్పస్తున్నారు. వారంలో రెండు రోజులు క్లాసులు నిర్వహిస్తున్నారు.గర్వపడుతున్నాం.. మెరుగైన విద్య, సౌకర్యాలు కల్పింస్తుండటంతో విద్యార్థులను చేర్పించేందుకు తల్లిదండ్రులు ముందుకు వస్తున్నారు. అందుకు గర్వపడుతున్నాం. విద్యార్థుల తాకిడి పెరగడంతో స్క్రీనింగ్‌కు పరీక్ష పెట్టాం. వీటిలో వచి్చన మార్కులు, వారి కుటుంబపరిస్థితిని బట్టి అడ్మిషన్లు ఇస్తాం. ఈ నెల 20తేదీలోగా ఎంపిక పూర్తవుతుంది. – రాజప్రభాకర్‌రెడ్డి, హెచ్ఎం, జెడ్పీ హైసూ్కల్, ఇందిరానగర్ సీటు కోసం వచ్చాను మా తమ్ముడి భార్య చనిపోయింది. నా మేనల్లుడిని ఇందిరానగర్ స్కూల్లో 6వ తరగతిలో చేరి్పంచేందుకు వచ్చాను. పరీక్ష రాయించాను. ఇందులో చదివితే విద్యావంతుడు అవుతాడని నమ్మకంతో సీటు కోసం తిరుగుతున్నా. – బాలలక్ష్మి, సిద్దిపేటఈ ఏడాది కొత్తగా ఎన్సీసీ ఈ ఏడాది కొత్తగా ఎన్సీసీ ప్రవేశపెట్టారు. కరీంనగర్‌కు చెందిన 9వ బెటాలియన్ ఆధ్వర్యంలో శిక్షణ ఇవ్వనున్నారు. 8వ తరగతి నుంచి 50 మంది విద్యార్థులను ఎంపిక చేస్తారు. ⇒ ఈ పాఠశాల విద్యార్థులు ట్రిపుల్ ఐటీ, కా ర్పొరేట్ కళాశాలలో ఉచిత సీట్లకు ఎంపికవుతున్నారు. 2023–2024 విద్యా ఏడాదిలో 231 మంది పదో తరగతి పరీక్ష రాయగా 229 మంది ఉత్తీర్ణులయ్యారు. ఇటీవల విడుదలైన పాలిసెట్‌లో వెయ్యిలోపు ఐదుగురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. -
సిద్ధిపేటలో మున్సిపల్, విద్యుత్ శాఖల మధ్య సమన్వయ లోపం
-
ఇద్దరు అన్నదాతల ఆత్మహత్య
మిరుదొడ్డి (దుబ్బాక)/ రామగిరి (మంథని): ఏడు బోర్లు వేసినా నీరందక పంట ఎండిపోవడంతో మనోవేదనతో ఓ రైతు, ఆరుగాలం కష్టపడ్డా నీటి కొరతతో పత్తి పంటకు దిగుబడి రాలేదన్న బాధతో మరో రైతు పురుగుల మందు తాగి తనువు చాలించారు. సిద్దిపేట, పెద్దపల్లి జిల్లాల్లో ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. వివరాలు.. తొగుట మండల కేంద్రానికి చెందిన చిక్కుడు శ్రీనివాస్‌కు (48) వ్యవసాయమే జీవనాధారం. భార్య, ఇద్దరు కూతుళ్లు, కుమారుడిని పోషించుకుంటూ బతుకు వెళ్లదీస్తున్నాడు. మిరుదొడ్డి మండల పరిధిలోని కాసులా బాద్ శివారులో నాలుగు ఎకరాల భూమిని కొనుగో లు చేసి వరి పంట వేశారు. భూగర్భ జలాలు వట్టిపోవడం.. మండుతున్న ఎండలతో రెండు ఎకరాలు పంట పూర్తిగా ఎండిపోయింది. దీంతో సుమారు రూ.6 లక్షల వరకు అప్పు చేసి 7 బోరు బావులు తవ్వంచాడు. అందులో ఒకటి రెండు బోరు బావుల నుంచి సన్నటి నీటి ధార మాత్రం వస్తోంది. పొట్ట దశకు వచ్చిన రెండు ఎకరాలకు సాగు నీరు అందక ఎండు ముఖం పట్టింది. దీంతో మనోవేదనకు గురైన శ్రీనివాస్ శనివారం సాయంత్రం పొలం వద్దే పురుగు మందు తాగాడు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. మరోఘటనలో పెద్దపల్లి జిల్లా రామగిరి మండలం లద్నాపూర్ గ్రామానికి చెందిన ఉడుత సంతోష్ యాదవ్ (34) రెండేళ్లక్రితం ఇల్లు నిర్మించుకున్నాడు. ఇందుకోసం కొంత అప్పు తీసుకొచ్చాడు. తనకున్న 8 ఎకరాల్లో పత్తి వేశాడు. ఇందుకోసం బ్యాంకులో మరికొంత లోన్ తీసుకున్నాడు. అప్పు రూ.35 లక్షల వరకు చేరింది. పత్తి పంట అధిక దిగుబడి వస్తే మొత్తం అప్పు తీర్చవచ్చని భావించాడు. కానీ, తెగుళ్లు, నీటి కొరతతో ఆశించిన దిగుబడి రాలేదు. దీంతో మనస్తాపం చెందిన సంతోష్ ఈనెల 3న గడ్డి మందు తాగాడు. చికిత్స పొందుతూ శనివారం రాత్రి మరణించాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. -
నీటిని విడుదల చేయకపోతే ఉద్యమం చేస్తాం: హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: రాష్ట్ర ప్రభుత్వం కరువు నివారించే ప్రయత్నం చేయకుండా.. రైతులకు అపాయం చేస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కేసీఆర్ పొలం బాట పట్టిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం మేల్కుందన్నారు. ఆయన సిద్దిపేట కలెక్టరేట్లో మాట్లాడారు. ‘నాడు ఉద్యమాల ద్వారా మెల్కొంది బీఆర్ఎస్. కేసీఆర్ పర్యటన తర్వాత నిన్న(సోమవారం) నీటిని విడుదల చేశారు. బీఆర్ఎస్ పార్టీ పోరాటం వల్లనే ప్రభుత్వం నీటిని విడుదల చేసింది. పంటలు నష్టపోయిన రైతులకు రూ. 25 వేల నష్ట పరిహారం అందించాలి.100 రోజుల్లో అమలు చేస్తామని రైతులకు అనేక హామీలు ఇచ్చారు. డిసెంబరు 9 నాడు రుణమాఫీ చేస్తామని చేయలేదు. అన్ని పంటలకు రూ. 500 బోనస్ ఇచ్చి కొనాలని డిమాండ్ చేస్తున్నాం. అడుగడుగునా కాంగ్రెస్ పార్టీ రైతులకు అన్యాయం చేస్తుంది. ...బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడూ రైతుల పక్షమే.. భారత రైతు సమితి. కాంగ్రెస్ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉంది. ఇది కాలం తెచ్చిన కరువు కాదు, కాంగ్రెస్ తెచ్చిన కరువు. కూడవెళ్లి వాగులోకి తక్షణమే నీటిని విడుదల చేయాలి. 24 గంటల్లో కూడవెళ్లి వాగులోకి నీటిని విడుదల చేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. లో వోల్టేజీ కరెంట్ వల్ల మోటార్లు కాలిపోతున్నాయి. ..బీఆర్ఎస్ పార్టీని విమర్శించే నైతిక హక్కు మీకు లేదు.కాంగ్రెస్ పార్టీ వచ్చినంక నీళ్లు తగ్గినయి, కన్నీళ్లు పెరిగినాయి. కాంగ్రెస్ పార్టీకి రైతుల కష్టాలు పట్టవు. రైతులను పరామర్శించేందుకు సీఎంకు, మంత్రులకు తీరిక లేదా?. బీఆర్ఎస్ పార్టీ రైతులను కంటికి రెప్పలా కాపాడుకుంది’ అని హరీశ్‌రావు అన్నారు. -
కేకే పార్టీ జంప్.! కేసీఆర్ రియాక్షన్ ఏంటంటే?
సాక్షి, సిద్దిపేట: ఎన్నికల వేళ తెలంగాణ రాజకీయాల్లో సంచలన మార్పులు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ మారుతారనే ప్రచారం జోరుగా సాగుతున్న వేళ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ కేశవరావు మాజీ సీఎం కేసీఆర్‌తో భేటీ అయ్యారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో కేసీఆర్‌ను కలిసిన కేకే పార్టీ మార్పు ప్రచారంపై కేసీఆర్‌కు వివరణ ఇచ్చినట్లు సమాచారం. ఇక సెలవు మరి.! ప్రస్తుత పరిస్థితుల్లో BRSలో ఉండలేనని కే. కేశవరావు చెప్పినట్టు సమాచారం. ఓ రకంగా ఇది కెసిఆర్‌కు మింగుడుపడని విషయం. పార్టీలో కేకేకు ఇచ్చిన ప్రాధాన్యత, పదవుల దృష్ట్యా కేకే శాశ్వతంగా ఉంటారని కెసిఆర్ భావించారు కానీ సీన్ రివర్స్ అయినట్టు తెలుస్తోంది. తన నిర్ణయంపై కెసిఆర్‌తో కొద్దిసేపు చర్చించిన కేకే.. తనకు ఈ పరిస్థితి అనివార్యంగా మారిందని చెప్పినట్టు తెలిసింది. పార్టీ మారుతానని కేశవరావు చెప్పగానే కెసిఆర్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం. మరో సారి ఆలోచించుకోవాలని కేకేకు చెప్పినట్టు తెలిసింది. లోపల గరం.. గరం ఫాంహౌస్ లోపల అంతా గరంగరంగా సమావేశం జరిగినట్టు తెలిసింది. నేను పుట్టింది కాంగ్రెస్‌లో.. కాంగ్రెస్ లోనే చనిపోతానని తేల్చిచెప్పిన కేకే చెప్పగా.. కెసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేసినట్టు తెలిసింది. పదేళ్లు అధికారం అనుభవించి ఇప్పుడు పార్టీ వీడతానంటే ఎలా? ప్రజలు అన్నీ గమనిస్తారని కేసీఆర్ మండిపడ్డట్టు సమాచారం. నీకు, నీ ఫ్యామిలీ కి BRS పార్టీ ఏం తక్కువ చేసిందని కేసీఆర్ ప్రశ్నించినట్టు తెలిసింది. కేకే అభ్యంతరాలు ఇవి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాంటి ప్లానింగ్ లేకుండా అభ్యర్థులను ఎంపిక చేశారు జాతీయ రాజకీయాల్లో అనవసరంగా తల దూర్చారు TRS పేరును BRSగా మార్చి గాల్లో మేడలు కట్టారు మహారాష్ట్రలో ప్రచారం చేయడం పెద్ద తప్పు అసలు రాజకీయ క్షేత్రం తెలంగాణను వదిలిపెట్టారు పార్టీని నమ్ముకున్న నాయకుల మాటలను పెడచెవిన పెట్టారు కొందరు అధికారులకు ఎక్కడ లేని ప్రాధాన్యత ఇచ్చారు నిర్ణయాధికారాల్లో ప్రజలు ఎన్నుకున్న నాయకుల కంటే అధికారుల మాట విన్నారు కూతురు వెంటే కేకే ఇప్పటికే కాంగ్రెస్‌లో చేరికకు కేకే కూతురు మేయర్ విజయలక్ష్మి రంగం సిద్ధం చేసుకుంది. కేకేను కాంగ్రెస్ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షీ పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే. దాంతో ఆయన పార్టీ మారుతారనే ప్రచారాన్ని కేకే నిజం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే ఆయన వ్యాఖ్యలు దీనికి ఆజ్యం పోశాయి. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ కంటే కాంగ్రెస్, బీజేపీకే అధిక సీట్లు వస్తాయంటూ కేకే చేసిన ప్రకటన సంచలనమయింది. కేసీఆర్‌కు అత్యంత సన్నిహితుడిగా ఉన్న కేకే.. ఏకంగా బీఆర్ఎస్ మూడో స్థానంలో ఉండబోతుందంటూ చెప్పడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఎర్రవెల్లి ఫామ్ హౌజ్ నుంచి హైదరాబాద్ నివాసానికి చేరుకున్న కేకే..ఇంటివద్ద విజువల్స్ తీస్తున్న మీడియా ప్రతినిధుల పైకి దురుసుగా దూసుకు వచ్చారు. తీసుకుంటారా వీడియా.. నన్ను తీసుకోండి అంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. కేసీఆర్.. కేకే.. సుదీర్ఘ ప్రయాణం ఉమ్మడి రాష్ట్రానికి పీసీసీ చీఫ్ గా పని చేసిన కేకే.. ఒకప్పుడు కాంగ్రెస్‌లో అత్యంత సీనియర్. సోనియాగాంధీకి నమ్మిన బంటులా ఉండేవాడంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కాంగ్రెస్ పార్టీని వీడి నాటి టీఆర్ఎస్ లో చేరారు. కేకేకు ఏకంగా పార్టీ సెక్రటరీ జనరల్ ఇచ్చారు కేసీఆర్. వరుసగా రెండు సార్లు రాజ్యసభకు పంపించారు కేసీఆర్. పార్టీ పార్లమెంటరీ పార్టీ నేత పదవి కూడా ఇచ్చారు. అభ్యర్ఠుల ఎంపిక కమిటీకి కూడా కేకేనే ఛైర్మన్ గా వ్యవహరించారు. కేకే కూతురు విజయలక్ష్మికి జీహెచ్ఎంసీ మేయర్ పదవిని ఇచ్చారు. పోతూ పోతూ విసుర్లు పార్టీ మారే పరిస్థితి వచ్చిన తర్వాత కేకే తన అసంతృప్తిని బయటపెట్టారు. తానిచ్చిన ఇన్ పుట్స్ ను కేసీఆర్ పట్టించుకోలేదు, బీఆర్ఎస్ కుటుంబ పార్టీగా మారింది. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ అనవసరంగా జోక్యం చేసుకున్నారని, ఇంజినీర్లు చేయాల్సిన పనిలో తల దూర్చారని, ఆ పని నిపుణులు చేయాల్సిందన్నారు. రాజకీయ వర్గాల సమాచారం ప్రకారం ఏప్రిల్ 30న కేకే కాంగ్రెస్ పార్టీలో అధికారికంగా చేరుతున్నట్టు తెలిసింది. మా నాన్న సంగతి నాకు తెలియదు : కేకే కొడుకు విప్లవ్ "పార్టీ మారే ఆలోచనలో కె.కె, విజయలక్ష్మి ఉన్నట్టు వస్తున్న వార్తలకు, వారు తీసుకున్న నిర్ణయాలకు సంబంధించి మీడియాలో వచ్చిన వార్తలతో నాకు ఎలాంటి సంబంధం లేదు. నేనే BRSలోనే ఉన్నాను, మా నాయకుడు కేసీఆర్ నాయకత్వంపై నాకు నమ్మకం ఉంది. కేకే, విజయలక్ష్మి కాంగ్రెస్‌లో చేరితే, వారు ధృవీకరిస్తే అప్పుడు మాత్రమే నేను మరింత మాట్లాడగలను." ఇదీ చదవండి: ఇది కాంగ్రెస్ తెచ్చిన కరువు: KTR ఆవేదన -
సిద్దిపేటలో హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కిట్ పేరిట భారీ మోసం
-
మెదక్ లోక్‌సభ స్థానంపై వీడని సస్పెన్స్..!
సాక్షి, సిద్దిపేట: బీజేపీ, బీఆర్ఎస్లు రెండు లోక్‌సభ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాయి. బుధవారం బీజేపీ మెదక్ అభ్యర్థిగా మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్ రావు, బీఆర్ఎస్ జహీరాబాద్ ఎంపీ అభ్యర్థిగా గాలి అనిల్ కుమార్‌ను ప్రకటించాయి. పార్టీ అధినేత కె.చంద్రశేఖరరావు అధికారికంగా గాలి పేరును ప్రకటించారు. ఎంపీ టికెట్‌ను పలువురు ఆశించినప్పటికీ అధిష్టానం అనిల్‌కుమార్ వైపే మొగ్గుచూపింది. లోక్‌సభ పరిధిలో మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు అధికంగా ఉండటమే కారణంగా పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. టికెట్‌ను ప్రకటించిన వెంటనే గాలి అనిల్‌కుమార్.. పార్టీ అధినేత కేసీఆర్‌ను కలిసి బొకే అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మాజీ మంత్రులు టి.హరీశ్‌రావు, జగదీష్‌రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ ఎం.శివకుమార్ తదితరులు కేసీఆర్‌ను కలిశారు. అయితే.. బీజేపీ మెదక్ ఎంపీ అభ్యర్థిగా దుబ్బాక మాజీ ఎమ్మెల్యే మాధవనేని రఘునందన్‌రావు కు అవకాశం కల్పించింది. ముందుగా ఊహించినట్లుగానే పార్టీ అధిష్టానం బుధవారం రాత్రి ప్రకటించిన 2 వ జాబితాలో ఆయన పేరును ఖరారు చేసింది. అధిష్టానం, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి ఫోన్ చేసి శుభాకాంక్షలు తెలిపినట్లు రఘునందన్ సాక్షి కి తెలిపారు. అలాగే మెదక్ ఎంపీ స్థానానికి గాను బీఆర్ఎస్, కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థులను ప్రకటించకపోవడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ నుంచి.. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డికి దాదాపు ఖరారు అయ్యే అవకాశం ఉంది. తొలుత ఎమ్మెల్సీ వెంకట్రాంరెడ్డి పేరు వినిపించినా పరిస్థితులకు అనుగుణంగా అభ్యర్థిని మార్చాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలిసింది. కాంగ్రెస్ నుంచి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సతీమణి నిర్మల, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హన్మంతరావు, నీలం మధు టికెట్ ఆశిస్తున్నారు. కాగా, గాంధీభవన్‌లో తెలంగాణ కాంగ్రెస్ ఇన్చార్జి దీపాదాస్‌ను నిర్మల కలిసి తనకు టిక్కెట్ ఖరారు చేయాలని కోరినట్లు తెలుస్తోంది. ఇవి చదవండి: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్.. బాజిరెడ్డి వైపు మొగ్గు! -
సిద్ధిపేట: రాజీవ్ రహదారిపై ఊహకందని ప్రమాదం
సిద్ధిపేట, సాక్షి: రాజీవ్ జాతీయ రహదారిపై సోమవారం ఊహాకందని రీతిలో ప్రమాదం జరిగింది. ఓ కారు డివైడర్‌ను ఢీ కొట్టి పల్టీలు కొడుతూ ఎగిరిపడి ప్రమాదానికి గురైంది. అయితే.. ఆ సమయంలో ఈ కారు మరో కారును ఢీ కొట్టిది. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా, పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.. హైదరాబాద్ నుండి కరీంనగర్ వెళ్తున్న కారు-కరీంనగర్ నుండి హైదరాబాద్ వస్తున్న కారు పరస్పరం తిమ్మారెడ్డి పల్లి ప్రమాదానికి గురయ్యాయి. రెండింటిలో ఓ కారు అదుపు తప్పి అదుపుతప్పి డివైడర్ మీదుగా పల్టీలు కొడుతూ వెళ్లింది. ఆ సమయంలో అవతలి రోడ్డులో కరీంనగర్ వైపు వెళ్తున్న కారుకు తగలడంతో.. రెండు ఒకదాని మీద ఒకటి పడి దొర్లాయి. ఆ తర్వాత రెండోకారు రోడ్డు కిందకు దిగిపోయి చెట్టును బలంగా ఢీ కొట్టింది. సమాచారం అందుకున్న కొండపాక 108 సిబ్బంది హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్నారు. బాధితులను సిద్ధిపేట జనరల్ ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌కు తరలించారు. క్షతగాత్రుల్ని కరీంనగర్ డెయిరీ అడ్వైజర్ హన్మంతరెడ్డి (48), మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి డ్రైవర్ శోభన్(36) గుర్తించారు. వీళ్లద్దరి పరిస్థితి మరింత విషమంగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈ ఘటనలోనే శోభన్ (44), ప్రశాంత్ (34)లు సైతం తీవ్రంగానే గాయపడినట్లు సమాచారం. -
సిరిసిల్లకు ఇప్పట్లో రైలు కూత లేనట్టే
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లకు ఇప్పట్లో రైలుకూత వినిపించే పరిస్థితి లేదు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరిగింది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్ వరకు రైలు సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మార్చి నాటికి సిరిసిల్ల స్టేషన్ వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీలునుబట్టి రైలు సర్వీసులను సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పొడిగించాలని అనుకుంది. డిమాండ్ సర్వేలో, ప్రయాణికుల సంఖ్య ఉంటుందని తేలితే సిరిసిల్ల నుంచి రైలు సర్విసులు నడిపే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు సిద్దిపేట–సిరిసిల్ల మధ్య కీలక ప్రాంతంలో పనులే జరగటం లేదు. ఫలితంగా రైలు సర్విసు కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ సంగతి..: భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యే కొద్దీ రైల్వే అధికా రులు పనులు చేస్తూ వెళ్లారు. ఇలా సిద్దిపేట వరకు వేగంగా పూర్తి చేసి అనుకున్న సమయంలో రైలు సర్విసులు ప్రారంభించా రు. ఆ తర్వాత సిద్దిపేట –సిరిసిల్ల సెక్షన్ల మధ్య పనులు ప్రారంభించారు. కానీ, మధ్యలో 80 ఎకరాలకు సంబంధించిన భూసేకరణలో ఇబ్బందులొచ్చాయి. ఆ ప్రాంతంలో భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో రైతు ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడివరకు వదిలి ఆపై భాగంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగించారు. తర్వా త సిద్దిపేట సమీపంలోని భూముల వివాదం పరిష్కారమైంది. భూయజమానులకు పరిహారం కింద రూ.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే సమ యంలో ఎన్ని కల కోడ్ రావడంతో ఆ చెల్లింపులు నిలిచిపోయా యి. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభు త్వం ఏర్పడ గానే ఆ డబ్బులు చెల్లింపు కోసం రైల్వే అధికారు లు ఒత్తిడి ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వర కు చెల్లింపు జాడే లేదు. దీంతో పెద్ద కోడూరు, మాచాపూర్, గంగాపూర్, విఠలాపూర్ గ్రామాల పరిధిలో రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. రైతులకు పరిహారం చెల్లిస్తే తప్ప ఆ భూములను రైల్వే స్వాదీనం చేసుకునే వీలు లేదు. సిరిసిల్ల సమీపంలో మాత్రం పనులు కొనసాగుతున్నా యి. అక్కడ పూర్తయినా, సిద్దిపేట సమీపంలో పెండింగ్‌లో ఉంటే రైల్వేలైన్ వేసే వీలుండదు. రాష్ట్రప్రభుత్వం పరిహారం చెల్లిస్తేనే పనులు మొదలవుతాయి. దీంతో పనులు కనీసం 4నెలలు వెనక బడ్డట్టు అయ్యిందని ఓ రైల్వే అధికారి వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే అన్నిరకాల పనుల్లో జాప్యం జరుగుతోందని సమాచారం. పరిహారం చెల్లింపే కాకుండా ప్రాజెక్టు వ్యయంలోనూ మూడో వంతు ఖర్చు రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇప్పుడు ఆ మొత్తానికి సంబంధించి కూడా కొంత పేరుకుపోయిందని తెలుస్తోంది. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య 30 కిలోమీటర్ల మేర పనులకు రూ.480 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఆ మార్గంలో కొంత గుట్టభూమి కూడా ఉండటంతో దాన్ని కట్ చేసి పనులు చేయాల్సి ఉంది. ఇది స్వతహాగానే ఆలస్యమయ్యే పని. భూపరిహారం పంపిణీలో జాప్యం, ఇతర పనులూ నెమ్మదించటం వెరసి.. ఈ 30 కిలోమీటర్ల పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం తప్పేలా కనిపించటం లేదు. -
TSRTC: సీటు కోసం చెప్పులతో కొట్టుకున్నారు
సిద్దిపేట, సాక్షి: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ఉచిత ప్రయాణం మూలంగా కష్టాలు మాత్రం తప్పడం లేదు. ఆర్టీసీ సిబ్బందితో గొడవ పడడం దగ్గరి నుంచి ఆఖరికి మహిళలు వాళ్లలో వాళ్లు కొట్టుకోవడం దాకా చూస్తూనే ఉన్నాం. తాజాగా మహిళలు చెప్పులతో కొట్టుకున్న వీడియో ఒకటి వైరల్ అవుతోంది. సీటు తనదంటే తనదంటూ ఇద్దరు వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో ఇద్దరూ చెప్పులు ఝులిపించుకున్నారు. ఒకరిపై ఒకరు చెప్పులతో దాడులు చేసుకున్నారు. ఆ మధ్యలో ఉన్న ఓ మహిళ వాళ్లను నిలువరించే ప్రయత్నం చేయగా.. ఇంతలో మరో ఇద్దరు పురుషులు జోక్యంతో వివాదం సర్దుమణిగింది. ఆ గొడవను ప్రయాణికులంతా ఆసక్తిగా తిలకించగా.. అక్కడే ఉన్న కొందరు ఆ వీడియో తీయడంతో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సికింద్రాబాద్ నుంచి దుబ్బాక వెళ్తున్న దుబ్బాక డిపో బస్సులో.. తోగుట మండలం వెంకట్రావ్ పేట వద్ద ఈ ఘటన చోటు చేసుకున్నట్లు సమచారం. ఉచిత ప్రయాణ విషయంలో ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ ఎప్పటికప్పుడు విజ్ఞప్తులు చేస్తూనే ఉన్నా.. ఇలాంటి ఘటనలు మాత్రం ఆగడం లేదు. -
కర్ర సాయంతో కేసీఆర్ నడక
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ మాజీ సీఎం కే. చంద్రశేఖరరావు చేతి కర్ర సాయంతో నడక సాధన చేస్తున్నారు. ఫిజయోథెరపీ వైద్యుల పర్యవేక్షణలో కేసీఆర్ అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. గత నాలుగు రోజులుగా సిద్దిపేట జిల్లా మర్కూర్ మండలం ఎర్రవెల్లిలోని తన ఫామ్‌హౌజ్‌లో కేసీఆర్ విశ్రాంతి తీసుకుంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమారు తన ‘ఎక్స్’ ట్విటర్ అకౌంట్లో పోస్ట్ చేశారు. కాలు తొంటి శస్త్ర చికిత్స అనంతరం కేసీఆర్ హైదరాబాద్ జూబ్లీహిల్స్ నందినగర్‌లోని తన నివాసంలో విశ్రాంతి తీసుకున్న విషయం తెలిసిందే. ఇక.. ఇటీవలే ఎర్రవల్లి వ్యవసాయ క్షేత్రానికి కేసీఆర్ చేరుకున్నారు. చదవండి: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ భర్తీపై తమిళిసై కీలక ప్రకటన -
TS: హుస్నాబాద్‌లో కారు బోల్తా.. యువకుడి మృతి
సాక్షి, సిద్ధిపేట: జిల్లాలో పండగ పూట విషాదం నెలకొంది. ఆదివారం హుస్నాబాద్- కరీంనగర్ రహదారిపై అతివేగంతో అదుపు తప్పిన కారు మూడు పల్టీలు కొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో యశ్వంత్ అనే యువకుడు దుర్మరణం పాలయ్యాడు. కారులో ఉన్న మరో ముగ్గురికి తీవ్ర గాయాలవడంతో ఆస్పత్రికి తరలించారు. అజయ్, అఖిల్, వెంకటేష్ అనే ముగ్గురు మైనర్లకు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. కారు బోల్తా పడ్డ దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదీచదవండి.. మల్కాజ్గిరి ఎంపీ సీటుపై మాజీ మంత్రి కన్ను -
ఆటో కార్మికులను రోడ్డున పడేశారు: హరీష్‌రావు
సాక్షి, సిద్దిపేట జిల్లా: కార్మికులను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదేనని మాజీ మంత్రి హరీష్‌రావు అన్నారు. ప్రభుత్వం మంచి చేస్తూ మరొకరి ఉసురుపోసుకుందని వ్యాఖ్యానించారు. ఆటో కార్మికుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. గ్రామాలకు మరిన్ని బస్సులు పెంచాలని హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట డిగ్రీ కళాశాల మైదానంలో ఆటో డ్రైవర్ల ఆటల పోటీలను ప్రారంభించిన హరీష్‌రావు అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆటో కార్మికుల ఆలోచనలో మార్పు వచ్చిందని.. ఆటో కార్మికులు సొసైటీ ఏర్పాటు చేసుకోవడం రాష్ట్రానికే ఆదర్శమన్నారు. ఆటో కార్మికులను ఈ ప్రభుత్వం రోడ్డున పడేసిందని, ప్రభుత్వం వీరి కోసం ఆలోచన చేసి నెలకు రూ.15వేల జీవన భృతి ఇవ్వాలని హరీష్‌రావు డిమాండ్ చేశారు. -
ఆటా ఆధ్వర్యంలో మెగా మెడికల్ క్యాంప్
-
అన్నం కూడా తిననియలే.. నాకు చాలా బాధగా ఉంది: ప్రశాంత్
ఈ ఏడాది జరిగిన రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ విన్నర్‌గా నిలిచారు. విజేతగా నిలిచిన తర్వాత ప్రశాంత్‌కు అతని అభిమానులు ఘనస్వాగతం పలికారు. అదేక్రమంలో అన్నపూర్ణ స్టూడియోస్ వద్దకు తరలివచ్చిన కొందరు ఫ్యాన్స్ శృతిమించి అత్యుత్సాహం ప్రదర్శించారు. కొందరైతే ఏకంగా బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్, అశ్విని, మాజీ కంటెస్టెంట్ గీతూ రాయల్‌పై కార్లపై దాడికి పాల్పడ్డారు. అంతే కాకుండా ఆర్టీసీ బస్సుల అద్దాలు సైతం ధ్వంసం చేశారు. అయితే ఈ ఘటనను సీరియస్‌గా తీసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు పల్లవి ప్రశాంత్‌తో పాటు అతని అభిమానులపై కేసులు నమోదు చేశారు. ఇదిలా ఉండగా ట్రోఫీ గెలిచిన తర్వాత పల్లవి ప్రశాంత్ తన సొంత ఊర్లో అడుగుపెట్టారు. బిగ్‌బాస్ ట్రోఫీ గెలిచిన ప్రశాంత్‌కు ఘనస్వాగతం లభించింది. కారులో ర్యాలీగా వెళ్లిన ప్రశాంత్.. అభిమానులకు అభివాదం చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. అయితే ఫ్యాన్స్ రియాక్షన్‌పై పల్లవి ప్రశాంత్ మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పల్లవి ప్రశాంత్ మాట్లాడుతూ..'అన్న నేను మళ్లా వచ్చినా. నాకు చాలా బాధగా ఉంది. ఇవాళ బాధపడే రోజు. రైతుబిడ్డ గెలిచిండని నా ఊరు ఘనస్వాగతం పలికింది. అన్నా.. మీడియా మిత్రులు మీరే చూసిర్రు. ఇంతమంది ప్రజలు నాకోసం వచ్చిర్రా అన్న సంతోషంలో ఉన్నా. కానీ ఆ సంతోషం లేకుండా చేయాలని మీరు అనుకుంటుర్రు. నిజంగా బాధగా ఉంది. ఏడుద్దామంటే నీరు నెగెటివ్ చేస్తారేమోనని భయంగా ఉంది. ఎందుకు 60 నుంచి 70 యూట్యూబ్ ఛానెళ్లు వచ్చిర్రు. నా కోసం వచ్చిన వారందరికీ ఫోటోలు, వీడియోలు ఇచ్చినా. నేను అన్నం కూడా తినలే. అయినా కొంతమంది మీడియా మిత్రులు వచ్చి.. అన్నా 5 నిమిషాలు ఇవ్వు, 10 నిమిషాలు ఇవ్వు అంటూ వెంటపడ్డారు. నేను కూడా మనిషినే కదా అన్నా. నా వల్ల అయితలేదు అని చెప్పినా వినరా అన్నా' అంటూ ఎమోషనల్ అయ్యారు. అయితే బిగ్‌బాస్ నుంచి బయటికొచ్చాక చాలామంది ప్రశాంత్‌ను ఇంటర్వ్యూ చేసేందుకు యత్నించారు. -
స్వగ్రామానికి చేరుకున్న రైతుబిడ్డ.. పూలవర్షం కురిపించిన అభిమానులు!
సామాన్య రైతుబిడ్డగా బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన పల్లవి ప్రశాంత్. వంద రోజులకు పైగా సాగిన తెలుగువారి బిగ్ రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 ట్రోఫీని ముద్దాడారు. రైతుబిడ్డ అన్న సింపతి వర్కవుట్ అయినా.. తనలో ఉన్న టాలెంట్‌ను బయటకు తీశాడు. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో మరో కంటెస్టెంట్ అమర్‌దీప్‌తో పోటీపడి టైటిల్ సాధించాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసినా పల్లవి ప్రశాంత్ పేరు మార్మోగిపోతోంది. బిగ్‌బాస్ విన్నర్‌గా నిలిచిన రైతుబిడ్డ తన సొంత ఊరికి చేరుకున్నాడు. స్వగ్రామానికి చేరుకున్న ప్రశాంత్‌కు ఘనస్వాగతం లభించింది. అభిమానులు అతనిపై పూలవర్షం కురిపించారు. కారులో టాప్‌పై నిలిచి ఉన్న ప్రశాంత్ అందరికీ అభివాదం చేస్తూ ముందుకు కదిలాడు. రోడ్డు వెంట వందలాది మంది ఫ్యాన్స్ మధ్య ర్యాలీ నిర్వహించారు. టైటిల్ ట్రోఫీని అభిమానులకు చూపిస్తూ.. డీజే స్టెప్పులతో ఊగిపోతూ సిద్దిపేట జిల్లాలోని కోల్గురు చేరుకున్నారు. రోడ్డు వెంట జనసందోహం నడుమ బిగ్ బాస్ విన్నర్ తన సొంతూర్లో అడుగుపెట్టారు. అయితే ప్రశాంత్ ట్రోఫీ గెలిచిన తర్వాత అన్నపూర్ణ స్టూడియోస్ వద్ద ప్రశాంత్ హంగామా చేశారు. అయితే ఫ్యాన్స్ అత్యుత్సాహం కాస్తా కేసుల వరకు వెళ్లింది. అభిమానుల శృతిమించి అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్ల అద్దాలతో పాటు ఆర్టీసీ బస్సుల అద్దాలను ధ్వంసం చేశారు. -
సిద్దిపేట జిల్లాలో విషాదం
-
భార్య, పిల్లల్ని చంపేసి.. సిద్ధిపేట కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్య
సాక్షి, సిద్ధిపేట జిల్లా: సిద్ధిపేట కలెక్టర్ గన్‌మెన్ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. భార్య, ఇద్దరు పిల్లల్ని చంపిన నరేష్.. గన్‌తో కాల్చుకున్నాడు. చిన్నకోడూర్ మండలం రామునిపట్లలో ఘటన జరిగింది. విధులు నిర్వహించుకుని ఇంటికి వచ్చే సమయంలో 9 mm పిస్తొల్‌తో భార్య చైతన్య, కుమారుడు రేవంత్, కుమార్తె హిమశ్రీలను కాల్చి, తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆన్లైన్ బెట్టింగ్తో అప్పుల పాలై నరేష్ ఆత్మహత్య చేసుకున్నట్లు స్థానికులు చెబుతున్నారు. తనకున్న ఎకరం భూమిని అమ్మిన అప్పులు తీరకపోవడంతో సూసైడ్‌కు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. సిద్ధిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ఏమన్నారంటే.. 11గంటల 15 నిముషాల సమయంలో ఈ ఘటన జరిగింది 2013బ్యాచ్ కి చెందిన నరేష్ సర్వీస్ రివాల్వర్‌తో కుటుంబ సభ్యులను కాల్చి, తనను తాను కాల్చుకొని మరణించాడు కొంత అప్పులు ఉన్నట్లు ప్రాథమిక సమాచారం ఉంది ఆన్ డ్యూటీ లో ఉండగా ఈ ఘటన జరిగింది నరేష్ ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నాం కేసును దర్యాప్తు చేసి పూర్తి వివరాలు కనుక్కుంటాం మృతుల వివరాలు ఆకుల నరేష్, కానిస్టేబుల్, వయస్సు 35 సంవత్సరాలు, ARPC 2735, ప్రస్తుతం కలెక్టర్ వద్ద PSO గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆకుల చైతన్య, నరేష్ భార్య, వయస్సు 30 సంవత్సరాలు ఆకుల రేవంత్, వయస్సు 6 సంవత్సరాలు, 1st క్లాస్ విద్యార్థి ఆకుల రిషిత, వయస్సు 5 సంవత్సరాలు, UKG విద్యార్థిని ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
నేడు చింతమడకకు కేసీఆర్
సాక్షి, హైదరాబాద్/ సిద్దిపేట రూరల్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సిద్దిపేట నియోజకవర్గంలోని తన స్వగ్రామం చింతమడకలో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. కేసీఆర్ దంపతులు ఉదయం 10 గంటలకు ప్రత్యేక హెలికాప్టర్లో అక్కడికి చేరుకుంటారు. గ్రామ పాఠశాలలోని 13వ బూత్‌లో ఓటు వేస్తారు. ఆ తర్వాత సీఎం తిరిగి ఎర్రవెల్లి ఫామ్‌హౌస్‌కు చేరుకుని పోలింగ్ సరళిని పర్యవేక్షిస్తారని బీఆర్ఎస్ వర్గాలు వెల్లడించాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ రామారావు ఖైరతాబాద్, మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట భారత్‌నగర్‌లో ఓటు హక్కు వినియోగించుకుంటారు. సీఎం చింతమడకకు వస్తున్న క్రమంలో భద్రతా ఏర్పాట్లు చేపట్టామని సీపీ శ్వేత తెలిపారు. అభ్యర్థులకు, నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగియడం, బుధవారం ‘సైలెన్స్ పీరియడ్’ కావడంతో గురువారం జరిగే పోలింగ్ ప్రక్రియ, అందుకు సంబంధించి పార్టీ పరంగా ఏర్పాట్లపై బీఆర్ఎస్ నేతలు దృష్టి సారించారు. పార్టీ అధినేత కేసీఆర్ బుధవారం ఎర్రవెల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి పోలింగ్ కోసం పార్టీ సన్నద్ధతపై ఆరా తీశారు. కొందరు పార్టీ అభ్యర్థులు, నేతలతో ఫోన్లో మాట్లాడారు. ప్రచార సరళి, క్షేత్రస్థాయి పరిస్థితిపై నిఘా వర్గాలు, వివిధ సంస్థల నుంచి అందిన నివేదికలను పరిశీలించి అభ్యర్థులకు పలు సూచనలు చేశారు. చివరి ఓటు పోలయ్యేంత వరకు పార్టీ పోలింగ్ ఏజెంట్లు బూత్‌లలోనే ఉండేలా చూసుకోవాలని, పార్టీ అనుకూల ఓటరు బూత్‌కు వెళ్లేలా పార్టీ కేడర్ దృష్టి కేంద్రీకరించాలని ఆదేశించారు. -
అద్భుతం.. 3డీ ప్రింటెడ్ ఆలయం
సిద్దిపేట అర్బన్: వాస్తుశిల్ప సౌందర్యం, సాంకేతిక పరి/జ్ఞనం మేళవింపుతో అసాధారణమైన రీతిలో నిర్మించిన ఆధ్యాత్మిక అద్భుతం.. ప్రపంచంలోనే మొట్టమొదటి 3డీ ప్రింటెడ్ హిందూ దేవాలయం సిద్ధపేటలో ఆవిష్కృతమైంది. సింప్లిఫోర్జ్ క్రియేషన్‌తో కలిసి అప్సుజా ఇన్ఫ్రాటెక్ ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా అర్బన్ మండలం బూరుగుపల్లి శివారులోని చర్విత మెడోస్‌లో నిర్మించిన 3డీ ప్రింటెడ్ దేవాలయానికి శ్రీపాద కార్య సిద్ధేశ్వర స్వామి దేవస్థానంగా నామకరణం చేశారు. వేద పండితుల ఆధ్వర్యంలో మంగళవారం మొదలైన ప్రతిష్టాపన మహోత్సవ పూజలు మరో రెండు రోజులు జరగనుండగా.. 24 నుంచి ఆలయాన్ని భక్తులు దర్శించుకునేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ ఐకానిక్ టెంపుల్ సాంస్కృతిక వారసత్వానికి నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తుందని అప్సుజా ఇన్ఫ్రాటెక్ మేనేజింగ్ డైరెక్టర్ హరికృష్ణ జీడిపల్లి వ్యాఖ్యానించారు. 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో 35.5 అడుగుల పొడవు, 4,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఆలయ నిర్మాణం అద్భుతంగా ఉందని హరికృష్ణ తెలిపారు. చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ అమిత్ ఘూలే మాట్లాడుతూ.. ఆలయం భూకంపాలకు దెబ్బతినకుండా నిర్మించినట్టు తెలిపారు. చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్ వసీం చౌదరి మాట్లాడుతూ గర్భగుడిలో వేదమంత్రాల ప్రతిధ్వనులతో భక్తులను మంత్రముగ్ధులను చేసేలా నిర్మాణం జరిగిందన్నారు. పూరీ జగన్నాథ ఆలయం శైలిలో గోపురం డిజైన్ చేసినట్లు వెల్లడించారు. ఆలయ నిర్మాణ పనులు 70 రోజుల్లో పూర్తయ్యాయి. -
బాబూ మోహన్‌కు తనయుడి షాక్
సాక్షి, సిద్ధిపేట: ఆందోల్ బీజేపీ అభ్యర్థి, మాజీ మంత్రి బాబూ మోహన్‌కి ఆయన తనయుడు షాక్ ఇచ్చాడు. సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావు సమక్షంలో బాబూమోహన్ కుమారుడు ఉదయ్ బాబూ మోహన్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు. ఉదయ్ బాబు మోహన్‌తో పాటు, ఆందోల్, జోగిపేట మున్సిపల్ ప్రెసిడెంట్ సాయి కృష్ణ, అందోల్ మండల ప్రెసిడెంట్ నవీన్ ముదిరాజ్, చౌటకుర్ మండల ప్రెసిడెంట్ శేఖర్, ఇతర బీజేపీ నాయకులు పార్టీలో చేరారు. మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్ వైపు నిలబడాలని, పార్టీ గెలుపు కోసం అందరం కలిసి కృషి చేయాలని మంత్రి హరీష్‌రావు పిలుపునిచ్చారు. చదవండి: తెలంగాణలో గెలుపెవరిది?.. డిసైడ్ చేసేది ఆ 30 నియోజకవర్గాలేనా? -
వారికి ఓటేస్తే రాష్ట్రం పదేళ్లు వెనక్కి
సాక్షి, సిద్దిపేట: ‘అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతుల్లో ఉంటే ఎలా క్షేమంగా ఉంటదో సీఎం కేసీఆర్ చేతుల్లో రాష్ట్రం కూడా అంతే క్షేమంగా ఉంటుంది. కేసీఆర్‌ను కాదని ఇతర పారీ్టలకు ఓట్లు వేయొద్దు. బీజేపీ, కాంగ్రెస్‌లకు ఓటు వేస్తే రాష్ట్రం పదేళ్లు తిరిగి వెనుకకు పోతుంది’అని మంత్రి హరీశ్‌రావు అన్నారు. గురువారం ఆయన సిద్దిపేటలో నామినేషన్ వేశారు. అంతకుముందు హరీశ్‌రావు మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలసి జగిత్యాల జిల్లాలోని కొండగట్టు ఆంజనేయస్వామిని దర్శించుకున్నారు. నామినేషన్ అనంతరం ఆయన సిద్దిపేటలో మీడియాతో మాట్లాడుతూ, గతంలో తెలంగాణలో కరువు కాటకాలు, ఆకలి చావులు, వలసలు ఉండేవన్నారు. ఇప్పుడు సీఎం కేసీఆర్ తెలంగాణను ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా మార్చారని చెప్పారు. తండ్రి వయసు ఉన్న కేసీఆర్‌పై కొందరు నాయకులు సంచలనాల కోసం నోరుపారేసుకుంటున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో ప్రైవేట్ రంగంలో 24 లక్షల ఉద్యోగాలు, ఐటీలో 6 లక్షల ఉద్యోగాలు, ప్రభుత్వ రంగంలో 1.80 లక్షల ఉద్యోగాలు కలి్పంచామని వెల్లడించారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు అభివృద్ధి చేయలేదన్నారు. తెలంగాణలో బీజేపీ తుడిచి పెట్టుకుపోయిందని ఎద్దేవా చేశారు. ఆ పారీ్టకి రాష్ట్రం మొత్తంలో ఒక్క సీటు కూడా రాదని, డక్ ఔట్ అవుతుందని ఎద్దేవా చేశారు. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో సిద్దిపేట నియోజకవర్గానికి 7వ సారి నామినేషన్ వేశానని చెప్పారు. -
వెంకటేశ్వర స్వామి ఆలయంలో కేసీఆర్ ప్రత్యేక పూజలు
-
రేపు కోనాయిపల్లికి సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు రేపు సిద్ధిపేటకు వెళ్లనున్నారు. అక్కడి కోనాయిపల్లి వేంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ఎన్నికల్లో నామినేషన్లు వేసే ముందు ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. అయితే.. ఈసారి వరుస బీఆర్ఎస్ సభలు.. మధ్యలో యాగం, సమయాభావ పరిస్థితులు, పైగా రేపు శనివారం కావడంతో ఈసారి ముందుగానే ఈ ఆలయంలో పూజలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల9వ తేదీన గజ్వేల్‌తో పాటు కామారెడ్డి లోనూ కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదే రోజు సాయంత్రం కామారెడ్డి బీఆర్ఎస్ ఆశీర్వాద బహిరంగ సభలో ఆయన ప్రసంగిస్తారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం లోని కోనాయిపల్లి గ్రామంలో వేంకటేశ్వర స్వామి ఆలయం ఉంది. కేసీఆర్‌కు ఇది సెంటిమెంట్ దేవాలయం. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే నామినేషన్ వేస్తారు. 1985లో మొదటిసారి సిద్ధిపేట ఎమ్మెల్యేగా గెలుపొందినప్పటి నుంచి 1989, 1994, 1999, 2001, 2004, 2009, 2014, 2018లలో జరిగిన ఎన్నికల సమయంలో.. ఈ వేంకటేశ్వరస్వామి దేవాలయంలో నామినేషన్ పత్రాలకు పూజలు నిర్వహించి, నామినేషన్ వేశారు. అన్ని సందర్భాల్లో ఆయన విజయం సాధించారు. మరో విశేషం ఏంటంటే.. 2001లో టీడీపీకి, శాసనసభ డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి, ఆపై ఈ ఆలయంలోనే పూజలు చేసి టీఆర్ఎస్(ప్రస్తుతం బీఆర్ఎస్) పార్టీ ప్రకటన చేశారాయన. -
ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై దాడి.. రఘునందన్ రావు ఏమన్నారంటే..
సాక్షి, సిద్ధిపేట: ఎన్నికల ప్రచారంలో భాగంగా దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో మెదక్ ఎంపీ, బీఆర్ఎస్ దుబ్బాక అభ్యర్థి కొత్త ప్రభాకర్‌రెడ్డిపై జరిగిన దాడిపై బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు స్పందించారు. కొత్త ప్రభాకర్ రెడ్డిపై దాడి జరగడం దురదృష్టకరమని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే ప్రభాకర్ రెడ్డిపై దాడి ఘటనతో తనకెలాంటి సంబంధం లేదని, దాడికి తానే కారణమని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని రఘునందన్‌రావు స్పష్టం చేశారు. పోలీసుల విచారణలో నిజానిజాలు ఎంత బురద చల్లేందుకు ప్రయత్నించినా.. అదే బురద నుంచి కమలం వికసిస్తుందని తెలిపారు. ఒకవేళ భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈ దాడికి పాల్పడితే తనే స్వయంగా అలాంటి వాడిని పోలీసులకు అప్పచెబుతానని అన్నారు. దాడికి పాల్పడిన నిందితుడు ఓ ఛానెల్ రిపోర్టర్ అని, దళితబంధు రాలేదనే ఆవేదనతోనే దాడి చేశాడని మీడియాలో వచ్చిందని తెలిపారు. పోలీసుల విచారణలో నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. ప్రభాకర్‌రెడ్డి మిత్రుడు, ఆయన్ను పరామర్శిస్తా ప్రభాకర్ రెడ్డిపై జరిగిన దాడి అనంతరం ఆర్ఎస్ నాయకులు చేపట్టిన నిరసన కార్యక్రమాల్లో బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడిని రఘునందన్ రావు తీవ్రంగా పరిగణించారు. ఈ హింసాత్మక ఘటనలపై పోలీసులు సమగ్రంగా విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉండగా ఇలాంటి నిరసనలకు ఎవరు అనుమతి ఇచ్చారో సిద్దిపేట కమిషనర్ వెల్లడించాలని అన్నారు. ప్రభాకర్ రెడ్డి తనకు మంచి మిత్రుడు అని ఆసుపత్రికి వెళ్లి అతని పరామర్శిస్తానని పేర్కొన్నారు. సిద్ధిపేట జిల్లా సూరంపల్లి వద్ద ఎన్నికల ప్రచారంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. ఓ పాస్టర్‌ను పరామర్శించి బయటకు వస్తున్న క్రమంలో ప్రభాకర్‌రెడ్డిపై కత్తితో దాడి చేశారు. దుండగుడి దాడిలో ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డికి కడుపులో గాయాలయ్యాయి. తొలుత గజ్వేల్ ఆసుపత్రికి తరలించగా.. తీవ్రత దృష్ట్యా మెరుగైన వైద్యం కోసం సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఆయనకు ఓపెన్ సర్జరీ చేస్తున్నారు. -
సిద్ధిపేట సభలో సీఎం కేసీఆర్ భావోద్వేగం
సాక్షి, సిద్ధిపేట: జన్మభూమిని మించిన స్వర్గం లేదని.. సిద్ధిపేట గడ్డ తనను నాయకుడ్ని చేసిందని సీఎం కేసీఆర్ అన్నారు. మంగళవారం ఆయన సిద్ధిపేటలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతూ, సిద్ధిపేట తనను తెలంగాణకు ముఖ్యమంత్రికి చేసిందని, సిద్ధిపేట రుణం జన్మలో ఏమిచ్చినా తీర్చుకోలేనన్నారు. ‘‘సిద్ధిపేటతో ఎంతో అనుబంధం నాకు ఉంది. సిద్ధిపేటలో నేను తిరగని పల్లె, ప్రాంతం లేదు. ‘‘చింతమడకలో నేను చిన్నవాణ్ణిగా ఉన్నప్పుడు మా అమ్మకు ఆరోగ్యం దెబ్బతింటే ఓ ముదిరాజ్ తల్లి నాకు పాలు పట్టింది’’ అంటూ తన చిన్ననాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ సీఎం కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. ‘‘సిద్ధిపేట మంచినీళ్ల పథకం రాష్ట్రానికే ఆదర్శం. సిద్ధిపేటను హరీష్‌రావు ఎన్నో రెట్లు అభివృద్ధి చేశారు. సిద్ధిపేట అన్ని రకాలుగా అభివృద్ధి చెందింది. తెలంగాణలోనే సిద్ధిపేట వజ్రం తునుకలా తయారవుతోంది. ఆరు అడుగుల బుల్లెట్ హరీష్‌రావు సిద్ధిపేటకు అప్పగించా’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: కేటీఆర్‌కు కాంగ్రాట్స్.. తనయుడిని పొగిడిన కేసీఆర్ మంత్రి హరీష్‌రావు భావోద్వేగం.. ఈ రోజు సీఎం కేసీఆర్ ఆశీస్సులు, మీ దివెనలతో సిద్దిపేటకి సేవ చేసే అవకాశం దక్కిందని మంత్రి హరీష్‌రావు అన్నారు. మరొక్కసారి సీఎం కేసీఆర్ ఆశీర్వదించి నాకు అవకాశం ఇచ్చారు. నాకు శ్వాస ఉన్నంత కాలం, జన్మ ఉన్నంత వరకు సీఎం కేసీఆర్‌కి, సిద్దిపేట జనాలకే నా జీవితం అంకితం చేస్తాను. మీరు చూపించిన ప్రేమాభిమానాలకు నా చర్మం ఒలిచి మీకు చెప్పులు కట్టించిన తక్కువే. నా చివరి శ్వాస ఉన్నంతవరకు సీఎం కేసీఆర్ నాయకత్వంలో మీకు సేవ చేస్తాను’’ అంటూ హరీష్‌రావు భావోద్వేగానికి లోనయ్యారు. ఆ ఘనత కేసీఆర్‌దే.. ఇది ఎన్నికల ప్రచార సభలా లేదని, మన కలను నిజం చేసిన సీఎం కేసీఆర్‌కి కృతజ్ఞత సభలా అనిపిస్తుందని మంత్రి హరీష్‌రావు అన్నారు. సిద్దిపేట దశాబ్దాల కలను నిజం చేసిన నాయకుడు కేసీఆర్. ఆనాటి సీఎం ఎన్టీఆర్‌కు సిద్దిపేట జిల్లా కావాలని కేసీఆర్ వినతి పత్రం ఇచ్చారు. ఇప్పుడు ఆయనే సిద్దిపేటను జిల్లా చేశారు. సిద్దిపేటకి రైలు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌దే. సిద్ధిపేటకి కాళేశ్వరం నీళ్లు వస్తాయంటే ప్రతి పక్షాలు ఎగతాళి చేశాయి. మూడేళ్లలో కాళేశ్వరం పూర్తి చేసి సిద్దిపేటకి నీళ్లు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్ దే. తెలంగాణకి సీఎంగా ఉన్న ఆయన వ్యవసాయం చేస్తున్నారు. ఆయన ఓ రైతు బిడ్డ కాబట్టే.. రైతుల బాధలు ఆయనకు తెలుసు’’ అని హరీష్‌రావు పేర్కొన్నారు. రోడ్డు పక్కన హోటల్లో చాయ్ తాగిన సీఎం కేసీఆర్ సిద్దిపేట సభ ముగించుకుని తిరుగు ప్రయాణంలో సీఎం కేసీఆర్ కాసేపు సేద తీరారు. మార్గంమధ్యలో సోనీ ఫ్యామిలీ దాబా వద్ద కాసేపు ఆగి చాయ్ తాగారు. ఆయనతో పాటు, మంత్రి హరీష్‌రావు, మాజీ స్పీకర్ మధుసూదనచారి ఉన్నారు. -
నేడు సిరిసిల్ల, సిద్దిపేటల్లో కేసీఆర్ సభలు
సాక్షి ప్రతినిధి, కరీంనగర్: బీఆర్ఎస్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి కరీంనగర్ జిల్లా పరిధిలోని సిరిసిల్లలో మంగళవారం ప్రజా ఆశీర్వాద సభను నిర్వహించనుంది. ఇది సీఎం కుమారుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం కావడం గమనార్హం. మధ్యాహ్నం 2 గంటలకు జరిగే బహిరంగ సభ కోసం మొదటి బైపాస్‌రోడ్డులో స్థలాన్ని సిద్ధం చేశారు. కేసీఆర్ హైదరాబాద్ నుంచి హెలికాప్టర్లో సిరిసిల్లకు చేరుకుని సభలో పాల్గొంటారు. తర్వాత సిద్దిపేటలో జరిగే సభకు వెళతారు. -
రాయి ఏంటో, రత్నమేదో గుర్తించి ఓటు వేయండి: సీఎం కేసీఆర్
సాక్షి, సిద్ధిపేట: తెలంగాణ రాక ముందు దారుణ పరిస్థితులు ఉండేవని, ఇప్పుడు అన్ని రంగాల్లో తెలంగాణ నంబర్ వన్ స్థాయికి చేరిందని సీఎం కేసీఆర్ అన్నారు. హుస్నాబాద్‌లోని బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన మాట్లాడుతూ రైతులకు కరెంట్ కూడా సరిగా ఇవ్వలేని పరిస్థితి అప్పుడు ఉండేదని, ఇవాళ తలసరి ఆదాయంలో తెలంగాణ నెంబర్ వన్ ఉందన్నారు. ‘‘పచ్చదనం, పారిశుధ్యంలో తెలంగాణ నెంబర్ వన్. వలసలు, కరెంట్ కోతలతో ఇబ్బంది పడ్డాం. తెలంగాణ వచ్చిన తర్వాత రాష్ట్రం ఎలా ఉందో ఆలోచించండి. పారిశ్రామిక విధానంలో మనమే నంబర్‌వన్‌గా ఉన్నాం. ప్రతిపక్షాలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా అన్నీ పూర్తి చేసుకున్నాం. ఎన్నికలొస్తే పార్టీలు ఏవేవో మాట్లాడుతుంటాయి’’ అంటూ కేసీఆర్ మండిపడ్డారు. ‘‘పెన్షన్లు ఎందుకివ్వాలని ఆలోచించాం. పనిచేసుకోలేని వారికి అండగా నిలచే ఉద్దేశంతోనే పెన్షన్లు ఇస్తున్నాం. ఒంటరి మహిళలు, వికలాంగులకు ఆర్థిక భరోసా కోసమే పెన్షన్లు ఓట్ల కోసం పెన్షన్లు ఇస్తామని ఎప్పుడూ మేం చెప్పలేదు. దశల వారీగా పెన్షన్లు పెంచుకుంటూ వస్తాం. ఓట్ల కోసం పెన్షన్లు ఇస్తామని ఎప్పుడూ మేం చెప్పలేదు. రైతు బంధుతో అన్నదాతలకు అండగా ఉంటున్నాం. రైతుబంధు సాయం ఇంకా పెంచాలని నిర్ణయించాం’’ సీఎం తెలిపారు. ‘‘ఒక్కొక్క ప్రాజెక్టునూ పూర్తి చేసుకుంటూ వస్తున్నాం. రైతు ఇవాళ కంటి నిండా నిద్ర పోతున్నాడు. మిషన్ భగీరథ లాంటి పథకం ప్రపంచంలోనే ఎక్కడా లేదు. ఆడబిడ్డ బిందె పట్టుకుని రోడ్డు మీద నిలబడే పరిస్థితికి ముగింపు పలికాం. తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచింది. ఓటు అనేది మన తలరాతను మారుస్తుంది. రాయి ఏంటో, రత్నమేదో గుర్తించి ఓటువేయాలి. స్పష్టమైన అవగాహనతో ఓటు వేస్తే ప్రజలు గెలుస్తారు’’ అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. చదవండి: బీఆర్ఎస్ మేనిఫెస్టో.. కేసీఆర్ హామీలివే.. -
సికింద్రాబాద్ టు సిద్దిపేట రూ.440
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్ జూబ్లీ బస్ స్టేషన్ నుంచి సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్ బస్ చార్జి రూ.140. వెళ్లి రావటానికి రూ.280. రెండు రోజులకు రూ.560. అదే రైలులో నెల రోజులు ప్రయాణించేందుకు రూ.440 చెల్లిస్తే సరి. రెండు రోజుల బస్ చార్జి కంటే చవకగా, ఏకంగా నెలరోజుల పాటు ప్రయా ణించే వెసులుబాటును రైల్వే శాఖ కల్పించింది. ఈ నెల మూడో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించిన సికింద్రాబాద్–సిద్దిపేట ప్యాసింజర్ రైలు ఆ ప్రాంత వాసులకు కారు చవక ప్రయాణ సౌకర్యాన్ని కల్పించింది. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య 117 కి.మీ. ప్రయాణానికి రైలు టికెట్ ధర కేవలం రూ.60 మాత్రమే. ఇప్పుడు దానిని మరింత చవకగా మారుస్తూ నెలవారీ సీజన్ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చింది. మామూలు టికెట్ ప్రకారం.. వెళ్లి రావటానికి రూ.120 చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ఆ లెక్కన నెల రోజులకు రూ.3,600 అవుతుంది. కానీ, నెల రోజుల సీజన్ టికెట్ కొంటే కేవలం రూ.440తో నెల రోజుల పాటు ఎన్ని ట్రిప్పులైనా తిరగొచ్చు. ఇంతకాలం బస్సులు, ప్రైవేటు వాహనాలకు ఎక్కువ మొత్తం చెల్లిస్తూ ప్రయాణిస్తున్న నిరుపేద వర్గాలకు ఇది పెద్ద వెసులుబాటుగా మారనుంది. స్పెషల్ రైలు సర్వీసుగా సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య ఈ రైలు సేవలు ప్రారంభమైనప్పటికీ, సీజన్ టికెట్‌ను జారీ చేయాలని రైల్వే అధికారులు నిర్ణయించారు. ప్రత్యేక రైలులో ఎక్స్‌ప్రెస్ టికెట్ ధరలను అమలు చేస్తారు. దాన్ని రెగ్యులర్ సర్వీసుగా మార్చగానే ఆర్డినరీ టికెట్ ధరలను వర్తింపచేస్తారు. ఈ ప్రకారం ప్రస్తుతం అమలులో ఉన్న టికెట్ ధర రూ.60 నుంచి రూ.50కి తగ్గుతుంది. అయితే దీనితో సంబంధం లేకుండా ఇప్పుడు సీజన్ టికెట్‌ను అందుబాటులోకి తెచ్చారు. 101 కి.మీ. నుంచి 135 కి.మీ. వరకు ప్రయాణ దూరానికి సీజన్ టికెట్ ధర రూ.440 ఉంటుంది. సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రైలు ప్రయాణ దూరం 117 కి.మీ.గా ఉంది. దీంతో ఈ టికెట్ ధరను రూ.440 ఖరారు చేశారు. నెల తర్వాత దానిని మళ్లీ రెన్యూవల్ చేసుకోవచ్చు. సికింద్రాబాద్ –సిద్దిపేట మధ్య ఇతర స్టేషన్ల వరకు కూడా ఈ సీజన్ టికెట్ పొందే వెసులుబాటు కల్పించారు. ఆయా స్టేషన్ల మధ్య దూరం ఆధారంగా ఆ టికెట్ ధర ఉంటుంది. ట్రిప్పు వేళలు ఇలా.. ♦ సిద్దిపేటలో రైలు (నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్‌కు 10.15కు చేరుకుంటుంది. ♦ తిరిగి సికింద్రాబాద్‌లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది. ♦ తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్‌కు సాయంత్రం 5.20 గంటలకు చేరుకుంటుంది. ♦ సికింద్రాబాద్‌లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేట కు రాత్రి 8.45 గంటలకు చేరుకుంటుంది. ♦ హాల్ట్‌స్టేషన్లు: మల్కాజిగిరి, కేవలరీ బ్యారెక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చ ల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట -
60 పైసల చెక్ ఇచ్చిన బ్యాంకు.. ఇదా అసలు విషయం!
నంగునూరు (సిద్దిపేట): ‘చారాణా కోడికి బారాణా మసాల’ అనే సామెత నిజం చేస్తూ 60 పైసల బ్యాంక్ చెక్కును చూసి ముక్కున వేలు వేసుకున్నారు ప్రజలు. సిద్దిపేట జిల్లా నర్మేటకు చెందిన దాచవరం రాజశేఖర్‌కు రెండు రోజుల కిందట స్పీడ్‌పోస్ట్ ద్వారా కవర్ వచ్చింది. అందులో కేరళలోని సౌత్ ఇండియా బ్యాంక్ త్రిసూర్ బ్రాంచ్ నుంచి అకౌంట్‌పే ద్వారా 60 పైసల చెక్కు రావడంతో రాజశేఖర్ అవాక్కయ్యాడు. చెక్కు ఎవరు పంపారు.. తనకు డబ్బులు ఎందుకు వచ్చాయో.. తెలియక జుట్టు పీక్కున్నాడు. రెండు రోజులపాటు కష్టపడి విచారిస్తే గతంలో క్రెడిట్ కార్డు ద్వారా తీసుకున్న లోన్ క్లియరెన్స్ చేయగా 60 పైసలు ఎక్కువ కట్టినట్లు తేలగా చెక్కు పంపారని తెలుసుకున్నాడు. రాజశేఖర్‌కు చెల్లించే డబ్బులకంటే చెక్కు ఓచర్, స్పీడ్ పోస్ట్‌కు అయ్యే ఖర్చులు ఎక్కువైనా న్యాయ బద్ధంగా చెక్కు పంపినందుకు లోన్ ఇచ్చిన కంపెనీ వారిని గ్రామస్తులు అభినందిస్తున్నారు. ఇంతకీ 60 పైసల చెక్కు తన అకౌంట్లో వేసుకోవాలా.. వద్దా అని రాజశేఖర్ డైలమాలో పడిపోయారు. -
దశాబ్దాల స్వప్నం సాకారమైంది!
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట ప్రజల దశాబ్దాల కల సాకారమైంది. సిద్దిపేట– సికింద్రా బాద్ రైలును నిజామాబాద్ నుంచి ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్‌గా మంగళవారం సాయంత్రం 4:20 గంటలకు ప్రారంభించారు. షెడ్యూల్ ప్రకారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించి.. అనంతరం రైలులో ప్రయా ణించారు. కొండపాక మండలం దుద్దెడ స్టేషన్లో దిగి కొండపాక మండలంలో ప లు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అదే రైలులో దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు గజ్వేల్ వరకు ప్రయాణించారు. బీఆర్ఎస్, బీజేపీ పోటా పోటీ నినాదాలు.. రైలు ప్రారంభోత్సవం సందర్భంగా సిద్ది పేట రైల్వే స్టేషన్‌కు బీఆర్ఎస్, బీజేపీ కార్య కర్తలు భారీగా చేరుకున్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలు సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు వల్లే సిద్దిపేటకు రైలు వచ్చిందని, బీజేపీ కార్యకర్తలు మోదీ వలనే సిద్దిపేటకు రైలు వచ్చిందని పోటాపోటీగా నినాదాలు చేశారు. ప్ల కార్డులు, తమ పార్టీకి చెందిన జెండాలు పట్టుకుని నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలోనే మంత్రి హరీశ్‌రావు రైలు ప్రారంభించేందుకు అక్కడకు చేరుకున్నారు. ప్లెక్సీలో సీఎం కేసీఆర్, స్థానిక ఎంపీ ఫొటోలను ఏర్పాటు చేయకపోవడంతో రైల్వే అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అహసనం వ్యక్తం చేస్తూ మోదీ చిత్రాలను ప్రదర్శిస్తున్న ఎల్ఈడీ టీవీని పక్కన పెట్టించారు. అప్పటికే బీఆర్ఎస్, బీజేపీ కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో ఉద్రి క్తత నెలకొంది. స్టేజీ పైన మోదీ చిత్రంతో ఏర్పాటు చేసిన ప్లెక్సీని చింపేశారు. దీంతో కార్యకర్తలు పరస్పరం బాహాబాహీకి దిగారు. కుర్చీలు, పార్టీల జెండాలను విసురుకోవడంతో బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి తదితరులకు స్వల్పంగా గాయాలయ్యాయి. రైల్వే పోలీసు చంద్రశేఖర్‌కు తలకు కూడా గాయమైంది. సొమ్ము ఒకడిది...సోకు ఒకడిది: హరీశ్ సిద్దిపేటకు రైల్వే లైన్ కోసం రూ. 310 కోట్ల వ్య యంతో 2,508 ఎకరాల భూమిని సేకరించి రైల్వే శాఖకు ఇచ్చామని, రాష్ట్ర ప్రభుత్వం వాటా కింద రూ.330 కోట్లను చెల్లించామని మంత్రి హరీశ్‌రావు చెప్పారు. ఇంత కష్టపడితే కనీసం సీఎం ఫొటోను పెట్టకపోవడం దుర్మార్గమని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుద్దెడ రైల్వే స్టేషన్లో దిగిన తర్వాత కొండపాక ఐవోసీ బిల్డింగ్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. బీజేపీ వాళ్లు రైలు వాళ్ల వల్లే వచ్చిందని చెప్పుకోవడం సిగ్గు చేటని విమర్శించారు. -
రేపటి నుంచి సిద్దిపేటలో రైలుకూత
సాక్షి, హైదరాబాద్: సిద్దిపేట–సికింద్రాబాద్ మార్గంలో రెండు ప్యాసింజర్ రైళ్లు మంగళవారం నుంచి రాకపోకలు సాగించనున్నాయి. వాణిజ్యపరంగా అభివృద్ధి చెందుతున్న సిద్దిపేటతో పాటు గజ్వేల్, ప్రముఖ పుణ్యక్షేత్రాలైన నాచగిరి (నాచారం), కొమురవెల్లి తదితర ప్రాంతాల మీదుగా సికింద్రాబాద్ స్టేషన్‌కు రోజుకు రెండు ప్యాసింజర్ రైళ్లు తిరుగుతాయి. తొలుత కాచిగూడ–సిద్దిపేట మధ్య రైళ్లు తిప్పాలని భావించినా, ఆయా ప్రాంతాల నుంచి ఎక్కువ మంది సికింద్రాబాద్‌కు వస్తున్నందున, సికింద్రాబాద్ స్టేషన్ నుంచే రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే నిర్ణయించింది. సికింద్రాబాద్–సిద్దిపేట (నిడివి 116 కిలోమీటర్లు) డెమూ రైలుచార్జీ :రూ.60 హాల్ట్‌స్టేషన్లు: మల్కాజిగిరి, కెవలరీ బ్యారక్స్, బొల్లారం, గుండ్లపోచంపల్లి, మేడ్చల్, మనోహరాబాద్, నాచారం, బేగంపేట, గజ్వేల్, కొడకండ్ల, లకుడారం, దుద్దెడ, సిద్దిపేట ట్రిప్పులు ఇలా... సిద్దిపేటలో రైలు(నంబరు:07483) ఉదయం 6.45కు బయలుదేరి సికింద్రాబాద్‌కు 10.15కు చేరుకుంటుంది. తిరిగి సికింద్రాబాద్‌లో రైలు (నంబరు:07484) ఉదయం 10.35కు బయలుదేరి సిద్దిపేటకు మధ్యాహ్నం 1.45 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సిద్దిపేటలో మధ్యాహ్నం 2.05 గంటలకు బయలుదేరి సిక్రింద్రాబాద్‌కు సాయంత్రం 5.10 గంటలకు చేరుకుంటుంది. సికింద్రాబాద్‌లో సాయంత్రం.5.45 గంటలకు బయలుదేరి సిద్దిపేటకు రాత్రి 8.40 గంటలకు చేరుకుంటుంది. అయితే ఉదయం సిద్దిపేట బదులు సికింద్రాబాద్ నుంచే రైలు బయలుదేరేలా చూడాలని స్థానిక నేతలు రైల్వేకు లేఖ రాశారు. దీనికి రైల్వే సమ్మతిస్తే ఈ వేళలు అటూ ఇటుగా మారుతాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్టాండ్ నుంచి సిద్దిపేటకు ఎక్స్‌ప్రెస్ బస్సుచార్జీ రూ.140. ప్రయాణ సమయం రెండున్నర గంటలు. రైలులో ప్రయాణ సమయం కాస్త ఎక్కువగా ఉన్నా, చార్జీ మాత్రం బస్సుతో పోలిస్తే సగానికంటే తక్కువగా ఉంది. రైలులో సికింద్రాబాద్–సిద్దిపేట మధ్య రానుపోను రూ.120 అవుతుండగా, పాస్ తీసుకుంటే రూ.90 ఉండొచ్చు. కృష్ణా టు రాయచూర్ రైలు రాకపోకలు షురూ మహబూబ్‌నగర్–మునీరాబాద్ (కర్ణాటక) మధ్య 234 కి.మీ. నిడివితో నిర్మించే రైల్వే ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ సరిహద్దు ప్రాంతమైన కృష్ణా వరకు పనులు పూర్తి కావటంతో కొత్త రైలు సర్విసు ప్రారంభమైంది. కాచిగూడ–బెంగుళూరు మార్గంలో ఉన్న దేవరకద్ర నుంచి కొత్తలైన్ మొదలు, అటు సికింద్రాబాద్–వాడీ మార్గంలో ఉన్న కర్నాటక సరిహద్దు స్టేషన్ అయిన కృష్ణాకు ఇది అనుసంధానమైంది. దీంతో కాచిగూడ నుంచి కృష్ణా స్టేషన్ మీదుగా కర్ణాటకలోని రాయచూరు వరకు ప్యాసింజర్ డెమూ రైలు సర్విసును ఆదివారం ప్రధానమంత్రి నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌లో జరిగిన బహిరంగసభలో జెండా ఊపి ప్రారంభించారు. దీంతో కృష్ణా నుంచి కొత్త రైలు బయలుదేరి కాచిగూడకు చేరుకుంది. సోమవారం నుంచి కాచిగూడ–రాయచూరు మధ్య ప్రారంభమవుతుంది. రైలుచార్జీ: 85.. రోజుకు ఒకటే ట్రిప్పు కాచిగూడ–రాయచూరు (నిడివి 221 కిలోమీటర్లు) ప్రస్తుతం స్పెషల్ సర్వీసుగా ఉన్నందున ఎక్స్‌ప్రెస్ చార్జీలున్నాయి. రెగ్యులర్ సర్విసుగా మారిన తర్వాత ఆర్డినరీ చార్జీలు అమలులోకి వస్తాయి. అప్పుడు చార్జీ రూ.50 ఉంటుంది.హాల్ట్‌స్టేషన్లు: కాచిగూడ, మలక్‌పేట, డబీర్‌పురా, యాకుత్‌పురా, ఉప్పుగూడ, ఫలక్‌నుమా, శివరాంపల్లి, బుద్వేల్, ఉందానగర్, తిమ్మాపూర్, కొత్తూరు, షాద్‌నగర్, బూర్గుల, బాలానగర్, రాజాపురా, గొల్లపల్లి, జడ్చర్ల, దివిటిపల్లి, యెనుగొండ, మహబూబ్‌నగర్, మన్యంకొండ, దేవరకద్ర, మరికల్, జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా, చిక్సుగుర్, రాయచూరు రైలు (నంబరు:07477) వేళలు ఇలా కాచిగూడలో ఉదయం 9.40కి బయలు దేరి 11.50గంటలకు మహబూబ్‌నగర్, 12.14కు దేవరకద్ర, మధ్యాహ్నం 2 గంటలకు కృష్ణా, 3 గం.కు రాయచూరు చేరుకుంటుంది. తిరిగి రాయచూరులో మధ్యాహ్నం.3.30 గంటలకు రైలు(నంబరు:07478)బయలుదేరి 3.49కి కృష్ణా, 5.29కి దేవరకద్ర, 6.05కు మహబూబ్‌నగర్ రాత్రి 9.10గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. -
సిద్దిపేట: ఘోర రోడ్డు ప్రమాదం..ముగ్గురు విద్యార్థులు మృతి
సాక్షి, సిద్ధిపేట: సిద్ధిపేట జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చిన్న కోడూరు మండలం అనంత సాగర్ శివారు.. రాజీవ్ రహదారిపై అగి ఉన్న ఇసుక లారీని వెనుక నుంచి క్వాలిస్ వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదం స్థలంలోనే ముగ్గురు విద్యార్థులు మృతి చెందగా.. మరో ఎనిమిది మందికి తీవ్రగాయలయ్యాయి. క్వాలిస్‌లో మొత్తం11మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని క్షతగాత్రులను చికిత్స కోసం సిద్దిపేట ప్రభుత్వ దవాఖానకు తరలించారు. మృతి చెందిన విద్యార్థులను నితిన్ , గ్రీష్మ, నమ్రతగా గుర్తించారు. విద్యార్థులు ప్రమాద స్థలంలోనే మరణించారు. వీరంతా కరీంనగర్‌లోని తిమ్మాపూర్‌లో పరీక్ష రాసి సిద్దిపేటకు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. విద్యార్థులంతా సిద్దిపేట ఇందూర్ ఇంజినీరింగ్ కళాశాలలో చదువుకుంటున్నారు. మంత్రి హరీష్ రావు సంతాపం సిద్దిపేట జిల్లాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై మంత్రి హరీష్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ సానుభూతి తెలిపారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించాలని అధికారులను ఆదేశించారు. -
‘జీ20 సదస్సు’కు సిద్దిపేట గొల్లభామ చీరలు
సిద్దిపేట జోన్: దేశ రాజధాని ఢిల్లీలో జరిగే జీ20 శిఖరాగ్ర సదస్సు సందర్భంగా సిద్దిపేట గొల్లభామ చీరలను ప్రదర్శించే అవకాశం దక్కింది. వివిధ దేశాల ప్రధానులు, అ ధ్యక్షులు, ఇతర ముఖ్య ప్రతినిధులు హాజ రుకానున్న సదస్సు వేదిక వద్ద పలు స్టాళ్లను ఏర్పాటు చేయనున్నారు. అందులో ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన సిద్దిపేట గొల్లభామ చీరలను కూడా ప్రత్యేక స్టాల్లో ప్రదర్శించనున్నారు. దీంతో సిద్దిపేట నేత న్నల నైపుణ్యం ప్రపంచానికి తెలియనుం దని స్థానికులు హర్షం వ్యక్తంచేస్తున్నారు. ఇలా రూపుదిద్దుకుంది..: కళాత్మకత ఉట్టిపడే గొల్లభామ చీరల ప్రస్థానం 70 ఏళ్ల క్రితం ప్రారంభమైంది. సిద్దిపేటకు చెందిన చేనేత కార్మికులు వీరబత్తిని సోమయ్య, రచ్చ నర్సయ్య.. ఒకరోజు తమ ఇంటి ముందునుంచి తలమీద పాలకుండ, చేతిలో పెరుగు గురిగి పట్టుకొని నడిచివెళుతున్న ఓ మహిళ నీడను చూసి.. వారిలో ‘గొల్ల భామ‘చీరల ఆలోచన పురుడు పోసుకుంది. ఆ దృశ్యాన్ని నేత పని ద్వారా చీరల మీద చిత్రించాలనుకున్నారు. అనుకున్నదే తడ వుగా ఆలోచనలకు పదును పెట్టి గొల్లభామ చీరలను నేసేందుకు ప్రత్యేకమైన సాంచాను తయారు చేసుకున్నారు. అలా ఆవిష్కృతమైన అద్భుతమే.. ‘గొల్లభామ చీర’గా ప్రశస్తి పొందింది. పట్టు, కాటన్.. రెండు రకాల్లోనూ ఈ చీరలను నేస్తారు. చీర అంచుల్లో వయ్యారంగా నడిచే గొల్లభామ చిత్రం వచ్చేలా నేయడమే వీటి ప్రత్యేకత. పెద్ద గొల్లభామ బొమ్మకు దాదాపు 400 దారపు పోగులు అవసరమైతే, చిన్న బొమ్మకు 30 నుంచి 40 పోగులు అవసరం అవుతాయి. ప్రస్తుతం ఇరవై రంగుల్లో గొల్లభామ చీరలను రూపొందిస్తున్నారు. ఒకప్పుడు గొల్లభామ చీర తయారీకి వారం నుంచి 10 రోజులు పట్టేది. ఇప్పుడు జాకార్డు మగ్గం వల్ల మూడు, నాలుగు రోజుల్లో గొల్లభామ చీర తయారు చేస్తున్నారు. మిగతా చీరలతో పోలిస్తే ఈ చీరలను నేయడం కష్టంతో కూడుకున్న పనిగా చెపుతారు. 2012లో ఈ చీరలకు జాగ్రఫికల్ ఇండికేషన్ ట్యాగ్ లభించింది. -
పెళ్లింట విషాదం.. పెళ్లైన తెల్లారే ఇలా..
సాక్షి, సిద్దిపేట: పెళ్లి కట్టిన తోరణాలు వాడనే లేదు.. వివాహానికి వచ్చిన బంధువులు వెళ్లనే లేదు. అంతలోనే పెళ్లింట విషాదం నెలకొంది. వరుడు అకాల మరణం పొందాడు. పెళ్లి జరిగిన మరుసటి రోజే.. వరుడు చనిపోవడంతో కుటుంబ సభ్యులు కన్నీటిపర్యంతమవుతున్నారు. వివరాల ప్రకారం.. సిద్దిపేట అర్బన్ మండలం వెంకటాపుర్‌లో విషాద ఘటన చోటుచేసుకుంది. వివాహం జరిగిన మరుసటి రోజే విద్యుత్ షాక్‌తో వరుడు మృతి చెందాడు. వెంకటాపూర్‌కు చెందిన నిరంజన్ సిద్దిపేటలోని ఇందిరానగర్ ప్రభుత్వ పాఠశాలలో భౌతికశాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. కొన్నేళ్లుగా సిద్దిపేట పట్టణంలో కుటుంబ సభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. అయితే, నిరంజన్‌కు సోమవారం పెళ్లి రిసెప్షన్ జరగాల్సి ఉంది. కాగా, సోమవారం ఉదయం తాను ఉంటున్న ఇంటి వద్ద రిసెప్షన్ కోసం ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో లైటింగ్ తీగలు తగిలి కరెంట్ షాక్‌తో నిరంజన్ మృతిచెందాడు. దీంతో, ఎంతో ఆనందంగా ఉన్న పెళ్లింట విషాదం నెలకొనడంలో కుటంబ సభ్యులు, బంధువులు కన్నీటిపర్యంతమవుతున్నారు. జీవితాంతం తోడుంటానని మూడుముళ్లు వేసిన భర్త అకాల మరణంతో వధువు బోరున విలపిస్తోంది. ఇది కూడా చదవండి: తీవ్ర విషాదం.. నాలాలో పడి మహిళ గల్లంతు.. -
సిటిజన్ ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట టాప్
సాక్షి, సిద్దిపేట: స్వచ్ఛ సర్వేక్షణ్–2023లో భాగంగా పట్టణంలో చెత్త సేకరణ, పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నాయా, పబ్లిక్ టాయిలెట్లు ఉన్నాయా? అని ఇలా పది రకాల ప్రశ్నలతో స్వచ్ఛత యాప్ ద్వారా సిటిజన్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్నారు. లక్షకు పైగా జనాభా కలిగిన పట్టణాల ఫీడ్ బ్యాక్‌లో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ, స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 సంయుక్త ఆధ్వర్యంలో దేశ వ్యాప్తంగా స్వచ్ఛ సర్వేక్షణ్–2023 పేరుతో పోటీలు నిర్వహిస్తోంది. దేశంలోని 4,355 పట్టణా లు ఇందులో మెరుగైన ర్యాంకింగ్ సాధించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాయి. గతేడాది స్వ చ్ఛ సర్వేక్షణ్–2022లో తెలంగాణలోని మున్సిపాలి టీలు, కార్పొరేషన్లు 16 అవార్డులు సాధించాయి. ఫీడ్ బ్యాక్‌లో టాప్‌లో సిద్దిపేట: సిటిజన్ ఫీడ్ బ్యాక్ స్వీకరణ ఆగస్టు 31వ తేదీతో ముగిసింది. దేశ వ్యాప్తంగా 4,355 పట్టణాలుండగా లక్షకు పైగా జనా భా ఉన్నవి 427, లక్షలోపు 3,928 పట్టణాలున్నాయి. లక్షకు పైగా జనాభా కలిగిన 427 పట్టణాల ఫీడ్ బ్యా క్లో తొలి స్థానంలో సిద్దిపేట నిలిచింది. సిద్దిపేట మున్పిపాలిటీలో 1,16,583 జనాభా ఉండగా 76, 283 మంది.. అంటే ఉన్న జనాభాలో 65.43 శాతం మంది ఫీడ్ బ్యాక్ ఇచ్చారు. 32.61 శాతం మంది ఫీడ్ బ్యాక్‌తో 4వ స్థానంలో మహబూబ్‌నగర్, 8.88 శాతంతో 24వ స్థానంలో వరంగల్ ఉంది. ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులు: స్వచ్ఛ సర్వేక్షణ్ లో మొత్తం 9,500 మార్కులు కేటాయించనున్నా రు. అందులో సర్వీస్ లెవల్ ప్రోగ్రెస్‌కు 4,830, సర్టిఫికేషన్‌కు 2,500, సిటిజన్ వాయిస్‌కు 2,170 కేటాయించగా, సిటిజన్ ఫీడ్ బ్యాక్‌కు 600 మార్కులను కేటాయించనున్నారు. జిల్లాలోని ము న్సిపాలిటీలు ఇప్పటికే స్వచ్ఛ సర్వేక్షణ్–2023కు ఆన్లైన్లో డాక్యుమెంట్లను అప్లోడ్ చేశారు. వాటి ప్రకారం పట్టణం ఉందా? లేదా? అని ఫిజికల్‌గా వెరిఫికేషన్ చేయనున్నారు. -
నెలలోపు సిద్దిపేటకు రైలు: మంత్రి హరీష్‌రావు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందని కేసీఆర్ కలలు కన్న సిద్దిపేట సాకారమవుతుందని.. మంత్రి హరీష్‌రావు అన్నారు. నెలలోపు సిద్దిపేటకి రైలు రాబోతుందన్నారు. ఆదివారం ఆయన డ్రోన్ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కోమటి చెరువులో స్కై రెస్టారెంట్, టన్నెల్ అక్వేరియం, వర్చువల్ రియాలిటీ డోమ్ థియేటర్ కూడా ఏర్పాటు చేయాలని మంత్రి శ్రీనివాస్ గౌడ్‌ని హరీష్‌రావు కోరారు. ఆయన మాకు ఆదర్శం: మంత్రి శ్రీనివాస్ గౌడ్ హరీష్ రావు మా అందరికి ఆదర్శప్రాయుడని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. ఆయన ఎక్కడికి వెళ్లిన, ఎక్కడున్నా, ఏం చూసినా ఇది సిద్దిపేటకు కావాలంటాడు. సిద్దిపేటను ఆదర్శంగా తీసుకుని తాము కూడా మహబూబ్ నగర్లో కొన్ని పనులు చేస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ అన్నారు. చదవండి: ఇదేం పిచ్చి రా బాబోయ్.. మొహాలకు న్యూస్ పేపర్లు చుట్టుకొని.. -
సిద్దిపేటలో రైలు కూతపై హరీష్‌రావు హర్షం
సాక్షి, సిద్దిపేట: సిద్ధిపేట వాసుల రైలు కల ఎట్టకేలకు తీరబోతోంది. త్వరలోనే సిద్దిపేటకి రైలు ప్రయాణాలు ఆరంభం కానున్నాయి. ఈ క్రమంలో నర్సాపూర్ స్టేషన్ వరకు ట్రయల్ రన్ నిర్వచించారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. ఇక సిద్దిపేటలో రైలు కూతపై హర్షం వ్యక్తం చేశారు సిద్ధిపేట ఎమ్మెల్యే, తెలంగాణ మంత్రి హరీష్ రావు. ట్రైన్ ముందు సెల్ఫీ దిగి తన ఆనందాన్ని పంచుకున్నారయన. ఎప్పటి నుంచి అనేదానిపై స్పష్టత రావాల్సి ఉండగా.. అది అతిత్వరలోనే అని తాజా ఫొటోతో సంకేతాలు ఇచ్చారాయన. సిద్దిపేట నుంచి సరిపడా సంఖ్యలో ప్రయాణికులు ఉంటారని నిర్ధారించుకున్న అధికారులు.. రోజుకు ఒకటి లేదా రెండు పుష్ పుల్ రైలు ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. సిద్దిపేట నుంచి కాచిగూడకు ఆ రైలు నడుస్తుందని చెబుతున్నారు. ఇక తిరుపతికి, బెంగళూరుకు గానీ ముంబయికి గానీ ఎక్స్ ప్రెస్ రైళ్లను కూడా సిద్దిపేట నుంచి నడపాలని దక్షిణ మధ్య రైల్వే భావిస్తోంది. హైదరాబాద్ నుంచి ప్రారంభం అవుతున్న కొన్ని ఎక్స్ ప్రెస్ లను సిద్దిపేట నుంచి ప్రారంభిస్తే కరీంనగర్ ప్రయాణికులకు కూడా ఉపయోగపడుతుందని రైల్వే అధికారులు యోచిస్తున్నారు. -
సిద్దిపేటలో జురాసిక్ పార్క్
వందల ఏళ్ల కిందట అంతరించిపోయిన డైనోసార్లకు హాలీవుడ్ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ వెండితెరపై రూపం ఇచ్చి ప్రాణం పోశారు. 1993లో వచ్చి న జురాసిక్ పార్క్ క్రియేట్ చేసిన ట్రెండ్ అంతా ఇంతా కాదు. ఆ తరువాత కూడా ఆ చిత్రానికి కొనసాగింపుగా అనేక సినిమాలు వచ్చి ప్రేక్షకాదరణ పొందాయి. ప్రజలకు డైనోసార్లపై ఉన్న ఆసక్తిని గమనించి ఆ తర్వాత డైనోసార్ థీమ్‌తో ప్రపంచ వ్యాప్తంగా అనేక నగరాల్లో పార్కులు వెలిశాయి. నూతన సాంకేతికతను ఉపయోగించి నిజంగా ప్రాణం పోసుకున్నాయా అన్నట్టుగా డైనోసార్లను తయారుచేసి ప్రదర్శించారు. అభివృద్ధి చెందిన దేశాలకు దీటైన రీతిలో ఇప్పుడు కొత్తగా డైనోపార్క్ మన తెలంగాణలోనూ అందుబాటులోకి రాబోతుంది. దానికి సిద్దిపేట వేదిక కాబోతుంది. - సాక్షి, సిద్దిపేట విదేశాల్లోని పార్కుల తరహాలో డైనోపార్క్ అంటే ఏదో ఎగ్జిబిషన్‌లా బొమ్మలు, 3డీ యానిమేషన్ స్క్రీన్లు కాదు. అమెరికా, సింగపూర్లలోని యూనివర్సల్ వరల్డ్ స్టూడియోలో ఉన్న డైనోపార్క్ల తరహాలో కోమటిచెరువు సమీపంలో పార్క్ నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. ఈ పార్క్ పనులు ఏడాది కిందట మొదలు కాగా ప్రస్తుతం చివరి దశకు చేరుకున్నాయి. వారంలో ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 1.5 ఎకరాల విస్తీర్ణంలో.. డైనోసార్ పార్క్‌ను 1.5 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఇందుకోసం సుమారు రూ.12 కోట్లు వెచ్చిస్తున్నారు. ఈ డైనోపార్క్లో పెద్ద గుహలు, కొండలు, గుట్టలు, అటవీ ప్రాంతం, లావా, గ్రీనరీ, వాటర్‌ఫాల్స్ ఇలా మూడు వేల శతాబ్దాల కిందట భూమండలం మీద పరిస్థితులు ఎలా ఉండేవో కళ్లకు కట్టినట్టుగా ఏర్పాటు చేస్తున్నారు. పార్కులో వివిధ రకాల డైనోసార్లు, వాటి గుడ్లు, అస్థిపంజరాలు ఏర్పాటు చేస్తున్నారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి సిలికాన్ డైనోసార్లను ఇక్కడ అందుబాటులో ఉంచుతున్నారు. ఇవి పార్కు ఆవరణలో అటూఇటూ కలియతిరుగుతూ భీకరంగా శబ్దాలు చేస్తూ సందర్శకులను సంభ్రమాశ్చర్యాలకు గురిచేసేందుకు సిద్ధమవుతున్నాయి. వాకింగ్ డైనో.. ఈ డైనో థీమ్ పార్క్‌లో వాకింగ్ డైనోసార్‌ను సైతం ఏర్పాటు చేస్తున్నారు. దీనిలో చిన్నారులు కూర్చుంటే నడుచుకుంటూ వెళ్తుంది. ఒకేసారి ఆరుగురు చిన్నారులు కూర్చునే విధంగా రూపొందించారు. అలాగే లోపల గుహల్లో తిరుగుతున్న సమయంలో సెల్ఫీ పాయింట్‌ను ఏర్పాటు చేశారు. డైనోసార్ గుడ్డులో నుంచి పిల్ల బయటకు వస్తుండగా సెల్ఫీ తీసుకునే అవకాశం ఉంటుంది. పార్క్‌ను చూసేందుకు వస్తున్న పిల్లలను అలరించేందుకు డైనోసార్ సూట్ వేసుకుని ఇద్దరు తిరగనున్నారు. మినీ ట్రాక్.. ఓపెన్ ట్రైన్ డైనోసార్ పార్కులో ఉన్న వింతలు విశేషాలను చూసేందుకు వీలుగా 240 మీటర్ల నిడివితో మినీ ట్రాక్‌ను నిర్మించారు. దీనిపై ఓపెన్ట్రైన్ నడుస్తుంది. ఈ ట్రైన్లో 3 బోగీలు ఉండగా ఒక్కో బోగీలో ఆరుగురు కూర్చునే వీలుంది. ఈ ఓపెన్ ట్రైన్లో తిరుగుతున్న సమయంలో సందర్శకులకు సరికొత్త అనుభూతిని ఇచ్చేలా ఒక్కసారిగా డైనోసార్లు మీదపడినట్టు, భీకరంగా అరవడం లాంటివి చేసేలా పార్క్‌ను డిజైన్ చేశారు. గుజరాత్‌ను మించేలా.. మన దేశంలో గుజరాత్‌లోని రయోలిలో డైనోసార్ గుడ్లు లభించాయి. దీంతో అక్కడ డైనోసార్ మ్యూజియం ఏర్పాటు చేశారు. ఈ మ్యూజియంలో నిలకడగా ఉండే డైనోసార్లను ప్రదర్శనకు ఉంచారు. డైనోసార్లలో ఒక్కటి మాత్రమే అరుస్తూ.. తోక ఊపుతుంది. కానీ సిద్దిపేటలో ప్రారంభంకాబోతున్న పార్క్‌లో కదిలే డైనోసార్లు 18 ఉన్నాయి. ఇవికాకుండా మరో ఐదు నిలకడగా ఉండేవి ఏర్పాటు చేశారు. ఒక రకంగా దేశంలో ఇదే అత్యుత్తమ, అత్యంత పెద్ద డైనోసార్ పార్క్ అని అంటున్నారు. కొత్త అనుభూతి కలిగిస్తుంది కోమటి చెరువులో మరో మణిహారంగా డైనోసార్ పార్క్ ఏర్పాటు కాబోతుంది. ఇప్పటికే రాక్‌గార్డెన్, గ్లో గార్డెన్, అడ్వెంచర్ పార్క్‌ల చెంతన వినూత్నమైన రీతిలో కొత్త అనుభూతిని కలిగించేలా డైనోసార్ పార్క్ అందుబాటులోకి రానుంది. సాహస అనుభవాలని, జ్ఞాపకాలని, మధురానుభూతిని కలిగించేలా డైనోసార్ పార్కు ఉంటుంది. దేశంలో ఎక్కడాలేని విధంగా సిద్దిపేటలో ఈ పార్క్ ఉండబోతుంది. -
సిద్దిపేటలో ఉత్సాహంగా హాఫ్ మారథాన్
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో రంగనాయకసాగర్ వేదికగా ఆదివారం జరిగిన హాఫ్ మారథాన్‌లో దేశం నలుమూలల నుంచి వచ్చిన రన్నర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడు తూ ‘సిద్దిపేట అన్నింటిలో మేటి.. నేడు హాఫ్ మారథాన్లోనూ బెస్ట్‌గా నిలిచింది’అని అన్నారు. అనంతరం విజేతలకు ఆయన బహుమతులు అందజేశారు. కాగా, దేశంలోనే తొలిసారిగా ప్లాస్టిక్ రహిత హాఫ్ మారథాన్‌ను సిద్దిపేటలో నిర్వహించారు. ఈ పోటీల్లో మహిళా విభాగంలో సూర్యాపేటకు చెందిన ఉమ, పురుషుల విభాగంలో నాగర్‌కర్నూల్‌కు చెందిన రమేశ్ చంద్ర ప్రథమ బహుమతులు గెలుచుకున్నారు. 10కే రన్ మహిళా విభాగంలో ప్రథమ బహుమతి నాగర్‌కర్నూల్‌కు చెందిన స్వప్న, పురుషుల విభాగంలో మహారాష్ట్రకు చెందిన సునీల్‌కుమార్ సాధించారు. కాగా, హైదరాబాద్ నుంచి 100 కిలోమీటర్లు రన్ చేసుకుంటూ వచ్చిన శ్రీకాంత్‌ను, అలాగే హైదరాబాద్ నుంచి సైక్లింగ్ చేసుకుంటూ వచ్చిన నేచర్‌క్యూర్ ఆస్పత్రి డాక్టర్ నాగలక్ష్మిలను మంత్రి సత్కరించారు. 10 కిలోమీటర్ల పరుగులో వరంగల్ జెడ్పీ చైర్పర్సన్ గండ్ర జ్యోతి పాల్గొని 1.06 గంటల్లో పూర్తి చేశారు. హాఫ్ మారథాన్ (21.1కిలోమీటర్లు)లో 400 మంది, పది కిలోమీటర్ల రన్లో 550, 5 కిలోమీటర్ల రన్లో 4వేల మంది పాలుపంచుకున్నారు. సిద్దిపేట సీపీ శ్వేత, జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ పాల్గొన్నారు. -
సిద్ధిపేట శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని సందర్శించిన హరీశ్
-
హై సొసైటీ సాగుగా మారిన మిద్దె తోటలు
-
హైదరాబాద్ లో బద్రినాథ్ ఆలయం
-
స్వచ్ఛ బడి.. సేంద్రియ సిరి
సాక్షి, సిద్దిపేట : సిద్దిపేటలో ఏర్పాటు చేసిన ‘స్వచ్ఛ బడి’ సత్ఫలితాలు ఇస్తోంది. పట్టణంలోని ఒకటి రెండు కాదు, ఏకంగా 3 వేలకు పైగా ఇళ్లలో చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. ఈ ఎరు వును ఇంటిమేడపై సాగు చేస్తున్న మిద్దె తోటలకు వినియోగిస్తున్నారు. స్వచ్ఛ బడి ద్వారా నేర్చుకున్న పాఠాలను ఆచరణలో పెట్టి అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. చెత్త ఒక వ్యర్థం కాదని నిరూపిస్తు న్నారు. ఇదే విధానాన్ని అందరూ అవలంబిస్తే పర్యావరణ కాలుష్యానికి కళ్లెం వేయడంతో పాటు చెత్త, డంపింగ్ యార్డుల సమస్యను చాలావరకు అధిగమించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల ఈ స్వచ్ఛబడిని సందర్శించిన మంత్రి కేటీఆర్ రాష్ట్రవ్యాప్తంగా ఇలాంటి బడులు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామని ప్రకటించారు. స్వచ్ఛ బడి అంటే.. సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో 2021 ఏప్రిల్ 10న ఈ స్వచ్ఛ బడిని ప్రారంభించారు. ఎకరానికి పైగా విస్తీర్ణంలో దేశంలోనే రెండోదైన స్వచ్ఛ బడిని మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో ఏర్పాటు చేశారు. ఇది అ..అంటే అమ్మ, ఆ..అంటే ఆవు లాంటి పదాలు ఇతర పాఠాలు బోధించే బడి కాదు. పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై ఆరేళ్ల నుంచి అరవై ఏళ్ల వయసు గల వారికి పాఠాలు చెప్పే బడి. ఒకేసారి 50 మంది క్లాస్ వినే విధంగా దీనిని ఏర్పాటు చేశారు. వర్మీ కంపోస్టు యార్డు, పక్కనే పార్కు, డిజిటల్ తరగతి గది, హోం కమ్యూనిటీ కంపోస్టింగ్ ఏర్పాటు చేశారు. సేంద్రియ ఎరువుల ద్వారా పండించే కూరగాయల తోట పెట్టారు. ప్లాస్టిక్‌తో కలిగే అనర్థాల గురించి తెలిసేలా చిత్రాలను వేశారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, వ్యర్థాల నిర్వహణ, పునర్వినియోగంపై బోధించడంతో పాటు పనికి రాని వస్తువులతో వివిధ రకాల వస్తువులను తయారు చేయడం, ఖాళీ సీసాలతో స్వాగత తోరణాలు, వెదురు బొంగులతో ప్రహరీ ఏర్పాటు చేయడంపై శిక్షణ ఇస్తున్నారు. ఫోర్ ఆర్ పై శిక్షణ.. తడి, పొడి, హానికరమైన చెత్తను వేరు చేయడం, ఫోర్ ఆర్.. అంటే రీయూజ్ (పునర్వినియోగం), రీసైకిల్ (తిరిగి తయారీ), రెఫ్యూజ్ (నిరాకరించడం), రెడ్యూస్ (తగ్గింపు) చేయడం కూడా నేర్పిస్తున్నారు. జీరో వేస్ట్ మేనేజ్మెంట్, తడి చెత్తతో సేంద్రియ ఎరువు తయారీపై ప్రత్యక్షంగా వివరిస్తున్నారు. ఇలా ఒక్క క్లాస్ రెండున్నర గంటల పాటు ఉంటుంది. ఈ బడిలో ఇప్పటివరకు 8వేల మందికి పైగా పాఠాలు విన్నారు. రాష్ట్రం నలుమూ లల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల వారు విదేశీ యులు సైతం సందర్శించి స్వచ్ఛ బడి గురించి తెలుసుకుంటున్నారు. 15 మున్సి పాలిటీలకు చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులు, మహిళా సంఘాల ప్రతినిధులు క్లాస్‌లు విన్నారు. బెంగళూరుకు చెందిన డాక్టర్ శాంతి పర్యవేక్షణలో స్వచ్ఛ బడి కొనసాగు తోంది. తడి చెత్తతో ఎరువు.. ప్రతి రోజూ మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్త బండ్లు పట్ట ణంలోని గృహాలకు తిరిగి తడి, పొడిచెత్తను వేర్వేరుగా సేకరిస్తుంటాయి. పట్టణంలోని 43 వార్డుల్లో 41,322 గృహాలు, 1,57,026 జనాభా ఉంది. ఇందులో 3 వేలకు పైగా ఇళ్లలో తడి చెత్తతో సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నారు. కేవలం పొడి, హానికరమైన చెత్తను మాత్రం చెత్తబండికి అందజేస్తున్నారు. ఇలా ఇంట్లోనే తయారు చేసే సేంద్రియ ఎరువుతో కూరగాయలు బాగా కాస్తుండటంతో పట్టణవాసులు క్రమంగా దీని తయారీకి మొగ్గు చూపుతున్నారు. సేంద్రియ ఎరువుతో కూరగాయల సాగు స్వచ్ఛ బడిలో పర్యావరణ పరిరక్షణ కోసం క్లాస్‌లు విన్నాను. అప్పటి నుంచి మా ఇంటి నుంచి తడి చెత్తను మున్సిపాలిటీ బండికి ఇవ్వడం మానేశా. దాన్ని ఉపయోగించి ఇంట్లోనే సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నా. దీనిని మిద్దెతోటలోని మొక్కలకు వేయడంతో కూరగాయలు, పూలు బాగా కాస్తున్నాయి. – గుడాల జ్యోతి, ప్రైవేట్ స్కూల్ టీచర్, సిద్దిపేట భవిష్యత్ తరాల కోసం.. బెంగళూరులో జీరో వేస్ట్ మేనేజ్ మెంట్ గురించి తెలుసుకు న్నాం. డాక్టర్ శాంతి చెప్పిన మాటలు మాకు స్ఫూర్తిని ఇచ్చాయి. మంత్రి హరీశ్‌రావు చొరవతో సిద్దిపేటలోస్వచ్ఛ బడిని ఏర్పాటు చేసి పట్టణవాసులకు అవగాహన కల్పిస్తు న్నాం. భవిష్యత్ తరాల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని దీనికి శ్రీకారం చుట్టాం. – దీప్తి నాగరాజు, కౌన్సిలర్, స్వచ్ఛ బడి నిర్వాహకురాలు -
TS: సోలిపేట రామచంద్రారెడ్డి కన్నుమూత
సాక్షి, హైదరాబాద్: సీనియర్ పొలిటీషియన్, రాజ్యసభ మాజీ సభ్యుడు సోలిపేట రామచంద్రారెడ్డి(92) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు ప్రకటించారు. 70 ఏళ్ల పాటు రాజకీయాలలో క్రియాశీలంగా పనిచేసి మచ్చలేని నేతగా పేరుపొందారు. సోలిపేట స్వస్థలం సిద్దిపేట జిల్లా దుబ్బాక (మం) చిట్టాపూర్ గ్రామం. రామచంద్రారెడ్డి తొలితరం కమ్యూనిస్టు నాయకుల స్ఫూర్తితో తెలంగాణ రైతాంగ పోరాటంలో పాల్గొన్నారు. సర్పంచ్ నుంచి ఎంపీ వరకు రాజకీయాల్లో రాణించిన సోలిపేట గతంలో దొమ్మాట (ప్రస్తుత దుబ్బాక) ఎమ్మెల్యేగా పని చేశారు. కాంగ్రెస్, టీడీపీ, లోక్‌సత్తాతో పని చేసిన సోలిపేట.. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు. ఆ తర్వాత రాజ్యసభకు వెళ్లారాయన. భారత చైనా మిత్రమండలికి అధ్యక్షులుగా, సి. ఆర్. ఫౌండేషన్, తెలంగాణ అమరవీరుల స్మారక ట్రస్టు వంటి సంస్థలకు సభ్యులుగా సేవలందించారు. సోలిపేట రామచంద్రారెడ్డికి భార్య, ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. సి.నారాయణరెడ్డి చిన్న కుమార్తెను.. రామచంద్రారెడ్డి పెద్ద కుమారుడు వెంకటేశ్వర్ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. హైదరాబాద్ బంజారాహిల్స్ లోని ఎమ్మెల్యే కాలనీలో ఆయన కుటుంబం నివాసం ఉంటోంది. అక్కడే ఆయన కన్నుమూయగా.. సందర్శనార్థం ఆయన పార్థీవదేహాన్ని అక్కడే ఉంచారు. ఈ సాయంత్రం ఫిలింనగర్ మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. హరీష్‌రావు సంతాపం సోలిపేట రామచంద్రారెడ్డి మృతిపట్ల మంత్రి హరీశ్ రావు సంతాపం వ్యక్తం చేశారు. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో ఆయన పాత్ర స్ఫూర్తిదాయకమన్నారు. సర్పంచి స్థాయి నుంచి ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎదిగి ప్రజల మన్ననలు పొందారన్నారు. ఎందరికో ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు చెబుతూ.. వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఇదీ చదవండి: ఉన్నత విద్యామండలి చైర్మన్‌గా లింబాద్రి -
సిద్ధిపేటలో రోబోటిక్స్, 3D ప్రింటింగ్ టెక్నాలజీతో దేవాలయాల నిర్మాణం
-
సిద్దిపేటకు రైలు.. తిరుపతి, బెంగళూరు, ముంబయికి ఎక్స్‌ప్రెస్ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: ఆగస్టులో సిద్దిపేటకు రైలు సర్విసులు ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా జూలై చివరి నాటికి లేదా ఆగస్టు మొదటి వారాంతానికి సిద్దిపేట వరకు రైల్వే లైన్ సిద్ధం కాబోతోంది. ప్రస్తుతం సిద్దిపేట సమీపంలోని దుద్దెడ వరకు పూర్తిస్థాయి ట్రాక్ ఏర్పాటు పూర్తికాగా, అక్కడి నుంచి సిద్దిపేట చేరువ వరకు తాత్కాలిక ట్రాక్ ఏర్పాటు పూర్తయింది. సిద్దిపేట బైపాస్ వరకు ఆ పనులు పూర్తయిన తర్వాత శాశ్వత ప్రాతిపదికన పట్టాలు ఏర్పాటు చేస్తారు. ఆ వెంటనే రైల్వే సేఫ్టీ కమిషనర్ దుద్దెడ నుంచి సిద్దిపేట వరకు ట్రాక్ సామర్థ్యాన్ని పరీక్షించి అనుమతి ఇవ్వగానే రైలు సేవలు ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్పుల్.. ఎక్స్‌ప్రెస్‌లు.. గజ్వేల్ వరకు లైన్ నిర్మాణం పూర్తయిన వెంటనే గతేడాదే అక్కడి నుంచి నగరానికి ప్యాసింజర్ రైలు నడపాలని నిర్ణయించారు. కానీ కోవిడ్ ఆంక్షలతో ఇందుకు ఆటంకం ఎదురయ్యింది. తర్వాత ప్రారంభించాలని భావించినా, గజ్వేల్ నుంచి నిత్యం నగరానికి ఓ రైలుకు సరిపడా ప్రయాణికులు ఉండరన్న అభిప్రాయం వ్యక్తం కావటంతో ఆ ప్రయత్నాన్ని అధికారులు విరమించుకున్నారు. ఇప్పుడు సిద్దిపేట నుంచి సరిపడ సంఖ్యలో ప్రయాణికులు ఉంటారని నిర్ధారించుకున్న అధికారులు.. రోజుకు ఒకటి లేదా రెండు పుష్పుల్ రైలు ట్రిప్పులు నడపాలని నిర్ణయించారు. సిద్దిపేట నుంచి కాచిగూడకు ఆ రైలు నడుస్తుందని చెబుతున్నారు. ఇక తిరుపతికి, బెంగళూరుకు గాని ముంబయికి గాని ఎక్స్‌ప్రెస్ రైళ్లను కూడా సిద్దిపేట నుంచి నడపాలని అధికారులు నిర్ణయించారు. హైదరాబాద్ నుంచి ప్రారంభమవుతున్న కొన్ని ఎక్స్‌ప్రెస్‌లను సిద్దిపేట నుంచి ప్రారంభిస్తే, కరీంనగర్ ప్రయాణికులకు కూడా వెసులుబాటుగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. సిద్దిపేట స్టేషన్ వద్ద ఐదు లైన్లు.. సిద్దిపేటలో రైల్వే స్టేషన్ భవనం వేగంగా సిద్ధమవుతోంది. దాంతోపాటు సరుకు రవాణాకు భారీ గూడ్సు యార్డును నిర్మిస్తున్నారు. ఇక్కడ మొత్తం ఐదు లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. ఒకటి మెయిన్ లైన్, రెండు లూప్లైన్లు, ఒకటి గూడ్సు లైను, ట్రాక్ మెయింటెనెన్స్‌కు వినియోగించే ట్రాక్ మిషన్ కోసం సైడింగ్ లైన్ ఏర్పాటు చేస్తున్నారు. ప్లాట్‌ఫామ్స్ 750 మీటర్ల పొడవుతో సిద్ధం చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి సరుకు రవాణా భారీగానే ఉంటుందని అంచనా వేస్తున్న రైల్వే శాఖ, అందుకోసం దాదాపు 800 మీటర్ల పొడవుతో గూడ్సు షెడ్డును ఏర్పాటు చేస్తోంది. ఇప్పటికే గజ్వేల్‌లో 600 మీటర్ల పొడవుతో ఏర్పాటు చేసిన సరుకు రవాణా యార్డు బాగా ఉపయోగపడుతోంది. ఈ ప్రాంతానికి కావాల్సిన ఎరువులు రైలు ద్వారానే వస్తున్నాయి. ఈ ప్రాంతం నుంచి ధాన్యం క్రమం తప్పకుండా ఎగుమతి అవుతోంది. సిద్దిపేటలో కూడా సరుకు రవాణా ప్రాంగణం అందుబాటులోకి వస్తే ధాన్యం తరలింపు ఊపందుకోనుంది. -
సిద్దిపేటలో అంతర్జాతీయ యోగా దినోత్సవం
-
కేటీఆర్ చేతుల మీదుగా సిద్దిపేట ఐటీ హబ్ ప్రారంభం
సాక్షి, సిద్ధిపేట: నియోజకవర్గ స్థాయి యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా కేసీఆర్ సర్కారు సిద్ధిపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేసిందని రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు చెప్పారు. ప్రారంభానికి సిద్ధంగా ఉన్న ఐటీ హబ్‌ను శుక్రవారం సందర్శించారాయన. జిల్లా కేంద్రమైన సిద్ధిపేట శివారులో నిర్మిస్తున్న ఐటీ హబ్ ను మంత్రి హరీశ్ రావు.. ఏంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, టీఏస్ఐఐసీ జోనల్ మేనేజర్ మాధవిలతో కలిసి సందర్శించారు. ఐటీ టవరులోని ప్రతీ ఫ్లోర్ కలియ తిరుగుతూ సందర్శించి జిల్లా కలెక్టర్, టీఏస్ఐఐసీ అధికారులతో ప్రారంభోత్సవ ఏర్పాట్లపై మంత్రి సమీక్ష జరిపారు. అత్యాధునిక సదుపాయాలతో నిర్మిస్తున్న ఐటీ హబ్ భవనాన్ని ఈ నెల జూన్ 15వ తేదీన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు మంత్రి హరీశ్ రావు వెల్లడించారు. దీంతో ప్రత్యక్షంగా 750 మంది స్థానిక యువతకు, పరోక్షంగా మరికొంత మందికి ఉపాధి లభిస్తుందని పేర్కొన్నారు. 150 మందికి నిరంతర శిక్షణ సిద్ధిపేట ఐటీ హబ్ లో టాస్క్ ఆధ్వర్యంలో ప్రతీ బ్యాచ్ లో 150 మంది నిరుద్యోగ యువతకు శిక్షణ తరగతులు నిర్వహిస్తారని, ప్రతీ 45 రోజులకు ఒక బ్యాచ్ ఉంటుందని మంత్రి హరీశ్ రావు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఇక.. ఈ జూన్ నెల 13వ తేదీన సిద్ధిపేట పోలీసు కన్వెన్షన్ హాల్ లో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. ఈ మెగా జాబ్ మేళాలో 11 కంపెనీలు ఉద్యోగ అవకాశాలు ఇవ్వనున్నాయని, ఈ సదవకాశాన్ని యువత సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
సిద్దిపేట ముద్దు బిడ్డ లాస్యకు హరీశ్ రావు అభినందన
ప్రముఖ తెలుగు ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఆహాలో ప్రసారమైన తెలుగు ఇండియన్ ఐడల్ 2 షో విజయవంతంగా ముగిసింది. గ్రాండ్ ఫినాలేకు ముఖ్య అతిథిగా హాజరైన అల్లు అర్జున్ విశాఖపట్నానికి సౌజన్య భాగవతులను విజేతగా ప్రకటిస్తూ ఆమెకు ట్రోఫీ అందించాడు. హైదరాబాద్‌కు చెందిన జయరాం ఫస్ట్ రన్నరప్‌గా, సిద్దిపేటకు చెందిన లాస్య ప్రియ సెకండ్ రన్నరప్‌గా నిలిచింది. ఎంతోమంది యువ గాయకులతో పోటీ పడి రెండో రన్నరప్ స్థానాన్ని సాధించిన లాస్యప్రియను ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్ రావు అభినందించారు. 'సింగింగ్ కాంపిటీషన్లో రన్నరప్‌గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియకు హృదయ పూర్వక అభినందనలు. భవిష్యత్‌లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్ ఉండేలా దీవించాలని భగవంతుడిని ప్రార్ధిస్తున్నాను' అంటూ ట్వీట్ చేశారు. కాగా తెలుగు ఇండియన్ ఐడల్ 2 షో మొత్తం 25 ఎపిపోడ్లకు గాను 10 వేల మంది యువ గాయకులు తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. వీరిలో ఐదుగురు మాత్రమే ఫినాలేకు చేరుకున్నారు. సౌజన్య, జయరాం, లాస్యప్రియతో పాటు న్యూజెర్సీకి చెందిన శ్రుతి, హైదరాబాద్‌కు చెందిన కార్తికేయ టాప్-5లో నిలిచారు. ఇండియన్ ఐడల్ తెలుగు -2023 సింగింగ్ కాంపిటీషన్ లో రన్నర్ అప్ గా నిలిచిన సిద్దిపేట ముద్దుబిడ్డ లాస్య ప్రియ కు హృదయ పూర్వక అభినందనలు 💐 భవిష్యత్ లో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షిస్తున్నాను. తెలుగు సంగీతంలోని మాధుర్యాన్ని అద్భుతంగా ఆవిష్కరించిన గాయకులందరికి గొప్ప భవిష్యత్… pic.twitter.com/MgL1iOPV36 — Harish Rao Thanneeru (@BRSHarish) June 5, 2023 Blockbuster season comes to an end… Happy to present Top 3 of #teluguindianidol2😍 Many congratulations and all the best for your singing careers!#Soujanya #Jayaram #LasyaPriya pic.twitter.com/CVV8hXCT1p — ahavideoin (@ahavideoIN) June 5, 2023 చదవండి: -
పదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం: కేటీఆర్
సాక్షి, సిరిసిల్ల: తెలంగాణవ్యాప్తంగా నేడు రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మంత్రి కేటీఆర్ సిరిసిల్లలో ఆవిర్బావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం, కేటీఆర్ జాతీయ జెండా ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ‘పదేళ్లలో ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేశాం. మిషన్ భగీరథతో ప్రతీ ఇంటికీ తాగునీరు అందించాం. దేశంలో ఏ రాష్ట్రంలోనూ హరితహారం కార్యక్రమం ఈ స్థాయిలో లేదు’ అని అన్నారు. సిద్దిపేట జిల్లాలో కలెక్టరేట్లో జరిగిన దశాబ్ది ఉత్సవాల్లో మంత్రి హరీశ్ రావు పాల్గొన్నారు. పోలీసుల గౌరవవందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతులకు అండగా నిలిచిందని చెప్పారు. గతంలో చెరువులు ఎండిపోయి ఉండేవని.. ఇప్పుడు నిండుగా మండుటెండల్లోనూ నిండుగా ఉన్నాయని చెప్పారు. ఉమ్మడి రాష్ట్రంలో తాగునీటి కోసం యుద్ధాలు జరిగేవని.. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదన్నారు. అంతకుముందు సిద్దిపేట పట్టణంలోని తన క్యాంపు కార్యాలయంలో జాతీయ జెండాను ఎగురవేశారు. రంగదాంపల్లిలో అమరవీరుల స్థూపం వద్ద పూలమాలవేసి నివాళులర్పించారు. ముస్తాబాద్ సర్కిల్లోని ప్రొఫెసర్ జయశంకర్ సార్ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. ఇది కూడా చదవండి: ‘తెలంగాణ కోసం సుష్మాస్వరాజ్ పోరాడారు’ -
రియల్ రంగంలోకి ‘సుడా’
సాక్షి, సిద్దిపేట : రియల్ ఎస్టేట్ రంగంలోకి ‘సుడా’ (సిద్దిపేట పట్టణాభివృద్ధి సంస్థ) అడుగు పెడుతోంది. గతేడాది డిసెంబర్ 9న ప్రభుత్వం విడుదల చేసిన జీఓ 234 ప్రకా రం సిద్దిపేట పట్టణ శివారులోని మిట్టపల్లి సమీపంలో 14 ఎకరాల అసైన్డ్ భూములను సుడా సేకరించింది. రాష్ట్రంలోనే తొలిసారిగా అసైన్డ్ ల్యాండ్ పూలింగ్తో మోడల్ లే అవుట్ ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే సిద్దిపేట అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఓ వైపు పర్యాటకంగా, మరోవైపు సాగు జలాలు, విద్యా కేంద్రంగా విలసిల్లుతోంది. త్వరలో రైలు సౌకర్యం కూడా రానుంది. పట్టణ శివారులో ఇప్పటికే పలు ప్రైవేట్ కంపెనీలు వెంచర్లు చేసి విక్రయిస్తున్నాయి. దీంతో భూములకు డిమాండ్ పెరిగింది. శనివారం సుడా మోడల్ టౌన్షిప్పై సిద్దిపేటలోని విపంచి కళానిలయంలో ప్రీబిడ్ మీటింగ్ ఏర్పాటు చేశారు. 10 మంది రైతులు.. 14 ఎకరాలు సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో అసైన్డ్ భూములు కలిగిన పది మంది రైతుల నుంచి 14 ఎకరాల భూమిని సేకరించారు. ఎకరం భూమి కోల్పోతున్న రైతుకు డెవలప్ మెంట్ చేసిన టౌన్షిప్లో 800 గజాల స్థలం ఇస్తారు. 14 ఎకరాల భూమిలో 67,760 గజాల భూమి తేలింది. ప్రధాన రోడ్డు 60 ఫీట్లు, అంతర్గత రోడ్లు 33 ఫీట్లతో నిర్మా ణాలు చివరి దశలో ఉన్నాయి. రోడ్లకు 23,907 గజాలు, పార్కులకు 6,098 గజాలు, ఇతర మౌలిక సదుపాయాలకు 2,391 గజాలు వినియోగిస్తున్నారు. దీంతో 35,360 గజాల స్థలం మిగిలింది. దీనిని 161 ప్లాట్లుగా విభజించారు. అందులో 10 మంది రైతులకు 50 ప్లాట్లు, 111 ప్లాట్లు సుడాకు మిగులుతాయి. స్ట్రీట్ లైట్లు, పార్కులు, మొక్కల పెంపకం,తాగునీటి సౌకర్యం.. ఇలా సకల సౌకర్యాలతో మోడల్ టౌన్షిప్ ఏర్పాటు చేస్తున్నారు. నేడు ప్రీబిడ్ మీటింగ్ ఈ నెల 29న తొలి విడతలో 101 ప్లాట్లను బహిరంగ వేలం ద్వారా విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అందులో భాగంగా ముందుగా ప్రీబిడ్ మీటింగ్‌ను శనివారం పట్టణంలోని విపంచి కళానిలయంలో ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో పాట్లు కొనుగోలు చేయాలనుకునే వారి సందేహాలను నివృత్తి చేయనున్నారు. ఒక్కో గజానికి ప్రభుత్వ ధరగా రూ.8 వేలు నిర్ణయించారు. ఆ ధర నుంచి సుడా అధికారులు వేలం ప్రారంభించనున్నారు. ఈ వేలంలో పాల్గొనే వారు దరఖాస్తు ఫీజు కింద రూ.5 వేలు చెల్లించాలి. కాగా, ప్లాట్ల విక్రయాల ద్వారా వచ్చిన డబ్బుతో సుడా ఆధ్వర్యంలో పలు అభివృద్ధి పనులు చేపడతారు. సకల సౌకర్యాలతో లే అవుట్ –రమణాచారి, సుడా వైస్ చైర్మన్ (19ఎస్డీపీ12) జీఓ 234 ప్రకారం రాష్ట్రంలోనే తొలి సారిగా అసైన్డ్ భూమిని ల్యాండ్ పూలింగ్ ద్వారా సేకరించాం. వేలంపాట ద్వారా ప్లాటు దక్కించుకున్న వారు వారంరోజుల్లో 25 శాతం డబ్బులు చెల్లించాలి. మిగతా డబ్బులు 60 రోజుల్లో చెల్లించాలి. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, విశాలమైన అంతర్గత రోడ్లు, నీటి సరఫరా, పార్కుల వంటి సకల సౌకర్యాలతో మోడల్ టౌన్‌షిప్‌ను ఏర్పాటు చేస్తాం. ఈ నెల 29న వేలం పాట నిర్వహిస్తాం. -
హామీలు నెరవేర్చాలని ‘కలెక్టరేట్’ ఎక్కిన రైతులు
సిద్దిపేట రూరల్: సిద్దిపేట కలెక్టరేట్, కమిషనరేట్ల నిర్మాణంలో భాగంగా భూములు ఇచ్చిన రైతులు తమకు ప్రభుత్వం చేసిన హామీలను పూర్తిస్థాయిలో నెరవేర్చాలని కోరుతూ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. సోమవారం కొండపాక మండలం దుద్దెడ గ్రామానికి చెందిన సుమారు 100 మంది బాధిత రైతులు తమ గోడును విన్నవించేందుకు ప్రజావాణికి వచ్చారు. అయితే బాధితులను పోలీసులు లోపలికి అనుమతించలేదు. వారితో మాట్లాడి గొడవ కాకుండా సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. తమను లోపలికి అనుమతించకపోవడంతో కలెక్టరేట్ ఎదుట నిరసన వ్యక్తం చేస్తామని చెప్పిన రైతులు, ఒక్కసారిగా కార్యాలయ భవనంపైకి ఎక్కి న్యాయం కావాలంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని భవనంపైనుంచి కిందకి తీసుకువచ్చారు. అనంతరం బాధిత రైతులు మాట్లాడుతూ కొండపాక మండలం దుద్దెడ, రాంపల్లి గ్రామాలకు చెందిన 663, 143 సర్వే నంబర్లలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 165 మంది రైతులకు 365 ఎకరాల భూమిని పంపిణీ చేసిందన్నారు. ఐదేళ్ల క్రితం రాష్ట్ర ప్రభుత్వం ఆ మొత్తం భూమిని సిద్దిపేట కలెక్టరేట్, కమిషనరేట్ నిర్మాణానికి సేకరించిందని, భూమికి నష్టపరిహారంగా రూ. 20 లక్షలు, కలెక్టరేట్ వద్ద 200 గజాల ఇంటి స్థలం అందిస్తామని అప్పటి కలెక్టర్ వెంకట్రామిరెడ్డి హామీ ఇచ్చారని వెల్లడించారు. తమలో కొంతమందికి డబ్బులు ఇచ్చి.. ఇంటిస్థలం పట్టా సర్టిఫికెట్ మాత్రం ఇచ్చారని, కానీ రిజిస్ట్రేషన్ మాత్రం చేయడంలేదని చెప్పారు. ఈ విషయంపై ఎన్నోసార్లు కలెక్టర్‌కు విన్నవించినా ఎలాంటి ఫలితం లేదని, పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యయత్నం చేసినా అధికారుల్లో మార్పు రాలేదని విచారం వ్యక్తంచేశారు. అనంతరం రైతులను ప్రజావాణిలో అదనపు కలెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి వద్దకు అనుమతించగా బాధితులు తమ గోడు వెల్లబోసుకున్నారు. దీనిపై స్పందించిన అదనపు కలెక్టర్.. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వారంలోపు సమావేశం నిర్వహించి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. బాధితులు బయటకు వచ్చాక భవనంపైకి ఎక్కిన ఘటనలో పోలీసులు పలువురు ఆందోళనకారులను అరెస్టు చేసి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. -
ఈ బుడ్డోడి తెలివి మామూలుగా లేదు..
-
సిద్దిపేటలో విషాదం.. ముగ్గురి ప్రాణాలు తీసిన సెల్ఫీ సరదా.
సాక్షి, సిద్దిపేట, హైదరాబాద్: సెల్ఫీ సరదాకు ముగ్గురి ప్రాణాలు బలయ్యాయి. మూడేళ్ల బాలుడు సహా ఇద్దరు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. గురువారం సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం నెంటూరు వద్ద ఈ విషాదకర ఘటన జరిగింది. బేగంపేట ఎస్ఐ అరుణ్‌కుమార్ కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని యాకుత్‌పురాకు చెందిన షేక్ కైసర్ (28), అతని అన్నకొడుకు షేక్ ముస్తఫా (3), సమీప బంధువు, జగద్గిరిగుట్టకు చెందిన మహమ్మద్ సోహెల్ (17) గురువారం రాత్రి సిద్దిపేట (దుద్దెడ)లో జరగనున్న ఫంక్షన్లో పాల్గొనేందుకు తమ కుటుంబ సభ్యులతో కలసి గజ్వేల్ మండలం మక్తమాసాన్‌పల్లిలోని బంధువుల ఇంటికి చేరుకున్నారు. ఈ సందర్భంగా గురువారం మధ్యాహ్నం వారు వర్గల్ మండలం నెంటూరు సామల చెరువు సమీపంలోగల బంధువుల పొలం వద్దకు వెళ్లారు. ఈ సమయంలో షేక్ ఖైసర్, మమ్మద్ సోహెల్‌లు ముస్తఫాను తీసుకుని సెల్ఫీలు దిగేందుకు సమీపంలో ఉన్న సామల చెరువుకు వెళ్లారు. అక్కడ సెల్ఫీలు దిగుతుండగా ప్రమాదవశాత్తు ముస్తఫా చెరువులో ఉన్న గుంతలో జారిపడ్డాడు. ఇది గమనించి అతడిని రక్షించే ప్రయత్నంలో సోహెల్, అతడిని కాపాడేందుకు ఖైసర్‌లు వరుసగా గుంతలో దిగారు. ఈత రాకపో వటంతో బాలుడితో పాటు వారిద్దరూ నీళ్లలో మునిగి చనిపోయారు. సమీపంలో వున్న కుటుంబ సభ్యులు అక్కడకు చేరుకుని మొదట బాలుడి బయటకు తీసి చికిత్స కోసం తరలించగా అప్పడికే అతను మృతిచెందాడు. పోలీసులు స్థానికుల సహాయంతో చెరువు నుంచి ఖైసర్, సోహెల్ మృతదేహాలను వెలికి తీశారు. మృతుడు ఖైసర్‌కు భార్య, మూడు నెలల కూతురు ఉన్నారు. అప్పటిదాకా ఆడుతూ కళ్ల ముందు సంతోషంగా గడిపిన ముస్తఫా నీట మునిగి విగత జీవిగా మారటంతో తండ్రి జుబేర్, తల్లి అయేశాలు కన్నీరు మున్నీరై బోరుమని విలపించారు. కాగా మహ్మద్ సోహెల్ ఇటీవలే టెన్త్ పరీక్షలు రాశాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తన చితికి తానే నిప్పుపెట్టుకుని విగతజీవిగా మారిన వెంకటయ్య
-
సిద్దిపేట: టీఆర్ఎస్ పేరుతో మరో కొత్త పార్టీ..
సాక్షి, సిద్దిపేట: టీఆర్ఎస్(తెలంగాణ రాజ్య సమితి) పేరుతో రాష్ట్రంలో కొత్త రాజకీయ పార్టీ ఏర్పాటు కాబోతుంది. తెలంగాణ రాజ్య సమితి రిజిస్ట్రేషన్ కోసం సిద్దిపేట జిల్లా పొన్నాల గ్రామానికి చెందిన తుపాకుల బాలరంగం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిబ్రవరి 13న దరఖాస్తు చేశారు. రాష్ట్ర పార్టీ కార్యాలయం చిరునామాగా ఓల్డ్ అల్వాల్‌లోని ఇంటి నంబర్. 1–4–177/148, 149/201ను దరఖాస్తులో పేర్కొన్నారు. కాగా, అదే గ్రామానికి చెందిన తుపాకుల మురళీకాంత్.. పార్టీ ఉపాధ్యక్షుడిగా, సదుపల్లి రాజు.. కోశాధికారిగా, వెల్కటూర్‌కు చెందిన నల్లా శ్రీకాంత్.. ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తారని పేర్కొన్నారు. ఈ పేరుపై ఎవరికైనా అభ్యంతరాలుంటే మే 27లోపు తమ కు తెలపాలని ఎన్నికల సంఘం ప్రకటించింది. మార్చి 28న ఓ హిందీ పత్రిక, 29న ఇంగ్లిష్ పత్రికలో ప్రకటన ఇచ్చారు. ఈ క్రమంలో అభ్యంతరాలొస్తే పరిశీలిస్తారు. అనంతరం నిబంధనల మేరకు రాజకీయ పార్టీగా రిజిస్ట్రర్ చేస్తారు. కాగా, బాలరంగం 1983 నుంచి కేసీఆర్‌తోనే ఉన్నారు. 1987, 1995 సంవత్సరాల్లో సర్పంచ్‌గా, 2001లో ఆయన సతీమణి ఎల్లమ్మ సర్పంచ్‌గా, అప్పటి టీఆర్ఎస్ సిద్దిపేట మండల పార్టీ అధ్యక్షుడిగా, 2006లో జెడ్పీటీసీగా, 2019–2021 వరకు ఉపాధి హామీ రాష్ట్ర కౌన్సిల్ సభ్యునిగా పని చేశారు. ఇది కూడా చదవండి: ‘హైదరాబాద్.. బయటకు వెళ్తే ఇంటికి వస్తారనే నమ్మకం లేదు’ -
బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ!
-
బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ.. యాక్ ఛీ! బాత్రూం బిర్యానీ!
ప్రశాంత్‌నగర్ (సిద్దిపేట): ఘుమఘుమలాడే బిర్యానీ అంటే ఎవరికై నా ఇష్టమే.. కానీ బిర్యానీ తయారీకి ఉపయోగించే బియ్యం కడిగేది బాత్రూంలోని నీటితో అని తెలిస్తే?.. సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఓ రెస్టారెంట్లో బిర్యానీకి ఉపయోగించే బియ్యాన్ని బాత్రూంలోని నీటితో శుభ్రపరుస్తున్నారు. దీన్ని ఓ వినియోగదారుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టడంతో వైరల్ అయ్యింది. ఈ వీడియోలో.. ఎందుకు బాత్రూంలో బిర్యానీ బియ్యం కడుగుతున్నారని నిర్వాహకుల్ని వినియోగదారుడు ప్రశ్నిస్తే.. నీటి సమస్య వల్ల ఇలా చేస్తున్నట్టు ఇచ్చిన సమాధానం స్పష్టంగా వినిపిస్తోంది. దీంతో నెటిజన్లు.. ‘బొంగు బిర్యానీ, బకెట్ బిర్యానీ, కుండ బిర్యానీ, బిందె బిర్యానీ, స్టీల్ డబ్బా బిర్యానీ.. ఇలా చాలా రకాలను మీరు చూసి ఉంటారు.. కానీ మా సిద్దిపేటలో సరికొత్త బిర్యానీ ఆవిష్కరించారు.. అదే బాత్రూం బిర్యానీ.. తినండి సూపర్ టేస్ట్’.. అంటూ.. సోషల్‌మీడియాలో సైటెర్లు విసురుతున్నారు. (చదవండి: రాష్ట్రంలో పెద్ద పులుల గాండ్రింపు!) -
మంత్రి హరీశ్ చొరవతో ప్రభుత్వ పాఠశాలలో హలో.. బోంజో.. ఓలా..
సిద్దిపేటలోని ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల.. లోపలికి అడుగుపెట్టగానే.. 9వ తరగతి చదువుతున్న మనోజ్ కనిపించాడు బోంజో అని పలకరించాడు.. అలా రెండడుగులు వేశామో లేదో.. ఓలా అన్నాడు రాంచరణ్.. ఏంటిది.. ఏమంటున్నారు అన్నదేగా మీ డౌట్.. వీళ్లిద్దరూ మనల్ని గుడ్ మార్నింగ్, హలో అని పలకరించారు. కాకపోతే.. ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో.. ఒక్క మనోజ్, రాంచరణే కాదు.. ఆ బడిలో చాలా మంది ఫ్రెంచ్, స్పానిష్ భాషలను నేర్చుకుంటున్నారు. స్పోకెన్ ఇంగ్లిష్‌లో పట్టు సాధిస్తున్నారు.. పోటీ ప్రపంచంలో రాణించేందుకు తమను తాము సంసిద్ధం చేసుకుంటున్నారు. సాక్షి, సిద్దిపేట: ఇందిరానగర్ జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలను హైదరాబాద్‌కు చెందిన ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్) యూనివర్సిటీ దత్తత తీసుకుంది. మంత్రి హరీశ్‌రావు చొరవతో విద్యార్థులకు స్పోకెన్ ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషలు నే ర్పి స్తున్నారు. ఈ విద్యా సంవత్సరం 9వ తరగతిలో 160 మంది విద్యార్థులను ఎంపిక చేసి వారిలో 100మందికి ఇంగ్లిష్ , 30 మందికి ఫ్రెంచ్, 30 మందికి స్పానిష్ నే ర్పిస్తున్నారు. ఓ యూనివర్సిటీ ప్రభుత్వ పాఠశాలను దత్తత తీసుకుని విద్యాబోధన చేయడం ఇదే మొదటిసారి. ఫిబ్రవరి 27న తరగతులను ప్రారంభించారు. ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషలు నే ర్పి ంచారు. వారంలో రెండు రోజులు (గురు, శుక్రవారాలు) ఆన్లైన్, ఒకరోజు ( శనివారం) ప్రత్యక్షంగా ప్రొఫెసర్లు బోధన చేశారు. ఇలా నాలుగు వారాలపాటు బోధించారు. ఇంగ్లిష్ లో భాగంగా ఉచ్ఛారణ, సంభాషణ, గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్‌పై అవగాహన కల్పించారు. ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో పలకరించడం, సెల్ఫ్ ఇంట్రడక్షన్, సింపుల్ కన్వర్జేషన్ నే ర్పించారు. మార్చి 28న హైదరాబాద్‌లోని ఇఫ్లూ యూనివర్సిటీకి 160 మంది విద్యార్థులను తీసుకెళ్లారు. విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, విద్యాబోధన తీరు ఇతర అంశాలపై అవగాహన కల్పించారు. ఇతర దేశాలకు చెందిన విద్యార్థులతో ఇంగ్లిష్ , ఫ్రెంచ్, స్పానిష్ భాషల్లో ముచ్చటించారు. శిక్షణ పొందిన విద్యార్థులకు ఈ నెల 16న మంత్రి హరీశ్‌రావు, యూనివర్సిటీ వీసీ చేతుల మీదుగా సర్టిఫికెట్లు అందజేశారు. వచ్చే విద్యా సంవత్సరంలో కూడా ఆయా భాషల బోధనకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. 6 నుంచి 10వ తరగతి వరకు ఆసక్తి ఉన్న విద్యార్థులను ఎంపిక చేసి ఏడాదంతా బోధించనున్నారు. ఒక అడ్వంచర్‌లా అనిపించింది.. నేను స్పానిష్ నేర్చుకుంటున్నా. నాకు ఒక అడ్వంచర్‌లా అనిపిస్తుంది. యూనివర్సిటీకి వెళ్లినప్పుడు అక్కడి స్టూడెంట్‌తో నేను స్వయంగా స్పానిష్‌లో మాట్లాడాను. ప్రపంచంలో ఎక్కువగా మాట్లాడే రెండో భాష స్పానిష్ నేర్చుకోవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇంకా నేర్చుకోవాలని ఉంది. పూర్తిగా గలగలా స్పానిష్‌లో మాట్లాడాలి. ఉన్నత విద్య కోసం స్పెయిన్‌కు వెళ్లినా నాకు అక్కడి భాషతో ఇక ఇబ్బంది ఉండదు. –రాంచరణ్, 9వ తరగతి ఇన్ఫార్మల్ టు ఫార్మల్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం ఇంగ్లిష్ లో ఇన్ఫార్మల్ టు ఫార్మల్ ఎలా మాట్లాడాలో నేర్చుకున్నాం. గ్రూప్ డిస్కషన్, ప్రజెంటేషన్ స్కిల్స్ నేర్చుకున్నాం. ఇఫ్లూ వర్సిటీ వారు మాకు ఇంగ్లిష్ నే ర్పి ంచడం చాలా లక్కీగా ఫీలవుతున్నాం. ఇతర విద్యార్థులు కార్పొరేట్ స్కూళ్లలో డబ్బులు పెట్టినా విదేశీ భాషలు నేర్చుకోలేరు అదే మా హరీశ్‌రావు సార్ కృషితో మా స్కూల్లోనే వాటిని నేర్చుకుంటున్నాం. –అప్ష, ఐమన్, తనీమ్, 9వ తరగతి విద్యార్థులు ఫ్రెంచ్నేర్చుకుంటున్నా.. –మనోజ్,9వ తరగతి ఫ్రెంచ్ భాషను ఇంట్రస్ట్‌గా నేర్చుకుంటున్నా.ఇఫ్లూ క్యాంపస్‌కు వెళ్లినప్పుడు అక్కడ ఫ్రెంచ్ విద్యార్థులతో మాట్లాడాను. ఫ్రెంచ్ మాట్లాడటంతోపాటు అర్థం చేసుకోగలుగుతున్నా. పదో తరగతిలోనూ ఇంకొంచెం ఫ్రెంచ్ భాషను నేర్చుకోవాలని ఉంది. -
కుర్రోకుర్రు.. కేసీఆర్ పీఎం.. హరీశ్‌రావు సీఎం
సాక్షి, సిద్ధిపేట: ఆత్మీయ సమ్మేళనంలో సిద్దిపేట అర్బన్ మండలం నాంచారిపల్లికి చెందిన చిన్నారి మైత్రి సభావేదికపై కుర్రో కుర్రు అంటూ మంత్రి హరీశ్‌రావుకు సోది చెప్పింది. హరీశ్‌రావుకు నరదృష్టి బాగా ఉందని పేర్కొంది. నరంలేని నాలుక 40 మాటలు అంటుందని.. అవన్నీ పట్టించుకోవద్దని సూచించింది. తన నోరు సత్యమే పలుకుతుందని.. తన మాట తప్పదంటూ దేశానికి కేసీఆర్ పీఎం కావాలనుకుంటే హరీశ్‌రావు రాష్ట్రానికి సీఎం కావాలని ఆ చిన్నారి సోది చెప్పింది. మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి మంత్రి తన్నీరు హరీశ్‌రావు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి చెందిన మేస్త్రీలు ఇటీవల తనను కలిసినప్పుడు తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని చెప్పానన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇక్కడే ఉండాలని వారికి సూచించానన్నారు. చదవండి: హైదరాబాద్ వెళ్తున్నానని చెప్పి అల్లుడితో లాడ్జికి వెళ్లిన అత్త.. షాకింగ్ ట్విస్ట్! -
ఉన్నమాట అంటే ఉలిక్కిపడుతున్నారు.. ఏపీ మంత్రులపై హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట: కొందరు ఏపీ మంత్రులు ఎగిరెగిరిపడుతున్నారని.. ఉన్నమాట అంటే.. వారు ఉలిక్కిపడుతున్నారని మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. సోమవారం సిద్దిపేట అర్బన్ మండల బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏపీకి చెందిన మేస్త్రీలు ఇటీవల తనను కలిసినప్పుడు తెలంగాణ అభివృద్ధిలో చెమట చుక్కలు కార్చిన ప్రతి ఒక్కరూ తమ బిడ్డలేనని చెప్పానన్నారు. తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ ఇక్కడే ఉండాలని వారికి సూచించానన్నారు. ‘ఆనాడు ఏపీకి ప్రత్యేక హోదా కోసం మీ నాయకత్వం పోరాడతాం అన్నది. ఈరోజు ఎందుకు మౌనం వహిస్తున్నారు? విశాఖ ఉక్కు కోసం ఎందుకు పోరాడటం లేదు? పోలవరం పనులు ఎందుకు పూర్తికావడం లేదన్నాను. ఇందులో ఏమైనా తప్పుందా?. నేను ప్రజల పక్షాన మాట్లాడా. ఏపీ ప్రజలు, మంత్రుల గురించి తప్పుగా మాట్లాడలేదు’ అని హరీశ్‌రావు అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, వివిధ సంక్షేమ పథకాల గురించి ఆయన వివరించారు. దేశంలో ఎక్కడాలేని విధంగా కేసీఆర్ పాలన ఉందన్నారు. కుర్రోకుర్రు.. కేసీఆర్ పీఎం.. హరీశ్‌రావు సీఎం అత్మీయ సమ్మేళనంలో సిద్దిపేట అర్బన్ మండలం నాంచారిపల్లికి చెందిన చిన్నారి మైత్రి సభావేదికపై కుర్రో కుర్రు అంటూ మంత్రి హరీశ్‌రావుకు సోది చెప్పింది. హరీశ్‌రావుకు నరదృష్టి బాగా ఉందని పేర్కొంది. నరంలేని నాలుక 40 మాటలు అంటుందని.. అవన్నీ పట్టించుకోవద్దని సూచించింది. తన నోరు సత్యమే పలుకుతుందని.. తన మాట తప్పదంటూ దేశానికి కేసీఆర్ పీఎం కావాలనుకుంటే హరీశ్‌రావు రాష్ట్రానికి సీఎం కావాలని ఆ చిన్నారి సోది చెప్పింది. చదవండి: తెలంగాణలో ఏం జరుగుతోంది? కాంగ్రెస్ నేతలను ఆరా తీసిన రాహుల్ -
చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే
సాక్షి, సిద్దిపేట: ’’మీరు చూపించిన ప్రేమ చూస్తుంటే నా కళ్ళలో నీళ్లు వస్తున్నాయి... మీ ఆదరణకు నేను ఎంత సేవ చేసినా తక్కువే. మీ ప్రేమ, ఈ బలగాన్ని చూస్తుంటే ఎన్ని జన్మలెత్తిన రుణం తీర్చుకోలేనేమో అనిపిస్తోంది.. నా చర్మం ఒలిచి చెప్పులు కుట్టించినా తక్కువే అనిపిస్తోంది..’’అంటూ ఆర్థిక వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేట రూరల్ మండలంలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో భావోద్వేగానికి లోనయ్యారు. హరీశ్ మాట్లాడుతూ.. నా ఊపిరి ఉన్నంతకాలం, చివరి శ్వాస వరకు మీ సేవ చేస్తూనే ఉంటా. పదవులు ఉండొచ్చు పోవచ్చు. మీ ప్రేమ ఆప్యాయత వెలకట్టలేనిదని బీఆర్ఎస్ శ్రేణులనుద్దేశించి అన్నా రు. కేసీఆర్ పాలనలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణగా మారిందన్నారు. కాంగ్రెస్, బీజేపీ నేతల మాటలు నమ్మొద్దని, కళ్ల ముందు జరిగిన అభివృద్ధి చూ సి తెలంగాణ ప్రజలు ఆశీర్వదించాలని కోరారు. మోదీ వ్యాఖ్యలు విడ్డూరం ప్రధాని మోదీ రాష్ట్ర పర్యటనలో చేసిన వ్యాఖ్యలు ఆశ్చర్యం కలిగించాయని మంత్రి హరీశ్ వ్యాఖ్యానించారు. విభజన హామీలైన బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ, ఐటీఐఆర్ ప్రాజెక్టు, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ అమలు కాలేదని, కాళేశ్వరానికి జాతీయ హోదా ఇవ్వకుండా రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటోంది కేంద్రమేనని విమర్శించారు. రూ.15 కోట్లతో ఏఈడీ మెషీన్లు.. సిద్దిపేట పోలీస్ కన్వెన్షన్ హాల్లో ప్రభుత్వ ఉద్యోగులకు, ప్రజా ప్రతినిధులకు నిర్వహించిన సీపీఆర్ శిక్షణ కార్యక్రమంలో మంత్రి హరీశ్ మాట్లాడారు. సీపీఆర్ ద్వారా 50శాతం మందిని బతికించవచ్చని, రాష్ట్ర వ్యాప్తంగా 36,520 మందికి సీపీఆర్‌పై శిక్షణ అందించామని చెప్పారు. రూ.15 కోట్లతో ఏఈడీ మెషీన్లను అందుబాటులోకి తెచ్చి అన్ని పీహెచ్‌సీలు, బస్తీ దవాఖానాలు, అంబులెన్స్‌లలో ఉంచుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్ సీపీఆర్ శిక్షణ తీసుకున్నారు. ఆటోడ్రైవర్... మినిస్టర్ హరీశ్ మంత్రి హరీశ్‌రావు కొద్దిసేపు ఆటో డ్రైవర్‌గా మారారు. ఆదివారం సిద్దిపేట ఆటో కార్మికుల కోసం ఏర్పాటు చేసిన సహకార సొసైటీ ఆధ్వర్యంలో జరిగిన ఆత్మీయ సమ్మేళనానికి ఆయన స్వయంగా ఆటో నడుపుతూ వచ్చారు. మంత్రిని చూసి ఆటోడ్రైవర్లు, ఆయన అభిమానులు ఉబ్బితబ్బిబ్బయ్యారు. -
సిద్దిపేట: అడిషినల్ కలెక్టర్‌ని కరిచిన కుక్క
సిద్ధిపేట: అదనపు కలెక్టర్ శ్రీనివాసరెడ్డి వీధికుక్క బారిన పడినట్లు తెలుస్తోంది. శనివారం నాడే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. సిద్ధిపేట కలెక్టర్ క్వార్టర్స్ దగ్గర వీధికుక్కలు వచ్చీపోయేవాళ్ల మీద దాడులకు తెగబడుతున్నా.. ఇంతకాలం మున్సిపల్ సిబ్బంది పట్టించుకోలేదు. తాజాగా అదనపు కలెక్టర్‌నే కరవడంతో రంగంలోకి దిగారు. శనివారం రాత్రి సమయంలో క్వార్టర్స్ వద్ద వాకింగ్ చేస్తున్న అడిషనల్ కలెక్టర్(రెవెన్యూ) శ్రీనివాస్ రెడ్డిపై వీధికుక్క దాడి చేసినట్లు తెలుస్తోంది. వాకింగ్ చేస్తున్న సమయంలో ఓ కుక్క ఆయన పిక్కలను పట్టేసి గాయపరిచింది. ఆయన కేకలు వేయడంతో అక్కడే ఉన్న కొందరు ఆయన్ని ఆస్పత్రికి తరలించారు. ఇక ఆయనపై దాడి తర్వాత ఆ శునకం.. మరో బాలుడిపై, అలాగే కలెక్టర్ పెంపుడు కుక్కపైనా దాడి చేసి కరిచిందని స్థానికులు చెప్తున్నారు. కలెక్టర్ క్వార్టర్స్ వద్ద వీధికుక్కల సంచారంపై గతంలోనూ ఫిర్యాదు చేసినా ఏనాడూ పట్టించుకోలేదని, ఇప్పుడు ఉన్నతాధికారి మీద దాడి చేయడంతో ఆగమేఘాల మీద చర్యలకు దిగారని విమర్శిస్తున్నారు స్థానికులు. -
ఏ సీమదానవో ఎగిరెగిరి వచ్చావు..
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): ముద్దుముద్దుగా పసిపిల్లలు అమ్మా.. అని పిలిస్తే చిలక పలుకులంటూ.. మురిసిపోతాం. అలాంటిది, నిజంగానే రామచిలుకే అమ్మా.. అంటుంటే.. కుటుంబ సభ్యుల్ని వారి పేర్లతో పిలుస్తుంటే.. ఆ ఆనందమే వేరు. వివరాలివి. సిద్దిపేట హౌసింగ్ బోర్డుకాలనీలోని జర్నలిస్ట్ వీధిలో కూతురు రాజిరెడ్డి, వనజ రెడ్డిల ఇంటి పైకి రోజూ ఓ రామచిలుక వచ్చి సందడి చేస్తోంది. నెల రోజులుగా రోజూ ఉదయం 6గంటలకే వచ్చి కుటుంబ సభ్యులను నిద్ర లేపుతుంది. చిన్నారులతో ఆడుకుంటుంది. వనజరెడ్డిని అమ్మా.. అని, పిల్లలను టింకు.. అని పిలుస్తుంది. ఎత్తుకో, టాటా, బాయ్ అంటుంది. దీంతో రాజిరెడ్డి కుటుంబ సభ్యులతో పాటు, కాలనీవాసులు సంబరపడిపోతున్నారు. ఉదయం ఆరు గంటల నుంచి 7.30 గంటల వరకు ఉండి పాలు, నీరు తాగుతుంది. జామ, మామిడి, ఆపిల్, తదితర పండ్లు, బిస్కెట్లు తిని వెళ్లిపోతుంది. సాయంత్రం 5గంటల సమయంలో వచ్చి మళ్లీ 6 గంటల వరకు తిరిగి వెళ్లిపోతుంది. ఈ చిలుక ఎక్కడి నుంచి వస్తుంది...ఎక్కడికి పోతుందనేది మాత్రం ఎవరికీ తెలియడం లేదు. నెల రోజులుగా ఈ రామచిలుక రాజిరెడ్డి, వనజరెడ్డిల కుటుంబ సభ్యుల్లో ఒకటిగా మారిపోయింది. శ్రీరాముడే వచ్చినట్టుంది రామచిలుక రోజూ మా ఇంటికి వచ్చి అమ్మా. అని పిలుస్తుంటే సంతోషంగా ఉంది. శ్రీ రామనవమి ముందు మా ఇంట్లోకి వచ్చింది కాబట్టి.. శ్రీ రాముడే వచ్చినట్టు అనిపిస్తోంది. – వనజరెడ్డి, సిద్దిపేట -
విధి వైపరిత్యం అంటే ఇదేనేమో.. కూతురు పెళ్లై 24 గంటలు గడవకముందే!
సాక్షి, సిద్దిపేట జిల్లా: ఆ ఇంట పెళ్లిసందడి ముగియకముందే చావుబాజా మోగింది. పెద్దకూతురు పెళ్లి జరిగి 24 గంటలు గడవకముందే తల్లి గుండెపోటుతో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బంజార గ్రామానికి చెందిన జగిలి స్వరూప(35)కు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురుకు శుక్రవారం వివాహం జరిగింది. ఇంటిల్లిపాది పెళ్లిసందడిలో ఆనందంగా ఉన్నారు. శనివారం ఉదయం కూతుర్ని అత్తగారింటికి పంపేందుకు ఒకవైపు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే తల్లి సర్వూప ఒక్కసారిగా గుండెపోటుతో తుది శ్వాస విడిచింది. దీంతో ఒక్కసారిగా పెళ్లింట విషాదఛాయలు నెలకొన్నాయి. పెద్దకూతురికి కన్యాదానం చేసి, చిన్నకూతురుతో తలకొరివి పెట్టించుకుందంటూ కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది. -
నాయకుడూ త్యాగధనుడే
● పొలిటికల్ లీడర్ పాత్ర గొప్పది.. కష్టమైనది ● ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు సిద్దిపేటజోన్: నాయకత్వం అంటే ఎలా ఉండాలి.. నాయకుడు అనే వాడు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా చేయాల్సిన బాధ్యత గూర్చి, సమాజహితం గురించి పడే తపన, తదితర అంశాల గురించి ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేడర్‌కు వివరించాడు. నాయకుడు కూడా త్యాగధనుడే అంటూ వారికి దిశానిర్దేశం చేశారు. శుక్రవారం సిద్దిపేట నాలుగో వార్డులో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో ఆర్శెట్టి(గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం) భవన నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువత ఉపాధి కోసం మంచి ఉద్దేశంతో శిక్షణ కేంద్రం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రాజకీయ నాయకుడు కూడా గొప్పవడని, పొలిటికల్ లీడర్ ఒక క్వాలిటీ ఉంటుందని, బ్యాంక్ అధికారులు, ఇతర అధికారులు తరహాలోనే లీడర్‌కు కూడా ఒక లక్షణం ఉంటుందన్నారు. లీడర్ అనే వాడు సమాజానికి మార్గదర్శకుడని అభివర్ణించారు. అధికారంలో ఉన్నా, ప్రతిపక్షంలో ఉన్నా ఇలాంటి సంస్థలను ప్రజల కోసం ఉపయోగించుకోవడంలో, ప్రజలను చైతన్యం చేయడంలో రాజకీయ నాయకుడు చొరువ చూపాలన్నారు. పదవులు లేవని, హోదా, అధికారం లేదనే భావన ఉండకుండా సేవలు అందించాలనే తపన ప్రతి లీడర్ మదిలో ఉండాలన్నారు. సద్వినియోగం చేసుకోవాలి... నిరుద్యోగ యువత కోసం సెట్విన్, న్యాక్, ఎల్ అండ్ టి, ఆర్ శెట్టి, తదితర సంస్థల ద్వారా స్వయం ఉపాధి శిక్షణ కోర్సులు ఏర్పాటు చేసి శిక్షణ అనంతరం ఉపాధి అవకాశాలు కూడా అందించడం జరుగుతుందన్నారు. యూనియన్ బ్యాంక్ భవిష్యత్‌లో ఉపాధి శిక్షణ ఇచ్చి అదే క్రమంలో ఉపాధి మార్గం కోసం రుణాలు కూడా ఇవ్వడానికి తన సూచన మేరకు అంగీకారాన్ని ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, సుడా చైర్మన్ రవీందర్‌రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ విజిత వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్ కొండం కవిత సంపత్, నర్సింగ్ కౌన్సిల్ సభ్యులు సాయిరాం, లీడ్ బ్యాంక్ మేనేజర్ సత్యజిత్, యూనియన్ బ్యాంక్ మేనేజర్ సత్యం, శ్రీనివాస్ పాల్గొన్నారు. -
విజయవంతంగా ‘కంటి వెలుగు’
కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ సిద్దిపేటరూరల్: రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమాన్ని జిల్లాలోవిజయవంతంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ తెలిపారు. శుక్రవారం పలు పథకాల పనితీరుపై అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్ మాట్లాడుతూ జీఓఎంఎస్ 58, 59 వెరిఫికేషన్ ప్రక్రియను త్వరగా పుర్తి చేస్తామని తెలిపారు. అలాగే పామాయిల్ మొక్కల పెంపకాన్ని నిర్దేశించిన లక్ష్యాన్ని చేరుకునేలా అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్, డీఎప్‌ఓ శ్రీనివాస్, డీఎంఎచ్ఓ డాక్టర్ కాశీనాథ్, డీఏఓ శివప్రసాద్, డీఎచ్ఓ రామక్ష్మి, డబుల్ బెడ్ రూమ్ నోడల్ అధికారి శ్యాంప్రసాద్‌రెడ్డి, మున్సిపల్ కమిషనర్లు, తదితరులు పాల్గొన్నారు. అవినీతి పాలనను గద్దె దించాలి బీజేపీ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్‌రెడ్డి సిద్దిపేటరూరల్: సీఎం కేసీఆర్ కుటుంబ పాలన చేస్తుంటే మోదీ ప్రజా పరిపాలన చేస్తున్నాడని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శుక్రవారం నారాయణరావుపేట మండల కేంద్రంలో మండల పార్టీ అధ్యక్షుడు మోత్కు బుగ్గ రాజేశం ఏర్పాటు చేసిన ప్రజాగోస బీజేపీ భరోసా శక్తి కేంద్ర కార్నర్ మీటింగ్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో జరుగుతున్న కేసీఆర్ అవినీతి అహంకార పాలన గద్దె దించడమే లక్ష్యంగా జనాల్లోకి వెళ్లాలని సూచించారు. రూ.20 కోట్లతో మంజూరైన గురుకుల కళాశాల ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటివరకు కూడా దానిపై ఆలోచించకుండా నిమ్మకు నీరెత్తినట్టు చూస్తూ పబ్బం గడుపుతున్నారన్నారు. కార్యక్రమంలో ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు రుద్రోజ్ శివకుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్, బాబురెడ్డి బీజేవైఎం యూత్ అధ్యక్షుడు అచ్యుత్‌రెడ్డి, మండల మహిళా మోర్చా అధ్యక్షురాలు లతారెడ్డి, గ్రామ శాఖ అధ్యక్షులు దేవరాజు, గంగాధర్. బాలరాజ్, ఎల్లం, రవి చారి రాజు, స్వరూప, రాజిరెడ్డి, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య తోపులాట
మిరుదొడ్డి(దుబ్బాక): నూతనంగా నిర్మించిన పంచాయతీ భవన ప్రారంబోత్సవంలో బీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. మండల పరిధిలోని ధర్మారం పంచాయతీ భవనాన్ని శుక్రవారం ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ నేపథ్యంలో ప్రొటోకాల్ పాటించకుండా అభివృద్ధి పనులను ఎలా ప్రారంభిస్తారంటూ ఆయనను బీజేపీ నాయకులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. దీంతో ప్రారంభోత్సవం రసాబాసాగా మారింది. అధికారిక అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఎలా ప్రారంభిస్తారని బీజేపీ నాయకులు ప్రశ్నిస్తూ బీజేపీ నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు బీజేపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు వర్గాలు పరస్పరం వ్యతిరేక నినాదాలు చేసుకున్నారు. పోలీసులు వాగ్వాదాన్ని ఆపే ప్రయత్నం చేయడంతో తోపులాటకు దారి తీసింది. చివరికి ఇరువర్గాల వారిని పోలీసులు చెల్లాచెదురు చేయడంతో ఆందోళన సద్దుమణిగింది. పంచాయతీరికార్డుల పరిశీలన కొమురవెల్లి(సిద్దిపేట): మండలంలోని గురువన్నపేట పంచాయతీని శుక్రవారం డీఎల్పీఓ మల్లికార్జున్‌రెడ్డి సందర్శించారు.ఈ సందర్బంగా పంచాయతీ రికార్డులను పరిశీలించి గ్రామంలోని సమస్యలను పంచాయతీ కార్యదర్శి సతీశ్‌ను అడిగి తెలుసుకున్నారు. రికార్డుల నిర్వహణలో పలు సూచనలను చేశారు. -
మహిళా రక్షణ చట్టాలను గౌరవించాలి
సిద్దిపేటకమాన్: మహిళా రక్షణ చట్టాలను గౌరవించడంతో పాటు ఇతరులు కూడా గౌరవించేలా కృషి చేయాలని అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్ సూచించారు. జండర్ సెన్సిటైజేషన్, రిసెప్షన్ విధులపై సీపీ కార్యాలయంలో రిసెప్షన్, వర్టికల్ సిబ్బందికి శుక్రవారం వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జండర్ తేడా లేకుండా ముందుకు వెళ్తే సమాజ శ్రేయస్సు, దేశ అభివృద్ధి ఉన్నతంగా ఉంటుందన్నారు. మహిళలకు సంబంధించిన కేసుల్లో స్నేహిత, సఖి, భరోసా సెంటర్ సేవలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. మహిళలు గృహహింసకు, బయట వేధింపులకు గురైతే వెంటనే స్నేహితకు సమాచారం అందించి కౌన్సెలింగ్ ద్వారా కుటుంబాలు నిలబెట్టవచ్చని తెలిపారు. స్వార్డ్ సంస్థ సీఈఓ శివకుమారి మాట్లాడుతూ మన ద్వారా సమాజంలో మార్పు రావాలని దానికి అందరం సమన్వయంతో ముందుకు వెళ్లాలని సూచించారు. కార్యక్రమంలో రిసెప్షన్, వర్టికల్ ఇంచార్జి తొగుట సీఐ కమలాకర్, సిసిఆర్బి సీఐ గురుస్వామి, మహిళ పోలీసు స్టేషన్ సీఐ దుర్గ, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రభుత్వ భూమి దర్జాగా కబ్జా!
అనుమతి లేకుండానే ప్లాట్లు, నిర్మాణాలు ● ప్రజాప్రతినిధుల అండతోనే వ్యవహారం! ● పట్టించుకోని రెవెన్యూ, జీపీ అధికారులు ● కోహెడ మండల కేంద్రంలో దుస్థితి కోహెడ(హుస్నాబాద్): ప్రభుత్వ భూములను దర్జాగా కబ్జా చేస్తున్నారు. రెవెన్యూ, జీపీ అధికారులు పట్టించుకోకపోవడంతో అక్రమార్కులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కోహెడ మండల పరిసర ప్రాంతాల్లో ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో కబ్జా వ్యవహారం జోరుగా సాగుతుంది. అనుమతి లేకుండాలనే ప్రభుత్వ భూముల్లో పలు ప్లాట్లు, నిర్మాణాలు చేస్తున్నారు. కోహెడ – సముద్రాల రోడ్డు సమీపంలోని సర్వే నంబర్ 768 బాడుగుల చెరువు రికార్డుల్లో 47.36 ఎకరాల విస్తీర్ణం ఉంది. కానీ మోక మీద పట్టుమని పాతిక ఎకరాలు కూడలేదు. సమీపంలోని సర్వే నంబర్లున్న పట్టాదారులు చెరువు భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా మార్చి విక్రయిస్తున్నారు. అలాగే కోహెడ నుంచి సముద్రాల ప్రస్తుత దారి కుడి పక్కన ఉన్న సర్వే నంబర్ 1229లో 6.30 ఎకరాల ప్రభుత్వ భూమి పూర్తిగా అన్యాక్రాంతమైంది. ఈ ప్రభుత్వ భూమిలో నిర్మాణాలకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడంతో ఓ ప్రజాప్రతినిధికి రూ.60 లక్షల విలువైన కొంత భూమిని ఇస్తామని ఆఫర్ చేసినట్లు సమాచారం. ఈ రహస్య ఒప్పందంతో కోహెడ పంచాయతీ తీర్మానం ద్వారా భవన నిర్మాణాలకు అనుమతి ఇప్పించినట్లు సమాచారం. అనంతరం ప్రభుత్వ భూములను కబ్జా చేసి భవన నిర్మాణాలతో పాటుగా ఇళ్ల స్థలాలకు ప్లాట్లు ఏర్పాటు చేసి విక్రయిస్తునట్లు తెలుస్తోంది. గతంలో బీపీసీఎల్ సంస్థ పెట్రోల్ బంక్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అక్కడి ప్రభుత్వ భూమిని ఆక్రమించి బంక్ నిర్మాణం చేస్తున్న ఓ యాజమాని నుంచి కూడ పెద్ద మొత్తంలో ముడుపులు ఇప్పించి అదే ప్రజాప్రతినిధి పంచాయతీ పాలకవర్గంతో ఎన్ఓసీ ఇప్పించినట్లు విశ్వసనీయ సమాచారం. అధికారులు పట్టించుకోకపోవడంతోనే రూ.కోట్లు విలువజేసే ప్రభుత్వ భూమి పరుల పాలవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చర్యలు తీసుకోవాలి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేయాలని.. లేకపోతే తీవ్ర ఆందోళన చేస్తామని పలు రాజకీయ పార్టీ నేతలు హెచ్చరిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి జిల్లా స్థాయి అధికారులతో సర్వే చేయించి ఆక్రణకు గురైన ప్రభుత్వ భూములను కాపాడాలని.. తప్పుడు సర్వే రిపోర్టులతో ప్రభుత్వ భూములను కబ్జాదారుల ద్వారా అన్యాక్రాంతానికి సహకరించిన వారిపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారుల పట్టింపు కరువైంది ప్రభుత్వ భూముల కబ్జాపై మండల అధికారుల పట్టింపు కొరవడింది. కబ్జాకు గురైతున్న భూములను సర్వే చేసి చేయించాలని కార్యాలయం చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగినా ఫలితం లేకుండా పోతుంది. దీంతో హైదరాబాద్‌లోని మానవ హక్కుల కమిషనర్‌కు సైతం ఫిర్యాదు చేశాను. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి భూములను కాపాడాలి. కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి. –వెల్పుల శంకర్, కోహెడ క్షేత్రస్థాయిలో విచారణ చేస్తాం వెంటనే క్షేత్రస్థాయిలో విచారణ చేయిస్తాం. ప్రభుత్వ భూములను సర్వే చేసి హద్దులు ఏర్పాటు చేస్తాం. కబ్జాదారులపై చర్యలు తీసుకుంటాం. నివేదికను ఉన్నతాధికారులకు అందజేసి ప్రభుత్వ భూమిని కాపాడుతాం. –జావిద్ అహ్మద్, తహసీల్దార్, కోహెడ -
ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ హబ్‌గా సిద్దిపేట: హరీశ్
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేటలో నెలకొల్పిన శిక్షణ కేంద్రాలను యువత సద్వినియోగం చేసుకునేలా స్థానిక ప్రజాప్రతినిధులపై గురుతర బాధ్యత ఉందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు వ్యాఖ్యానించారు. శుక్రవారం సిద్దిపేట జిల్లాలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో హరీశ్ పాల్గొన్నారు. యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నూతన భవన నిర్మాణ పనులకు యూనియన్ బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ సూర్యచంద్ర తేజతో కలసి శంకుస్థాపన చేశారు. హరీశ్ మాట్లాడుతూ సిద్దిపేట ఇండస్ట్రియల్, అగ్రికల్చర్ హబ్‌గా మారిందన్నారు. పరిశ్రమల ఏర్పాటుకు అనుకూలంగా కాళేశ్వరం ద్వారా గోదావరి నీటి వసతి వచ్చిందని తెలిపారు. త్వరలో రైల్వే సౌకర్యం రానుందని, ప్రముఖ కోకాకోలా కంపెనీ కొండపోచమ్మ సాగర్ వద్ద భారీ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పా టు చేయనుందని హరీశ్ వెల్లడించారు. దక్షిణ భారతదేశంలో అతిపెద్ద ఫుడ్ ప్రాసెసింగ్ రైస్ మిల్లు వర్గల్లో రానుందన్నారు. బెజ్జంకి దాచా రం వద్ద భారీ గ్రానైట్ హబ్ వస్తుందని తెలిపారు. కాగా, పొన్నాల వద్ద నిర్మించిన ప్లైఓవర్ బ్రిడ్జిని హరీశ్ ప్రారంభించి బుల్లెట్ బండిపై బ్రిడ్జి మీదుగా డ్రైవ్ చేసుకుంటూ వెళ్లారు. -
భూసారాన్ని కాపాడితేనే ఆరోగ్యం
సాక్షి, సిద్దిపేట: ‘భూమి బాగుంటే మనిషి బాగుంటాడు. రసాయనిక ఎరువులు ఎక్కువ వినియోగించడంతో సమాజంలో కేన్సర్ వేగంగా విస్తరిస్తోంది. భూ సారాన్ని కాపాడుకుంటేనే మనం ఆరోగ్యంగా ఉంటాం’ అని ఆర్థిక, వైద్య, ఆరోగ్య మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేట పత్తి మార్కెట్ ఆవరణలో భూ మిత్ర.. మన తడిచెత్త–మన సేంద్రియ ఎరువు – మన నేల అనే నినాదంతో ‘సిద్దిపేట కార్బన్ లైట్స్’ సేంద్రియ ఎరువును మార్కెట్లోకి మంగళవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఇది సిద్దిపేట మున్సిపాలిటీలోని 41,322 మంది ప్రజల విజయమన్నారు. ఇదంతా నిత్యం తడి, పొడి, హానికరమైన చెత్త వేర్వేరుగా ఇవ్వడంతోనే సాధ్యమైందన్నారు. కార్యక్రమంలో కలెక్టర్ ప్రశాంత్‌జీవన్ పాటిల్, జెడ్పీ చైర్పర్సన్ రోజారాధాకృష్ణ శర్మ, పర్యావరణవేత్త డాక్టర్ శాంతి పాల్గొన్నారు. తొలి బ్యాగ్ కొన్న మంత్రి.. సిద్దిపేట బ్రాండ్‌తో తయారైన జీవ సంపన్న సేంద్రియ ఎరువు తొలి బ్యాగును మంత్రి హరీశ్‌రావు కొనుగోలు చేశారు. సిద్దిపేట శివారులోని తన పొలంలో వినియోగించేందుకు రూ.37వేలు చెల్లించి 125 బ్యాగుల ఎరువును కొనుగోలు చేశారు. మా భూమి సారం పెరిగింది సార్ మాది చిన్న కోడూరు మండలం రామునిపట్ల గ్రామం. నా పేరు కృప మంత్రి హరీశ్‌రావు: ఎన్ని ఎకరాల భూమి ఉందమ్మ? కృప: నాకు నాలుగెకరాల భూమి ఉంది. మూడున్నర ఎకరాల్లో వరి, అరెకరంలో కూరగాయలు సాగు చేస్తున్న. మంత్రి: సేంద్రియ ఎరువుతో సాగు చేస్తున్నావా? కృప: అవును సార్.. ఆరు నెలల నుంచి సేంద్రియ ఎరువుతోనే పండిస్తున్న. మంత్రి: ఇప్పటివరకు ఎన్ని బస్తాలు తీసుకున్నావు కృప: శాంపిల్‌గా ఇచ్చిన 25 బస్తాలను తీసుకున్నాను సార్. సేంద్రియ ఎరువుతో సాగు చేయడంతో మార్కెట్లో మా కూరగాయలకు బాగా డిమాండ్ ఉంటుంది. ఇటీవల చిక్కుడు కాయ తెంపినం. మార్కెట్లో అందరూ కిలో రూ.35కు అమ్మితే నేను రూ.40కిలో అమ్మాను. మంత్రి: నీకు ఆదాయం పెరగడంతో పాటు ఆరోగ్యం కాపాడుతున్నావు అమ్మ. శభాష్.. -
సిద్దిపేట ‘సేంద్రియ ఎరువు’.. పేరేంటో తెలుసా?
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్త ద్వారా తయారైన నాణ్యమైన సేంద్రియ ఎరువు త్వరలో మార్కెట్లోకి రానుంది. మున్సిపాలిటీలో సేకరించిన తడి చెత్తను సిద్దిపేట రూరల్ మండలం బుస్సాపూర్‌లోని డంపింగ్ యార్డుకు తరలిస్తున్నారు. ఈ తడి చెత్తతో ఇప్పటికే సీఎన్జీని తయారు చేసి విక్రయిస్తుండగా.. తాజాగా ఎరువును కూడా తయారు చేసి విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సేంద్రియ ఎరువును సిద్దిపేట కార్బన్ లైట్స్ బ్రాండ్ పేరుతో ఈ నెల 21న రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు చేతుల మీదుగా మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. ప్రతి ఇంటినుంచి చెత్త సేకరణ.. సిద్దిపేట పట్టణంలోని 43 వార్డుల్లో 41,322 కుటుంబాలు ఉండగా 1,57,026 మంది నివసిస్తున్నారు. ఇక్కడ తడి, పొడి, హానికర చెత్తను ఇంటింటి నుంచి సేకరించడాన్ని డిసెంబర్ 2020లో ప్రారంభించారు. ఈ చెత్తను సేకరించేందుకు 52 వాహనాలను ఏర్పాటు చేశారు. మున్సిపాలిటీ పరిధిలో రోజుకు 60 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతుండగా ఇందులో 70 శాతం తడి, 30 శాతం పొడి చెత్త ఉంటోంది. ఈ లెక్కన 42 మెట్రిక్ టన్నుల తడి చెత్త, 18 మెట్రిక్ టన్నుల పొడి చెత్తను సేకరిస్తున్నారు. తడి చెత్తతో ఎరువు తయారీ బుస్సాపూర్ డంపింగ్ యార్డులో రూ.6 కోట్ల వ్యయంతో బయో – సీఎన్జీ ప్లాంట్, సేంద్రియ ఎరువుల కేంద్రం నిర్మించారు. ఈ ప్లాంట్ నిర్వహణ బాధ్యతలను కార్బన్ లైట్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి అప్పగించారు. రాష్ట్రంలోనే మొదటిదైన ఈ ప్లాంట్‌ను 2021 డిసెంబర్ 20న బ్రిటన్ డిప్యూటీ హైకమిషనర్ డాక్టర్ ఆండ్రూ ఫ్లెమింగ్‌తో కలసి మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఇళ్ల నుంచి సేకరించిన 42 మెట్రిక్ టన్నుల తడి చెత్త నుంచి ఆహార వ్యర్థాలు, కురగాయలు, ఇతర వ్యర్థాలను వేరు చేస్తున్నారు. ఇలా వేరుచేసిన తర్వాత 10 మెట్రిక్ టన్నుల తడి చెత్తను బయో–సీఎన్జీ తయారు చేయడానికి మిగతా 32 మెట్రిక్ టన్నుల చెత్తను సేంద్రియ ఎరువులను తయారు చేయడానికి వినియోగిస్తున్నారు. సిద్ధం చేసిన సేంద్రియ ఎరువును 40 కేజీల చొప్పున బ్యాగుల్లో ప్యాక్ చేసి విక్రయించేందుకు సిద్ధం చేశారు. ఒక్కో బ్యాగు అసలు ధర రూ.600 కాగా సిద్దిపేట రైతులకు రూ.300కే విక్రయించనున్నారు. 21న రైతులకు అవగాహన సదస్సు సేంద్రియ ఎరువుల ఆవశ్యకతపై రైతులకు ఈ నెల 21న సిద్దిపేట వ్యవసాయ మార్కెట్లోని పత్తి యార్డులో అవగాహన కల్పించనున్నారు. అనంతరం మంత్రి హరీశ్‌రావు చేతుల మీదుగా రైతులకు పంపిణీ చేయనున్నారు. సిద్దిపేట బ్రాండ్‌తో సేంద్రియ ఎరువు: మంత్రి హరీశ్‌రావు మంత్రి హరీశ్‌రావు ఆదివారం సాయంత్రం సిద్దిపేట నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సిద్దిపేట బ్రాండ్‌తో చెత్త ద్వారా తయారు చేసిన ఎరువును రైతులకు అందించబోతున్నామన్నారు. సిద్దిపేట ప్రజలు రోజు వేసే చెత్తతో ఒక గొప్ప సంపదను తయారు చేసి రైతులకు ఇవ్వడం సంతోషంగా ఉందన్నారు. ఈ సేంద్రియ ఎరువుతో అన్నీ పంటల నుంచి అధిక దిగుబడి, నాణ్యమైన ఉత్పత్తులు పొందే అవకాశం ఉందని చెప్పారు. -
కేసీఆర్ కారణజన్ముడు
సాక్షి, సిద్దిపేట: కే.. అంటే కారణజన్ముడు.. సీ.. అంటే చిరస్మరణీయుడు.. ఆర్.. అంటే మన తలరాతలను మార్చిన మహనీయుడు కేసీఆర్ అని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అభివర్ణించారు. సీఎం కేసీఆర్ పుట్టిన రోజు శుక్రవారం. ఈ నేపథ్యంలో గురువారం రాత్రి సిద్దిపేట జయశంకర్ క్రికెట్ స్టేడియంలో కేసీఆర్ క్రికెట్ టోర్నమెంట్ సీజన్–3ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ‘దసరా’సినిమా ట్రైలర్‌ను విడుదల చేశారు. కార్యక్రమంలో హీరో నాని మాట్లాడుతూ 373 టీమ్‌లతో ప్రపంచంలో ఎక్కడ కూడా క్రికెట్ టోర్నమెంట్ జరగలేదన్నారు. ఇంత పెద్ద టోర్నమెంట్‌ను నిర్వహిస్తున్న మంత్రి హరీశ్‌ను అభినందించారు. క్రికెటర్ అంబటి రాయుడు మాట్లాడుతూ తాను కేసీఆర్ అభిమానినన్నారు. -
రేపు సిద్ధిపేట జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటన
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఇరిగేషన్ పాలసీ పరిశీలనలో భాగంగా సిద్ధిపేట జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం (రేపు) పర్యటించనున్నారు. ఈ పర్యటనలో సీఎం కేసీఆర్‌తో పాటు పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్సింగ్ కూడా పాల్గొనున్నారు. ఈ క్రమంలో పంజాబ్ సీఎం బుధవారం రాత్రి హైదరాబాద్‌కు చేరుకోనున్నారు. సిద్దిపేట పర్యటనలో భాగంగా కాళేశ్వరం ప్రాజెక్టులోని కొండపోచమ్మ, మల్లన్న సాగర్ రిజర్వాయర్లను ఇద్దరు సీఎంలు సందర్శించనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అందులోని రిజర్వాయర్లు, తెలంగాణ ఇరిగేషన్ పాలసీని పంజాబ్ సీఎంకు కేసీఆర్ వివరించనున్నారు. -
కళ్ల ముందు... కదలాడుతూ..
సాక్షి, సిద్దిపేట: చదివిన దాని కన్నా చూసింది ఎక్కువగా గుర్తుంటుంది. అంతకుమించి బాగా అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో 2డీ, 3డీ యానిమేషన్ దృశ్యరూప విద్యాబోధన ప్రాచుర్యంలోకి వచ్చింది. 3డీ యానిమేషన్లో కళ్ల ముందు కదలాడుతున్నట్లుగా పదో తరగతి పాఠ్యాంశాలను అందిస్తున్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్య అందించి, మెరుగైన ఫలితాలు సాధించే లక్ష్యంతో మంత్రి హరీశ్‌రావు సొంత ఖర్చులతో సిద్దిపేట జిల్లా సర్కారు బడుల్లోని టెన్త్ విద్యార్థులకు అందిస్తున్నారు. మళ్లీ మొదటిస్థానం కోసం.. 2021–22 విద్యా సంవత్సరంలో పదో తరగతిలో 97.85 శాతం ఉత్తీర్ణతతో సిద్దిపేట జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. అదే స్ఫూర్తితో మొదటి స్థానాన్ని తిరిగి సాధించేందుకు మరింత కృషి అవసరమని గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ డిజిటల్ కంటెంట్ పేరుతో హైదరాబాద్‌కు చెందిన మంత్ర లెర్నింగ్ అకాడమీ... 3డీ యానిమేటెడ్ పాఠాలు, స్టడీ మెటీరియల్ రూపొందించింది. మంత్రి హరీశ్‌రావు రూ.20లక్షలకు పైగా వెచ్చించి జిల్లా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు అందించారు. జనవరి 24న సిద్దిపేటలో ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్లో విద్యార్థులకు క్యూఆర్ కోడ్ స్కానింగ్ స్టడీ మెటీరియల్‌ను హరీశ్‌రావు అందించి ప్రారంభించారు. కేసీఆర్ డిజిటల్ కంటెంట్ పుస్తకాలను అందజేస్తున్న మంత్రి హరీశ్ రావు(ఫైల్) నాలుగు సబ్జెక్ట్‌లు.. గణితం, జీవశాస్త్రం, భౌతిక శాస్త్రం, సాంఘిక శాస్త్రం నాలుగు సబ్జెక్టుల్లో ఉన్న అన్ని పాఠ్యాంశాలు 3డీ యానిమేషన్లో అందిస్తున్నారు. ఒక్కో పాఠ్యాంశానికి ఒక్కో క్యూఆర్ కోడ్ పొందుపరిచారు. 30 సెకన్ల నుంచి 5 నిమిషాలపాటు ఆ పాఠ్యాంశానికి సంబంధించిన వివరణ ఉంటుంది. తరగతి గదుల్లో గంటల వ్యవధిలో బోధించే పాఠాన్ని ఐదు నిమిషాల్లో అర్థం చేసుకునేలా రూపొందించారు. విద్యార్థులు ఇంటికి వెళ్లి మొబైల్ ఫోన్ల ద్వారా దృశ్య రూపంలో పాఠాలను సులువుగా అభ్యసించే అవకాశం ఉంది. తల్లిదండ్రులకు హరీశ్ లేఖ.. ‘మీ పిల్లల ఉజ్వల భవిష్యత్ కోసం ప్రభుత్వ పాఠశాలల ద్వారా నాణ్యమైన విద్య అందిస్తున్నాం. విద్యార్థుల జీవితంలో పదో తరగతి కీలకమైంది. వారి భవిష్యత్‌కు పునాదులు వేసే వార్షిక పరీక్షలు సమీపిస్తున్నాయి. టీవీలకు, వినోదాలకు దూరంగా ఉంచండి. పిల్లలు ఇంటి దగ్గర చదువుకునేలా ప్రోత్సహించండి’ .. అంటూ తల్లిదండ్రులకు మంత్రి హరీశ్‌రావు లేఖలు రాశారు. దృశ్యాలతో కళ్ల ముందు మా పాఠశాలలో ఇప్పటికే అన్ని సబ్జెక్ట్‌ల సిలబస్ పూర్తయింది. ప్రస్తుతం రివిజన్ క్లాస్‌లు జరుగుతున్నాయి. స్టడీ మెటీరియల్లోని క్యూఆర్ కోడ్ స్కాన్‌తో 3డీ యానిమేషన్ ద్వారా పాఠ్యాంశాలు వస్తున్నాయి. వాటితో ఇంకా బాగా అర్థమవుతున్నాయి. బట్టీ పట్టకుండా నేర్చుకుంటున్నాం. – అక్షయ, టెన్త్ విద్యార్థి, ఇందిరానగర్ జడ్పీ హైస్కూల్ సిద్దిపేటకు పేరు తేవాలి.. 2021–22లో పదోతరగతిలో రాష్ట్రంలో సిద్దిపేట మొదటి స్థానంలో నిలిచింది. ఆ çస్థానాన్ని నిలబెట్టుకునేందుకు, విద్యార్థులు మంచి మార్కులు సాధించేందుకు ఉచితంగా డిజిటల్ పాఠాలను అందిస్తున్నాం. తల్లిదండ్రుల ఫోన్లో ఉదయం, రాత్రి వేళల్లో డిజిటల్ పాఠాలు వింటూ మెళకువలు నేర్చుకోవాలి. బాగా చదివి తల్లిదండ్రులకు, జిల్లాకు పేరు తీసుకురావాలి. – హరీశ్ రావు, ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి -
పసుపుమయం పట్నం వారం
కొమురవెల్లి (సిద్దిపేట): ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లి మల్లికార్జున స్వామి క్షేత్రంలోని తోటబావి ప్రాంగణంలో పట్నం వారాన్ని పురస్కరించుకొని సోమవారం అగ్నిగుండాలు, పెద్దపట్నం వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్ర మానికి హైదరాబాద్‌కు చెందిన యాదవ భక్తులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఒగ్గు పూజారులు పంచవర్ణాల పిండితో పెద్దపట్నం వేశారు. అనంతరం పంచ పల్లవాలతో (మామిడి, జువ్వి, రాగి, మేడి, మర్రి) కట్టెలతో నిప్పు కణిక లు తయారు చేసి అగ్ని గుండాలను సిద్ధం చేశారు. తర్వాత ఉత్సవ విగ్రహాలతో ఆలయ పూజారులు పెద్దపట్నం, అగ్ని గుండాలు దాటారు. -
సిద్ధిపేట: వ్యక్తి హల్చల్ ఘటనలో ట్విస్ట్
సిద్ధిపేట: డబుల్ బెడ్రూమ్ ఇళ్ల వ్యవహారంలో అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు బీజేపీ ప్రయత్నిస్తోంది. విమర్శలు ఎక్కుపెడుతోంది. తాజాగా సిద్ధిపేటలో జరిగిన ఓ ఘటనను దానికి ముడిపెట్టి సోషల్ మీడియాలో ప్రచారం చేసింది. అయితే.. జిల్లా కేంద్రంలో ఓ వ్యక్తి సృష్టించిన అలజడిపై పోలీసులు స్పష్టత ఇచ్చారు. బిల్బోర్డ్ ఫ్రేమ్‌ను పట్టుకుని ఓ వ్యక్తి ఊగిసలాడడం, డబుల్ బెడ్రూం ఇళ్ల కోసమే అతనలా చేశాడంటూ జరిగిన ప్రచారం అంతా నిజం కాదని సిద్ధిపేట పోలీసులు స్పష్టత ఇచ్చారు. సిద్ధిపేట జిల్లా కేంద్రంలో బుధవారం నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. ఓ వ్యక్తి.. బిల్బోర్డ్ పట్టుకుని వేలాడుతూ అధికారులకు చుక్కలు చూపించాడు. దానికి తోడు అతని వ్యవహారంతో ట్రాఫిక్ ఝామ్ అయ్యింది. అయితే.. ఎలాగోలా అతన్ని కిందకు దించారు పోలీసులు. దీనిపై మంత్రి హరీష్‌రావు ఏమంటారంటూ బీజేపీ విమర్శకు దిగింది. డబుల్ బెడ్రూం ఇళ్ల నిరసనలో భాగమే ఇదంటూ ప్రచారం చేసింది. అయితే.. ఆ వ్యక్తి తప్పతాగి వీరంగం వేశాడని పోలీసులు స్పష్టత ఇచ్చారు. ‘‘బుధవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. తాగిన మత్తులో సోయిలేక ఆ వ్యక్తి అలా చేశాడు. డబుల్ బెడ్రూం ఇళ్ల కోసమో మరేయితర దాని కోసమో అతను అలా చేయలేదు. కిందకు దించి అతన్ని కుటుంబ సభ్యులకు అప్పగించాం. అలాగే అతనిపై న్యూసెన్స్ కేసు నమోదు చేశాం’’ అని సిద్ధిపేట కమిషనర్ శ్వేత మీడియాకు వెల్లడించారు. This is the Situation in #Siddipet Mr.@trsharish Do you have an Answer?@BRSparty #KCRFailedTelangana pic.twitter.com/u5yzfRv5FD — Maruthi (@Maruthi0305) January 11, 2023 -
అతివేగంతో అదుపుతప్పి కెనాల్లో పడిన కారు
గజ్వేల్: వేములవాడ రాజన్న దర్శనానికి వెళ్లి వస్తుండగా మార్గమధ్యలో సిద్దిపేట జిల్లా జగదేవ్‌పూర్ మండలం ముని గడపలో చోటుచేసుకున్న రోడ్డు ప్రమాదం ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురిని బలితీసుకుంది. అతివేగం వల్ల కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొని రోడ్డు పక్కనే ఉన్న కొండ పోచమ్మసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్లో పడిపోవడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఘటనా స్థలంలోనే ఐదుగురు మృతి చెందగా.. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరొకరు కన్ను మూశారు. ప్రత్యక్ష సాక్షులు, పోలీసుల కథనం ప్రకారం.. యాదాద్రి– భువనగిరి జిల్లా బీబీనగర్ మండల కేంద్రానికి చెందిన బొల్లు సమ్మయ్య(38).. భార్య స్రవంతి(36), కూతురు భవ్య(13), కుమారుడు కార్తీక్ అలియాస్ లోకేశ్ (11)లతో పాటు అదే జిల్లా బొమ్మల రామారం మండలం మల్యాల గ్రామానికి చెందిన మామ బిట్టు వెంకటేష్ (58), అత్త రాజమణి(56)లను తీసుకొని ఆల్టో కారులో తనే డ్రైవింగ్ చేస్తూ సోమవారం మధ్యాహ్నం వేములవాడ రాజన్న ఆల యానికి వెళ్లాడు. సమ్మయ్య ఏటా ఆలయానికి ఆనవాయి తీగా వెళ్తుంటాడు. మొక్కుతీర్చుకొని వీరంతా మంగళవారం తిరుగు ప్రయాణమయ్యారు. తక్కువ దూరం ఉంటుందని భావించి రాజీవ్ రహదారిపై ఉన్న గజ్వేల్ మండలం కొడకండ్ల నుంచి జగదేవ్‌పూర్, భువనగిరి వైపు వచ్చారు. కల్వర్టును ఢీకొట్టిన తర్వాత.. మార్గమధ్యలో మధ్యాహ్నం 3.30గంటల సమయంలో మునిగడప గ్రామ స్టేజీ సమీపంలో ఎల్లమ్మ ఆలయం వద్ద మలుపు దాటిన తర్వాత కొండపోచమ్మసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కోసం నిర్మించిన కల్వర్టును వేగంగా ఢీకొట్టాడు. దాంతో ఒక్కసారిగా కారు అదుపుతప్పింది. ఇదే క్రమంలో స్టీరింగ్ తిప్పి ఎక్సలేటర్ మరింత పెంచడంతో కారు వేగంగా ఎడమ నుంచి కుడివైపు దూసుకువెళ్లి మట్టిగడ్డను తాకింది. దాని పైనుంచి కాల్వలో మిషన్ భగీరథ పైప్‌లైన్‌ను తాకి అందులో పడిపోయింది. అప్పటికే కాల్వలో నీరు ఉండడం వల్ల కారు తలకిందులైంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న వారందరూ తీవ్రంగా గాయపడడంతో పాటు కారులోకి నీరుచేరడంతో నీటమునిగి ఊపిరాడనిస్థితిలో కొట్టుమిట్టా డారు. ఈ ఘటనను చూసిన గ్రామస్తులు హుటాహుటిన పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడం, ఇదే సమయంలో ఎస్ఐ కృష్ణమూర్తి, గజ్వేల్‌రూరల్ సీఐ రాజశేఖరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని నీటమునిగిన వారిని బయటకు తీశారు. అప్పటికే సమ్మయ్య, స్రవంతి, భవ్య, కార్తీక్‌లతో పాటు రాజమణిలు మృతి చెందినట్లు గుర్తించారు. వెంకటేష్ మాత్రం విషమస్థితిలో ఉన్నట్టు గమనించి ఆయన్ను చికిత్స నిమిత్తం గజ్వేల్‌లోని ప్రభుత్వాస్పత్రికి ఆ తర్వాత సికింద్రాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను అక్క డి నుంచి పోస్టుమార్టం నిమిత్తం గజ్వేల్ ఆస్ప త్రికి తరలించారు. ఆర్ధికంగా ఇంకా కుదురు కోని సమ్మయ్య కుటుంబ పోషణ నిమిత్తం స్టీల్ సామాన్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. మరో మృతుడు సమ్మయ్య మామ వెంకటేష్‌ది రెక్కాడితేగాని డొక్క నిండని కుటుంబం. కారు కండీషన్లో లేకపోవడం... మృతులు ప్రయాణించిన కారు కండీషన్ సక్రమంగా లేకపోవడం, అందులో ఆరుగురు ఇరుకుగా కూర్చోవడం కూడా ప్రమాదానికి ఓ కారణంగా భావిస్తున్నారు. కాగా ప్రమాదంలో మృతి చెందిన వెంకటే– రాజమణి దంపతులు ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన నిరుపేద కూలీలు. రాజమణి గంపలో గాజులు, స్టీల్, ప్లాస్టిక్ సామాన్లు పెట్టుకుని ఇంటింటికి అమ్ముతూ ఉండగా, వెంకటేష్ గ్రామంలో ఎక్కడైనా దినసరి కూలీ లభిస్తే వెళ్లేవాడు. లేని పక్షంలో పూరీ్వకుల నుంచి ఆచారంగా వచి్చన వృత్తిలో భాగంగా భాగవతం పాటలు పాడుతూ భిక్షాటన చేసేవాడు. మంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి మునిగడపలో చోటు చేసుకున్న ప్రమాదంలో ఆరుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్య శాఖామంత్రి హరీశ్‌రావు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాల పోస్టుమార్టంతో పాటు ఇతర సహాయక చర్యలను వెనువెంటనే జరిపించేందుకు దగ్గరుండి పర్యవేక్షించాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్, సీపీ శ్వేతలను ఆదేశించారు. మంత్రి ఆదేశాల నేపథ్యంలో కలెక్టర్, సీపీలు గజ్వేల్ ప్రభుత్వాస్పత్రికి చేరుకొని పోస్టుమార్టం త్వరగా జరిపించి మృతదేహాలను స్వస్థలాలకు తరలించే ఏర్పాట్లు చేయాలని వైద్యాధికారులతో పాటు పోలీసులకు సూచించారు. -
ఇల్లు నిర్మించుకునేవారికి రూ. 3 లక్షలు..
సాక్షి, సిద్దిపేట: సంక్రాంతి పండుగ తర్వాత సొంత స్థలంలో ఇల్లు కట్టుకునేవారికి రూ.3 లక్షల ఆర్థిక సాయం అందిస్తామని ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు తెలి పారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని సోమవారం ఆయన సిద్దిపేట పట్టణంలోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి 2 కిలోల స్వర్ణ కిరీటాన్ని స్వామి వారికి కానుకగా సమర్పించారు. మంత్రి హరీశ్‌రావుతోపాటు భక్తులు ఇచ్చిన విరాళాలతో ఈ కిరీటాన్ని రూపొందించారు. అనంతరం ఆయన బస్తీ దవాఖానాను ప్రారంభించి రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో హరీశ్ మాట్లా డుతూ పేదల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారని అన్నారు. బస్తీ ప్రజలకు వైద్య సేవలను మరింత అందుబాటులోకి తీసుకువచ్చేందుకే ఈ బస్తీ దవాఖానాను ఏర్పాటు చేశామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, ఇతర నేతలు పాల్గొన్నారు. -
Monkey Food Court: కోతుల కోసం మూడు ఎకరాల్లో పండ్ల మొక్కలు
సాక్షి, దుబ్బాక(సిద్ధిపేట): కోతుల బెడదతతో ప్రజలు నానా అవస్థలుపడుతున్నారు. అడవుల్లో ఉండాల్సిన కోతులు గుంపులు గుంపులుగా గ్రామాలకు చేరాయి. అక్కడ వాటికి సరిపడా ఆహారం లేకపోవడంతో గ్రామాలు, పట్టణాలకు వస్తున్నాయి. ఏకంగా ఇళ్లలోకి చోరబడి తినుబండారాలను ఎత్తుకెళ్లుతున్నాయి. ఇండ్ల పైకప్పులను ధ్వంసం చేస్తున్నాయి. రైతులు పండించి కూరగాయలను, ఇతర ఆహార పంటలను నాశనం చేస్తున్నాయి. దీంతో రైతులు తీవ్రస్థాయిలో నష్ట పోతున్నారు. కోతుల బెడద నుంచి పంటలను రక్షించుకోవడానికి వాయిస్ అలారం ఏర్పాటు చేశారు. కొంత మంది రైతులు డప్పు చప్పుడు, టపాసులు కాల్చుతున్నారు. కోతులను బెదర కొట్టేందుకు కొన్ని గ్రామాల రైతులు ఇతర జిల్లాల నుంచి రూ.30 వేలు ఖర్చు పెట్టి కొండెంగలను కొనుగోలు చేసి తిప్పుతున్నారు. వాటి సంరక్షులకు ప్రతీ నెల జీతం ఇస్తున్నారు. పద్మనాభునిపల్లి గ్రామపంచాయతీ కార్యాలయం కోతుల బెడదను తప్పించడానికి అవి ఊర్లలోకి రాకుండా, పంట పొలాలను నష్టం చేయకుండా దుబ్బాక మండలం పద్మనాభునిపల్లి గ్రామంలోని గ్రామ శివారులో ప్రత్యేకించి ‘మంకీ ఫుడ్‌కోర్టు’ ఏర్పాటు చేశారు. గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో మూడు ఎకరాలను చదును చేసి అందులో పలు రకాల పండ్ల మొక్కలు నాటారు. అవి నాటి మూడు సంవత్సరాలైంది. మామిడి, జామ, దానిమ్మ, సపోట, సీతాఫలం, రేగుపండ్లు, బొప్పాయి, సంత్ర, అరటి, బత్తాయి, అల్లనేరేడు, వెలగ పండ్లు, ఖర్బూజ, దోస పండ్ల మొక్కలను పెంచుతున్నారు. రాజక్కపేటలో కొండెంగలను తిప్పుతున్న గ్రామస్తులు -
ఓట్ల కోసం ఏదైనా చేస్తారు
సాక్షి, సిద్దిపేట: ‘గోవును, గుడిలో భగవంతున్ని పూజించేది మేము.. కానీ రాజకీయాలకు వాడుకుని మలినం చేసే చరిత్ర బీజేపీది’అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు బీజేపీపై ధ్వజమెత్తారు. ఓట్ల కోసం బీజేపీ వాళ్లు ఏదైనా చేస్తారని దుయ్యబట్టారు. శుక్రవారం సిద్దిపేట జిల్లా దుబ్బాకలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో వ్యవసాయ మంత్రి నిరంజన్‌రెడ్డి, రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్‌లతో కలిసి హరీశ్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రానికి, దేశానికి బీజేపీ చేసిన ఒక్క మంచి పని చెప్పండి అని ప్రశ్నించారు. ధరలు పెంచడం తప్ప ఎవరికి ఏం చేశారని నిలదీశారు. జన్ ధన్ యోజన ద్వారా డబ్బులు ఇస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి వేయలేదన్నారు. కోట్ల కొలువులు ఇస్తా మని ఒక్కటీ ఇవ్వలేదన్నారు. ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టి ప్రభు త్వ రంగ సంస్థలు అమ్మడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని హరీశ్ ధీమా వ్యక్తం చేశారు. మిషన్ 90 సీట్లు కాదు: నిరంజన్‌రెడ్డి మిషన్ 90 సీట్ల పేరుతో తెలంగాణలో 90 స్థానాలు గెలుస్తామని ఓ బీజేపీ నాయకుడు అన్నాడని, వాళ్లు మొదటగా 90 మంది అభ్యర్థులను పెట్టుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. ఎన్నికష్టాలొచ్చినా సీఎం కేసీఆర్ రైతుబంధు ఆపలేదని, 10వ విడతలో ఇప్పటికే 42 లక్షల ఎకరాలకు రైతుబంధు వచ్చిందని.. అలాంటి కేసీఆర్‌కు అండగా ఉండాలని పిలుపునిచ్చారు. బీజేపీకి చెందిన వ్యక్తికి చెక్కు ఆపేశా..: ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్ మాట్లాడుతూ నిజామాబాద్‌లో కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీలో బీజేపీకి చెందిన వ్యక్తికి ఇవ్వాల్సిన చెక్కును ఆపేశానని చెప్పారు. ’’ఆ వ్యక్తి నా దగ్గరికి వచ్చి చెక్కు రాలేదని అడిగాడు.. ఇంట్లో రెండు ఫించన్లు ఇస్తున్నా కల్యాణలక్ష్మి చెక్కు ఎందుకు..ఇంకా బీజేపీలో ఎందుకు ఉన్నావ్ ’’అని అడిగానని బాజిరెడ్డి తెలిపారు. గవర్నమెంట్ పథకాలు తీసుకుంటూ బీజేపీలో ఉండటం ఏంటని ప్రశ్నించానని చెప్పా రు. ప్రభుత్వ కార్యక్రమాలకు అడ్డుపడుతూ.. ఇక్కడ మాదిరిగానే మా దగ్గర సైతం ఓ గుండు గాడు ఉన్నాడని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. ’’బీజేపీ వాళ్లు జై శ్రీరామ్ అని అంటున్నారు.. మోదీకి భార్య లేదు కాబట్టి శ్రీరాముని భార్య సీతను కూడా విడదీస్తారా.. జై సీతారామ అనాలి’’అని బాజిరెడ్డి వ్యాఖ్యానించారు. -
పంచుడు బీఆర్ఎస్ వంతు.. పెంచుడు బీజేపీ వంతు: మంత్రి హరీష్ రావు
సాక్షి, సిద్ధిపేట: దుబ్బాకలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే లేకపోయినా నియోజకవర్గ ప్రజలపై కేసీఆర్‌కు ఎంతో ప్రేమ ఉందని మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. స్థానిక ఎమ్మెల్యే బీజేపీ వ్యక్తి అయినా.. ప్రజలు మాత్రం తెలంగాణ వారు అని తెలిపారు. దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా దుబ్బాకలో గులాబీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. దుబ్బాక పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారంలో మంత్రి హరీష్ రావు పాల్గొని ప్రసంగించారు. ఆయన మాట్లాడుతూ.. దుబ్బాక బస్టాండ్ చూస్తుంటే కడుపు నిండిందన్నారు. ఇక్కడ బస్టాండ్, తిరుపతి బస్సు కోసం ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి కష్టడ్డారని గుర్తు చేశారు. అయితే కొబ్బరికాయ కొట్టేందుకు వచ్చింది ఇంకోకరు అని విమర్శించారు. బీజేపీ, ఎమ్మెల్యేలను కొనే కుట్ర చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. సైనికులను, గోవులను రాజకీయాలకు వాడుకుని మలినం చేసే చరిత్ర బీజేపీదంటూ ధ్వజమెత్తారు. ఓట్ల కోసం బీజేపీ వాళ్లు ఏదైనా చేస్తారని మండిపడ్డారు. బీజేపీ చేరికల కమిటీ పార్టీలు చీల్చే కమిటీగా మారిందన్నారు. పక్క పార్టీలను బెదిరించి గుంజుకునే పార్టీ బీజేపీ అని దుయ్యబట్టారు. 400 ఉన్న సిలిండర్‌ను 1200కు పెంచారన్నారు. పెంచిన సిలిండర్ ధర ఎప్పుడు తగ్గిస్తారని ప్రశ్నించారు. పంచుడు బీఆర్ఎస్ వంతు అయితే.. పెంచుడు బీజేపీ వంతు అని అన్నారు. దేశంలో బీజేపీ వాళ్లు బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చారా అని మంత్రి ప్రశ్నించారు. 30 సీట్లు రావని బీజేపీ నేత సంతోష్ చెప్పకనే చెప్పారు.. అంటే వాళ్లు తెలంగాణలో అధికారంలోకి రారని విమర్శించారు. ఉన్న ఉద్యోగాలను తీసేసి, ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు చేయడం తప్ప బీజేపీ చేసిందేమీ లేదన్నారు. జన్ ధన్ యోజన ద్వారా డబ్బులు ఇస్తామని ఇంతవరకు ఒక్క రూపాయి వేయలేదన్నారు. మాయమాటలు చెప్పితే మోసపోవడం ఇక కుదరదన్నారు. చదవండి: అయ్యప్పస్వామిపై భైరి నరేష్ వివాదాస్పద వ్యాఖ్యలు.. పరిగెత్తించి కొట్టిన స్వాములు -
మేమే చంపేశాం..
సిద్దిపేటకమాన్: జెడ్పీటీసీ శెట్టే మల్లేశం హత్య కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించినట్లు సిద్దిపేట పోలీస్ కమిషనర్ ఎన్.శ్వేత తెలిపారు. కమిషనరేట్ కార్యాలయంలో బుధవారం మీడియా సమావేశంలో ఆమె వివరాలు వెల్లడించారు. ’’ హత్య జరిగిన తర్వాత మంగళవారం చేర్యాల మండలం గుర్జకుంట ఉపసర్పంచ్ నంగి సత్యనారాయణ (32), అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న బస్వరాజు సంపత్‌కుమార్ (24) పోలీస్ స్టేషన్‌కొచ్చి లొంగిపోయారు. తాము నేరాన్ని చేసినట్టు ఒప్పుకున్నారు. కుల సంఘం, గ్రామ రాజకీయంలో మల్లేశం తన ఎదుగుదలకు అడ్డు వస్తున్నాడన్న కక్షతో అడ్డు తొలగించుకోవాలని సత్యనారాయణ పథకం వేసుకున్నాడు. ముందుగా వేసుకున్న ప్లాన్ ప్రకారం సోమవారం తెల్లవారుజామున ఇద్దరు నిందితులు కారులో గ్రామ శివారులో ఉన్న వాటర్ ప్లాంట్ వద్ద వేచి ఉన్నారు. మల్లేశం ఉదయం వాకింగ్ చేసుకుంటూ నిందితులు ఉన్న కారు ముందు నుంచి వెళ్తుండగా.. సత్యనారాయణ కారును వేగంగా నడిపి మల్లేశంను వెనుక నుంచి ఢీకొట్టారు. కిందపడిపోయిన మల్లేశం తలపై.. సత్యనారాయణ కత్తితో బలంగా కొట్టడంతో తీవ్ర రక్తస్రావమై కిందపడిపోయాడు. అనంతరం ఇద్దరు నిందితులు కారులో ఘటనా స్థలం నుంచి పారిపోయారు. నిందితుల నుంచి హత్య చేయడానికి ఉపయోగించిన కత్తిని, కారును స్వాధీనం చేసుకుని అరెస్టు చేసి జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించాం’’ అని సీపీ తెలిపారు. కేసులో ఇంకా ఎవరైనా ఉన్నారా? ఎవరి పాత్రనైనా ఉందా? అనే విషయాలపై విచారణ కొనసాగిస్తామని చెప్పారు. కేసు ట్రయల్ తొందరగా జరిగేలా చూస్తామన్నారు. సమావేశంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ మహేందర్, ఎస్బి సీఐ రఘుపతిరెడ్డి పాల్గొన్నారు. -
‘లేబర్ కోడ్’లు రద్దు చేసేవరకు పోరాడుతాం
సిద్దిపేటఅర్బన్: కార్మికుల హక్కులను హరిస్తూ...వారికి ఉరితాళ్లుగా మారిన లేబర్ కోడ్లను కేంద్రం ప్రభుత్వం రద్దు చేసేంతవరకు పోరాడుతూనే ఉంటామని సీఐటీయూ జాతీయ ప్రధాన కార్యదర్శి తపస్‌సేన్ స్పష్టం చేశారు. సీఐటీయూ రాష్ట్ర నాలుగో మహాసభల ముగింపు సమావేశం శుక్రవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా కేరళ కార్మిక మంత్రి శివన్ కుట్టి హాజరయ్యారు. ఈ సందర్భంగా తపస్‌సేన్ మాట్లాడుతూ..కేంద్రంలోని నరేంద్రమోదీ సర్కార్ అదానీ, అంబానీ, టాటా, బిర్లా వంటి బడా పెట్టుబడిదారులకు కొమ్ము కాస్తూ సామాన్యులను, కార్మికులను మోసం చేస్తోందని విమర్శించారు. రూ.లక్షల కోట్ల ప్రజాధనాన్ని పెట్టుబడిదారులకు దోచిపెడు తూ దేశాన్ని ఆర్థికంగా బలహీనపరుస్తోందన్నారు. సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు (సీఆర్) మాట్లాడుతూ...29 కార్మిక చట్టాలను నాలుగు కోడ్లుగా వర్గీకరించి కార్మికులను పెట్టుబడిదారులకు బానిసలుగా మార్చిందన్నారు. మళ్లీ సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడుగా సీఆర్ సీఐటీయూ రాష్ట్ర మహాసభల సందర్భంగా రాష్ట్ర నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మళ్లీ రాష్ట్ర అధ్యక్షుడిగా చుక్క రాములు ఎన్నికయ్యారు. ఉపాధ్యక్షులుగా ఎస్.వీరయ్య, భూపాల్, ఎస్.రమ, పి.జయలక్ష్మి, కె, వెంకటేశ్వర రావు, జె.మల్లికార్జున్, వీఎస్.రావు, వీరారెడ్డి, ఈశ్వర్ రావు, రాజారెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పాలడుగు భాస్కర్, కార్యదర్శులుగా వెంకటేశ్, పద్మశ్రీ, ముత్యంరావు, చంద్రశేఖర్, మధు, మల్లేశ్, రమేశ్, శ్రీకాంత్, రమేశ్, కూరపాటి రమేశ్, గోపాల స్వామి, కోశాధికారిగా రాములు ఎన్నికయ్యారు. -
ఉద్యాన పరిశోధనలు పెరగాలి
సాక్షి, సిద్దిపేట: ప్రజల ఆరోగ్యాన్ని పెంపొందించే వంగడాల ఉత్పత్తే లక్ష్యంగా ఉద్యాన పరిశోధనలు చేయాలని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ పిలుపునిచ్చారు. విద్యార్థులు వ్యవసాయ, ఉద్యాన కోర్సులు ఎంచుకుంటుండటం సంతోషకరమని.. ఔషధ పంటలపైనా పరిశోధనలు విస్తృతం కావాల్సి ఉందని పేర్కొన్నారు. సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీకొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రెండో స్నాతకోత్సవం శుక్రవారం జరిగింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ దీనిలో ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశ సంస్కృతిలో పండ్లు, కూరగాయలు, పూలు కూడా భాగమని గవర్నర్ పేర్కొన్నారు. ఆహార అలవాట్లు మార్చుకోవాలి వ్యవసాయ రంగానికి ఉద్యాన విభాగం మూలస్తంభం లాంటిదని గవర్నర్ పేర్కొన్నారు. పూర్వీకులు సంప్రదాయ ఆహారం తీసుకున్నారని, అప్పట్లో జీవనశైలి వ్యాధులైన బీపీ, మధుమేహం వంటివి లేవని గుర్తు చేశారు. ‘‘తమిళనాడులో రకరకాల బియ్యం అందుబాటులో ఉన్నాయి. అదే తెలుగు నేలపై పాలిష్డ్ రైస్‌కు అధిక ప్రాధాన్యం ఇస్తున్నాం. బియ్యం తగ్గిస్తూ ప్రత్యామ్నాయంగా చిరుధాన్యాలు, పండ్లను ఆహారంలో భాగం చేసుకోవాలి. కోవిడ్ సమయంలో పండ్లు, కూరగాయల ప్రాధాన్యత ఏమిటో చూశాం. మానవాళికి ఆరోగ్యవంతమైన ఆహారంగా ఉపయోగపడే వంగడాల సృష్టి జరిగేలా ఉద్యాన పట్టభద్రులు నిరంతరం పరిశోధనలు చేయాల్సిన అవసరం ఉంది.’’ అని గవర్నర్ తమిళిసై చెప్పారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులకు, వ్యవసాయానికి మంచి ప్రోత్సాహం ఇస్తోందని చెప్పారు. పంటల ఉత్పత్తి, నాణ్యత పెంచాలి పర్యావరణ మార్పుల నేపథ్యంలో వ్యవసాయ, ఉద్యాన పంటల ఉత్పత్తి, నాణ్యత పెంచడంలో శాస్త్ర సాంకేతికతల భాగస్వామ్యం అవసరమని భారత వ్యవసాయ పరిశోధన మండలి డిప్యూటీ డైరెక్టర్ జనరల్ (హార్టికల్చర్) ఆనంద్‌కుమార్ సింగ్ పేర్కొన్నారు. మార్కెట్ ఉన్న పంటలు సాగు చేయడం, కోత అనంతర నష్టాలను తగ్గించడంతోపాటు రోబోటిక్స్, డ్రోన్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, జీనోమ్ ఎడిటింగ్, బయోటెక్నాలజీ వంటి ఆధునిక పద్ధతులను ఉపయోగించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైస్ చాన్స్‌లర్ నీరజ ప్రభాకర్ వర్సిటీ ఎనిమిదేళ్లలో సాధించిన విజయాలను, జరిగిన పరిశోధనలను వివరించారు. దేశంలోనే మొదటి మహిళా వీసీగా నియమించినందుకు సీఎం కేసీఆర్‌కు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. 11 మందికి గోల్డ్ మెడల్స్ స్నాతకోత్సవం సందర్భంగా 11 మంది విద్యార్థులకు గవర్నర్ తమిళిసై బంగారు పతకాలను అందించారు. పి.సాయి సుప్రియ మూడు మెడల్స్, ఎద్దుల గాయత్రి మూడు మెడల్స్, సంధ్యారాణి, స్నేహప్రియ, మిట్టపల్లి కిశోర్, హరిక, తేజస్విని ఒక్కో గోల్డ్ మెడల్ అందుకున్నారు. మొత్తంగా 482 అండర్ గ్రాడ్యుయేట్, 76 పీజీ, 17 పీహెచ్డీ పట్టాలను అందజేశారు. నాలుగు గోల్డ్ మెడల్స్ సాధించా.. మాది జగిత్యాల జిల్లా. ఉద్యాన కళాశాలలో 2018–2020 ఎమ్మెస్సీ (వెజిటబుల్స్) చేశాను. 92.9 శాతం మార్కులతో యూనివర్సిటీ టాపర్‌గా నిలిచాను. ప్రస్తుతం అగ్రికల్చర్ ఆఫీసర్‌గా యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేస్తున్నాను. యూజీలో ఒకటి, ఇప్పుడు మూడు.. మొత్తం నాలుగు గోల్డ్ మెడల్స్ వచ్చాయి. ఇదే స్ఫూర్తితో పీహెచ్డీ పూర్తి చేస్తాను. – పి.సాయి సుప్రియ, పీజీ విద్యార్థిని చంటి బిడ్డలతో వచ్చి పీహెచ్డీ పట్టా జనగామ జిల్లా స్టేషన్ ఘన్‌పూర్‌కు చెందిన కె.దివ్య పీహెచ్డీ పూర్తిచేసి శుక్రవారం పట్టా అందుకుంది. మూడు నెలల కవల పిల్లలు, కుటుంబసభ్యులతో కలిసి ఆమె స్నాతకోత్సవానికి వచ్చారు. పట్టా అందుకుని రాగానే పిల్లలను దగ్గరికి తీసుకుని, ఆనందంతో మురిసిపోయింది. -
సిద్దిపేటలో సీఐటీయూ రాష్ట్ర మహాసభలు
సిద్దిపేట అర్బన్: సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఈనెల 21, 22, 23 తేదీల్లో నిర్వహించే సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర 4వ మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర అధ్యక్షుడు చుక్క రాములు, ప్రధాన కార్యదర్శి భాస్కర్ పిలుపునిచ్చారు. సోమవారం ఇక్కడ నిర్వహించిన మహాసభల సన్నాహక సమావేశంలో రాములు మాట్లాడుతూ సిద్దిపేటరెడ్డి సంక్షేమ భవన్లో నిర్వహించే మహాసభల ప్రాంగణానికి మల్లు స్వరాజ్యం, సున్నం రాజయ్యల పేర్లు ప్రతిపాదించినట్లు తెలిపారు. రాష్ట్రం నలుమూలల నుంచి 600 మంది ప్రతినిధులు మహాసభలకు హాజరవుతారన్నారు. మూడు రోజులపాటు జరిగే మహాసభలకు ఇతర కార్మిక సంఘాలను కూడా ఆహ్వానిస్తున్నాని చెప్పారు. మహాసభల చివరి రోజు జరిగే బహిరంగ సభకు కేరళ మంత్రి శివమ్స్ కుట్టి వస్తారన్నారు. కార్మిక చట్టాలు, ధరల పెరుగుదల, విద్యుత్ చట్టం, రైతాంగ సమస్యలపై ఏప్రిల్ 5న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించే అవకాశాలున్నాయని తెలిపారు. సమావేశంలో మహాసభల ఆహ్వాన సంఘం ఉపాధ్యక్షులు మల్లారెడ్డి, శశిధర్, సీఐటీ యూ జిల్లా అధ్యక్షుడు ఎల్లయ్య పాల్గొన్నారు. -
కొమురవెల్లి మల్లన్న జాతర
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లన్న జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. స్వామి వారి కల్యాణంతో మూడు నెలలపాటు జరిగే జాతరకు అంకురార్పణ జరగనుంది. ఈనెల 18న ప్రారంభమై మార్చి 20తో ముగుస్తుంది. మూడు నెలలపాటు బ్రహ్మో త్సవాలు జరిగే ఏకైక శైవక్షేత్రంగా కొమురవెల్లి ప్రసిద్ధి గాంచింది. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. నేటి కల్యాణానికి మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు. -
గుర్జకుంట సర్పంచ్, ఉపసర్పంచ్‌పై ఫిర్యాదు!
సాక్షి, చేర్యాల(సిద్దిపేట): మండల పరిధిలోని గుర్జకుంట గ్రామ పంచాయతీలో జరిగినఅవకతవకలపై విచారణ నిర్వహించి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్తులు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంతో పాటు స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. సర్పంచ్, ఉపసర్పంచ్ ఇద్దరు కలిసి నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. పంచాయతీ నిధుల ఖర్చు వివరాలపై సర్పంచ్ మమతా రాంరెడ్డి, ఉపసర్పంచ్ సత్యనారాయణలను అడగగా..వారు నిర్లక్ష్యపు సమాధానం ఇచ్చారన్నారు. ఈ విషయంపై నంగి చంద్రం అనే వ్యక్తి సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు తీసుకున్నారనన్నారు. ఆ వివరాలను పరిశీలించగా పంచాయతీ నిధుల ఖర్చులో అవకతవకలు జరిగినట్లు గుర్తించామని, అట్టి వివరాలతో సంబంధిత జిల్లా, మండల అధికారులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
కీచక ఉపాధ్యాయుడు.. ప్రత్యేక తరగతులని చెప్పి విద్యార్థినిని..
సాక్షి, హుస్నాబాద్: విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన ఉపాధ్యాయుడికి దేహశుద్ధి చేసిన ఘటన సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం కేంద్రంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. మండలానికి చెందిన ఓ యువతి స్థానికంగా ఓ కళాశాలలో డిగ్రీ ప్రథమ సంవత్సరం చదువుతోంది. అదే కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న జనగామ జిల్లా నర్మెట్టకు చెందిన ఏనుగు రవి ఈనెల 20న బాలికకు ఫోన్ చేసి ప్రత్యేక తరగతులు ఉన్నాయని, కాలేజీకి రావాలని చెప్పాడు. దీంతో ఆమె తన సోదరుడితో కలిసి బైక్‌పై కళాశాలకు వచ్చింది. ఆదివారం కావడం, కళాశాల మూసి ఉండడంతో వెంటనే ఉపాధ్యాయుడికి ఫోన్ చేసింది. తాను నర్మెట్ట నుంచి వస్తున్నాని, లద్నూరు వరకు రావాలని విద్యార్థినికి సూచించాడు. యువతి తన సోదరుడితో కలిసి లద్నూరుకు వెళ్లింది. ఉపాధ్యాయుడు చెప్పిన చోటుకు నడుచుకుంటూ వెళ్లగా, అతడు తన బైక్‌పై ఎక్కించుకొని లద్నూరు రిజర్వాయర్ పైకి తీసుకువెళ్లాడు. గమనించిన యువతి సోదరుడు మరికొంత మందితో కలిసి ఉపాధ్యాయుడిని వెంబడించి పట్టుకున్నారు. ప్రత్యేక తరగతుల పేరిట విద్యార్థిని ఎక్కడి తీసుకువెళుతున్నావని ప్రశ్నించగా, పొంతనలేని సమాధానాలు చెప్పాడు. దీంతో యువతి సోదరుడు, మరికొంత మంది కలిసి ఉపాధ్యాయుడు రవికి దేహశుద్ధి చేశారు. ఈ విషయంపై ఎస్ఐ నారాయణను వివరణ కోరగా ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. చదవండి: కానిస్టేబుల్ ఈశ్వర్.. ఇతని రూటే సెపరేటు.. దొంగలతో చేతులు కలిపి -
త్వరలో గ్రూప్–4 నోటిఫికేషన్
సిద్దిపేట జోన్: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం యువతను నిర్వీర్యం చేసేలా అగ్నిపథ్ పేరిట ఆర్మీలో కాంట్రాక్టు విధానం తెచ్చిందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖమంత్రి హరీశ్‌రావు ఆరోపించారు. అలాగే నల్ల చట్టాలను తేవడం, పెట్రో ధరలను ఇష్టానుసారంగా పెంచి ప్రజల నడ్డి విరిచిందన్నారు. అలాంటి బీజేపీ తీరును గ్రామాల్లో ఎండగట్టి చర్చ పెట్టి నాయకుల చెంప చెల్లుమనేలా గులాబీ శ్రేణులు పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. ఆదివారం సిద్దిపేట జిల్లా కేంద్రంలో కేసీఆర్ ఉచిత శిక్షణ కేంద్రంలోని పోలీస్ ఉద్యోగాల శిక్షణార్థులకు పాలు, గుడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా హరీశ్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్–4 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనుందని ప్రకటించారు. వాటిలో 95 శాతం స్థానిక రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. రాష్ట్రంలోని కాళేశ్వరం ద్వారా ఒక్కఎకరా కూడా పండలేదని కొంతమంది అవాకులు చెవాకులుగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. ప్రతి గ్రామంలో నిండుకుండలా బావుల్లో, చెరువుల్లో, చెక్ డ్యామ్ల్లోనీరు ఉందన్నారు. గతంలో 5 వేల ఎకరాల్లో పంటల సాగు అయ్యేదని, ఇప్పుడు నాలుగింతల సాగు పెరిగిందని తెలిపారు. ఢిల్లీలో, గాంధీభవన్‌లో కూర్చొని మాట్లాడితే ఏం తెలుస్తుందని,గ్రామాల్లోకి వచ్చి చూస్తే కాళేశ్వరం గురించి తెలుస్తుందని హరీశ్ హితవు పలికారు. కొర్రీలతో 30 వేల కోట్ల నిధుల నిలుపుదల ఆంధ్రప్రదేశ్‌లో పోలవరం ప్రాజెక్టు మొదలైన తర్వాత రాష్ట్రంలో ప్రారంభించిన కాళేశ్వరం పూర్తిచేసుకుని ప్రస్తుతం ఫలితాలు పొందుతున్నామని హరీశ్ అన్నారు. కానీ అక్కడ ఆ ప్రాజెక్టు ఎప్పుడు పూర్తవుతుందో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలు కొర్రీల పేరుతో రాష్ట్రానికి వచ్చే రూ.30 వేల కోట్ల నిధులను ఆపిందని ఆరోపించారు. మల్లన్నసాగర్ ద్వారా సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఇంటింటికీ తాగునీరు అందించే రింగ్‌మెన్ రేపటి తరాలకు వరంగా మారుతుందన్నారు. దేశంలో ఎక్కువగా మాంసాహారం తినే రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉందని, 99 శాతం మాంసాహారులు ఉండగా, 1 శాతం శాకాహారం వారు ఉన్నట్లు హరీశ్ వెల్లడించారు. -
తెల్ల బంగారం భళా
గజ్వేల్: సిద్దిపేట జిల్లా గజ్వేల్ మార్కెట్ యార్డులో పత్తి ఈ సీజన్లో రాష్ట్రంలోనే రికార్డు స్థాయి ధర పలికింది. శుక్రవారం ఇక్కడ జరిగిన ఈ – నామ్ కొనుగోళ్లలో క్వింటాల్‌కు గరిష్టంగా రూ.9,040 పలికింది. ఏడుగురు రైతులు 13.29 క్వింటాళ్ల పత్తిని విక్రయించారు. ఇందులో మర్కూక్ మండలం పాములపర్తి గ్రామానికి చెందిన రైతు కనకయ్యకు చెందిన రెండు క్వింటాళ్ల పత్తిని లక్ష్మీ ట్రేడర్స్ క్వింటాకు అత్యధికంగా రూ.9,040 ధరను కోట్ చేసి కొనుగోలు చేసింది. అత్యల్పంగా రూ.8,750 పలికింది. ఈ విషయాన్ని మార్కెట్ కమిటీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, కార్యదర్శి జాన్‌వెస్లీలు ధ్రువీకరించారు. -
బైరాన్‌పల్లి చరిత్ర అందరికీ తెలియాలి
సాక్షి, సిద్దిపేట: తెలంగాణ సాయుధ పోరాటంలో భాగంగా రజాకార్లపై పోరాడిన బైరాన్‌పల్లి చరిత్ర అందరికీ తెలియాల్సిన అవసరం ఉందని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ చెప్పారు. అమరుల త్యాగాలను గురించి తెలుసుకోవడంతో యువతలో దేశభక్తి భావం పెంపొందుతుందని పేర్కొన్నారు. గురువారం గవర్నర్ సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. తొలుత కొమురవెల్లి మల్లన్న ఆలయానికి వెళ్లారు. ఆలయ పూజారులు, అధికారులు ఆమెకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. గవర్నర్ స్వామివారిని దర్శించుకుని, పట్నం వేయించి పూజలు చేశారు. తర్వాత ధూల్మిట్ట మండలం బైరాన్‌పల్లికి వెళ్లారు. రజాకార్లతో పోరాడి అమరులైన 118 మంది స్మారకార్థం ఏర్పాటు చేసిన స్తూపం వద్ద నివాళులు అర్పించారు. నాడు పోరా టం జరిగిన బురుజును సందర్శించారు. నాటి పోరాటంలో పాల్గొన్న సమరయోధులను సన్మానించారు. బైరాన్‌పల్లిని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని, అమరుల కుటుంబాలకు సమరయోధుల పింఛను ఇప్పించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కాగా సిద్దిపేట జిల్లాలో గవర్నర్ కార్యక్రమాలకు కలెక్టర్, సీపీ, ఇతర ఉన్నత అధికారులెవరూ హాజరుకాలేదు. కాన్వాయ్ ఆపి మహిళతో మాట్లాడిన గవర్నర్ చేర్యాల పట్టణంలో సంధ్యారాణి అనే మున్సిపల్ కార్మికు రాలు చేయి ఊపుతూ గవర్నర్ కాన్వాయ్‌ను ఆపడానికి ప్రయత్నించింది. అది చూసిన తమిళిసై కాన్వాయ్ ఆపి సంధ్యారాణితో మాట్లాడారు. తమది పేద కుటుంబమని, ఇల్లు లేక ఇబ్బంది పడుతున్నామని సంధ్యారాణి వాపోయింది. దీనితో ఆమె నివాసమున్న ఇంట్లోకి గవర్నర్ వెళ్లి పరిశీలించారు. ఆదుకుంటానని హామీ ఇచ్చారు. విద్యార్థిని విజ్ఞప్తి మేరకు వెళ్లి.. సెప్టెంబర్ 28న రాజ్‌భవన్‌లో తెలంగాణ విమోచన ఉద్యమం, పోరాటాలు, త్యాగాలపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఆ పోటీల్లో బైరాన్‌పల్లికి చెందిన బీటెక్ విద్యార్థి చల్లా అఖిల పాల్గొన్నారు. ఆ సమయంలో బైరాన్‌పల్లిని సందర్శించాలని ఆమె కోరగా గవర్నర్ తమిళిసై అంగీకరించారు. తాజాగా బైరాన్‌పల్లికి వెళ్లారు. తన కోరిక మేరకు గవర్నర్ రావడం సంతోషంగా ఉందని.. ఇప్పటికైనా బైరాన్‌పల్లి అభివృద్ధి బాట పడుతుందని ఆశిస్తున్నానని ఈ సందర్భంగా అఖిల పేర్కొన్నారు. -
63 ఏళ్ల వయసులో 6,000 కి.మీ.సైక్లింగ్
ఆయన వయసు 63 సంవత్సరాలు. జెట్ స్పీడ్‌తో సైకిల్ తొక్కుతూ రయ్ రయ్ అంటూ దూసుకెళ్తున్నారు. తొక్కుతున్న సైకిల్ స్పీడ్ చూస్తే 25 ఏళ్ల వయసు ఉన్న యువకుడు అనుకుంటారు. తన ఫేస్‌కు ఉన్న మాస్క్ తీస్తే కానీ తెలియదు ఆయన 60 ఏళ్ళకి పైబడిన వ్యక్తి అని. ఆయనే హైదరాబాద్‌కు చెందిన మేజర్ జనరల్ డాక్టర్ ఆలపాటి వెంకటకృష్ణ (ఏవీకే) మోహన్. సోమవారం హైదరాబాద్ నుంచి సిద్దిపేటలోని రంగనాయకసాగర్‌కు సైక్లింగ్ చేసుకుంటూ వచ్చారు. ఈ సందర్భంగా సాక్షి పలకరించింది. వివరాలు ఆయన మాటల్లోనే... – సాక్షి, సిద్దిపేట 23 ఏళ్లు ఇక్కడే.. 37 ఏళ్లు దేశవ్యాప్తంగా విధులు మా నాన్న దేవాదాయ శాఖలో విధులు నిర్వర్తించేవారు. కాకినాడలో ఎంబీబీఎస్ పూర్తి చేశాను. 1984లో సికింద్రాబాద్‌లోని మిలటరీ హాస్పిటల్లో డాక్టర్‌గా జాబ్ వచ్చింది. 37 ఏళ్ల పాటు ఆర్మీలో వివిధ హోదాల్లో విధులు నిర్వర్తించి ఆర్మీ సదరన్ కమాండ్ హెడ్ క్వార్టర్స్ పుణేలో మెడికల్ హెడ్‌గా మేజర్ జనరల్‌గా ఉద్యోగ విరమణ తీసుకున్నాను. ప్రస్తుతం సికింద్రాబాద్‌లోని కౌకూర్‌లో నివాసం ఉంటున్నాను. నా కూతురు ప్రసన్న డెంటల్ స్పెషలిస్ట్ గౌహతిలో ప్రాక్టీస్ చేస్తోంది. పర్వతారోహణ.. బైకింగ్ 1991లో ఇటాలియన్లతో కలిసి మౌంట్ సతోపంత్‌కు పర్వతారోహణ యాత్ర చేశా. 2000 సంవత్సరం ప్రారంభంలో కాంగోలోని మౌంట్ నైరాగాంగోలో ప్రత్యక్ష అగ్నిపర్వతం అధిరోహించిన ఆర్మీ బ్రిగేడ్‌లో మొదటి వ్యక్తి నేనే. ఈశాన్యంలోని మొత్తం ఎనిమిది రాష్ట్రాలల్లో బైకింగ్ చేసుకుంటూ తిరిగి వచ్చాను. 2019లో దే«శంలోని మూడు కార్నర్లు తూర్పు, పడమర దక్షణంలో 11,500 కిలో మీటర్లు మోటార్ బైకింగ్ చేశాను. సైక్లింగ్ అంటే ఇష్టంతో నాకు చిన్నప్పటి నుంచి సైక్లింగ్ చేయడం అంటే చాలా ఇష్టం. డిసెంబర్ 2014లో చెన్నైకి బదిలీపై వచ్చాను. అప్పటికే చెన్నై నగరంలో ప్రసిద్ధ సైక్లింగ్ గ్రూప్ అయిన చెన్నై జాయ్ రైడర్జ్ ఉంది. అందులో చేరాను. చెన్నై నుంచి విజయవాడ , 2015లో కర్ణాటక, కేరళ , తమిళనాడులో 900 కి.మీ, టూర్ ఆఫ్ నీలగిరీస్ సైక్లింగ్ పర్యటన చేశాను. 2016లో స్వచ్ఛ భారత్ అభియాన్‌లో భాగంగా కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు సైక్లింగ్ చేశాను. జలశక్తి మిషన్ కింద 2019లో కచ్(గుజరాత్) నుంచి గౌహతి(అస్సాం) వరకు 3,200 కిలోమీటర్లు సైక్లింగ్ చేశాను. ఈ నెల 20 నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ ఈ నెల 20వ తేదీ నుంచి నెల రోజుల పాటు గోల్డెన్ క్వాడ్రీలెట్రల్ సైక్లింగ్ చేయనున్నాను. 6 వేల కిలోమీటర్ల మేర యాత్ర సాగనుంది. ఔరంగాబాద్‌లో ప్రారంభమై జార్ఖండ్, వెస్ట్‌బెంగాల్, కోల్‌కతా, చెన్నై, ముంబై, ఢిల్లీ మీదుగా మళ్లీ ఔరంగాబాద్‌కు చేరుకుంటాను. ఇలా నెల రోజుల పాటు సైక్లింగ్ చేస్తాను. ఫిట్నెస్ ఔత్సాహికులకు సలహాలు, మెరుగైన జీవనం వైపు అడుగులు వేసేందుకు ఇతరులకు ఆదర్శంగా ఉండాలనేదే ఆలోచన. -
దివంగత సీఎం వైఎస్‌ది గోల్డెన్ పీరియడ్: చాడ
హుస్నాబాద్: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాం గోల్డెన్ పీరియడ్ అని సీపీఐ జాతీయ కార్యవర్గసభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి అన్నారు. వైఎస్ కాలంలో తాను సీపీఐ శాసన సభాపక్ష నేతగా ఉన్న సమయంలో అసెంబ్లీలో ప్రజాసమస్యలు చర్చించేందుకు ఎక్కువ అవకాశం కలిగిందని, స్ఫూర్తిదాయక చర్చ జరిగేదని గుర్తుచేసుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని రాజ్యలక్ష్మి ఫంక్షన్ హాల్లో శనివారం చాడ వెంకట్‌రెడ్డి రచించిన ‘అసెంబ్లీ సాక్షిగా నా పోరాటం.. శాసనసభ ప్రసంగాలు’ అనే పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమానికి స్ఫూర్తి అసోసియేషన్ అధ్యక్షుడు పందిల్ల శంకర్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా చాడ మాట్లాడుతూ తాను ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొంటూ హుస్నాబాద్ కేంద్రంగా ఉద్యమాలు నిర్వహించానన్నారు. ముఖ్యంగా హుస్నాబాద్‌లో జరిగిన లాకప్‌డెత్‌పై అసెంబ్లీలో చర్చ జరిగిందని గుర్తుచేశారు. వైఎస్ మానవత్వం ఉన్న నాయకుడని, ప్రజల సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లినప్పుడు పార్టీ వేరైనా పరిష్కరించేవారన్నారు. నాటి ప్రతిపక్షాలు ప్రజల గొంతుగా ప్రజా సమస్యలపై ప్రశ్నించేవారని నేడు అలాంటి పరిస్థితి లేదని విమర్శించారు. ప్రస్తుతం ఒక ఎమ్మెల్యేను రూ.100 కోట్లకు కొనే పరిస్ధితి వచ్చిందని, ఇప్పుడు ప్రజాస్వామ్యం అమ్ముడుపోయిందన్నారు. కార్యక్రమంలో ప్రముఖ కవి అన్నవరం దేవేందర్, సీపీఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజిత, వైస్‌చైర్మన్ అనిత తదితరులు పాల్గొన్నారు. -
మరో మహిళతో సంబంధం.. భర్త కొట్టడంతో మనస్తాపం చెంది
సాక్షి, సిద్దిపేట: భర్త వేధింపులు తాళలేక భార్య ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం జిల్లాలోని చిన్నకోడూరు మండల కేంద్రంలో చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దిపేటకు చెందిన దాసరి రాజ్యలక్ష్మి (24)ని 2015లో చిన్నకోడూరుకు చెందిన శ్రీశైలంతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా శ్రీశైలం మూడేళ్లుగా అదే గ్రామానికి చెందిన మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఇరువురికి నచ్చజెప్పి సముదాయించారు. ఆదివారం రాజ్యలక్ష్మిని భర్త కొట్టడంతో మనస్తాపం చెంది రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. అల్లుడు వేధింపుల వల్లే తన కూతురు ఆత్మహత్య చేసుకుందని మృతురాలి తల్లి దేవవ్వ ఆరోపించింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. చదవండి: దసరాకి కొత్త దుస్తులు నాన్నా.. ఈ రోజే తెద్దాంలే కన్నా’.. అంతలోనే -
బతుకమ్మ పండగ వేళ విషాదం.. మరొకరితో సహజీవనం చేస్తోందని..
సాక్షి, సిద్దిపేట: బతుకమ్మ పండగ వేళ మండలంలోని వీరాపూర్‌లో విషాదం నెలకొంది. ఆదివారం రాత్రి బతుకమ్మ ఆడుతుండగా మామిడి స్వప్న(45)ను ఆమె భర్త ఎల్లారెడ్డి రాడ్డుతో తలపై మోదడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతురాలు తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు వివరాలు ఇలా ఉన్నాయి. బెజ్జంకి వీరాపూర్ గ్రామానికి చెందిన మామిడి ఎల్లమ్మ, గోపాల్‌రెడ్డి దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు మంగ, స్వప్న ఉన్నారు. అదే గ్రామంలోని యాల్ల ఎల్లారెడ్డితో పెద్ద కూతురు మంగ వివాహం 20 ఏళ్ల క్రితం జరిగింది. పెళ్లి జరిగిన నెలకే మంగ ఆత్మహత్య చేసుకుంది. తరువాత రెండో కూతురు స్వప్నను ఎల్లారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఆరేళ్ల వరకు వారు అనోన్యంగానే ఉన్నారు. వారికి కుమార్తె సుశ్మిత, కుమారుడు శ్రీజన్ ఉన్నారు. భార్యాభర్త తరుచు గొడవ పడేవారు. కాగా 14 ఏళ్ల నుంచి అదేగ్రామానికి చెందిన ఓ వ్యక్తితో స్వప్న సహజవనం చేస్తోంది. తనను వదిలి మరో వ్యక్తితో ఉంటోందని మనుసులో పెట్టుకున్న ఎల్లారెడ్డి బతుకమ్మ ఆడుతున్న స్వప్నను రాడ్‌తో తలపై కొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందింది. కూతురును హత్య చేసిన ఎల్లారెడ్డిపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని తల్లి ఎల్లమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్ఐ ఆవుల తిరుపతి తెలిపారు. చదవండి: లోయలో పడ్డ టెంపో ట్రావెలర్.. ఏడుగురు దుర్మరణం -
Chakradhar Goud: వంద రైతు కుటుంబాలకు రూ.కోటి సాయం
సాక్షి, సిద్దిపేట జోన్: రైతుల జీవితాల్లో వెలుగులు నింపేందుకు తమ సంస్థ కృషి చేస్తుందని ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ చైర్మన్ చక్రధర్ గౌడ్ అన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న వంద రైతు కుటుంబాలకు.. ఒక్కొక్కరికి రూ.లక్ష చొప్పున మొత్తం రూ.కోటి విలువైన చెక్కులను ఆదివారం సిద్దిపేట కొండ భూదేవి గార్డెన్స్‌లో ఆయన అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌలు రైతులను ఆదుకోవడం, వారికి అండగా నిలిచే లక్ష్యంగా తమ సంస్థ రాజకీయాలకు అతీతంగా పనిచేస్తుందన్నారు. చదవండి: (నీ కాళ్లు మొక్కుత సారూ.. పైసలిప్పియ్యరూ: రైతు ఆవేదన) -
సమగ్ర యాజమాన్యంతో అధిక దిగుబడి
సిద్దిపేటరూరల్: సాగులో సమగ్ర యాజమాన్య పద్ధతులు పాటిస్తే అధిక దిగుబడులు పొందవచ్చని తోర్నాల పరిశోధ స్థానం శాస్త్రవేత్తలు అన్నారు. తోర్నాల వ్యవసాయ పరిశోధన స్థానం, ఏరువాక కేంద్రం దత్తత గ్రామం ఇబ్రహీంపూర్లో ఉత్తమ సాగు పద్ధతులపై రైతులకు శిక్షణ నిర్వహించారు. శాస్త్రవేత్త, హెడ్ డా.ఎస్.శ్రీదేవి వ్యవసాయ, ఉద్యాన పంటల్లో పోషకాలపై వివరించారు. పంటల్లో చీడపీడల నివారణకు రసాయన మందులను కాకుండా సేంద్రియ మందులు వాడాలన్నారు. పర్యావరణ సమతుల్యత దెబ్బతినకుండా చీడపీడలను నివారించుకునేందుకు దీపపు ఎరలు, లింగాకర్షణ బుట్టలు, జిగురు పూసిన ఎరలను వాటి ప్రాముఖ్యతను వివరించారు. పంటల్లో ఎలా అమర్చుకోవాలో ప్రయోగాత్మకంగా ప్రదర్శించారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సాయినాథ్, ఎ.సరిత, ఉమారాణి, శ్వేత, డా.పల్లవి, ప్రొఫెసర్ సతీష్, సర్పంచ్, ఆర్.ఎస్.ఎస్ కోఆర్డినేటర్ కె.నగేష్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
తండ్రిని హతమార్చిన కూతురు
దౌల్తాబాద్(దుబ్బాక): సొంత కూతురే భర్త, మేనమామతో కలిసి తండ్రిని హతమార్చింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండల పరిధిలోని ఇందూప్రియాల్ గ్రామంలో గురువారం చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం..గ్రామానికి చెందిన హనుమాండ్ల కాడి వెంకటయ్య (42) గతంలో అత్తపై అత్యాచారం చేసిన కేసులో రెండు నెలలు జైలు శిక్ష అనుభవించి ఇటీవల విడుదలై గ్రామానికి వచ్చాడు. ఆ అత్యాచార విషయమై వెంకటయ్యతో ఆయన భార్య స్వరూప గొడవపడి ఇటీవలే పుట్టింటికి వెళ్లిపోయింది. కాగా, గతంలోనే కూతురు రజితను అదేగ్రామానికి చెందిన కనకయ్యకు ఇచ్చి వివాహం జరిపించారు. వారితోసైతం వెంకటయ్య రోజూ గొడవ పడుతుండటంతో విసుగు చెందిన కూతురు, అల్లు డు ఆయనను అడ్డు తొలగించుకోవాలని భా వించారు. వీరికి తోడు తన తల్లిపై అత్యాచారానికి పాల్పడ్డాడన్న కక్షపెంచుకున్న బావమరిది నాగసానిపల్లికి చెందిన శ్రీహరి వారికి తోడయ్యాడు. ముగ్గురు కలిసి బుధవారం అర్ధరాత్రి వెంకటయ్యపై విచక్షణారహితంగా దాడి చేశా రు. అనంతరం తీవ్ర గాయాలపాలైన వెంకటయ్యపై కిరోసిన్‌పోసి నిప్పంటించారు. దీంతో వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. వెంకటయ్య అన్న ఐలయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. -
‘గుప్పెడంత’ శిశువుకు ప్రాణం పోశారు!
సిద్దిపేట కమాన్: నెలలు నిండకుండా 700 గ్రాముల బరువుతో జన్మించిన శిశువుకు రెండు నెలలపాటు చికిత్స అందించి 1,470 (1.47కేజీ) గ్రాముల బరువు వచ్చేలా చేశారు. సంపూర్ణ ఆరోగ్యం చేకూరాక గురువారం డిశ్చార్జి చేశారు. ఇదేదో కార్పొరేట్ ఆస్పత్రిలో జరిగిన చికిత్స కాదు. సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రి వైద్యుల ఘనత. సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల అనుబంధ జనరల్ ఆస్పత్రిలో కార్పొరేట్ తరహాలో మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. రూ.20 లక్షల వైద్యం ఉచితంగా.. సిద్దిపేట జిల్లా చేర్యాలకు చెందిన రెహనా ఏడు నెలల గర్భిణి. జూలై 20న సిద్దిపేట ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చింది. పరీక్షించిన వైద్యులు ఆమె హైపర్‌టెన్షన్‌తో బాధపడుతున్నట్లు గుర్తించి డెలివరీ చేశారు. నెలలు నిండకపోవడంతో 700 గ్రాముల బరువుతో పుట్టిన శిశువుకు ఎస్ఎన్సీ యూలో ఉంచి పీడియాట్రిక్ విభాగ హెచ్ఓడీ, ప్రొఫెసర్ డాక్టర్ సురేశ్‌బాబు ఆధ్వర్యంలో చికి త్స అందించారు. ఆరోగ్యం మెరుగవడంతో గురువారం శిశువును డిశ్చార్జి చేసినట్లు వైద్యు లు తెలిపారు. మెడికల్ కళాశాల డైరెక్టర్ డాక్టర్ విమలా థామస్, సూపరింటెండెంట్ డాక్టర్ కిషోర్‌కుమార్ మాట్లాడుతూ.. నెలలు నిండకుండా జన్మించిన పాపకు ఎస్ఎన్సీయూ, కంగారు మదర్ కేర్ యూనిట్లలో సపోర్టివ్ కేర్ ద్వారా 62 రోజులపాటు వైద్యం అందించినట్లు తెలిపారు. చికిత్సకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో రూ. 15 లక్షల నుంచి 20 లక్షల ఖర్చు అవుతుందన్నారు. లక్షల విలువైన వైద్య సేవలను మంత్రి హరీశ్‌రావు కృషి, సహకారంతో ప్రభుత్వ ఆస్పత్రిలో ఉచితంగా అందుతున్నాయని చెప్పారు. వైద్య సేవలు అందించిన వారిలో చిన్న పిల్లల వైద్యులు కోట వేణు, శ్రీలత, సందీప్, సప్తరుషీ, రవి, గ్రీష్మ ఉన్నారు. శిశువు ఆరోగ్యంగా డిశ్చార్జి కావడంతో తల్లిదండ్రులు రెహనా, సాజిద్‌బాబా హర్షం వ్యక్తం చేశారు. -
పల్లెల్లోకి రండి.. నీటి పరుగు చూపిస్తాం: మంత్రి హరీశ్‌రావు
సిద్దిపేటజోన్/సిద్దిపేటకమాన్:హైదరాబాద్, ఢిల్లీలో కూర్చొని మాట్లాడడం కాదు.. తెలంగాణ పల్లెల్లో, సిద్దిపేట నియోజకవర్గ పరిధిలో క్షేత్రస్థాయిలో చూస్తే కాళేశ్వరం గురించి తెలుస్తుందని మంత్రి హరీశ్‌రావు అన్నారు. సిద్దిపేటలోని క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ పరిధిలోని వివిధ కుల సంఘాలకు రూ.2 కోట్ల విలువైన కమ్యూనిటీ భవన నిర్మాణ ప్రొసీడింగ్ పత్రాలు అందించారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. నీరు పారలేదంటున్న వాళ్లు సిద్దిపేట నియోజకవర్గానికి వచ్చి చెరువులను చూస్తే తెలుస్తుందన్నారు. ఎప్పుడూ నిండని రాఘవాపూర్ చెరువు ఇప్పుడు గోదారి నీటితో కళకళలాడుతోందని, ఒకప్పుడు రాఘురూకుల, చింతమడక, నారాయణరావుపేట, తోర్నాలలు కరువు ప్రాంతాలుగా ఉండేవని, ఇప్పుడవి సస్యశ్యామలం అయ్యాయని తెలిపారు. రాష్ట్రంలో గుంటెడు భూమైనా పడావు పడి ఉందా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ హయాంలో సిద్దిపేట నియోజకవర్గం పరిధిలో కరంట్ సమస్యపై విద్యుత్ కార్యాలయం వద్ద వంటావార్పు, రాత్రి బస చేశామని, కానీ.. ఇప్పుడు సీఎం కేసీఆర్ హయాంలో రాష్ట్రంలో 24 గంటలు నాణ్యమైన విద్యుత్ వస్తోందని తెలిపారు. తెలంగాణలో రైతుల బావుల వద్ద మీటర్లు పెట్టలేదని కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాష్టానికి వచ్చే 30 వేల కోట్లు ఆపిందని ఆరోపించారు. కేంద్రం వద్ద 16 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, అవి భర్తీ చేయకపోగా, ఉన్న ఉద్యోగాలను ఊడగొట్టేపని పెట్టుకుందన్నారు. నియోజకవర్గ పరిధిలో ప్రతి ఊరికి కుల సంఘాల భవనాలున్నాయని, ఒక్కో ఊరిలో రెండు, మూడు, ఐదు, ఎనిమిది, 11 చొప్పున కమ్యూనిటీ భవనాలు ఉన్నాయని చెప్పారు. ఇబ్బందైనా కష్టపడి నిధులు తెచ్చానని, కొబ్బరికాయలు కొట్టి కొట్టి చెయ్యి నొప్పి పెట్టిందని చమత్కరించారు. కాగా, బుధవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాలలో జరిగిన వార్షికోత్సవంలో కూడా ఆయన పాల్గొన్నారు. మెరుగైన వైద్యమే సీఎం ధ్యేయం పేదలు, గ్రామీణ ప్రాంత వాసులకు మెరుగైన వైద్యం అందించాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమని ఆర్థిక, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. బుధవారం సిద్దిపేట ప్రభుత్వ మెడికల్ కళాశాల వార్షికోత్సవంలో ఆయన మాట్లాడుతూ రష్యా, ఉక్రెయిన్ యుద్ధం సందర్భంగా తెలంగాణకు తిరిగి వచ్చిన వైద్య విద్యార్థులు ఆ ప్రాంతాలకు వెళ్లలేక ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనుమతి ఇస్తే వారికి సహకరించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి హరీశ్ స్పష్టం చేశారు. -
ఇక్ష్వాకుల కాలం నాటి టెర్రకోట బొమ్మ
సాక్షి, హైదరాబాద్: దాదాపు క్రీస్తుశకం మూడో శతాబ్దానికి చెందిందని భావిస్తున్న టెర్రకోట బొమ్మ సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామ శివారు శిథిల గ్రామ పాటిగడ్డమీద లభించింది. మహిళ రూపంతో ఉన్న ఈ టెర్రకోట బొమ్మను కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారు. ఇది ఇక్ష్వాకుల కాలానికి చెందినదిగా ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. బొమ్మ తలపై ఉన్న మకరిక శిరోజాలంకరణ, నుదుట చూడామణి, చెవులకు కుండలాలు, కనుముక్కుతీరు నాగార్జున కొండ, కొండాపూర్‌లలో దొరికిన టెర్రకోట బొమ్మలను పోలి ఉండటంతో ఇలా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. -
విముక్తికి బాట వేసిన బైరాన్‌పల్లి..!
1947 ఆగస్టు 15.. తెల్లదొరలను తరిమిన భారతావనిలో ప్రజలు స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటున్నారు.. కానీ హైదరాబాద్ సంస్థానం మాత్రం నిజాం పాలనలో బిక్కుబిక్కుమంటూనే గడిపింది. ఆ రోజే కాదు.. మరో ఏడాదికిపైగా నిజాం నియంతృత్వాన్ని, రజాకార్ల దుర్మార్గాలను భరిస్తూ వచ్చింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయాలన్న ప్రజల ఆకాంక్షలు, ప్రతిఘటనలు, పోరాటాల రూపంలో తెరపైకి రావడం మొదలైంది. వీటన్నింటికీ పరాకాష్టగా బైరాన్‌పల్లి నరమేధం కలకలం రేపింది. హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేసుకోవాలన్న ఒత్తిడి తీవ్రస్థాయికి చేరింది. 1948 ఆగస్టు 27న బైరాన్‌పల్లి ఘటన జరిగితే ఆ తర్వాత 21 రోజుల్లో.. అంటే సెప్టెంబర్ 17 నాటికి హైదరాబాద్ సంస్థానం ఇండియన్ యూనియన్‌లో విలీనమైంది. –సాక్షి, సిద్దిపేట ఎన్నో పోరాటాలు జరిగినా.. బ్రిటీష్‌వాళ్లు దేశాన్ని వదిలిపెట్టి పోయినా.. నిజాం రాజు హైదరాబాద్ సంస్థానాన్ని భారత్‌లో విలీనం చేయడానికి నిరాకరించారు. దీనికి తోడు నిజాం సైన్యాధ్యక్షుడు ఖాసీం రజ్వీ వ్యక్తిగత సైన్యం రజాకార్ల అరాచకాలు ఎక్కువయ్యాయి. ఈ పరిస్థితుల్లో నిజాంకు వ్యతిరేకంగా సాయుధ పోరాటం మొదలైంది. సిద్దిపేట జిల్లా ధూల్మిట్ట మండలం బైరాన్‌పల్లి కేంద్రంగా కూటిగల్, లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాల యువకులతో బలమైన గ్రామ రక్షక దళం ఏర్పడింది. రజాకార్ల నుంచి తమ గ్రామాన్ని రక్షించుకోవాలన్న లక్ష్యంతో బైరాన్‌పల్లి గ్రామస్తులంతా ఏకమయ్యారు. శత్రువుల దాడిని ఎదుర్కొని, ప్రతిదాడి చేయడానికి గ్రామంలో శిథిలావస్థలో ఉన్న కోట బురుజును పునర్నిర్మించారు. నాటు తుపాకులు, మందు గుండు సామగ్రి సమకూర్చుకున్నారు. ఆయుధ శిక్షణ తీసుకున్న యువకులు నాటు తుపాకులతో గస్తీ నిర్వహించేవారు. ప్రతీకారేచ్ఛతో వరుస దాడులకు తెగబడి.. 1948లో లింగాపూర్, ధూల్మిట్ట గ్రామాలపై రజాకార్లు దాడి చేసి తగులబెట్టారు. తిరిగి వెళ్తుండగా బైరాన్‌పల్లి సమీపంలోకి రాగానే వారిపై దూబూరి రాంరెడ్డి, ముకుందరెడ్డి, మురళీధర్‌రావు నాయకత్వంలో రక్షణ గెరిల్లా దళాలు దాడిచేసి దోచుకున్న సంపదను స్వాధీనం చేసుకున్నాయి. దాన్ని తిరిగి ప్రజలకు పంచారు. దీనిపై ఆగ్రహంతో రగిలిపోయిన రజాకార్లు బైరాన్పల్లిపై దాడి చేశారు. రక్షక దళం గట్టిగా ప్రతిఘటించింది. ఈ దాడిలో 20 మందికిపైగా రజాకార్లు చనిపోయారు. ఇలా రెండోసారి కూడా విఫలం కావడంతో రజాకార్లు ప్రతీకారేచ్ఛతో రగిలిపోయారు. నాటి భువనగిరి డిప్యూటీ కలెక్టర్ హషీం ఆదేశాలతో హైదరాబాద్ నుంచి 500 మందికిపైగా సైనికులను రప్పించి మూడోసారి దాడి చేశారు. దారుణంగా కాల్చి చంపారు ఖాసీంరజ్వీ నేతృత్వంలో రజాకార్లు 1948 ఆగస్టు 27 తెల్లవారుజామున అంతా నిద్రలో ఉన్న సమయంలో ఒక్కసారిగా బైరాన్‌పల్లిని చుట్టుముట్టారు. అయితే ఆ సమయంలో బహిర్భూమికి వెళ్లిన గ్రామస్తుడు వడ్లె వెంకటనర్సయ్య గమనించి కేకలు వేయడంతో.. వెంటనే బురుజుపై ఉన్న కాపలాదారులు నగారా మోగించారు. అప్పటికే దూసుకొచ్చిన రజాకార్ల కాల్పుల్లో బురుజుపై ఉన్న గెరిల్లా దళ సభ్యులు మోగుటం రామయ్య, పోచయ్య, భూమయ్య మృతిచెందారు. రజాకార్లు ఫిరంగులతో దాడి చేయగా.. బురుజులోని మధ్య గదిలో ఉన్న మందు గుండు సామగ్రిపై నిప్పులు పడి పేలిపోయింది. తర్వాత రజాకార్లు మరింత విజృంభించారు. బురుజుపై తలదాచుకున్న 40 మందిని కిరాతకంగా కాల్చి చంపారు. మరో 56 మంది యువకులను బంధించి ఊరి బయటికి తీసుకొచ్చి కాల్చిచంపారు. మృతదేహాలను పాత బావిలో పడేశారు. ఈ ఘటనల్లో 118 మందికిపైగా మృతిచెందినట్లు చరిత్ర చెబుతోంది. యువకులను చంపడంతో ఊరుకోని రజాకార్లు మరిన్ని దారుణాలకు తెగబడ్డారు. మహిళలను నగ్నంగా ఆ శవాల చుట్టూ బతుకమ్మ ఆడించారు. వారిపై అత్యాచారాలకు పాల్పడ్డారు. ఈ దారుణాలను తట్టుకోలేక కొందరు మహిళలు ఆత్మహత్య చేసుకున్నట్టు బైరాన్‌పల్లి గ్రామస్తులు చెబుతున్నారు. ఈ నరమేధం నాటి భారత ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో నిజాం సంస్థానాన్ని స్వాధీనం చేసుకునే చర్యలు మొదలయ్యాయి. నాటి కేంద్ర హోంమంత్రి వల్లభ్ భాయ్ పటేల్ ఆధ్వర్యంలో జరిగిన పోలీస్ యాక్షన్‌తో కొద్దిరోజుల్లోనే హైదరాబాద్ సంస్థానం భారత యూనియన్‌లో వీలినమైంది. బైరాన్‌పల్లి వాసులు నాటి ఘటనను గుర్తు చేసుకుని ఇప్పటికీ కన్నీటిపర్యంతం అవుతున్నారు. ప్రభుత్వాలు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు పట్టించుకోలేదు నాటి ఘటనతో బైరాన్‌పల్లి.. వీర బైరాన్‌పల్లి అయింది. ఇంతటి పోరాట పటిమ చూపిన తమ గ్రామాన్ని ప్రభుత్వాలు చిన్నచూపు చూశాయని స్వాతంత్య్ర సమరయోధులు, గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలోని ప్రతి కుటుంబం నాటి పోరాటంలో పాల్గొన్నా 28 మందికి మాత్రమే పెన్షన్ మంజూరు చేశారని.. నాటి పోరాటంలో పాల్గొని పెన్షన్ రానివారు ఇంకా 30 మంది ఉన్నారని చెబుతున్నారు. కూటిగళ్లు గ్రామంలోనూ ఇదే పరిస్థితి ఉందని.. నాడు అమరులైన వారి పేర్లతో గ్రామస్తులే ఓ స్తూపాన్ని నిర్మించుకున్నారని వివరిస్తున్నారు. 2003లో వైఎస్ రాజశేఖర రెడ్డి చేతుల మీదుగా స్తూపాన్ని ఆవిష్కరించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. బైరాన్‌పల్లి పోరాటాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి బైరాన్‌పల్లి పోరాటాన్ని విద్యార్థుల పాఠ్యాంశాల్లో చేర్చాలి. నాటి ఘనత నేటి తరానికి తెలిసేలా అమరధామం, ఎత్తయిన స్తూపం, భవనం నిర్మించాలి. సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా దృష్టిపెట్టి అభివృద్ధి చేయాలి. కేసీఆర్ కేంద్ర మంత్రిగా ఉన్న సమయంలో బైరాన్‌పల్లి గురించి వివరించాం. వస్తానన్నారు. ఇప్పటివరకు రాలేదు. ఇప్పటికైనా పట్టించుకోవాలి. –చల్లా చంద్రారెడ్డి నాటి పోరాటంలో కాలికి గాయమైంది నాడు రజాకార్లు చందాల పేరుతో పీడించేవారు. వారి దాడుల్లో నా కాలుకు గాయమైంది. అయినా రక్షణ దళంతో కలిసి రజకార్లపై పోరాడాను. నాటి పోరాటకారుల్లో కొందరికి ఇప్పటికీ పెన్షన్ మంజూరు చేయలేదు. వెంటనే మంజూరు చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలి. గ్రామంలో సర్వే చేసి ఇల్లు లేనివారికి ఇల్లు నిర్మించి ఇవ్వాలి. –ఇమ్మడి ఆగంరెడ్డి -
ఉద్యాన డిప్లొమా కోర్సులకు దరఖాస్తులు
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా ములుగులోని శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ రాష్ట్ర ఉద్యాన విశ్వవిద్యాలయం రెండేళ్ల ఉద్యాన డిప్లొమా కోర్సుల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి పాసై పాలీసెట్ అర్హత సాధించిన వారు ఈ డిప్లొమా కోర్సుల్లో చేరేందుకు అర్హులని వర్సిటీ వీసీ నీరజ ప్రభాకర్ చెప్పారు. ఈనెల 22 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఐదు పాలిటెక్నిక్ కళాశాలల్లో 200 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ పాలిటెక్నిక్‌లు ఆదిలాబాద్, పెద్దపల్లి జిల్లాల్లో ఉండగా, మరో మూడు ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాలలు నల్లగొండ జిల్లా (గ్రామభారతి ఉద్యాన పాలిటెక్నిక్ మర్రిగూడ), మహబూబాబాద్ జిల్లా (విశ్వవర్ధిని తొర్రూర్), సూర్యాపేట జిల్లా (గంట గోపాల్‌రెడ్డి కళాశాల)లో ఉన్నాయి. డిప్లొమా కోర్సు పూర్తి చేసిన వారు హార్టీసెట్ ప్రవేశపరీక్ష ద్వారా 15 శాతం మందికి ఉద్యాన బీఎస్సీ చేసేందుకు అవకాశం కల్పించనున్నారు. -
విషాదం.. కొడుకును నడుముకు కట్టుకుని.. చెరువులో దూకిన తల్లి
సాక్షి, సిద్దిపేట: కుటుంబ కలహాలతో మనస్తాపం చెందిన ఓ వివాహిత కుమారుడితో సహా చెరువులో దూకింది. కుమారుడు మృతి చెందగా, తల్లి ప్రాణాలతో బయటపడింది. ఈ విషాద ఘటన సిద్దిపేట జిల్లా నారాయణరావుపేట మండలం మల్యాలలో సోమవారం జరిగింది. పోలీసులు, బాధితుల వివరాల ప్రకారం నారాయణరావుపేట మండలం మల్యాల గ్రామానికి చెందిన చింతల స్వాతికి ముస్తాబాద్ మండలం బదనకల్‌కు చెందిన శరత్‌తో నాలుగేళ్ల క్రితం వివాహమైంది. వీరికి కుమారుడు శివతేజ(3) ఉన్నాడు. కుటుంబ కలహాలతో ఏడాదిగా తల్లిదండ్రుల వద్ద మల్యాలలో ఉంటున్న స్వాతి, సిద్దిపేటలోని ఓ షోరూంలో పని చేస్తోంది. అయినా కొద్ది రోజులుగా శరత్ వేధింపులకు గురిచేస్తుండడంతో మనస్తాపం చెందింది. కుమారుడిని నడుముకు కట్టుకొని గ్రామంలోని చెరువులో దూకింది. గమనించిన గొర్రెల కాపరులు చెరువులో నుంచి ఇద్దరిని ఒడ్డుకు చేర్చారు. అప్పటికే కుమారుడు శివతేజ మృతిచెందాడు. తానూ ప్రాణాలు తీసుకోవాలనుకుంటే తన కుమారుడు చనిపోయాడని, అందుకు కారణమైన భర్తపై చర్యలు తీసుకోవాలని స్వాతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. చదవండి: Khammam: తొలి తరం కమ్యూనిస్టు నేత భూపతిరావు మృతి -
సొంత జాగాల్లో ఇళ్లకు దసరా తరువాత ముహూర్తం
గజ్వేల్: సొంత జాగాల్లో ఇళ్లు నిర్మించుకునేవారికి రూ.3లక్షలు పంపిణీ చేసే పథకానికి దసరా తర్వాత శ్రీకారం చుట్టనున్నామని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రకటించారు. సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం బెజుగామ, శేర్పల్లి గ్రామాల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లను మంగళవారం పంపిణీ చేశారు. ఆ తర్వాత గజ్వేల్ పట్టణంలోని మహతి ఆడిటోరియంలో కొత్తగా మంజూరైన ఆసరా పింఛన్లను అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభల్లో హరీశ్ మాట్లాడుతూ.. కరోనా వల్ల రెండేళ్లుగా రాష్ట్రానికి ఆదాయం తగ్గడం వల్ల సొంత జాగాల్లో ఇళ్ల నిర్మాణ పథకాన్ని ప్రారంభించలేక పోయామన్నారు. దసరా తర్వాత నిధులు ఇవ్వాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. సాగు పెట్టుబడి తగ్గించి, రాబడి పెంచుతామని చెప్పిన కేంద్రం డీజిల్, ఎరువుల ధరలను పెంచి రైతుల నడ్డి విరిచిందని విమర్శించారు. రైతులకు గొప్పగా ఉపయోగపడుతున్న ఉచిత కరెంట్‌ను కూడా వద్దని చెప్పడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. ఈ కార్యక్రమాల్లో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు యాదవరెడ్డి, ఫారుఖ్ హుస్సేన్, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. చదవండి: రాష్ట్రంలోకి అడెల్లు, మంగులు దళాలు! కేసీఆర్ పర్యటన రూటుమార్పు? -
యాక్టర్‌గా మారిన టీచర్.. ట్రెండ్ సెట్టర్‌గా మారుతున్న యూట్యూబర్ అనిల్
సాక్షి, కరీంనగర్(మల్యాల): అందివచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటే విజయం కోసం ఎదురుచూడాల్సిన అవసరం లేదంటున్నాడు.. యూట్యూబ్ స్టార్ అనిల్ జీల. టీచర్ కావాల్సిన వ్యక్తి యాక్టర్‌గా సక్సెస్ అయ్యాడు. మారుమూల పల్లెనుంచి వచ్చిన వ్యక్తి తనప్రతిభతో దేశంలోనే నంబర్‌వన్ వెబ్‌సిరీస్ తీస్తున్నాడు. అంకితభావం, పట్టుదల, స్వయంకృషి, నేర్చుకోవాలనే తపన ఉంటే ఏదైనా సాధించవచ్చంటూ యువతకు స్ఫూర్తిగా నిలిచాడు. జన్మనిచ్చింది దర్గాపల్లి అయితే యూట్యూబ్ వైపు అడుగులు నేర్పింది మల్యాల మండలం లంబాడిపల్లి గ్రామం. నటుడు, ఎడిటర్, సినీ ఫొటోగ్రాఫర్‌గా రాణిస్తున్న ట్రెండ్ సెట్టర్ అనిల్‌పై సండే స్పెషల్.. వ్యవసాయ కుటుంబం సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం దర్గాపల్లి గ్రామానికి చెందిన జీల మల్లేశం–నిర్మల పెద్ద కుమారుడు అనిల్. వీరిది వ్యవసాయాధారిత కుటుంబం. ఆది నుంచి అన్నింటిలో ముందుండాలనే సంకల్పం, క్రమశిక్షణతో అందరి మన్ననలు పొందాడు అనిల్. స్వయం కృషితో తనదైన లోకాన్ని సృష్టించుకున్నాడు. సెల్‌ఫోన్ వాడటం తెలిసిన యువతకు అనిల్ తెలియని వారుండరంటే అతిశయోక్తి కాదు. ప్రతీ చోట తనదైన ముద్ర అనిల్ జీల జీవితంలో ప్రతి చోట తనదైన ముద్ర వేసుకున్నాడు. ఐదో తరగతి నుంచి ఇంటర్ వరకు హోటల్లో పనిచేస్తూ చదువు కొనసాగించాడు. ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు టీ అమ్మేవాడు. సాయంత్రం వచ్చిన తర్వాత రాత్రి 8గంటల వరకు హోటల్లో పనిచేస్తూ చదువుకుని పాఠశాలలో టాపర్‌గా నిలిచాడు. ఇంటర్లో సైతం టాపర్‌గా నిలిచి సత్తా చాటాడు. అనంతరం బుక్స్టాల్లో సేల్స్ బాయ్‌గా పనిచేసి తన ఆలోచనలకు పదును పెడుతూ సామాన్యులకు పుస్తకాలను చేరువ చేశాడు. చదవండి: నో కాంట్రవర్సీ కామెంట్స్.. ఆద్యంతం నవ్వులు పండించిన మునావర్ ఉపాధ్యాయుడిగా జీవితం ప్రారంభం అనిల్ జీల కరీంనగర్‌లోని ఉపాధ్యాయ శిక్షణా కళాశాలలో టీటీసీ పూర్తిచేశాడు. అనంతరం జమ్మికుంటలోని ఆవాసంలో రెండేళ్లపాటు ఉపాధ్యాయుడిగా పనిచేస్తూనే తనలోని నటనా ఆసక్తి, ఆలోచలనకు రూపం ఇస్తూ, షార్ట్‌ఫిల్మ్స్ చిత్రీకరణ ప్రారంభించాడు. ఉత్తమ ఉపాధ్యాయుడిగా ఎదగాలనే తనలోని ఆలోచనలకు అనుగుణంగా ఆచరిస్తూ విద్యార్థులకు బోధించాడు. అనంతరం లంబాడిపల్లికి వచ్చి షార్ట్‌ఫిల్మ్‌లో నటించడం ప్రారంభించి తనలోని నటనతో ప్రపంచాన్ని మెప్పించాడు. వ్లాగ్ నుంచి సినిమాల వైపు.. అనిల్ సహజసిద్ధ నటన పల్లెటూరి సామాన్యుల నుంచి సినీ ఇండస్ట్రీని సైతం ఆకర్షించింది. హాస్యం, జానపద పాటలు, డాక్యుమెంటరీ ఇలా అన్నిరకాల కేటగిరీల్లో ప్రతిభ కనబర్చాడు. దీంతో యువకులకు క్రేజీ హీరోగా మారాడు. అనిల్ ఏది చేసినా ట్రెండింగ్‌గా మారడంతో ట్రెండింగ్ స్టార్‌గా ముద్రపడింది. గతంలో హీరో విజయ్ దేవరకొండ వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో నటించాడు. ఎస్ఆర్ కల్యాణ మండపంలో ప్రధానపాత్రలో, డిగ్రీ కాలేజ్, ఫ్రెషర్ కుక్కర్, అర్ధ శతాబ్దం వంటి సినిమాల్లో సైతం నటించాడు. పెళ్లిలో సైతం ప్రత్యేకతే.. అనిల్ పెళ్లి సైతం ప్రత్యేకత సంతరించుకుంది. తెలంగాణ యాసలో రాసిన పత్రిక వైరల్‌గా మారింది. ‘శుభలేకలో శ్రీరస్తు.. శుభమస్తు.. కల్యాణమస్తు స్థానంలో శానిటైజర్ ఫస్టు.. మాస్కు మస్టు.. సోషల్ డిస్టాన్స్ బెస్ట్ అంటూ కరోనా కాలంలో పాటించాల్సిన నియమాలు రాశారు. తల్వాలు పడ్డంక ఎవరింట్ల ఆళ్లే బువ్వ తినుండ్రి. బరాత్ ఉంది కాని ఎవరింట్ల వాళ్లే పాటలు పెట్టుకుని ఎగురుండ్రి. కట్నాలు మాత్రం గూగుల్ పే, ఫోన్ పే చేయుండ్రి’ అంటూ తనదైన ప్రత్యేకత చాటుకున్నాడు. కట్నాల రూపంలో వచ్చిన సుమారు రూ.80వేలకు మరో రూ.20వేలు కలిసి కరోనా కాలంలో బాధపడుతున్న నిరుపేదలకు నిత్యావసర సరుకులు ఇంటింటికీ తిరిగి అందజేసి మానవత్వాన్ని చాటుకున్నాడు అనిల్ జీల. ఇండియాలో నంబర్ 1 అనిల్ అడుగడుగునా అంకితభావం, పట్టుదల, సాధించాలనే తపనతో ముందుకుసాగుతున్నాడు. నిహారిక కొణిదెల నిర్మాతగా హలో వరల్డ్ వెబ్ సిరీస్ ఇండియా మొత్తంలో జీ5 నిర్మించిన అన్ని వెబ్‌సిరీస్‌లలో దేశవ్యాప్తంగా అన్ని భాషల్లోకెల్లా అనిల్ నటించిన హలో వరల్డ్ వెబ్‌సిరీస్ నంబర్ 1గా నిలిచింది. ఇప్పటికే మై విలేజ్ షోలో సుమారు 100 షార్ట్ ఫిల్మ్‌ల్లో నటించాడు. హుషారు పిట్టలు వెబ్ సిరీస్‌లో సైతం నటించి మెప్పించాడు. ఒకరిని మించి ఒకరు అనిల్ జీల వ్లాగ్‌కు లక్షల్లో సబ్స్క్రైబర్లు, వీక్షకులుండగా సెలబ్రిటీలకు ఇచ్చే గ్రీన్సైన్ లభించింది. అలాగే అతడి జీవిత భాగస్వామి ఆమని చేసే రీల్స్, ప్రమోషన్ పాటలకు సైతం వీక్షకులు లక్షల్లో ఉన్నారు. ఆమె ఇన్‌స్టాగ్రాంకు 1.17 లక్షల మంది ఫాలోవర్సు ఉన్నారు. వీరి అనురాగానికి ప్రతీకైన ఆరునెలల మేధాన్‡్ష ఇన్‌స్టాగ్రాంకు సైతం 3,000 మంది ఫాలోవర్సు ఉండడం విశేషం. అనిల్ వ్లాగ్‌కు సబ్స్క్రైబర్లు: 7.70 లక్షల మంది నటించిన షార్ట్ ఫిల్మ్స్ : 100 ఇన్‌స్టాగ్రాంకు ఫాలోవర్లు: 3.80 లక్షల మంది వీక్షకులు: 25 లక్షల మంది -
కేంద్రంలో బీసీ శాఖ ఏర్పాటు ఎప్పుడు?
నంగునూరు(సిద్దిపేట): కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని అసెంబ్లీలో ఎప్పుడో తీర్మానం చేసి పంపితే ఇప్పటి వరకూ ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలేదని రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. రాష్ట్రాన్ని మరింత ఇబ్బందులు పెట్టేందుకు విద్యుత్‌ను కొనుగోలు చేయాలంటే అడ్వాన్స్ చెల్లించాలని కొర్రీలు పెడుతూ సీఎం కేసీఆర్‌కు చెడ్డపేరు తెచ్చేందుకు బీజేపీ సర్కారు కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. బీజేపీ పాలనలో ఎవరు బాగుపడ్డారో చెప్పాలని, కేంద్రం ఉచితాలు వద్దంటోందని, దేశానికి అన్నం పెట్టే రైతుకు సబ్సిడీలు ఇవ్వడం ఉచితాల కిందికి వస్తుందా? అని ఆయన ప్రశ్నించారు. శనివారం మంత్రి.. సిద్దిపేట జిల్లా పాలమాకులలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గోదావరి నదికి చరిత్రలో కనీ, వినీ ఎరగని రీతిలో వరద వచ్చి తెలంగాణకు నష్టం జరిగితే బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బాధపడకుండా సంతోషంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌లోని 21 పంపులకుగాను రెండు పంపులకు వరద వల్ల నష్టం జరిగితే ప్రతిపక్షాలు రాద్ధాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. గత సంవత్సరం మండుటెండలో కాళేశ్వరం నీటితో మత్తడి దూకిన చెరువుల గురించి తెలుకోవాలని, ప్రస్తుతం రంగనాయకసాగర్ వద్ద నడుస్తున్న పంపులు చూసి మాట్లాడాలని అన్నారు. నెల రోజుల్లో కాళేశ్వరం మోటార్లు మరమ్మతు చేసి నీటిని పంపింగ్ చేసి చెరువులు నింపుతామని హరీశ్‌రావు స్పష్టం చేశారు. వ్యవసాయ బావులవద్ద మోటార్లకు మీటర్లు పెడితే రూ రూ.6,500 కోట్లు ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ఆశ చూపితే.. ముఖ్యమంత్రి కేసీఆర్ వినకపోవడంతో రాష్ట్రానికి రావాల్సిన డబ్బులు ఇవ్వడం లేదని ఆయన మండిపడ్డారు. -
భర్త వేధింపులతో విసిగి కూతురుసహా తల్లి సజీవదహనం
ములుగు(గజ్వేల్): కుటుంబకలహాలు రెండు నిండుప్రాణాలను బలితీసుకున్నాయి. ఒకవైపు భర్త వేధింపులు.. మరోవైపు మానసిక వికలాంగురాలైన కూతురుకు పెళ్లి కాదేమోననే బెంగ.. కొంతకాలంగా మానసిక వేదన అనుభవిస్తున్న ఓ తల్లి కూతురుతోసహా నిప్పంటించుకుని ఆత్మాహుతికి పాల్పడింది. ఈ ఘటన సిద్దిపేట జిల్లాలో చోటుచేసుకుంది. ములుగు మండలం వాగునూతి గ్రామానికి చెందిన సగ్గు అవిలయ్యకు ఇద్దరు భార్యలు. పెద్ద భార్య గంగవ్వ(40)కు జ్యోతి, హారతి అనే ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. చిన్నకూతురు వివాహం జరగ్గా మానసిక వికలాంగురాలైన పెద్ద కూతురు జ్యోతి తల్లిదండ్రుల వద్దే ఉంటోంది. రెండో భార్యకు కొడుకు, కూతురు. అందరూ ఒకే ఇంట్లో ఉంటున్నారు. ఆరునెలల నుంచి అవిలయ్య, గంగవ్వకు మధ్య కుటుంబకలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో అవిలయ్య ఆమెను కొట్టడంతో గురువారం ఉదయం 10 గంటలకు తన సోదరుడు మానుక అవిలయ్యకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో మధ్యాహ్నం 2 గంటలకు అతడు బావకు ఫోన్ చేయగా గంగవ్వ, జ్యోతి కనపడటం లేదని చెప్పాడు. ఆందోళనకు గురైన మానుక అవిలయ్య వారి కోసం వెతకడం ప్రారంభించాడు. మరుసటిరోజు ఉదయం 11 గంటలకు జప్తిసింగాయిపల్లి అటవీ ప్రాంతంలో నీలగిరి చెట్ల మధ్య కాలినస్థితిలో గంగవ్వ, జ్యోతి మృతదేహాలు కనిపించాయి. అక్కడ సమీపంలోనే గంగవ్వ బంగారు, వెండి అభరణాలు మూటకట్టి ఉన్నాయి. భర్త వేధింపులు భరించలేకనే తన సోదరి గంగవ్వ కూతురితో కలసి నిప్పంటించుకుని బలవన్మరణం చెందిందని మానుక అవిలయ్య పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం అలుముకుంది. గంగవ్వ భర్త అవిలయ్యను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
కొత్త కళ్ల జోడుతో సరికొత్త వెలుగులు
సిద్దిపేటజోన్: కొత్త కళ్ల జోడు.. కళ్లలో కొత్త వెలుగులు నింపుతుందని, ప్రభుత్వం తరఫున గ్రామాల్లో వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి కంటి సమస్యలు ఉన్న ప్రతీ ఒక్కరికి ఉచితంగా ఆపరేషన్లు చేయిస్తామని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు భరోసా ఇచ్చారు. సోమవారం స్వాతంత్య్ర వజ్రోత్సవాల్లో భాగంగా జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో వైద్యశాఖ ఆధ్వర్యంలో కంటి అద్దాలు పంపిణీ చేశారు. ‘‘మీ చల్లని చూపుతో మా కంటికి కొత్త వెలుగులు వచ్చాయని, ఇప్పుడు అన్ని బాగా చూడగలుగుతున్నాం. బిడ్డా... నీవు సల్లంగా ఉండాలి’’అని మంత్రిని ఈ సందర్భంగా వృద్ధులు ఆశీర్వదించారు. దశాబ్దాలుగా కంటి సమస్యలతో బాధపడుతున్న పేదవారికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేసి మందులు ఇవ్వడం సంతృప్తినిచ్చిందని మంత్రి తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో 762 మందికి కాటరాక్ట్ ఆపరేషన్లు చేసి మందులు పంపిణీ చేశామన్నారు. మరో 1,800మందికి చేయాల్సి ఉందన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్, జిల్లా వైద్యాధికారి కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
కాగితపు జెండాలు అంటించుకోవాలా?: హరీశ్
సాక్షి, సిద్దిపేట: స్వతంత్ర భారత వజ్రోత్సవాల నిర్వహణ విషయంలో కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న వైఖరిపై ఆర్థిక, వైద్యారోగ్య మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. జాతీయ జెండాలను అందించలేకపోతున్నామని, కాగితపు జెండాలతో వజ్రోత్సవాలు చేసుకోవాలని మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నా యని విమర్శించారు. ఇదేనా వజ్రోత్సవాలు జరిపే తీరు, ఇదేనా జాతీయ జెండాకు మీరిచ్చే విలువ అంటూ మండిపడ్డారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం సిద్దిపేట శివారు రంగనాయకసాగర్ సమీపంలో మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్కును హరీశ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. చేనేత కార్మికులకు ఉపాధి కల్పించి తెలంగాణ ప్రభుత్వం 1.20 కోట్ల జెండాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. మేకిన్ తెలంగాణ పేరిట జాతీయ జెండాలను తయారు చేసి ఇంటింటికీ అందజేస్తున్నామన్నారు. మహా త్మాగాంధీని అవమానపరుస్తూ.. గాడ్సేను పొగిడే సంస్థలను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. కేంద్రం అలాంటి సంస్థలపై చర్యలు తీసుకోవడం లేదని, వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. భావి భారత పౌరులకు దేశభక్తిని పెంపొందించేలా, దేశభక్తి చాటేలా స్వాతంత్య్ర సమరయోధుల చిత్రాలను 570 సినిమా టాకీసుల్లో ప్రదర్శిస్తున్నామని హరీశ్ చెప్పారు. కాగా, ఫ్రీడమ్ పార్క్‌లో వజ్రోత్సవాల్లో భాగంగా 75 అని మొక్కలతో ఏర్పాటు చేయడం అందరినీ ఆకట్టుకుంటోంది. -
రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు.. ఫిర్యాదు చేసిన రెండేళ్లకు
సాక్షి, సిద్ధిపేట: మానకొండూరు టీఆర్ఎస్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌పై కేసు నమోదైంది. ఎమ్మెల్యే నుంచి తనకు ప్రాణహాని ఉందని, చర్యలు తీసుకోవాలని సిద్ధిపేట జిల్లా బెజ్జంకి మండలానికి చెందిన రాజశేఖరరెడ్డి అనే వ్యక్తి 2020లో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దాదాపు రెండేళ్ల తర్వాత ఈ కేసుపై స్పందించిన పోలీసులు .. తాజాగా ఎమ్మెల్యేపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 209, 506 సెక్షన్ల కింద రసమయిపై కేసు నమోదు చేశారు. విచారణ కోసం కేసుకు సంబంధించిన సాక్ష్యాలను వారం రోజుల్లో అందించాలని పోలీసులు కోరారు. అయితే ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేసిన రెండేళ్ల తర్వాత పోలీసులు రసమయి బాలకిషన్‌పై కేసు నమోదు చేయడం చర్చనీయాంశంగా మారింది. కాగా కళాకారుడిగా గుర్తింపు సాధించిన రసమయి 2014లో మానుకొండూరు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2018 ఎన్నికలలోనూ ఆయన విజయం సాధించారు. ఏడాది క్రితం తెలంగాణ ప్రభుత్వం ఆయన్ను రాష్ట్ర సాంస్కృతిక మండలి చైర్మన్‌గా నియమించింది. చదవండి: ఊపందుకున్న ఆపరేషన్ ఆకర్ష్.. బీజేపీలోకి జయసుధ? -
డబుల్ బెడ్రూం ఇల్లు వెనక్కి
సాక్షి, సిద్దిపేట జోన్: ‘గత కొన్నేళ్లుగా సిద్దిపేట పట్టణంలో కిరాయి ఇంట్లో ఉంటున్న. డబుల్ బెడ్రూం ఇల్లు వచ్చింది. కానీ అనారోగ్యంతో ఉన్న కొడుకును పట్టుకొని డబుల్ బెడ్రూం కాలనీలో ఉండలేను. ఇల్లు అవసరం ఉన్న నాలాంటి పేద వారికి నా ఇల్లు ఇవ్వండి’ అని సిద్దిపేట పట్టణానికి చెందిన కూరేళ్ల రూప.. మంత్రి హరీశ్ రావుకు ప్రభుత్వం తనకిచ్చిన డబుల్ బెడ్రూం పట్టా పత్రాలు, ఇంటి తాళం తిరిగి ఇచ్చి ఆద ర్శంగా నిలిచింది. ఈ సందర్భంగా మంత్రి హరీశ్‌రావు ఆమె నిజాయితీని అభినందించారు. అర్హులైన వారికి బుల్ బెడ్రూం ఇళ్లు దక్కాలని ఆయన ఆకాంక్షించారు. (క్లిక్: ఒక్కో సహజ ప్రసవానికి రూ.3వేలు) -
స్ఫూర్తి..: జీవనాడిని విస్తరించింది.. రూ.60 లక్షల వ్యాపారం
పచ్చని ఆకులో భోజనం మన సంప్రదాయం అదే మన ఆరోగ్య రహస్యం. ఆ జీవనాడిని పట్టుకొని అదే వ్యాపారంగా మార్చుకున్నారు తెలంగాణలోని సిద్దిపేట జిల్లా వాసి మాధవి విప్పులంచ. బాధించిన క్యాన్సర్ నుంచి కోలుకొని అమెరికాలో చేస్తున్న ఉద్యోగం వదిలి సేంద్రియ వ్యవసాయం వైపు మరలి పచ్చని విస్తరాకు ప్లేట్లను రాష్ట్రంతోపాటు ఇతర దేశాలకూ సరఫరా చేస్తున్నారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లికి చెందిన విప్పులంచ మాధవి బీఫార్మసీ చేసి, బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేశారు. తిమ్మారెడ్డిపల్లిలో సేంద్రీయ వ్యవసాయం చేస్తూ మోదుగ, అడ్డాకులతో ప్లేట్లు తయారు చేస్తూ, వాటిని విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. 20 మంది మహిళలకు ఉపాధి కల్పిస్తూ, యేటా రూ.60 లక్షలు సంపాదిస్తూ స్ఫూర్తిగా నిలుస్తున్నారు. అగ్రి టూరిజాన్ని వృద్ధి చేయాలనే లక్ష్యంతో ఉన్న మాధవిని ఆమె పర్యావరణ ప్రయాణం గురించి అడిగితే ఎన్నో విశేషాలను వివరించింది. ‘‘పుట్టి పెరిగింది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం ఎనుగుర్తి గ్రామం. అమ్మానాన్నలు ఉద్యోగరీత్యా హైదరాబాద్‌లో స్థిరపడ్డారు. నాన్న చింతల బలరాం కళాశాల ప్రిన్సిపాల్‌గా రిటైర్ అయ్యారు. అమ్మ సరోజిని రిటైర్డ్ ఫార్మసిస్ట్. నేను డిగ్రీవరకు హైదరాబాద్‌లోనే చదువుకున్నాను. ఆ తర్వాత అమ్మ సలహా తో వరంగల్ కాకతీయ విశ్వవిద్యాలయంలో బీఫార్మసీ పూర్తి చేశాను. చదువుకునే సమయంలోనే పెళ్లైంది. ఇద్దరు కొడుకులు. నా చదువు పూర్తయిన తర్వాత నా భర్త వేణుగోపాల్‌తో కలిసి ఉద్యోగరీత్యా పూణె వెళ్లాను. అక్కడ పూణె హాస్పిటల్లో ఫార్మసిస్ట్‌గా మూడేళ్ల పాటు పని చేశాను. ఆ తర్వాత బ్యాంకాక్, మలేషియా, సింగపూర్, అమెరికా దేశాల్లో ఉద్యోగాలు చేసి, 2007లో తిరిగి హైదరాబాద్‌కు వచ్చేశాం. స్కూల్‌తో మొదలు కొన్ని రోజుల్లోనే ప్రైమరీ పాఠశాలను ప్రారంభించాను. సాయంత్రం వేళల్లో యోగా శిక్షకురాలిగా పనిచేశాను. వ్యవసాయం అంటే ఉన్న ఆసక్తితో సేంద్రియ సేద్యం వైపు దృష్టి పెట్టాను. అంతా సాఫీగా సాగుతుందనుకున్న క్రమంలో కొద్దిరోజుల తేడాతో నాన్న, అక్క మరణించడం నన్ను తీవ్రంగా బాధించింది. క్యాన్సర్ నుంచి కోలుకుని.. వారి మరణం బాధ నుంచి కోలుకోక ముందే బ్రెస్ట్ క్యాన్సర్ బారిన పడ్డాను. అయినా భయపడకుండా ధైర్యంగా ఉంటూ చికిత్స తీసుకున్నాను. ఆ సమయంలో యోగా శిక్షణ నన్ను మరింత బలంగా చేసింది. ఏడాదిన్నర కాలంలో క్యాన్సర్‌ను జయించాను. ఆ సమయంలోనే కూరగాయలు, పంటల సాగులో రసాయనాల వాడకం, కలుషితమైన వాతావరణమే నా వ్యాధికి కారణమని గ్రహించాను. నాలాగే చాలామంది ఇలాంటి సమస్యలకు లోనవుతుంటారని కూడా తెలుసుకున్నాను. అప్పుడే ప్రకృతి సేద్యం చేస్తూ ఉన్నంతలో మంచి ఆహార పంటల ఉత్పత్తులను సమాజానికి అందించాలన్న ఉద్దేశంతో నా భర్త సహకారంతో 2017లో సిద్దిపేట జిల్లా కొండపాక మండలం తిమ్మారెడ్డిపల్లి లో 25 ఎకరాల భూమిని కొనుగోలు చేశాం. అందులో 20 వేల వరకు మామిడి, జామ, అరటి, బత్తాయి, సపోట తోటలు పెట్టాం. ఇతర కూరగాయలు పంటలను çపండించడం మొదలుపెట్టాం. సేంద్రియ ఎరువు తయారీకి 15 ఆవులను పెంచుతున్నాం. వాటి మూత్రం, పేడతో జీవామృతం తయారుచేసి మొక్కలకు అందిస్తున్నాం. పచ్చని విస్తరాకులు పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్‌ను చూసినప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్ కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. నా చిన్నతనంలో ఆకులతో కుట్టిన విస్తరాకుల్లోనే భోజనం చేసేవారు. ఇప్పుడు ఆ పద్ధతి మారిపోయింది. మన సంస్కృతిలో భాగమైన విస్తరాకుల తయారీని ముందు చేత్తోనే చేయడం మొదలుపెట్టాను. ఆ తర్వాత దీనినే 2019లో ‘ఆర్గానిక్ లీఫ్ టేబుల్’ పేరిట వ్యాపారాన్ని ప్రారంభించాను. ఈ విస్తరాకు ల విక్రయానికి ప్రత్యేకంగా ఒక పోర్టల్ సైతం ఏర్పాటు చేశాను. దీంతోపాటు సామాజిక మాధ్యమాల్లోనూ నిత్యం పోస్టులు చేయడం ద్వారా కొనుగోలుదారులు మమ్మల్ని సంప్రదిస్తున్నారు. విదేశాలకూ ఎగుమతి జర్మనీ, హాంకాంగ్, అమెరికా దేశాలకు సైతం మా విస్తరాకులు ఎగుమతి అవుతున్నాయి. వీటి తయారీకి కావాల్సిన అడ్డాకులను ప్రత్యేకంగా ఒరిస్సా నుంచి దిగుమతి చేసుకుంటున్నాం. మోదుగ ఆకులు మన నేలకు మాత్రమే ప్రత్యేకమైనవి. ఆకుల సేకరణ కష్టంగా ఉంది. ఇబ్బందులను అధిగమిస్తూనే రోజూ 10 వేల వరకు విస్తరాకులను తయారు చేస్తున్నాం. దాదాపు 20 మంది స్థానిక మహిళలకు ఉపాధి కల్పించాను. ప్రతి యేడు రూ.60 లక్షల వరకు వ్యాపారం జరుగుతోంది. రానున్న రోజుల్లో మేం పండిస్తున్న సేంద్రియ కూరగాయలు, పండ్లతో వివిధ రకాల ఆహార పదార్థాలు తయారు చేయాలనుకుంటున్నాం. ఎవరైనా వ్యవసాయం గురించి తెలుసుకోవాలనుకుని వచ్చినవారికి మా స్థలంలో ఒక పిక్నిక్ స్పాట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటున్నాం. వచ్చినవాళ్లకు రెండు మూడు రోజులపాటు వసతి సదుపాయాలు అందించేలా జాగ్రత్తలు తీసుకుంటూ, అగ్రి టూరిజం చేయాలనేదే లక్ష్యంగా ముందుకెళ్తున్నాను’ అని వివరించారు మాధవి. పండించే పంట, చేసే వంట మాత్రమే కాదు తినే ప్లేటు కూడా బాగుండాలనే ఆలోచన యూజ్ అండ్ త్రో మెటీరియల్‌ను చూసి నప్పుడల్లా కలిగేది. ప్లాస్టిక్ కారణంగా ఎంత నష్టం వాటిల్లుతుందో తెలుసుకునే క్రమంలో చాలా బాధ అనిపించింది. ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా ఏదైనా చేయాలనుకున్నప్పుడు విస్తరాకుల తయారీ సరైనదని గ్రహించాను. – గజవెల్లి షణ్ముఖ రాజు, సాక్షి, సిద్దిపేట ఫొటోలు: కె.సతీశ్‌కుమార్ -
నాసిరకం భోజనంతో విద్యార్థులకు అస్వస్థత
సిద్దిపేట అర్బన్: నాసిరకం భోజనం తిని 45 మంది విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. సిద్దిపేట అర్బన్ మండలం ఎన్సాన్పల్లి సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సరిగా ఉడకని ఆహారం తిన్న విద్యార్థినులు రెండు, మూడు రోజులుగా కడుపునొప్పి, వాంతులు, విరేచనాలతో ఇబ్బంది పడుతున్నారు. విషయం బయటకు పొక్కకుండా హాస్టల్లో ని ఓ గదిలో ఉంచి పుల్లూరు పీహెచ్సీ వైద్యులతో వైద్యం చేయిస్తున్నారు. విద్యార్థులకు అందుతున్న వైద్య సేవలను స్థానిక ప్రజాప్రతినిధులు దగ్గరుండి పర్యవేక్షిస్తూ విషయం బయటకు తెలియకుండా జాగ్రత్త పడుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఇక్కడ విద్యార్థులు అస్వస్థతకు గురికావడం నెల రోజుల వ్యవధిలో ఇది రెండోసారి. పునరావృతం కావొద్దు: కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారనే విషయాన్ని సామాజి క మాధ్యమాల ద్వారా తెలుసుకున్న అదనపు కలెక్టర్ ముజామ్మిల్‌ఖాన్ హాస్టల్‌ను సందర్శించారు. విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందని వారిని అడగ్గా ప్రస్తుతం బాగా నే ఉందని విద్యార్థినులు సమాధానం చెప్పారు. పిల్లలు బాగా నే ఉంటే బయట ప్రచారం మరోలా జరుగుతోందని ఇలా ఎందుకు అని ప్రిన్సిపాల్ లలితను ప్రశ్నించగా హెడ్ కుక్ రాకపోవడంతో మరో వ్యక్తి వంట చేయగా నాణ్యత లోపించి విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారని సమాధానం ఇచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. అనంతరం విద్యార్థినులతో కలిసి భోజనం చేసి నాణ్యతను పరిశీలించారు. విద్యార్థినుల ఆరోగ్యం కుదుటపడే వరకు మెడికల్ సిబ్బంది అక్కడే ఉండి వైద్యసేవలందించాలని డీఎంహెచ్‌వోను ఆదేశించారు. -
మా అమ్మానాన్నను కలపండి ప్లీజ్
అమ్మ ఒక చోట.. నాన్న మరో చోట.. మేము ఇంకో చోట ఉంటున్నాం. మేమందరం ఒకే చోట ఉండేలా చూడాలని చేతుల్లో గోరింటాకుతో రాసి పెట్టుకుని పలువురు చిన్నారులు రాష్ట్ర ప్రభుత్వాన్ని వేడుకున్నారు. మరికొంత మంది పిల్లలు తమ ఆలనాపాలన చూడటానికి తమ తల్లిదండ్రులకు సమయం సరిపోవడంలేదని, సీఎం కేసీఆర్ తాత మా అమ్మానాన్నను కలపాలని ఫ్లెక్సీలతో ర్యాలీలో పాల్గొన్నారు. సోమవారం సిద్దిపేట పట్టణంలో నిర్వహించిన స్పౌజ్ ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలని ఈ విధంగా ర్యాలీ నిర్వహించారు. –సాక్షి, స్టాఫ్ ఫొటోగ్రాఫర్, సిద్దిపేట -
తీరొక్క భూములు.. చూడచక్కని అడవులు
సాక్షి, సిద్దిపేట: దేశంలో ఉన్న అటవీప్రాంతాలు, వివిధ రకాల కర్రలు, నేలల రకాలు అన్నీ ఒకే దగ్గర తిలకించేవిధంగా ఏర్పాటు చేశారు. అది ఎక్కడో అనుకుంటున్నారా! ఎక్కడో కాదు.. సిద్దిపేట జిల్లా ములుగులోని అటవీ కళాశాల పరిశోధన కేంద్రంలో(ఎఫ్ఆర్సీఐ) ఏర్పాటు చేసిన మ్యూజియంలో కొలువుదీరాయి. 52 ఎకరాల్లో ఏర్పాటుచేసిన అటవీ కళాశాల, పరిశోధన సంస్థలో బీఎస్సీ ఫారెస్ట్ నాలుగేళ్లు, ఎమ్మెస్సీ ఫారెస్ట్ రెండేళ్ల కోర్సులు కొనసాగుతున్నాయి. విద్యార్థులు, అధ్యాపకులు రెండేళ్లపాటు అడవులను సందర్శించి వీటిని సేకరించారు. ప్రజలకు దేశంలో అటవీప్రాంతాలు, నేలల రకాలపై అవగాహన కోసం మ్యూజియం రూపొందించారు. మ్యూజియంలోకి వెళ్లగానే అడవిలోకి వెళ్లినట్లుగా ఉండే విధంగా వివిధ రకాల జంతువుల బొమ్మలు, చెట్లు ఏర్పాటు చేశారు. భూములు... అడవులు మ్యూజియంలో ఎన్నో అంశాలు తెలుసుకునేవిధంగా ఏర్పాటు చేశారు. దేశంలో భూములు, పంటల రకాలు, రాష్ట్రంలోని అడవుల గురించి తెలిసే విధంగా చిత్రాలను ఉంచారు. తడి ఆకులు, పొడి ఆకురాల్చు, ముళ్ల అడవులు, పొడి సతత హరితారణ్యాలకు సంబంధించి వాటి స్వరూపాన్ని తెలిపే అంశాలను లిఖించారు. రాష్ట్ర వృక్షం జమ్మి, రాష్ట్ర జంతువు జింక, రాష్ట్ర పుష్పం తంగేడు, రాష్ట్రపక్షి పాలపిట్టలకు సంబంధించిన పూర్తి సమాచారంతోపాటు చిత్రాలను ఏర్పాటు చేశారు. శిల్పాలు, ఖనిజాలు, శిలాజాలు, మృత్తికలు చిత్రరూపంలో ఉన్నాయి. జంతువుల పాదాల అచ్చులు ఏ జంతువు పాదం అచ్చు ఏ విధంగా ఉంటుందో ఫొటోలతో ఏర్పాటు చేశారు. జింక, పులి, నీటి ఏనుగు, సింహం, చిరుత, ఎలుగుబంటి, నక్క, ఏనుగుల పాదాల అచ్చులను ఏర్పాటు చేశారు. కప్పకు సంబంధించిన లైఫ్ సర్కిల్‌ను ఫొటోల రూపం ఏర్పాటు చేశారు. సాధారణంగా నాలుగు, ఐదు రకాల సీతాకోక చిలుకలనే మనం చూసి ఉంటాం. అదే ఫారెస్ట్ కళాశాల మ్యూజియంలో 32 రకాల సీతాకోక చిలుకలు, 10 రకాల గొల్లభామలు, మిడతలు, తేనెటీగలు ఉన్నాయి. సాయిల్ ప్రొఫైల్ భూముల్లో ఎన్ని పొరలు ఉంటాయి. ఏవిధంగా ఉంటాయో తెలియదు. అందరికీ తెలిసేవిధంగా ఫారెస్ట్ కళాశాలలో సాయిల్ ప్రొఫైల్ ఏర్పాటు చేశారు. భూమిలో ఐదుపొరలు ఉండనున్నాయి. అవి ఆర్గానిక్ ఆరిజన్, టాప్ సాయిల్, సబ్ సాయిల్, రాక్ ప్రాంగ్మెంట్స్, బెడ్రాక్లు ఉన్నాయి. ఇవన్నీ గాజుపాత్రలో ఏర్పాటు చేశారు. కర్రల సమూహం తెలంగాణలో చాలారకాల చెట్లను నరికి తయారు చేసిన కర్రల చెక్కలను గృహ అవసరాలకు వినియోగిస్తుంటారు. ఈవిధంగా ఉపయోగించే 17 రకాల చెట్లకు సంబంధించిన చెక్కలను మ్యూజియంలో ఏర్పాటు చేశారు. టేకు, బండారు, తుమ్మ, సీసం, తెల్లమద్ది, ఇప్ప, కరక్కాయ, చిల్ల, కానుగ, ఇప్ప, రోజ్ఉడ్, మిత్రదైనా, గుంపెన, లాటిణోలియా, గ్జలేలియా, తునికి, నారెప్పల చెట్టుకు సంబంధించిన కర్ర చెక్కలున్నాయి. వివిధ రకాల కర్రలతో తయారు చేసిన చెక్క బొమ్మలు, వివిధ ఆకృతులు మ్యూజియంలో ఉన్నాయి. రెండేళ్లు పట్టింది ఇవన్నీ సేకరించేందుకు.. డాక్టర్ కపిల్ సిహాద్తోపాటు మరో ఇద్దరు ప్రొఫెసర్లు రెండేళ్లపాటు తెలంగాణలోని అన్ని అటవీ ప్రాంతాల నుంచి సేకరించారు. దేశంలో, రాష్ట్రంలో అటవీప్రాంతాలు, వివిధ రకాల కర్రలు, జంతువులు, నేలల రకాల గురించి అందరికీ తెలిపేందుకే ఈ మ్యూజియం ఏర్పాటు చేశాం. పాఠశాల విద్యార్థులు ప్రతి నెలా ఫీల్డ్ విజిట్లకు వెళ్తుంటారు. అలా వెళ్లేవారు ఎఫ్సీఆర్ఐలో ఉన్న మ్యూజియాన్ని సందర్శిస్తే ఇక్కడ ఎన్నో కొత్త విషయాలు తెలుసుకోవచ్చు. – వెంకటేశ్వర్లు, ఎఫ్ఆర్సీఐ డిప్యూటీ డైరెక్టర్ -
ప్రజా గోస బీజేపీ భరోసా.. ప్రజల మద్దతు కోరుతూ మిస్డ్‌కాల్ ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఆధ్వర్యంలో ‘ప్రజా గోస బీజేపీ భరోసా’ పేరిట నిర్వహిస్తున్న బైక్ ర్యాలీని గురువారం సిద్దిపేటలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ప్రారంభిస్తారు. అనంతరం వేములవాడలో నిర్వహించే బైక్‌ర్యాలీ లోనూ సంజయ్ పాల్గొంటారు. తొలివిడతలో రాష్ట్రంలోని 6 ఎంపీ స్థానాల్లోని, ఆరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ ర్యాలీలను సమాంతరంగా మొదలుపెడతారు. ఈ ర్యాలీలకు తాండూరులో పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, సిద్దిపేటలో పార్టీ మధ్యప్రదేశ్ ఇంచార్జి మురళీధర్‌రావు, జుక్కల్‌లో జాతీయ కార్యవర్గ సభ్యుడు డా.వివేక్ వెంకటస్వామి, బోధన్‌లో బీజేఎల్పీ నేత టి.రాజాసింగ్, నర్సంపేటలో పార్టీ ఎమ్మెల్యే ఎం.రఘునందన్‌రావు, వేములవాడలో మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ నేతృత్వం వహిస్తారని పార్టీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, బైక్ ర్యాలీ ఇంచార్జి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి బుధవారం మీడియాకు వెల్లడించారు. టీఆర్ఎస్ సర్కార్ అప్రజాస్వామిక, నియంత, కుటుంబపాలనపై బీజేపీ చేస్తున్న పోరాటానికి ప్రజా మద్దతు కోరుతూ 6359199199 మొబైల్ నంబర్ ఏర్పాటు చేశామన్నారు. బీజేపీకి మద్దతు ఇవ్వాలనుకున్న వారు ఈ నంబర్‌కు మిస్డ్ కాల్ ఇవ్వాలని కోరారు. ఫసల్ బీమా, డబుల్ బెడ్రూమ్లు, నిరుద్యోగం, ఇతర అంశాలపై ఇబ్బందులను తెలుసుకుని ప్రజలకు భరోసా కల్పించేందుకు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశామన్నారు. త్వరలో మరో 7 నియోజకవర్గాల్లో... త్వరలోనే మరో 7 నియోజకవర్గాల్లో బైక్ ర్యాలీలు ప్రారంభమవుతాయని ప్రేమేందర్‌రెడ్డి చెప్పారు. దేవరకద్రలో పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యుడు ఈటల రాజేందర్, ఆదిలాబాద్‌లో ఎంపీ ధర్మపురి అర్వింద్, వైరాలో ఎంపీ సోయం బాపూరావు, మేడ్చల్‌లో జాతీయ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి, దేవరకొండలో జాతీయ కార్యవర్గ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు, ఇబ్రహీంపట్నంలో కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, కల్వకుర్తిలో బాబూమోహన్ పాల్గొనను న్నారు. ‘100 టీఎంసీలు ఎత్తిపోయనోడివి లక్ష కోట్లకు పైగా డబ్బులు పెట్టి కాళేశ్వరం ఎందుకు కట్టినట్టు? వరద లతో 1,200 టీఎంసీలు వృథాగా సముద్రంలో కలిశాయి’ అని ఆయన సీఎం కేసీఆర్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. -
లంచం తీసుకుంటూ పట్టుబడ్డ తొగుట ఎమ్మార్వో కృష్ణమోహన్
-
మానవరూపంలో నంది
సాక్షి, హైదరాబాద్: నంది అనగానే శివాలయంలో శివుడికి ఎదురుగా మంటపంలో జంతు రూపంలో ఉం డటమే మనకు తెలుసు. కానీ.. 11వ శతాబ్దంలో నందికి మానవరూపంతో ఓ దైవ విగ్రహంగా ప్రత్యేక స్థానం ఉండేది. ఇప్పుడు అలాంటి అరుదైన విగ్రహం సిద్దిపేట జిల్లా మిట్టపల్లిలోని కాసువాగు ఆంజనేయస్వామి ఆలయంలో వెలుగుచూసింది. కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యుడు కొలిపాక శ్రీనివాస్ గుర్తించారని ఆ బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఈ నంది విగ్ర హాన్ని అధికార నందిగా పేర్కొంటారు. శివుడి దర్శనానికిగాను భక్తులకు అనుమతి ఇచ్చే అధికారంతో ఉంటుందని, అందుకే అధికార నంది అంటారని ప్రముఖ స్థపతి డాక్టర్ ఈమని శివనాగిరెడ్డి చెప్పారు. శివుడి దర్శనానికి ముందు ఈ విగ్రహాన్ని దర్శించేలా చాళుక్యుల కాలంలో సంప్రదాయం ప్రారంభమైందని, వెయ్యేళ్ల క్రితం నిర్మించిన ఆలయాల్లో వీటిని ఏర్పాటు చేసే వారని, ఆ తర్వాత అంతర్ధానమైందని వివరించారు. ఇక కుతుబ్ షాహీల కాలంలో 40 గ్రామాలకు దేశ్‌ముఖ్‌గా పనిచేసిన సిద్ధసోమాజీ, తన తల్లి కోరిక మేరకు ఈ ఆలయాన్ని నిర్మించి దీన్ని ప్రతిష్టించారని చెప్పారు. ఈ విగ్రహం వెనక కుడి చేతిలో పరశువు, ఎడమచేతిలో కృష్ణ జింక, ముందరి కుడి చేయి వరద హస్తంగా, ఎడమ చేతిలో అధికార దండం ఉన్నట్టు వెల్లడించారు.