సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లకు ఇప్పట్లో రైలుకూత వినిపించే పరిస్థితి లేదు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరిగింది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్ వరకు రైలు సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మార్చి నాటికి సిరిసిల్ల స్టేషన్ వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది.
వీలునుబట్టి రైలు సర్వీసులను సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పొడిగించాలని అనుకుంది. డిమాండ్ సర్వేలో, ప్రయాణికుల సంఖ్య ఉంటుందని తేలితే సిరిసిల్ల నుంచి రైలు సర్విసులు నడిపే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు సిద్దిపేట–సిరిసిల్ల మధ్య కీలక ప్రాంతంలో పనులే జరగటం లేదు. ఫలితంగా రైలు సర్విసు కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ సంగతి..: భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యే కొద్దీ రైల్వే అధికా రులు పనులు చేస్తూ వెళ్లారు. ఇలా సిద్దిపేట వరకు వేగంగా పూర్తి చేసి అనుకున్న సమయంలో రైలు సర్విసులు ప్రారంభించా రు. ఆ తర్వాత సిద్దిపేట –సిరిసిల్ల సెక్షన్ల మధ్య పనులు ప్రారంభించారు. కానీ, మధ్యలో 80 ఎకరాలకు సంబంధించిన భూసేకరణలో ఇబ్బందులొచ్చాయి. ఆ ప్రాంతంలో భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో రైతు ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడివరకు వదిలి ఆపై భాగంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగించారు. తర్వా త సిద్దిపేట సమీపంలోని భూముల వివాదం పరిష్కారమైంది.
భూయజమానులకు పరిహారం కింద రూ.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే సమ యంలో ఎన్ని కల కోడ్ రావడంతో ఆ చెల్లింపులు నిలిచిపోయా యి. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభు త్వం ఏర్పడ గానే ఆ డబ్బులు చెల్లింపు కోసం రైల్వే అధికారు లు ఒత్తిడి ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వర కు చెల్లింపు జాడే లేదు. దీంతో పెద్ద కోడూరు, మాచాపూర్, గంగాపూర్, విఠలాపూర్ గ్రామాల పరిధిలో రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. రైతులకు పరిహారం చెల్లిస్తే తప్ప ఆ భూములను రైల్వే స్వాదీనం చేసుకునే వీలు లేదు.
సిరిసిల్ల సమీపంలో మాత్రం పనులు కొనసాగుతున్నా యి. అక్కడ పూర్తయినా, సిద్దిపేట సమీపంలో పెండింగ్‌లో ఉంటే రైల్వేలైన్ వేసే వీలుండదు. రాష్ట్రప్రభుత్వం పరిహారం చెల్లిస్తేనే పనులు మొదలవుతాయి. దీంతో పనులు కనీసం 4నెలలు వెనక బడ్డట్టు అయ్యిందని ఓ రైల్వే అధికారి వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే అన్నిరకాల పనుల్లో జాప్యం జరుగుతోందని సమాచారం. పరిహారం చెల్లింపే కాకుండా ప్రాజెక్టు వ్యయంలోనూ మూడో వంతు ఖర్చు రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇప్పుడు ఆ మొత్తానికి సంబంధించి కూడా కొంత పేరుకుపోయిందని తెలుస్తోంది.
సిద్దిపేట–సిరిసిల్ల మధ్య 30 కిలోమీటర్ల మేర పనులకు రూ.480 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఆ మార్గంలో కొంత గుట్టభూమి కూడా ఉండటంతో దాన్ని కట్ చేసి పనులు చేయాల్సి ఉంది. ఇది స్వతహాగానే ఆలస్యమయ్యే పని. భూపరిహారం పంపిణీలో జాప్యం, ఇతర పనులూ నెమ్మదించటం వెరసి.. ఈ 30 కిలోమీటర్ల పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం తప్పేలా కనిపించటం లేదు.
Comments
Please login to add a commentAdd a comment