Railway Project
-
2 కి.మీ. నిడివి రూ. 332 కోట్ల వ్యయం
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్ల సమీపంలో మానేరునదిపై 2.4 కిలోమీటర్ల పొడవుతో భారీ రైలువంతెన నిర్మించనున్నారు. ఇందుకు రూ.332 కోట్లు ఖర్చు కానుంది. కరీంనగర్ పట్టణాన్ని సిద్దిపేట మీదుగా హైదరాబాద్‌తో నేరుగా అనుసంధానించే మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో భాగంగా ఈ వంతెన పనులు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం గోదావరి నదిపై పెద్ద వంతెనలున్నాయి. ఇప్పుడు మానేరుపై నిర్మించే ఈ వంతెన వాటి సరసన చేరనుంది. విజయవాడ రైలు వంతెన తరహాలో..కృష్ణానదిపై విజయవాడ వద్ద నిర్మించిన రైలు వంతెన తరహాలో ఇనుప గర్డర్లతో దీన్ని రూపొందించబోతున్నారు. రైళ్లు వేగంగా వెళ్లినప్పుడు ఏర్పడే కంపన ప్రభావం పిల్లర్లపై పెద్దగా ప్రభావం చూపకుండా ఇనుప గర్డర్లు అడ్డుకుంటాయి. దీంతో ఈ డిజైన్‌కు మొగ్గు చూపారు. భారీ వరద పోటెత్తినా ఇబ్బంది కానిరీతిలో..మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టులో భాగంగా సిద్దిపేట వరకు రైలు సేవలు ప్రారంభించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం సిద్దిపేట–సిరిసిల్ల మధ్య పనులు జరుగుతున్నాయి. రైలు సిరిసిల్లకు చేరుకోవాలంటే మానేరు నదిని దాటాలి. సిరిసిల్ల శివారులో రైల్వే స్టేషన్ నిర్మిస్తున్నారు. అక్కడకు చేరుకునే మార్గానికి కేవలం 10 కి.మీ. దూరంలో మిడ్ మానేరు జలాశయం ఉంది. దీంతో అక్కడ బ్యాక్ వాటర్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. వానాకాలంలో నీటి నిల్వ పెరిగి నది మరింత వెడల్పుతో ప్రవహిస్తుంది.గతంలో గరిష్ట నీటిమట్టాన్ని పరిగణనలోకి తీసుకుని అంతకంటే ఎక్కువ నీళ్లు చేరినా రైలు మార్గానికి ఇబ్బంది కాని రీతిలో వంతెనకు డిజైన్ చేశారు. దీంతో 2.4 కి.మీ. నిడివితో నిర్మించాలని నిర్ణయించారు. నదీతీరంలో ఉన్న గోపాలరావుపల్లి వద్ద వంతెన నిర్మాణం ప్రారంభమై.. సిరిసిల్ల వైపు అనుపురం గ్రామపరిధిలో ల్యాండ్ అవుతుంది. 120 కి.మీ. వేగంతో రైలు ప్రయాణించేలా..సాధారణంగా వంతెనలపై రైళ్ల వేగాన్ని కనిష్ట స్థాయికి కుదిస్తారు. ప్రయాణికుల రైళ్లు గంటకు 120 కి.మీ.వేగంతో దూసుకుపోయినా ఇబ్బందికాని విధంగా ఈ వంతెన నిర్మించనున్నారు. అయితే సరుకు రవాణా రైళ్ల గరిష్ట వేగాన్ని 65 కి.మీ.కు అనుమతిస్తారు. ఆంగ్ల అక్షరం ‘ఎస్’ఆకృతిలో..ఈ వంతెన ఆంగ్ల అక్షరం ‘ఎస్’ఆకృతిలో మలుపుతో ఉంటుంది. వంతెన నిర్మించే ప్రాంతంలో కొంతభాగం అటవీ ప్రాంతం అలైన్‌మెంట్‌లోకి చొచ్చుకొచ్చింది. మరోవైపు గుట్టలున్నాయి. దీంతో వాటిని తప్పిస్తూ ఎస్ ఆకృతిలో డిజైన్ చేశారు. వెంటనే పనులు..వంతెన పనులను వెంటనే ప్రారంభించేలా దక్షిణ మధ్య రైల్వే టెండర్లు పిలిచింది. గతంలో ఈ సెక్షన్ మధ్యలో భూ పరిహార మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో డిపాజిట్ చేయలేదు. దీంతో పనుల్లో జాప్యం జరిగింది. ఇటీవల ఆ మొ త్తం చెల్లించటంతో పనులు జరుగుతున్నాయి. ఇక మానేరు నది అవతల సిరిసిల్ల నుంచి కరీంనగర్ (కొత్తపల్లి) వరకు భూసేకరణ ప్రక్రియ నిలిచిపో యింది. పరిహారం మొత్తం రూ.40 కోట్లను రాష్ట్ర ప్రభుత్వం కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయలేదు. దీంతో భూమి రైల్వే ఆధీనంలోకి రాలేదు. ఫలితంగా అక్కడ టెండర్లు కూడా పిలవలేదు. దీంతో ప్రాజెక్టు అనుకున్న సమ యంలో పూర్తయ్యే పరిస్థితి లేదు. దీంతో మిగ తా పనులతో ప్రమేయం లేకుండా వంతెన భా గాన్ని వేగంగా నిర్మించి, ప్రాజెక్టులో అపరిమిత జాప్యాన్ని నివారించాలని దక్షిణ మధ్య రైల్వే నిర్ణయించింది. సిరిసిల్ల వైపు లైన్ నిర్మాణం పూర్తయ్యేనాటికి వంతెన సిద్ధమయ్యేలా ప్లాన్ చేస్తోంది. 18 నుంచి 20 నెలల్లో వంతెన నిర్మాణం పూర్తి చేయనున్నట్టు పేర్కొంటోంది. -
ప్రధాని వాకబుతో ‘మనోహరాబాద్’ రైల్వేలైన్ చకచకా!
సాక్షి, హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వాకబు చేయటంతో మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టులో చకాచకా అనేక పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొన్ని నెలలుగా పెండింగ్‌లో ఉన్న పరిహారం సొమ్ము విడుదలైంది. ఈ ప్రాజెక్టులో చివరి స్టేషన్ అయిన కొత్తపల్లి వరకు భూసేకరణ అంశం కొలిక్కి వచి్చంది. ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం రూ.137 కోట్లు విడుదల చేసినట్టు సమాచారం. దీంతో ఈ మొత్తం భూమి త్వరలో రైల్వే అ«దీనంలోకి రానుంది. ఆమేరకు అన్ని భాగాలకు టెండర్లు పిలిచేందుకు రైల్వే ఏర్పాట్లు చేస్తోంది. ప్రధానమంత్రి ‘ప్రగతి’లో ఉండటంతోనే... రైల్వే కీలక ప్రాజెక్టులు ప్రధానమంత్రి ఆధ్వర్యంలోని ‘ప్రగతి’జాబితాలో ఉంటాయన్న విషయం తెలిసిందే. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టుకు స్వయంగా ఆయన హాజరై భూమి పూజ చేసినందున దానిని కూడా అందులో చేర్చారు. దేశవ్యాప్తంగా ఆయన స్వయంగా హాజరై పనులు ప్రారంభించిన రైల్వే ప్రాజెక్టుల పురోగతిని సమీక్షించాలని ఇటీవల నిర్ణయించారు. ఇందులో భాగంగా మనోహరాబాద్–కొత్తపల్లి ప్రాజెక్టు వివరాలు కూడా వాకబు చేసినట్టు తెలిసింది. సిద్దిపేట వరకు రైలు సేవలు మొదలు కాగా, ఆ తర్వాత సిరిసిల్ల స్టేషన్‌కు ముందు నుంచి భూసేకరణలో సమస్య నెలకొందని ఆయన దృష్టికి వెళ్లింది. భూసేకరణకు సంబంధించి అన్నితంతులు పూర్తి అయినా.. పరిహారం డబ్బులు మాత్రం విడుదల కాలేదని స్పష్టమైంది.ఈ ప్రాజెక్టు భూసేకరణ భారం పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వానిదే. కీలక ప్రాజెక్టుల్లో కూడా ఇలా జాప్యం జరగటం ఏంటని ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. దీనిపై రైల్వే శాఖ నిర్వహించే ప్రాజెక్టు మానిటరింగ్ గ్రూప్ (పీఎంజీ)లో దీనిపై చర్చ జరిగింది. సమాచారం రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చేరవేయటంతో వెంటనే భూ పరిహారం నిధులు రూ.137 కోట్లు విడుదల చేసినట్టు రైల్వేవర్గాలు చెప్పాయి. వాటి పంపిణీకి చెక్కులు సిద్ధం చేస్తున్నారని, ఆ వెంటనే భూమి తమ స్వా«దీనం అవుతుందని రైల్వే అధికారులు పేర్కొంటున్నారు. మరో 72 కిలోమీటర్ల పని ఈ ప్రాజెక్టు పూర్తి నిడివి 151 కిలోమీటర్లు. ఇందులో సిద్దిపేట వరకు 79 కి.మీ. మేర ట్రాక్ సిద్ధమై గతేడాది నుంచి రైళ్లు తిరుగుతున్న విషయం తెలిసిందే. మిగిలిన 72 కి.మీ. పనులు ఇప్పుడు జరగాల్సి ఉంది. ఇందులో చివరి స్టేషన్ అయిన కొత్తపల్లిలో యార్డు, స్టేషన్ పనులు మరో మూడు నెలల్లో సిద్ధం కానున్నాయి. ఇందులో మానేరు నదిపై దాదాపు 2 కిలోమీటర్ల మేర వంతెన నిర్మించాల్సి ఉంది. ఈ పనుల్లో జాప్యం జరిగే అవకాశం ఉంది. దిగువ నీటి ప్రవాహం ఆధారంగా పనులు జరుగుతాయి. మిగతా పనులు వేగంగానే పూర్తి కానుండగా, ఈ వంతెన పనులు మాత్రమే నెమ్మది గా జరుగుతాయి. మరో మూడేళ్లలో ప్రాజెక్టు పను లన్నీ పూర్తవుతాయని భావిస్తున్నారు. -
రైల్వేలకు సంతృప్తికరంగా నిధులు
సాక్షి, హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో రైల్వే ప్రాజెక్టులకు సంతృప్తికరంగా నిధులు కేటాయించారని దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్ కుమార్ జైన్ అన్నారు. తాజా బడ్జెట్లో రైల్వేలకు రూ.2.52 లక్షల కోట్లు కేటాయించగా.. అందులో దక్షిణ మధ్య రైల్వేకి రూ.14,232.84 కోట్లు కేటాయించారన్నారు. ఇందులో తెలంగాణ ప్రాంత వాటా రూ.5,071 కోట్లని, గత బడ్జెట్ కంటే 14.7 శాతం నిధులు అధికంగా కేటాయించారని వివరించారు. శుక్రవారం ఆయన రైల్‌నిలయంలో మీడియాతో మాట్లాడుతూ, రైలు ప్రయాణికుల భద్రత, సౌకర్యార్థం 40 వేల సాధారణ బోగీలను వందే భారత్ ప్రమాణాలకు తగ్గట్టుగా మార్చనున్నట్లు వివరించారు. ఈసారి పీఎం గతిశక్తి కింద పలు ప్రాజెక్టులను గుర్తించినట్లు తెలిపారు. కవచ్ వ్యవస్థ అభివృద్ధి కోసం ఈ సారి రూ.41.94 కోట్లు కేటాయించారన్నారు. తాజా బడ్జెట్లో నిధులు తగ్గినట్లు కనిపించినప్పటికీ ఇది మధ్యతరం మాత్రమేనని, పూర్తిస్థాయి బడ్జెట్లో నిధులు పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. భద్రాచలం రోడ్ – డోర్నకల్ డబ్లింగ్ ప్రాజెక్టు కింద రూ. 770.12 కోట్లతో 54.65 కిలోమీటర్లు అభివృద్ధిచేయనున్నట్లు వివరించారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఈ సారి రెండు బైపాస్ లైన్ల నిర్మాణానికి బడ్జెట్లో నిధులు కేటాయించారని, ఇందులో కాజీపేట్ బైపాస్ లైన్ 10.65 కిలోమీటర్లు, వికారాబాద్ మార్గంలో 2.8 కిలోమీటర్లు నిర్మించనున్నట్లు వివరించారు. ఈ పదేళ్లలో రాష్ట్రానికి కేటాయింపులు దాదాపు 20 రెట్లు పెరిగాయని తెలిపారు. -
సిరిసిల్లకు ఇప్పట్లో రైలు కూత లేనట్టే
సాక్షి, హైదరాబాద్: సిరిసిల్లకు ఇప్పట్లో రైలుకూత వినిపించే పరిస్థితి లేదు. మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వే ప్రాజెక్టు పనుల్లో భాగంగా భూసేకరణ పరిహారం చెల్లింపుల్లో జాప్యం జరిగింది. దీంతో పనులు ముందుకు సాగడం లేదు. సికింద్రాబాద్ నుంచి ప్రస్తుతం సిద్దిపేట స్టేషన్ వరకు రైలు సర్వీసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ మార్చి నాటికి సిరిసిల్ల స్టేషన్ వరకు పనులు పూర్తి చేయాల్సి ఉంది. వీలునుబట్టి రైలు సర్వీసులను సిద్దిపేట నుంచి సిరిసిల్ల వరకు పొడిగించాలని అనుకుంది. డిమాండ్ సర్వేలో, ప్రయాణికుల సంఖ్య ఉంటుందని తేలితే సిరిసిల్ల నుంచి రైలు సర్విసులు నడిపే అవకాశం ఉంటుంది. కానీ, ఇప్పుడు సిద్దిపేట–సిరిసిల్ల మధ్య కీలక ప్రాంతంలో పనులే జరగటం లేదు. ఫలితంగా రైలు సర్విసు కూడా ఇప్పట్లో ఉండే అవకాశం లేదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదీ సంగతి..: భూసేకరణ ప్రక్రియ పూర్తయ్యే కొద్దీ రైల్వే అధికా రులు పనులు చేస్తూ వెళ్లారు. ఇలా సిద్దిపేట వరకు వేగంగా పూర్తి చేసి అనుకున్న సమయంలో రైలు సర్విసులు ప్రారంభించా రు. ఆ తర్వాత సిద్దిపేట –సిరిసిల్ల సెక్షన్ల మధ్య పనులు ప్రారంభించారు. కానీ, మధ్యలో 80 ఎకరాలకు సంబంధించిన భూసేకరణలో ఇబ్బందులొచ్చాయి. ఆ ప్రాంతంలో భూముల ధరలు ఎక్కువగా ఉండటంతో రైతు ల నుంచి అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. దీంతో అక్కడివరకు వదిలి ఆపై భాగంలో భూసేకరణ ప్రక్రియ కొనసాగించారు. తర్వా త సిద్దిపేట సమీపంలోని భూముల వివాదం పరిష్కారమైంది. భూయజమానులకు పరిహారం కింద రూ.19 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఇదే సమ యంలో ఎన్ని కల కోడ్ రావడంతో ఆ చెల్లింపులు నిలిచిపోయా యి. ఎన్నికలు ముగిసి కొత్త ప్రభు త్వం ఏర్పడ గానే ఆ డబ్బులు చెల్లింపు కోసం రైల్వే అధికారు లు ఒత్తిడి ప్రారంభించారు. కానీ కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పడి 45 రోజులు గడుస్తున్నా ఇప్పటి వర కు చెల్లింపు జాడే లేదు. దీంతో పెద్ద కోడూరు, మాచాపూర్, గంగాపూర్, విఠలాపూర్ గ్రామాల పరిధిలో రైల్వేలైన్ పనులు ప్రారంభం కాలేదు. రైతులకు పరిహారం చెల్లిస్తే తప్ప ఆ భూములను రైల్వే స్వాదీనం చేసుకునే వీలు లేదు. సిరిసిల్ల సమీపంలో మాత్రం పనులు కొనసాగుతున్నా యి. అక్కడ పూర్తయినా, సిద్దిపేట సమీపంలో పెండింగ్‌లో ఉంటే రైల్వేలైన్ వేసే వీలుండదు. రాష్ట్రప్రభుత్వం పరిహారం చెల్లిస్తేనే పనులు మొదలవుతాయి. దీంతో పనులు కనీసం 4నెలలు వెనక బడ్డట్టు అయ్యిందని ఓ రైల్వే అధికారి వ్యాఖ్యానించారు. గతంతో పోలిస్తే అన్నిరకాల పనుల్లో జాప్యం జరుగుతోందని సమాచారం. పరిహారం చెల్లింపే కాకుండా ప్రాజెక్టు వ్యయంలోనూ మూడో వంతు ఖర్చు రాష్ట్రప్రభుత్వం భరించాల్సి ఉంది. ఇప్పుడు ఆ మొత్తానికి సంబంధించి కూడా కొంత పేరుకుపోయిందని తెలుస్తోంది. సిద్దిపేట–సిరిసిల్ల మధ్య 30 కిలోమీటర్ల మేర పనులకు రూ.480 కోట్లు వ్యయమవుతుందని అంచనా. ఆ మార్గంలో కొంత గుట్టభూమి కూడా ఉండటంతో దాన్ని కట్ చేసి పనులు చేయాల్సి ఉంది. ఇది స్వతహాగానే ఆలస్యమయ్యే పని. భూపరిహారం పంపిణీలో జాప్యం, ఇతర పనులూ నెమ్మదించటం వెరసి.. ఈ 30 కిలోమీటర్ల పనుల నిర్వహణలో తీవ్ర జాప్యం తప్పేలా కనిపించటం లేదు. -
రామేశ్వరం – ధనుష్కోడి రైల్వే లైన్‌కు బ్రేక్?
సాక్షి, చైన్నె: రామనాథపురం జిల్లాలోని రామేశ్వరం ఆథ్యాత్మికంగా, పర్యాటకంగా ఎంతో ప్రసిద్ధి చెందిన విషయం తెలిసిందే. ఇక్కడికి నిత్యం రామనాథ స్వామిని దర్శించుకునేందుకు భక్తులు, పర్యాటక అందాల్ని తిలకించేందుకు దేశ విదేశీయులకు చెందిన వారు తరలి వస్తుంటారు. ఇక్కడ సముద్ర తీరంలోని అగ్ని తీర్థం పవిత్ర స్నానాలకు ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్నానం చేసినానంతరం భక్తులు ఆలయంలోని ఉన్న మరో బావి నీళ్లు చల్లుకుని రామనాథ స్వామి దర్శనార్థం వెళ్లడం జరుగుతోంది. ఇటీవల ఓ పరిశోధనలతో రామేశ్వరం పరిసరాల్లో 1962 కాలంలో 62 తీర్థాలు ఉన్నట్లు తేల్చారు. ఇందులో 30 తీర్థాలను ప్రస్తుతం గుర్తించారు. ఇవి ఆయడ మగుడం, తంగచ్చి మఠం, మండపం, ఉప్పురూ తదితర ప్రాంతాల్లో ఉన్నట్టు తెలుస్తోంది. వీటిని పునరుద్ధరించి ఆథ్యాత్మిక, పర్యాటకంగా ఈ పరిసరాలను తీర్చిదిద్దేందుకు కేంద్రం ప్రత్యేక కార్యాచరణపై దృష్టి పెట్టింది. అలాగే, మండపం నుంచి పాంబన్ మీదుగా రామేశ్వరానికి రైలు ప్రయాణం సముద్రం మధ్యలో సాగుతోంది. చైన్నె నుంచే కాదు, ఉత్తరాది రాష్ట్రాల నుంచి సైతం రామేశ్వరానికి పలు రైళ్ల సేవలు అందుబాటులో ఉన్నాయి. మండపం నుంచి రామేశ్వరం వైపుగా రైలు సాగేందుకు పాంబన్ దీవుల్ని తాకుతూ రైల్వే వంతెన నిర్మించి 110 ఏళ్లు అవుతోంది. 1964లో కడలి కల్లోలానికి పాంబన్ సమీపంలోని ధనుస్కోడి నామ రూపాలు లేకుండా పోయినా, ఈ వంతెనకు మాత్రం చెక్కు చెదర లేదు. అందుకే ఈ వంతెనను అభివృద్ధి చేయడంతో పాటు, ప్రత్యామ్నాయ వంతెన నిర్మాణాలపై కేంద్రం దృష్టి పెట్టింది. 2018–19లో.. రామేశ్వరం, మండపం, పాంబన్, ధనుష్కోడి పరిసరాల నుంచి కచ్చదీవులు, శ్రీలంక సముద్ర తీర దీవులు కూత వేటు దూరంలోనే ఉన్నాయి. ఈ పరిసరాలను కలిపే విధంగా ప్రయాణికుల నౌకను నడిపేందుకు ప్రయత్నాలు సైతం సాగుతున్నాయి. అలాగే 1964లో కడలి సృష్టించిన కల్లోలానికి నామ రూపాలు లేకుండా పోయిన ధనుష్కోడిని మళ్లీ పునరుద్ధరించి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే విధంగా కసరత్తు చేపట్టారు. ఇందులో భాగంగా గతంలో గల్లంతైన రామేశ్వరం నుంచి ధనుష్కోడికి రైల్వే మార్గం పునరుద్ధరించే విధంగా కొత్త మార్గానికి సిద్ధమయ్యారు. ఈ మార్గంలో 17.2 కి.మీ దూరం రూ.733 కోట్లతో 2018–19లో రైల్వే ప్రాజెక్టును కేంద్ర రైల్వే శాఖ ప్రకటించింది. అటవీ శాఖకు చెందిన 28 హెక్టార్లు, తమిళనాడు ప్రభుత్వానికి చెందిన 43 హెక్టార్లు, ప్రైవేటుకు చెందిన 3.66 హెక్టార్లను ఈ రైల్వే మార్గం, రైల్వేస్టేషన్ల ఏర్పాటు కోసం సేకరించాలని నిర్ణయించారు. తొలి విడతగా రూ.385 కోట్లను ప్రకటించారు. ఈ పనులకు లోక్‌సభ ఎన్నికలకు ముందుగా ప్రధాని నరేంద్ర మోదీ శంకుస్థాపన కూడా చేశారు. వ్యతిరేకత.. ఈ ప్రాజెక్టుకు రాష్ట్రంలోని డీఎంకే ప్రభుత్వం వ్యతిరేకత వ్యక్తం చేసినట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ విషయాన్ని ఢిల్లీలో కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ లిఖిత పూర్వంగా ప్రకటించడం గమనార్హం. రామేశ్వరం – ధనుష్కోడి రైల్వే ప్రాజెక్టును తమిళనాడు ప్రభుత్వం వ్యతిరేకిస్తూ, నిరాకరించినట్లు ఇందులో ప్రకటించారు. ధనుష్కోడి పరిసరాల్లో రైల్వే ప్రాజెక్టు కారణంగా పర్యావరణ సంబంధింత సమస్యలు అనేకం ఉత్పన్నం అవుతాయని, అలాగే, ఇక్కడ పనులు సమస్యాత్మక పరిస్థితులను సృష్టించే అవకాశాలు ఉన్నాయని తమిళనాడు ప్రభుత్వం తన లేఖలో వివరించింది. ఈ రైల్వే ప్రాజెక్టును పక్కన పెడితే మంచిదని, ఈ ప్రాజెక్టు తాము వ్యతిరేకం అని రాష్ట్ర ప్రభుత్వం స్పష్టం చేసిన నేపథ్యంలో కేంద్రం మున్ముందు ఎలాంటి చర్యలు చేపట్టనుందో అనే విషయం ఉత్కంఠ రేపుతోంది. -
ఆర్ఆర్ఆర్ చుట్టూ 'రింగ్ రైల్'..
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా చేపడు తున్న రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా రైల్వే లైన్ ఏర్పాటుకు రంగం సిద్ధమవుతోందని.. ఈ మేరకు ఔటర్ రింగ్ రైల్వే ప్రాజెక్టు తుది సర్వేకు కేంద్రం పచ్చజెండా ఊపిందని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి ప్రకటించారు. సర్వే కోసం తాజాగా రూ. 14 కోట్లను కేటాయించిందని తెలిపారు. రీజనల్ రింగ్ రోడ్డు, దానివెంట ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్టులతో హైదరాబాద్ నగరంతోపాటు తెలంగాణ రాష్ట్ర రూపురేఖలు మారిపోతా యని పేర్కొన్నారు. ప్రజల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో స్పష్టమైన సానుకూల మార్పులు వస్తాయని చెప్పారు. బుధవారం ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. నలువైపులా లైన్లను అనుసంధానిస్తూ.. హైదరాబాద్‌కు నలువైపులా ఉన్న రైల్వేలైన్లను కలుపుతూ రీజనల్ రింగ్ రోడ్డుకు అనుబంధంగా ఔటర్ రైల్ రింగ్ ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని కిషన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు రైల్వే కనెక్టివిటీ లేని ప్రాంతాలకు కొత్తగా రైల్వే సదుపాయం లభిస్తుందని.. ఆయా ప్రాంతాల నుంచి హైదరాబాద్‌కు త్వరగా, సులభంగా చేరుకోవచ్చని కేంద్ర మంత్రి వివరించారు. దీనితోపాటు కరీంనగర్– హసన్‌పర్తి (వరంగల్) మధ్య 61 కిలోమీటర్ల రైల్వేలైన్ సర్వే కోసం రైల్వేశాఖ రూ.1.5 కోట్లు కేటాయించిందని వెల్లడించారు. భక్తుల సౌకర్యార్థం పూర్తిగా కేంద్ర ప్రభుత్వ నిధులు రూ.330 కోట్లతో యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రెండో ఫేజ్ పనులను చేపట్టనున్నట్టు తెలిపారు. ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం.. ఈ వ్యయంలో మూడింట రెండొంతుల మేర రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సిన ఉన్నా ముందుకు రాలేదని.. దీనితో మొత్తం ఖర్చును కేంద్రమే భరించి పనులు చేపట్టాలని నిర్ణయించిందని వెల్లడించారు. దీనితోపాటు ‘రాష్ట్రాలకు మూలధన పెట్టుబడి ప్రత్యేక సహాయ పథకం’లో భాగంగా కేంద్ర ప్రభుత్వం 2020–21 నుంచి 2023–24 వరకు తెలంగాణ రాష్ట్రానికి రూ.5,221.92 కోట్లు మంజూరు చేసిందని తెలిపారు. ఎన్సీడీసీ కోసం భూమి ఇవ్వండి అత్యాధునిక వ్యాధి నిర్ధారణ సౌకర్యాలతో కూడిన ‘నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్సీడీసీ)’ కేంద్రాన్ని తెలంగాణలో ఏర్పాటు చేయటానికి కేంద్రం గతంలోనే ఆమోదం తెలిపిందని కిషన్‌రెడ్డి వెల్లడించారు. కానీ జీనోమ్ వ్యాలీలో ఈ కేంద్రం ఏర్పాటుకోసం అవసరమైన భూమిని రాష్ట్ర ప్రభుత్వం ఇంతవరకు బదలాయించలేదని చెప్పారు. ఇది రాష్ట్రానికి ఎంతో ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని.. ఇలాంటి వాటిని ఎంత త్వరగా పూర్తిచేసుకుంటే రాష్ట్ర ప్రజలకు అంత ఎక్కువ మేలు జరుగుతుందని స్పష్టం చేశారు. ఈ విషయంలో సీఎం కేసీఆర్‌కు మరో లేఖ రాయనున్నట్టు తెలిపారు. దేశంలో పర్యాటకాన్ని కొత్త పుంతలు తొక్కించేందుకు సెపె్టంబర్లో ఢిల్లీలో గ్లోబల్ టూరిజం ఇన్వెస్టర్స్ సదస్సు నిర్వహించనున్నట్టు వివరించారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష మార్పుపై ఎలాంటి చర్చా లేదు తెలంగాణలో రాష్ట్ర బీజేపీ నాయకత్వం మార్పు వంటిదేమీ లేదని, ఈ విషయంలో వస్తున్న వార్తలన్నీ పూర్తి అవాస్తవాలని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. అధ్యక్ష మార్పు అంశమేదీ అధిష్టానం దృష్టిలో లేదని, దీనిపై పారీ్టలో ఎలాంటి చర్చ జరగలేదని చెప్పారు. కార్యకర్తల్లో ఎలాంటి గందరగోళం లేదని, ఇదంతా మీడియా సృష్టించిన గందరగోళమేనన్నారు. తెలంగాణలో పార్టీ అధ్యక్ష మార్పు వార్తలను బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి తరుణ్ ఛుగ్ కూడా కొట్టిపారేశారు. అధిష్టానం వద్ద ఇలాంటి ఆలోచనేదీ లేదన్నారు. -
ఇండియన్ రైల్వేకు వరల్డ్ బ్యాంక్ రుణం!
న్యూఢిల్లీ: రైలు సరుకు రవాణా, లాజిస్టిక్స్ మౌలిక సదుపాయాలను ఆధునీకరించడానికి భారతదేశం చేస్తున్న ప్రయత్నాలకు ప్రపంచ బ్యాంకు మద్దతు తెలిపింది. ఇందుకుగాను 245 మిలియన్ డాలర్ల (డాలర్‌కు రూ.78 చొప్పున రూ.1,911 కోట్లు రుణాన్ని ఆమోదించినట్లు బహుళజాతి ఆర్థిక సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ (ఐబీఆర్డీ) విభాగం నుంచి ఈ రుణ మంజూరీలకు ప్రపంచ బ్యాంక్ బోర్డ్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల అమోదం లభించింది. ఏడు సంవత్సరాల గ్రేస్ పీరియడ్సహా 22 సంవత్సరాల్లో రుణాన్ని చెల్లించాల్సి ఉంటుంది.ప్రపంచ బ్యాంక్ ప్రకటన ప్రకారం, భారత్ చేపట్టిన రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ అభివృద్ధి దేశంలో మరింత ట్రాఫిక్‌ను రోడ్డు నుండి రైలుకు మార్చడానికి సహాయపడుతుంది. అలాగే సరుకు రవాణా, ప్రయాణీకులను సురక్షితంగా, వేగంగా గమ్య స్థానాలకు చేర్చడానికి సమర్థవంతంగా పనిచేస్తుంది. ప్రతి సంవత్సరం మిలియన్ల టన్నుల గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను (జీహెచ్‌సీ) తగ్గిస్తుంది. ఈ ప్రాజెక్ట్ రైల్వే రంగంలో మరిన్ని ప్రైవేట్ రంగ పెట్టుబడులను కూడా ప్రోత్సహిస్తుందని వరల్డ్ బ్యాంక్ (ఇండియా) ఆపరేషన్స్ మేనేజర్, యాక్టింగ్ కంట్రీ డైరెక్టర్ హిడేకి మోరీ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రకటనకు సంబంధించి మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ♦ ఇండియన్ రైల్వే మార్చి 2020తో ముగిసే ఆర్థిక సంవత్సరంలో 1.2 బిలియన్ టన్నుల సరుకు రవాణా చేసి, ప్రపంచంలో నాల్గవ–అతిపెద్ద రైలు నెట్‌వర్క్‌గా రికార్డులకు ఎక్కింది. అయినప్పటికీ, ఇప్పటికీ భారతదేశంలోని సరుకు రవాణాలో 71 శాతం రోడ్డు మార్గం ద్వారా, 17 శాతం మాత్రమే రైలు ద్వారా జరుగుతుండడం గమనార్హం. ♦ భారతీయ రైల్వేల సామర్థ్య పరిమితులు ఈ విభాగం పురోగతికి అడ్డంకిగా మారుతున్నాయి. సరకు రవాణా వేగం, విశ్వసనీయతలకు కూడా ప్రతికూల పరిస్థితి ఏర్పడుతోంది. ఫలితంగా, సంవత్సరాలుగా రోడ్డు రవాణా ట్రక్కులకు రైల్వే తన మార్కెట్ వాటాను కోల్పోతోంది. రవాణాలో రైల్వే మార్కెట్ షేర్ దశాబ్దం కిత్రం 52 శాతం అయితే, 2017–18లో 32 శాతానికి తగ్గింది. ♦రోడ్డు రవాణా కాలుష్య ఉద్గారాలకు ప్రధాన కారణంగా ఉంది. సరుకు రవాణా రంగం దాదాపు గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలను కలిగి ఉంది. 2018లో జరిగిన రోడ్డు ప్రమాదాలలో 12.3 శాతం ట్రక్కులకు సంబంధించినవే. రోడ్డు రవాణా సంబంధిత మరణాలలో 15.8 శాతం వాటా కూడా ట్రక్కులదే. ట్రక్కుల గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలలో కేవలం ఐదవ వంతును మాత్రమే రైల్వే రంగం విడుదల చేస్తుంది, ♦ భారతీయ రైల్వేలు 2030 నాటికి పూర్తి కాలుష్య రహిత వాతావరణంలో పనిచేయాలని యోచించడం హర్షణీయం. ప్రతి సంవత్సరం 7.5 మిలియన్ టన్నుల కార్బన్ డయాక్సైడ్, ఇతర గ్రీన్హౌస్ వాయువులను తొలగించగల సామర్థ్యాన్ని రైల్వే రంగం కలిగి ఉంది. ♦ భారత్ చేపట్టిన రైల్ లాజిస్టిక్స్ ప్రాజెక్ట్ కాలుష్యాన్ని తగ్గించడానికే కాకుండా, కోట్లాది మంది రైలు ప్రయాణీకులకు ఊరట కలిగించే అంశం. అభివృద్ధి చెందిన దేశాలతో పోల్చితే అధికంగా ఉన్న రవాణా వ్యయాలను గణనీయంగా తగ్గిస్తుంది. ఇక భారత్ సంస్థల పోటీ తత్వాన్ని సైతం పెంచే అంశం ఇది. -
ఆర్థిక లోటులో ఉంటే వాటా అడుగుతారా?
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన అనంతరం రూ.16 వేల కోట్ల ఆర్థికలోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రైల్వే ప్రాజెక్టుల నిమిత్తం వాటా ఇవ్వాలని ఎలా అడుగుతారని కేంద్రాన్ని వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ప్రశ్నించారు. బడ్జెట్లో ఏపీలో రైల్వే పనుల నిమిత్తం రూ.9 వేల కోట్లు కేటాయించారని సంతోషించాలో బాధపడాలో అర్థంకావడం లేదన్నారు. రాష్ట్ర విభజనకన్నా ముందుగానే కోటిపల్లి–నరసాపురం, గూడూరు–దుగరాజపట్నం, నడికుడి–శ్రీకాళహస్తి ఖమ్మం–ప్రొద్దుటూరు, కొండపల్లి–కొత్తగూడెం, కడప–బెంగళూరు, భద్రాచలం–కొవ్వూరు, తుముకూరు–రాయగఢ, మరికుప్పం–కుప్పం రైల్వే లైన్లు అనుమతించారని వాటిలో చాలావరకు పురోగతిలో లేవని వివరించారు. లోక్‌సభలో మంగళవారం రైల్వే పద్దులపై జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అశాస్త్రీయంగా విభజించారన్నారు. ఆంధ్రప్రదేశ్ రూ.16వేల కోట్ల రెవెన్యూ లోటుతో ఏర్పాటైందన్న విషయం గుర్తుంచుకోవాలని కోరారు. మూడేళ్ల కిందట ఏర్పాటు చేసిన సౌత్‌కోస్ట్ రైల్వేజోన్‌కు నిధులు కేటాయించి కార్యకలాపాలు ప్రారంభించాలని కోరారు. గుంటూరు రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు కేటాయించిన రూ.80 కోట్లు ఇతర డివిజన్లకు మళ్లించారన్నారు. ఇలా ఎందుకు మళ్లించారో తేల్చాల్సి ఉందన్నారు. మిర్చి, పొగాకు, పత్తి తదితరాలు ఎగుమతి అయ్యే గుంటూరు రైల్వేస్టేషన్లో సదుపాయాలు మెరుగుపరచాల్సిన అవసరం ఉందన్నారు. గుంటూరు స్టేషన్‌కు తిరిగి నిధులు కేటాయించి అభివృద్ధి చేయాలని కోరారు. కరోనా పేరుతో నడికుడిలో పలు రైళ్లను ఆపడం లేదని అడిగితే ఆదాయం రావడం లేదని అధికారులు చెబుతున్నారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదించి రాష్ట్రంలో రైల్వే సదుపాయాలు మెరుగుపరచాలని కేంద్రానికి ఆయన విజ్ఞప్తి చేశారు. చిత్తూరులో కంటైనర్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ వైఎస్సార్సీపీ ఎంపీ చింతా అనూరాధ మాట్లాడుతూ చిత్తూరు జిల్లాలో ఎన్టీపీసీ, బీహెచ్ఈఎల్కు కేటాయించిన భూముల్లో కంటైనర్ మ్యాన్యుఫాక్చరింగ్ యూనిట్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. దక్షిణాది రాష్ట్రాల్లో పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ఐఆర్సీటీసీ ప్యాకేజీలు లేవన్నారు. ఏపీలో తిరుపతి, శ్రీశైలం, అహోబిలం, కనకదుర్గ ఆలయం, శ్రీకాళహస్తి, లేపాక్షి, కాణిపాకం ఆలయాలకు పర్యాటకాన్ని ప్రోత్సహించేలా పర్యాటక ప్యాకేజీ రూపాందించాలని కోరారు. రాష్ట్రంలో ఆర్వోబీ, ఆర్యూబీల నిర్మాణానికి తగిన నిధులు కేటాయించాలన్నారు. ఈస్ట్‌కోస్ట్ రైల్వేజోన్‌లో ఖాళీలు భర్తీచేయాలని, నూతన సౌత్‌కోస్ట్ రైల్వేజోన్ రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు చేయాలని, ఎస్సీ, ఎస్టీల నిమిత్తం ప్రత్యేక రిక్రూట్మెంట్ డ్రైవ్ నిర్వహించాలని కోరారు. సౌత్‌కోస్ట్ జోన్ కార్యకలాపాలు త్వరగా ప్రారంభించాలని, వాల్తేరు డివిజన్‌ను దీన్లోనే కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. కోటిపల్లి–నరసాపురం రైల్వే పనులు త్వరగా పూర్తి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి నిమిత్తం రాష్ట్రం సూచనలు పరిగణించి అమలు చేయాలని ఆమె కోరారు. ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలి వైఎస్సార్సీపీ ఎంపీ బి.వి.సత్యవతి మాట్లాడుతూ కరోనా సమయంలో రద్దుచేసిన ప్యాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. పలాస–విశాఖ, విశాఖ–విజయవాడ, విశాఖ–రాజమండ్రి, విశాఖ–కాకినాడ ప్యాసింజర్ల రద్దువల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు బుల్లెట్ ట్రైన్ నడపాలని కోరారు. తద్వారా ఏపీ, తెలంగాణల్లో ఆర్థిక పురోగతి ఉంటుందన్నారు. నెల్లిమర్ల, గరివిడి, అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం రోడ్ వంటి స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపరచాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో గుర్తించిన 23 బౌద్ధ స్మారకాలు, ప్రాంతాలను అభివృద్ధి చేయడానికి పర్యాటక రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు. ఏపీలో ఓడీవోఎఫ్పీలో పలు ఉత్పత్తుల గుర్తింపు ఒక జిల్లా దృష్టి సారించిన ఒక ఉత్పత్తి (ఓడీవోఎఫ్‌పీ)లో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో 10 ఉత్పత్తులు గుర్తించినట్లు కేంద్ర ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ సహాయమంత్రి ప్రహ్లాద్ పటేల్ చెప్పారు. పీఎం ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకంలో భాగంగా ఆర్థిక, సాంకేతిక, వ్యాపార సహకారం అందిస్తున్నట్లు వైఎస్సార్సీపీ ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు ప్రశ్నకు జవాబుగా తెలిపారు. -
వ్యాగన్ వర్క్‌షాప్ కథ కొలిక్కి!
సాక్షి, హైదరాబాద్: కాజీపేటలో రైల్వే ప్రాజెక్టు కోసం దాదాపు 13 ఏళ్లుగా జరుగుతున్న నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడింది. పీరియాడికల్ ఓవర్‌హాలింగ్ వర్క్‌షాపు త్వరలో పట్టాలెక్కబోతోంది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి రాష్ట్రప్రభుత్వం–రైల్వే మధ్య నెలకొన్న వివాదం సద్దుమణగడం, బడ్జెట్లో నిధులు కేటాయించడంతో.. రైల్వేశాఖ బుధవారం టెండర్లు పిలిచింది. రూ.220 కోట్ల అంచనా వ్యయంతో దీన్ని చేపట్టనున్నారు. మార్చి మూడో వారంలో టెండర్లు తెరిచి.. నిర్మాణ సంస్థను గుర్తించి, వర్క్ ఆర్డర్ ఇవ్వనున్నారు. అప్పటినుంచి ఏడాదిన్నర వ్యవధిలో వర్క్ షాపును పనులు పూర్తిచేయాల్సి ఉంటుంది. రెండు సార్లు మారిపోయి నాలుగు దశాబ్దాల కింద ఇందిరాగాంధీ ప్రధానిగా ఉన్న సమయంలో పీవీ నరసింహారావు విజ్ఞప్తి మేరకు కాజీపేటకు రైల్వేకోచ్ ఫ్యాక్టరీని మంజూరు చేశారు. కానీ తర్వాతి పరిణామాలతో ప్రాజెక్టు పంజాబ్‌కు తరలిపోయింది. దానికి బదులు 2009లో రైలు చక్రాల కర్మాగారాన్ని మంజూరు చేశారు. దీనికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూమిపై కోర్టు కేసులు దాఖలై జాప్యం జరగడంతో.. ఈ ప్రాజెక్టు కూడా వేరే రాష్ట్రానికి తరలిపోయింది. చివరికి 2016లో వ్యాగన్ ఓవర్ హాలింగ్ పీరియాడికల్ వర్క్‌షాప్‌ను కేటాయించారు. ఇటీవలే భూముల కేటాయింపు అంశం ఓ కొలిక్కి రావడంతో పనులు చేపట్టేందుకు రైల్వే సిద్ధమైంది. ఈ వర్క్‌షాపులో.. సరుకు రవాణా వ్యాగన్ల జీవిత కాలాన్ని పెంచేందుకు నిర్ధారిత గడువులో ఓవర్‌హాలింగ్ చేస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 2 వేల మందికి ఉపాధి లభించనుంది. -
రైల్వేలైన్ నిర్మాణం నుంచి భారత్‌ను తప్పించిన ఇరాన్
టెహ్రాన్: చాబహర్ పోర్టు నుంచి జహెదాన్ వరకు రైల్వే లైన్ ప్రాజెక్టును సొంతంగానే చేపట్టాలని ఇరాన్ నిర్ణయించింది. ఈ ప్రాజెక్టు నుంచి భారతదేశాన్ని తప్పించింది. భారతదేశం నుంచి నిధుల రాకలో ఆలస్యం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇండియా ఆర్థిక సాయంతో ఈ ప్రాజెక్టు పూర్తిచేయాలని నాలుగేళ్ల క్రితం ఇండియా–ఇరాన్–అఫ్ఘానిస్తాన్‌మధ్య ఒప్పందం కుదిరింది. ఇప్పుడు ఆ ఒప్పందాన్ని ఇరాన్ పక్కన పెట్టింది. ఈ రైల్వే లైన్‌ను 2022 మార్చినెల నాటికి పూర్తి చేయాల్సి ఉంది. దీనికోసం ‘ఇరానియన్ నేషనల్ డెవలప్మెంట్ ఫండ్’ నుంచి 400 మిలియన్ డాలర్లు తీసుకోనున్నారు. అఫ్ఘనిస్తాన్, దక్షిణాసియా దేశాలతో వాణిజ్య, వ్యాపార కార్యకలాపాలకు ప్రత్యామ్నాయ మార్గం ఏర్పాటులో భాగంగా ఇరాన్లో చాబహర్ పోర్టు అభివృద్ధికి ఇండియా సహకరిస్తోంది. అలాగే చాబహర్ పోర్టు–జహెదాన్ రైల్వేలైన్ నిర్మాణానికి 1.6 బిలియన్ డాలర్లు అందజేస్తామని, నిర్మాణ పనుల్లో సహరిస్తామని ఇండియా హామీ ఇచ్చింది. ఈ మేరకు ఒప్పందం కుదిరింది. అయితే, ఇరాన్‌పై అమెరికా ఆంక్షలు విధించడంతో పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. (చదవండి: ఇరాన్ అలక) -
పట్టాలెక్కవా?
సాక్షి, సిటీబ్యూరో: ఏళ్లకేళ్లుగా అదే నిర్లక్ష్యం. నగరంలో చేపట్టిన రైల్వేప్రాజెక్టులన్నీ ఒక అడుగు ముందుకు, నాలుగడుగులు వెనక్కు అన్నట్లుగా మారాయి. 5 సంవత్సరాల క్రితం చేపట్టిన ఎంఎంటీఎస్ రెండో దశలో ఇప్పటి వరకు ఒక్క లైన్ కూడా పూర్తి కాలేదు. గత ఏడాది డిసెంబర్ నాటికే రెండో దశ రైలు పట్టాలెక్కుతుందన్న హామీ ఈ ఏడాది డిసెంబర్ నాటికి కూడా అమలయ్యే దాఖలాలు కనిపించడం లేదు. యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ పొడిగింపు ప్రతిపాదనకు రెండేళ్లు దాటినా ఒక్క రాయి కూడా వేయలేదు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునీకరణ పగటి కలగామారింది. నగరంలోని మూడు ప్రధాన స్టేషన్లపైన ఒత్తిడిని తగ్గించేందుకు చర్లపల్లి, వట్టినాగులపల్లిలో నిర్మించ తలపెట్టిన రైల్వే టర్మినళ్లపై ఎలాంటి కదలిక లేదు. ప్రతి సంవత్సరం నిర్వహించే ఎంపీల సమావేశాలు కేవలం ప్రహసనంగా మారాయి. వచ్చే జనవరిలో ప్రవేశపెట్టనున్న కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో దక్షిణమధ్య రైల్వేలో ప్రజల సమస్యలు, డిమాండ్లు, ప్రతిపాదనలపైన రేపు రైల్‌నిలయంలో నిర్వహించనున్న ఎంపీల సమావేశం మరోసారి మొక్కుబడి జాబితాలో చేరిపోతుందా...లేక ఏ ఒక్క ప్రాజెక్టునైనా సాధిస్తుందా...ప్రజల అవసరాలను, డిమాండ్లను ప్రతిపాదిస్తుందా... వేచి చూడాల్సిందే. ఎంఎంటీఎస్ రెండో దశ నత్తనడక... గత సంవత్సరం డిసెంబర్ నాటికి 10 కిలోమీటర్ల బొల్లారం–సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ లైన్‌ను ప్రయాణికులకు అందుబాటులోకి తేనున్నట్లు ప్రకటించారు. ఏడాది గడిచింది. ఈ మార్గంలో భద్రతా కమిషన్ తనిఖీలు కూడా పూర్తయ్యాయి. కానీ నిధుల కొరత కారణంగా కొత్త రైళ్లు రాలేదు. పట్టాలెక్కలేదు.ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఘట్కేసర్ వరకు ఎంఎంటీఎస్ రైళ్లు నడుపనున్నట్లు చెప్పారు. పటాన్చెరు–తెల్లాపూర్ మధ్య ఎంఎంటీఎస్ పరుగులు తీస్తుందన్నారు. ఇప్పటి వరకు అతీ గతీ లేదు. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు, అక్కడి నుంచి శంషాబాద్ విమానాశ్రయం వరకు రైల్వేలైన్ల డబ్లింగ్, విద్యుదీకరణ, కొత్తలైన్ల నిర్మాణం రద్దయిపోయింది. మౌలాలీ–సనత్‌నగర్ మధ్య 5 కిలోమీటర్ల మేర రక్షణశాఖ భూముల్లో రెండో దశ లైన్ల డబ్లింగ్, విద్యుదీకరణకు రక్షణశాఖ నుంచి అనుమతి వచ్చినట్లు చెప్పారు. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే ఎంఎంటీఎస్ రెండో దశ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా ఉంది. ఇవీ పనులు...... రెండో దశలో ఘట్కేసర్ నుంచి మౌలాలీ వరకు 14 కిలోమీటర్లు కొత్త లైన్లు వేసి విద్యుదీకరించాలి. సనత్‌నగర్ నుంచి మౌలాలీ వరకు 23 కిలోమీటర్ల లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరించవలసి ఉంది. ఫలక్‌నుమా నుంచి ఉందానగర్ వరకు ఉన్న సింగిల్ లైన్ డబుల్ చేసి విద్యుదీకరించవలసి ఉంది. బొల్లారం –మేడ్చల్ మధ్య మరో 14 కిలోమీటర్ల లైన్లు డబ్లింగ్ చేసి విద్యుదీకరించాలి. తెల్లాపూర్ నుంచి పటాన్చెరు వరకు 10 కిలోమీటర్ల పాత లైన్లను ఈ ప్రాజెక్టులో పునరుద్ధరిస్తారు. రెండో దశలో ఫిరోజ్‌గూడ, సుచిత్ర జంక్షన్, బిహెచ్ఈఎల్, భూదేవీనగర్, మౌలాలీ హౌసింగ్‌బోర్డు కాలనీలలో కొత్తగా ఎంఎంటీఎస్ రైల్వేస్టేçషన్లు నిర్మించవలసి ఉంది. కానీ ఇప్పటి వరకు స్టేషన్ల నిర్మాణం కూడా పూర్తి కాలేదు. కదలిక లేని చర్లపల్లి టర్మినల్ ...... వట్టినాగులపల్లి టర్మినల్ ఇప్పట్లో నిర్మించలేకపోయినా, హైదరాబాద్ అవసరాల దృష్ట్యా ఈ ఏడాది చర్లపల్లి టర్మినల్ విస్తరణ చేపట్టి వచ్చే రెండు, మూడేళ్లలో పూర్తి చేయనున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ వినోద్‌కుమార్ యాదవ్ ఇటీవల ప్రకటించారు. ఆర్థిక సంవత్సరం ముగింపునకు వచ్చేసింది. కానీ టెండర్లు ఖరారు కాలేదు. ఇప్పట్లో పనులు ప్రారంభమవుతాయన్న ఆశలు కనుచూపు మేరలో కనిపించడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల పైన పెరిగిన ఒత్తిడిని దృష్టిలో ఉంచుకొని 4వ రైల్వే టర్మినల్‌గా చర్లపల్లిని అభివృద్ధి చేయాలని రెండేళ్ల క్రితం ప్రతిపాదించారు. సుమారు వంద ఎకరాల విశాలమైన స్థలంలో నిర్మించతలపెట్టిన ఈ టర్మినల్ కోసం రూ.250 కోట్ల వరకు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్లు అంచనా వేశారు. గతేడాది రైల్వేశాఖ రూ.80 కోట్ల నిధులు కూడా విడుదల చేసింది. మొదట 6 ప్లాట్‌ఫామ్‌లు నిర్మించి, కనీçసం 100 రైళ్ల రాకపోకలకు అనువుగా దీన్ని అభివృద్ది చేయాలని ప్రతిపాదించారు. యాదాద్రికి ఎంఎంటీఎస్ అంతే సంగతులు.. లక్షలాది మంది భక్తులు సందర్శించే పవిత్ర పుణ్యక్షేత్రం యాదాద్రికి ఎంఎంటీఎస్ రైలు మార్గంపైన కూడా ఇప్పటి వరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. ఈ ఏడాది టెండర్లు పూర్తి చేసి పనులు చేపట్టనున్నట్లు చేసిన ప్రకటనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఈ ప్రాజెక్టును రాష్ట్రప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగానే భావించింది. కానీ నిధులు మాత్రం అందజేయలేదు. ఘట్కేసర్ నుంచి రాయగిరి వరకు 34 కిలోమీటర్ల మేర రైల్వేలైన్లను పొడిగించి విద్యుదీకరించవలసి ఉంది. ఇందుకోసం రూ.330 కోట్లతో అంచనాలు రూపొందించారు. రాష్ట్ర ప్రభుత్వం తనవంతు వాటాగా 51 శాతం నిధులను, మిగతా 49 శాతం నిధులను రైల్వేశాఖ అందజేçయాల్సి ఉంది. రెండేళ్లలో ప్రాజెక్టును పూర్తిచేసి యాదాద్రికి ఎంఎంటీఎస్ రైళ్లు నడపాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. దీనివల్ల సికింద్రాబాద్ నుంచి నేరుగా రాయగిరి వరకు వెళ్లవచ్చు. అక్కడి నుంచి 4 కిలోమీటర్ల వరకు రోడ్డు మార్గంలో యాదాద్రికి చేరుకోవలసి ఉంటుంది. అటకెక్కిన సికింద్రాబాద్ ఆధునీకరణ... అంతర్జాతీయ ప్రమాణాల మేరకు, విమానాశ్రయంలోని సేవలు, సదుపాయాలను తలదన్నేవిధంగా చారిత్రాత్మక సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను అభివృద్ధి చేయనున్నట్లు రెండేళ్ల క్రితం బడ్జెట్లో ప్రతిపాదించారు. ప్రయాణికుల సదుపాయాలు, వ్యాపార,వాణిజ్య కార్యకలాపాలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని భావించారు. మల్టిప్లెక్స్ థియేటర్లు, బడ్జెట్ హోటళ్లు, అత్యాధునిక వినోద సదుపాయాలతో సికింద్రాబాద్‌ను ఒక అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ సెంటర్‌గా అభివృద్ధి చేయాలనే ప్రతిపాదన అటకెక్కింది. స్టేషన్లో నిర్మించతలపెట్టిన నాలుగో వంతెన నిర్మాణానికి కూడా ఇప్పటికీ మోక్షం కలుగలేదు. -
రైల్వే ప్రాజెక్టుల్లో ఇక రాష్ట్రాలే సుప్రీం!
కొత్త పనుల ఖర్చు సగం భరించాల్సి రావడమే కారణం రాష్ట్రం ముందుకొచ్చే ప్రాజెక్టులకే కేంద్రం పచ్చజెండా బడ్జెట్ ముందు ప్రతిపాదనలిచ్చే విధానానికి స్వస్తి సాక్షి, హైదరాబాద్: ‘‘ఫలానా రైల్వే లైన్ మాకు చాలా అవసరం. దయచేసి ఈ బడ్జెట్లో దాన్ని పొందుపరచండి. ఈ ఏడాదే పనులు మొదలయ్యేలా నిధులివ్వండి..’’ అంటూ ఏటా రైల్వే శాఖను రాష్ట్ర ప్రభుత్వం అడుగుతూ వచ్చేది. ఇకపై ఈ తీరు మారనుంది. ఏ ప్రాజెక్టు చేపట్టాలి, దేన్ని వదిలేయా లన్నది ఇక పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం ఇష్టమే. ఏ రైల్వే ప్రాజెక్టు చేపట్టినా అందులో సగం ఖర్చును రాష్ట్ర ప్రభుత్వం కూడా భరించాల్సి ఉండటమే ఇందుకు కారణం. ప్రాజెక్టు వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తే.. మిగతా మొత్తాన్ని ప్రకటించేందుకు రైల్వే కూడా సిద్ధపడనుంది. అంటే... ప్రాజెక్టుల ఎంపిక ఇక దాదాపు రాష్ట్ర ప్రభుత్వ ఇష్టం ప్రకారమే జరగ నుంది. రైల్వే ప్రాజెక్టుల భారాన్ని కేవలం కేంద్ర ప్రభుత్వమే మోయటం సాధ్యం కాదని గతంలోనే ప్రధాని మోదీ తేల్చారు. రాష్ట్ర ప్రభుత్వాలతో ప్రత్యేకంగా ఒప్పందాలు చేసుకోనున్నట్టు ప్రకటించారు. ఇందులో భాగంగానే తెలంగాణ ప్రభుత్వం కూడా రైల్వేతో ఈ మేరకు ఒప్పందం కుదుర్చుకుంది. దీని ప్రకారం ఇక రైల్వే ప్రాజెక్టుల వ్యయంలో 50 శాతం రాష్ట్ర సర్కారు భరించాల్సి ఉంటుంది. సగానికి సగం భారం తగ్గటంతో ఇక పనుల్లో కూడా రైల్వే వేగాన్ని పెంచే అవకాశం ఉంది. ప్రస్తుతం ఒక్క తెలంగాణకు సంబంధించే దాదాపు రూ.25 వేల కోట్ల విలువైన పెండింగు ప్రాజెక్టులు ఎదురుచూస్తున్నాయి. బడ్జెట్‌తో సంబంధం లేకుండా నిధులు గతంలో కేవలం బడ్జెట్లో ప్రకటించిన పనులనే నిర్వహించేవారు. ఇప్పుడు దాన్ని సమూలంగా మార్చేశారు. బడ్జెట్లో నామమాత్రంగానే రైల్వే ప్రాజెక్టులను ప్రకటించి, ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వాల సంప్రదింపుల ఆధారంగా సంవత్సరం మధ్యలో ఎప్పుడైనా కొత్త ప్రాజెక్టులను చేపట్టే అవకాశం ఉంది. ఫలితంగా బడ్జెట్ ముందు ప్రతిపాదనలను రైల్వేకు సమర్పించే విధానం కూడా లేకుండా పోయింది. ఇక నుంచి ఏ ప్రతిపాదన ఇచ్చినా రాష్ట్ర ప్రభుత్వమే ఆచితూచి వ్యవరించాల్సి ఉంది. ప్రాజెక్టు వ్యయంలో సగం భరించాల్సి ఉన్నందున తోచినన్ని ప్రతిపాదనలు ఇచ్చే అవకాశం ఉండదు. ఖర్చుకు సిద్ధమయ్యే ప్రతిపాదనలు పంపాల్సి ఉంటుంది. డబ్లింగ్ పనులకు ప్రాధాన్యం.. ప్రస్తుతం సరుకు రవాణాను పెంచేందుకు తీవ్ర కసరత్తు చేస్తున్న రైల్వేశాఖ డబ్లింగ్ పనులపై దృష్టి సారించింది. ఈ మేరకు ప్రణాళికలు రూపొందిస్తూనే సాధారణ మార్గాల్లో రెండు, మూడో లైన్ నిర్మాణానికి ఏర్పాట్లు చేస్తోంది. గతంలోనే ప్రారంభమై ముందుకు సాగని పనులను పరుగుపెట్టించేందుకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. ఇందులో భాగంగా సికింద్రాబాద్–విజయవాడ–బల్లార్షాకు నిధులు కేటాయించే అవకాశం ఉంది. అలాగే సికింద్రాబాద్–నాగ్‌పూర్ ప్రత్యేక కారిడార్‌పై దష్టి సారించే అవకాశం ఉంది. -
రైల్వే ప్రాజెక్టుల కోసం రాష్ట్రాలతో జట్టు
జాయింట్ వెంచర్ కంపెనీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం... ♦ వనరుల సమీకరణ, ప్రాజెక్టులను ♦ వేగంగా పూర్తిచేయడమే లక్ష్యం న్యూఢిల్లీ: రైల్వేలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో ఇకపై రాష్ట్రాలకు మరింతగా భాగస్వామ్యం కల్పించేందుకు కేంద్రం పచ్చజెండా ఊపింది. రేల్వే శాఖతో రాష్ట్ర ప్రభుత్వాలు జాయింట్ వెంచర్(జేవీ) కంపెనీ ఏర్పాటు చేసేందుకు మార్గం సుగమం చేసింది. బుధవారమిక్కడ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో జరిగిన ఆర్థిక వ్యవహారాల కేబినెట్ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆమోదముద్ర పడింది. రైల్వే ప్రాజెక్టులకు వనరులను సమకూర్చడం, వేగంగా అమలు చేయడం వంటివి ఈ చర్యల ప్రధానోద్దేశం. వివిధ రాష్ట్రాల్లో రైల్వే లైన్ల ఏర్పాటుకు డిమాండ్లు అంతకంతకూ పెరుగున్న నేపథ్యంలో వీటి నిర్మాణానికి భారీ మొత్తంలో నిధులు అవసరమవుతున్నాయి. ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలతో ఏర్పాటు చేసే జేవీ కంపెనీలు ఇలాంటి ప్రాజెక్టులను గుర్తించడం, భూసేకరణ, తగిన నిధుల సమీకరణ వంటివాటితోపాటు పర్యవేక్షణను కూడా చేపడతాయి. ఈ విధమైన ప్రాజెక్టులకు ప్రభుత్వం నుంచి కూడా కొంతమేరకు నిధులు లభిస్తాయని కేబినెట్ భేటీ అనంతరం కేంద్రం విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ, సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఈక్విటీ వాటా కేటాయింపు ప్రాతిపదికన జేవీ కంపెనీలు ఏర్పాటవుతాయి. ప్రతి జేవీకి ప్రాజెక్టుల సామ ర్థ్యాన్ని అనుసరించి కనీస పెయిడ్-అప్ మూలధనం రూ. 100 కోట్లుగా ఉంటుందని ప్రకటనలో తెలిపారు. ఇందులో ప్రతి రాష్ట్రంతో ఏర్పాటయ్యే జేవీలోనూ రైల్వేల కనీస పెయిడ్-అప్ మూలధనం రూ.50 కోట్లకు పరిమితమవుతుంది. అయితే, భవిష్యత్తులో ఆయా ప్రాజెక్టుల కోసం మరిన్ని నిధులు/ఈక్విటీ పెంచాలంటే... సంబంధిత యంత్రాంగం నుంచి ప్రాజెక్టులు, నిధుల సమీకరణకు తగిన ఆమోదం లభించాకే వీలవుతుందని ప్రభుత్వ ప్రకటన తెలిపింది. మరోపక్క ఈ జేవీ కంపెనీలు నిర్దేశిత ప్రాజెక్టుల కోసం విడివిడిగా ప్రత్యేక సంస్థ(ఎస్పీవీ)లను కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. వీటిలో బ్యాంకులు, పోర్టులు, ప్రభుత్వ రంగ సంస్థలు, మైనింగ్ కంపెనీలకు సైతం ఈక్విటీ వాటాలను ఇచ్చేందుకు అనుమతిస్తారు. రైల్వే ప్రాజెక్టులకు సంబంధించి భూసేకరణ, చట్టపరమైన అనుమతులు వేగంగా రావడంతోపాటు రాష్ట్ర ప్రభుత్వాలను ఆర్థికంగా, నిర్ణయాలు తీసుకునే ప్రక్రియలో మరింత భాగస్వామ్యం కల్పించేందుకు ఈ జేవీ విధానం దోహదం చేస్తుందని కేంద్రం పేర్కొంది. ఇటీవలే రైల్వే శాఖ కేరళ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాలతో జేవీ కంపెనీల ఏర్పాటుకు అవగాహన ఒప్పందం(ఎంఓయూ)పై సంతకాలు కూడా చేసింది. ఒడిశా, మహారాష్ట్ర ప్రభుత్వాలు కూడా రైల్వే ప్రాజెక్టులకు ఇదే విధమైన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సిమెంట్, స్టీల్ రంగాలకు వేలం ద్వారా బొగ్గు.. ప్రభుత్వ నియంత్రణలోలేని సిమెంటు, స్టీల్ తదితర రంగాలకు బొగ్గు సరఫరాలకు సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ రంగాలకు చెందిన కంపెనీలకు వేలం పద్ధతిలోనే బొగ్గును సరఫరా చేయనున్నట్లు ప్రకటించింది. కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ విభాగంలో స్పాంజ్ ఐరన్, అల్యూమినియం, ఎరువుల కంపెనీ(యూరియా)లు మినహా ఇతర పరిశ్రమలు ఉన్నాయి. బొగ్గు సరఫరా ప్రక్రియలో పారదర్శకతను పెంచడం, వినియోగదారులందరికీ సమాన అవకాశాలను కల్పించం కోసమే వేలం విధానాన్ని ప్రవేశపెడుతున్నట్లు బొగ్గు, విద్యుత్ శాఖ మంత్రి పియూష్ గోయల్ పేర్కొన్నారు. ఏప్రిల్ చివరికల్లా వేలానికి సిద్ధం చేస్తామన్నారు. కోల్ ఇండియా, సింగరేణి కాలరీస్ తమ ఉత్పత్తిలో పావు శాతాన్ని విద్యుత్‌యేతర కంపెనీల కోసం వేలంలో అందుబాటులో ఉంచుతాయని ప్రభుత్వ ప్రకటన వెల్లడించింది. అయితే, కోల్ ఇండియాతో దీర్ఘకాలిక ఒప్పందాలున్న కంపెనీలకు మాత్రం వాటి గడువు పూర్తయ్యేవరకూ సరఫరాలు కొనసాగుతాయని గోయల్ స్పష్టం చేశారు. రాజస్థాన్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంట్స్ లిమిటెడ్(ఆర్ఈఐఎల్)ను దాని మాతృ సంస్థ ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ నుంచి విడదీసి కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ(సీపీఎస్ఈ)గా మార్చేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. -
ప్రాజెక్టులు పట్టాలెక్కేనా?
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం:జిల్లాలో రైల్వే సమస్యల పరిష్కారానికి మరో అవకాశం లభించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టనున్న రైల్వే బడ్జెట్లో పొందుపరిచేందుకు అవసరమైన ప్రతిపాదనలు, ఇంతకు ముందు పెండింగులో ఉన్న సమస్యలు, ప్రాజెక్టుల వివరాలు ఇవ్వాలని రైల్వే బోర్టు ఎంపీలందరినీ కోరింది. ఈ మేరకు శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో రైల్వే సమస్యలు, పెండింగు ప్రాజెక్టుల వివరాలు సమర్పించేందుకు స్థానిక ఎంపీ కింజరాపు రామ్మోహన్నాయుడు సిద్ధమవుతున్నారు. వాస్తవానికి ప్రతి ఏటా రైల్వే బడ్జెట్లో జిల్లాకు తీవ్ర అన్యాయమే జరుగుతోంది. జిల్లా పరిస్థితి కూడా దారుణంగానే ఉంది. బ్రిటీష్ కాలం నుంచి జిల్లాలో పలు స్టేషన్లున్నా మౌలిక సదుపాయాల పరిస్థితి నానాటికీ తీసికట్టు అన్నట్లుంది. కొత్త రైళ్లు, హాల్టులతోపాటు పొందూరు-రాజాం రైల్వే లైను, గుణుపురం వరకు బ్రాడ్‌గేజ్ రైళ్లు, రైల్వే ఓవర్బ్రిడ్జిల నిర్మాణాలకు కొన్నేళ్ల క్రితమే ప్రతిపాదనలు చేసినా అవేవీ ఇప్పటికీ పట్టాలెక్కడం లేదు. జిల్లా ప్రజాప్రతినిధులు లేఖలు రాసి చేతులు దులుపుకోవడం తప్ప రైల్వేబోర్డు, రైల్వే మంత్రిత్వ శాఖపై రాజకీయంగా ఒత్తిడి తెచ్చేందుకు ఏమాత్రం ప్రయత్నించడం లేదన్న విమర్శలున్నాయి. ఈ నేపథ్యంలో రైల్వేలకు సంబంధించి ఉన్న సమస్యలను ప్రస్తావించాలంటూ రైల్వే బోర్డు తాజాగా ఎంపీలను కోరడంతో తన పరిధిలోని ఎమ్మెల్యేలు, రైల్వేస్టేషన్ల అధికారులు, నిపుణులు, స్వచ్చంద సంస్థల సూచనలు స్వీకరించాలని శ్రీకాకుళం ఎంపీ రామ్మోహన్నాయుడు నిర్ణయించుకున్నారు. అన్నీ సమస్యలే.. శ్రీకాకుళం పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలో పొందూరు, శ్రీకాకుళం రోడ్డు (ఆమదాలవలస), దూసి, జి.సిగడాం, తిలారు, కోటబొమ్మాళి, డి.జి.పురం, నౌపడ, పూండి, రౌతుపురం, పలాస, మందస, హరిపురం, కంచిలి(సోంపేట ఆర్ఎస్), హరిశ్చంద్రపురం, ఉర్లాం, జాడుపూడి ఆర్ఎస్, ఇచ్ఛాపురం రైల్వేస్టేషన్లు ఉన్నాయి. అయితే ఏ స్టేషన్లోనూ సరైన మరుగుదొడ్లు, మంచినీరు, ఫుట్ఓవర్ బ్రిడ్జిలు, ఇతర వసతులు లేవనే విషయం అందరికీ తెలిసిందే. అదే విధంగా శ్రీకాకుళం మీదుగా ప్రయాణించే చాలా రైళ్లు రెండుమూడు స్టేషన్లు తప్ప ఎక్కడా ఆగడం లేదు. జిల్లా మీదుగా పలు సూపర్‌ఫాస్ట్ రైళ్లు నడుస్తున్న శ్రీకాకుళం రోడ్, పలాస వంటి పెద్ద స్టేషన్లలోనూ ఆగడం లేదు. కొత్త రైల్వే లైన్ల ప్రతిపాదనలు రికార్డులకే పరిమితమవుతున్నాయి. తిలారు స్టేషన్ వద్ద ఫ్లై ఓవర్ బ్రిడ్జి నిర్మించాలన్న ప్రతిపాదన ఉన్నా ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. పలాసలో ఫ్లై ఓవర్ పనులు మందకొడిగా సాగుతున్నాయి. రెండు నెలల క్రితం భువనేశ్వర్‌లో జరిగిన రైల్వే జనరల్ మేనేజర్ల సమావేశంలో ఈ సమస్యలను స్థానిక ఎంపీ వారికి నివేదించారు. కాగా ఏటా ఫిబ్రవరిలో పార్లమెంటులో ప్రవేశపెట్టే రైల్వేబడ్జెట్ రూపకల్పనకు మూడు నాలుగు నెలల ముందునుంచే కసరత్తు మొదలవుతుంది. నవంబర్, డిసెంబర్ నెలల్లో రైల్వే బోర్డు అధికారులు ఎంపీలందరి నుంచి ప్రతిపాదనలు కోరడం ఆనవాయితీగా వస్తోంది. ఎంపీలిచ్చే నివేదికల్లోని సాధ్యాసాధ్యాలను, అవసరాలను పరిశీలించి బడ్జెట్లో పొందుపరుస్తారు. ఈసారి కూడా రైల్వేబోర్డు నుంచి నివేదికలు కోరిన విషయాన్ని ఎంపీ రామ్మోహన్నాయుడు వద్ద ‘సాక్షి’ ప్రస్తావించగా.. గతంలో జీఎం సమావేశంలో సమస్యలపై నివేదించానని, వచ్చే ఏడాది బడ్జెట్ కోసం అందరి సూచనలతో మరో నివేదిక తయారు చేసి బోర్డుకు త్వరలోనే అందజే స్తానని చెప్పారు. -
‘చుక్..చుక్’ కలలకు గ్రీన్ సిగ్నలేనా!
సాక్షి, కాకినాడ : నాటి ఎన్డీఏ హయాంలో పునాదిరాయి పడిన రైల్వేప్రాజెక్టులకు నేటి ఎన్డీఏ ప్రభుత్వంలోనైనా మోక్షం లభించకపోతుందా, రైల్వే మంత్రి సదానందగౌడ్ మంగళవారం ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్ అయినా తమ ఆకాంక్షలను సాకారం చేయకపోతుందా అని జిల్లావాసులు ఆశపడుతున్నారు. పెండింగ్ ప్రాజెక్టుల్ని పట్టాలెక్కించడంతో పాటు రాష్ర్ట విభజన నేపథ్యంలో మరికొన్ని ప్రాజెక్టులు, రైళ్లు మంజూరు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. విశాఖ- చెన్నైల మధ్య ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు కానున్న నేపథ్యంలో కాకినాడ-బాపట్ల మధ్య కొత్త రైల్వేలైన్ ఏర్పాటు చేయాలన్న డిమాండ్ కూడా తెరపైకి వచ్చింది. కోటిపల్లి-నర్సాపురం రైల్వేలైన్‌ను పట్టాలెక్కించడంతో పాటు నర్సాపురం నుంచి మచిలీపట్నం-రేపల్లె-నిజాంపట్నంల మీదుగా బాపట్ల వరకు పొడిగిస్తూ, కాకినాడ-మచిలీపట్నం-నిజాంపట్నం ఓడరేవులను కలుపుతూ కొత్తలైన్ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. వందలకోట్లు ఇస్తున్నా చిన్నచూపే.. దక్షిణ మధ్య రైల్వేకి రూ.900 కోట్లకు పైగా ఆదాయాన్ని తెచ్చి పెడుతున్న మన జిల్లా పట్ల కేంద్ర ప్రభుత్వాలు వివక్ష చూపుతూనే ఉన్నాయి. దశాబ్ద కాలంగా యూపీఏ- 1, 2 హయాంలో ప్రతి రైల్వే బడ్జెట్లో మొండిచేయే మిగిలేది. ఈఏడాది ఫిబ్రవరి 12న అప్పటి రైల్వేమంత్రి మల్లిఖార్జునఖార్గే ప్రవేశపెట్టిన బడ్జెట్లో జిల్లా మీదుగా కొత్తగా సికింద్రాబాద్-విశాఖపట్నం ఏసీ ఎక్స్‌ప్రెస్ మినహా ఒరిగిందేమీ లేదు. జిల్లా కేంద్రమైన కాకినాడను మెయిన్‌లైన్‌కు అనుసంధానించాలన్నది దశాబ్దాల కల. అనుసంధానానికి కాకినాడ-పిఠాపురంల మధ్య 21 కిలోమీటర్ల బ్రాడ్‌గ్రేజ్ లైన్ వేయాలి. రూ.126 కోట్లు వ్యయమయ్యే ఈ ప్రాజెక్టుకు 2012 బడ్జెట్లో రూ.5 కోట్లు కేటాయిస్తే 2013లో రూ.కోటి మాత్రమే విదిల్చారు. ఈ బడ్జెట్లోనైనా ఈ ప్రాజెక్టు పట్టాలెక్కేందుకు అవసరమైన నిధులు మంజూరు చేస్తారని కాకినాడ వాసులు ఆశిస్తున్నారు. కోనసీమకు రైల్వేకూత వినిపించేనా? కోటిపల్లి-నర్సాపురం రైల్వేప్రాజెక్టుకు దివంగత లోక్‌సభాపతి జీఎంసీ బాలయోగి కృషితో 2000 నవంబరు 16న నాటి ఎన్డీఏ హయాంలో పునాదిరాయి పడింది. 55 కిలో మీటర్ల ఈ లైన్ నిర్మాణ వ్యయం 2000లో రూ.329 కోట్లు కాగా ప్రస్తుతం రూ.1100 కోట్లకు చేరింది. ట్రాక్, స్టేషన్ నిర్మాణాలకు 161.43 ఎకరాలు సేకరించగా,ఇప్పటి వరకు ఈ ప్రాజెక్టు కోసం రూ.70 కోట్లు మాత్రమే కేటాయించారు. దీంట్లో అధిక మొత్తం పరిహారానికి, మిగిలింది సర్వేలకు ఖర్చుచేశారు. నిర్మాణ వ్యయంలో 25 శాతం నిధులు ఇచ్చేందుకు దివంగత ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హామీ ఇచ్చినా కేంద్రం పట్టించుకోనేలేదు. ఎంపీలు హామీలు నిలుపుకోవాలి.. కొవ్వూరు-భద్రాచలం రైల్వేలైన్ సర్వేకు 2012 బడ్జెట్లో ఆమోదం తెలిపినా నేటికీ నిధులు కేటాయించలేదు. కాకినాడ నుంచి ఢిల్లీ, కోల్‌కతా, వారణాసిలకు కొత్త రైళ్లు, కాకినాడ రాజమండ్రిల మీదుగా హైదరాబాద్, తిరుపతిలకు ఇంటర్సిటీ ఎక్స్‌ప్రెస్‌లను నడపాలని, సర్కార్ ఎక్స్‌ప్రెస్‌ను పుదుచ్చేరి వరకు పొడిగించాలన్న డిమాండ్లు ఈసారైనా కార్యరూపం దాలుస్తాయని ఆశిస్తున్నారు. నిరుపయోగంగా ఉన్న కాకినాడ- కోటిపల్లి లైన్లో రాయగడ వరకు పాసింజర్ రైలును కొత్తగా ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. మెయిన్‌లైన్, కోనసీమ రైల్వేలైన్ సాధిస్తామని కాకినాడ, అమలాపురం ఎంపీలు తోట నరసింహం, పండుల రవీంద్రబాబు ఎన్నికల్లో హామీలిచ్చారు. తోట లోక్‌సభలో టీడీపీ పక్ష నేతగా ఉన్నందున పెండింగ్ రైల్వేప్రాజెక్టులను పట్టాలెక్కిస్తారని ఆశిస్తున్నారు. -
కేసీఆర్ పదేళ్ల కల..
సిద్దిపేట: సీఎం కేసీఆర్ పదేళ్ల కల.. ఆయన స్వయంగా రూపకల్పన చేసిన రైల్వే ప్రాజెక్టు అది. సీఎం కృషితోనైనా రైలు చూడాలన్న తమ కల నెరవేరాలని సిద్దిపేట ప్రజలు ఎదురుచూస్తున్నారు. కేంద్రమంత్రి హోదాలో కేసీఆర్ రూపకల్పన చేసిన మనోహరాబాద్-సిద్దిపేట-కొత్తపల్లి రైల్వేలైన్‌కు ‘మోడీ’ ప్రభుత్వం పచ్చజెండా ఊపుతుందని ఆశ పడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం మంగళవారం రైల్వేబడ్జెట్ ప్రవేశపెడుతున్న నేపథ్యంలో రైలుమార్గంపై ప్రజల ఆశలు మళ్లీ చిగురించాయి. 'మెదక్ ఎంపీ వెంకటస్వామి మొదలు విజయశాంతి వరకు సిద్దిపేటకు రైలుమార్గం తీసుకువస్తామని హామీలు ఇచ్చినా కార్యాచరణ కు నోచుకోలేదు. ఎంపీలు కొంత ప్రయత్నం చేసినా, వారి ప్రయత్నాలు ఫలించలేదు. దీంతో 2004లో యూపీఏ ప్రభుత్వంలో కేంద్ర కార్మికశాఖ మంత్రిగా ఉన్న టీఆర్ఎస్ అధినేత కె. చంద్రశేఖర్‌రావు సిద్దిపేటకు రైలు తీసుకువచ్చేందుకు మనోహరాబాద్-సిద్దిపేట-కొత్తపల్లి రైల్వేలైన్‌ను ప్రతిపాదించారు. యూపీఏ ప్రభుత్వం ఈ మార్గానికి 2007లో పచ్చజెండా ఊపింది. రైల్వేలైన్ సర్వే పనులు చేపట్టేందుకు రూ.4 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే సర్వే పనులు ప్రారంభానికి నోచుకోలేదు. అప్పటికే టీఆర్ఎస్ యూపీఏ ప్రభుత్వం నుంచి వైదొలగటంతో ఈ ప్రాజెక్టు మరుగునపడింది. కాగా తిరిగి కేసీఆర్ వత్తిడితో కేంద్రం మరోమారు మనోహరాబాద్-సిద్దిపేట-పెద్దపల్లి రైలుమార్గం తాత్కాలిక సర్వే పనుల కోసం రూ.40 కోట్ల నిధులు విడుదల చేసింది. అయితే సకాలంలో సర్వే పనులు పూర్తి చేయకపోవటంతో నిధులు వెనక్కిమళ్లి మరోమారు సిద్దిపేట ప్రజల ఆశలు అడుగంటినట్లైంది. కాగా 2009లో కేంద్రం రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యంతో నూతన రైలుమార్గాల ఏర్పాటుకు ముందుకు వచ్చింది. అయితే కేంద్రం ప్రతిపాదనలు, షరతులు సిద్దిపేట రైలుమార్గానికి అవరోధంగా మారాయి. భూసేకరణ, నూతన రైల్వేమార్గం ఏర్పాటులో 50 శాతం వ్యయం, ప్రాజెక్టు ప్రారంభం నుంచి ఐదేళ్లపాటు రైలుమార్గంలో చోటు చేసుకునే నష్టం భరించాల్సిందిగా కేంద్రం నిబంధనలు విధించింది. కఠినమైన ఈ నిబంధనల కారణంగా రాష్ట్ర ప్రభుత్వం అప్పట్లో ఈ నూతన రైలుమార్గంపై మౌనం వహించింది. నూతన రాష్ట్రంలో రైలుమార్గంపై కోటి ఆశలు తెలంగాణ రాష్ర్టం సిద్ధించటం.. సిద్దిపేట బిడ్డ కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ముఖ్యమంత్రి కావటంతో సిద్దిపేట ప్రజలు మరోమారు రైలుమార్గం కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ప్రజల అవసరాన్ని గుర్తించిన కేసీఆర్ సైతం తన కలల ప్రాజెక్టు మనోహరాబాద్-సిద్దిపేట-కొత్తపల్లి రైల్వేలైన్ కోసం వత్తిడి ప్రారంభించారు. ఆదివారం జరిగిన టీఆర్ఎస్ ఎంపీల సమావేశంలోనూ ఈ రైలుమార్గం కోసం పార్లమెంట్లో పట్టుబట్టాలని ఎంపీలకు సూచించారు. దీంతో మంగళవారం కేంద్రం ప్రవేశపెట్టనున్న రైల్వేబడ్జెట్ కోసం సిద్దిపేట ప్రజలు ఆశగా ఎదురుచూస్తున్నారు. కేంద్రం నిధులు విడుదల చేయటంతోపాటు, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణకు హామీ ఇచ్చిన పక్షంలో సిద్దిపేట ప్రజల కల సాకారమయ్యే అవకాశం ఉంది. సిద్దిపేటకు రైలుమార్గం ఏర్పాటు ద్వారా ఈ ప్రాంతం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతుంది. జహీరాబాద్: జహీరాబాద్ ప్రాంత ప్రయాణికులకు ప్రతి రైల్వే బడ్డెట్‌లోనూ నిరాశే ఎదురవుతోంది. ఈ బడ్డెట్లోనైనా మోక్షం కలుగుతుందేమోనని ప్రజలు ఆశతో ఎదురు చూస్తున్నారు. రైల్వే పెండింగ్ పనులను పూర్తి చేయించే విషయంలో తీవ్ర జాప్యం జరుగుతుండటంపై ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నాలుగు సంవత్సరాలుగా జహీరాబాద్ రైల్వేస్టేషన్లో అనేక పనులు పెండింగ్‌లో ఉన్నాయి. రెండో ప్లాట్ ఫాం, పుట్ ఓవర్ బిడ్జి తదితర పనుల జాప్యంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, రైల్వే అధికారులు స్పందించి రెండో ప్లాట్ ఫాంను నిర్మించి ఇబ్బందులు తీర్చాలని ప్రయాణికులు కోరుతున్నారు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేక తప్పని తిప్పలు ఫుట్ ఓవర్‌బ్రిడ్జి లేని కారణంగా ప్రయాణికులు ఉత్తరం వైపున ఉన్న రైల్వే ద్వారం నుంచే బయటకు వెళ్లాల్సి వస్తోంది. దక్షిణం వైపున వెళ్లే ప్రయాణికులు చుట్టూ తిరిగి వెళ్లేందుకు ఇబ్బందులు పడక తప్పడం లేదు. ఫుట్ ఓవర్ బ్రిడ్జి లేని కారణంగా ప్రయాణికులు రైల్వే ట్రాక్‌ను దాటుకుంటూ మొదటి ప్లాట్‌ఫాం పైకి ఎక్కాల్సి వస్తోంది. కొత్త రైళ్ల కోసం ఎదురు చూపు ఈ బడ్జెట్లో కొత్తగా రైళ్లను మంజూరు చేస్తుందేమోనని ప్రయాణికులు ఆశగా ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్-బీదర్ల మధ్య కొత్తగా రెండో ఇంటర్సిటీ రైలు కావాలని కోరుతున్నారు. హైదరాబాద్ నుంచి బీదర్ వైపు వెళ్లేందుకు ఉదయం పూట ఒక్క రైలు సదుపాయం కూడా లేదు. హైదరాబాద్ నుంచి జహీరాబాద్ మీదుగా ముంబాయికి రైలును మంజూరు చేయాలని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్నారు. రైల్వే విచారణ కౌంటర్ అవసరం ప్రస్తుతం జహీరాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్ల సమాచారం తెలుసుకునేందుకు అవకాశం లేక ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే విచారణ కౌంటర్‌ను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ప్రతిపాదనలకు నోచుకోని డబుల్ లైన్ జహీరాబాద్‌కు డబుల్ రైల్వేలైన్‌ను మంజూరు చేసే విషయంలో రైల్వే శాఖ అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోవటం లేదని పలువురు విమర్శిస్తున్నారు. రంగారెడ్డి జిల్లాలోని వికారాబాద్ నుంచి కర్ణాటకలోని బీదర్ వరకు డబుల్ లైన్ నిర్మించాల్సి ఉంది. వికారాబాద్-బీదర్ల మధ్య కేవలం వంద కిలోమీటర్ల దూరం ఉంది. ఈ మేరకు డబుల్‌లైన్‌ను ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలకు రైళ్ల రాక పోకలు సాగించేందుకు ఇబ్బందులు ఉండవని ప్రయాణికులు పేర్కొంటున్నారు. డబుల్లైన్తో పాటు ఎలక్ట్రిక్ రైళ్లు నడిచేందుకు వీలుగా కూడా నిధులు కేటాయించాలని ప్రజలు కోరుతున్నారు. మెదక్: అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్ పనులు మూడడుగులు ముందుకు...ఆరడుగులు వెనక్కు అన్నట్లు ఉంది. రైల్వేలైన్ మంజూరు కోసం కేంద్రం పచ్చజెండా ఊపి తనవంతు వాటాగా మొదట రూ.25కోట్లు మంజూరు చేసింది. అయితే రాష్ర్ట ప్రభుత్వ నిధుల కోసం ఎదురు చూపులు తప్పడం లేదు. భూ సేకరణ ప్రక్రియ సైతం నత్తనడకన నడుస్తోంది. నేటి రైల్వే బడ్జెట్లో కేంద్రం తనవంతు మిగతా బడ్జెట్‌ను మంజూరు చేయాలని రైల్వే సాధన సమితి సభ్యులు విజ్ఞప్తి చేస్తున్నారు. అనేక పోరాటాల ఫలితంగా అక్కన్నపేట-మెదక్ రైల్వేలైన్‌కు నిర్మాణం కోసం అవసరమైన రూ.129 కోట్ల వ్యయంలో 50 శాతం వాటా భరించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 2007లో అంగీకారం తెలిపారు. దీంతో 2010 రైల్వే బడ్జెట్లో కాస్ట్ ఆఫ్ షేరింగ్ కింద కొత్త రైల్వేలైన్ల జాబితాలో మెదక్ -అక్కన్నపేట లైన్‌కు చోటుదక్కింది. 2012 రైల్వే బడ్జెట్లో మెదక్ రైల్వే లైన్‌కు పచ్చజెండా లభించింది. ఈ మేరకు రైల్వే శాఖ నుండి రూ 1 కోటి, రాష్ట్ర ప్రభుత్వం రూ1 కోటి, ఎంపీ విజయశాంతి తన కోటా నుండి రూ.1 కోటి, 2013 బడ్జెట్లో రూ 1.10 కోట్లు మంజూరయ్యాయి. ఈ మేరకు రైల్వే లైన్ సర్వే, భూవివరాల సేకరణ, రైల్వే స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియలు ప్రారంభమయ్యాయి. ఇందుకు 80 గ్రామాల పరిధిలోని 131.14 హెక్టార్ల భూమితో పాటు, అటవీ శాఖకు చెందిన 66 హెక్టార్ల భూమి అవసరమవుతుందని అధికారులు తేల్చారు. ఎట్టకేలకు 2014 జనవరి 19న అప్పటి మెదక్ ఎంపీ విజయశాంతి, మంత్రి సునీతారెడ్డిల చేతుల మీదుగా రైల్వేలైన్‌కు శంకుస్థాపన జరిగింది. అనంతరం ఫిబ్రవరిలో కేంద్ర ప్రభుత్వం రైల్వేలైన్ కోసం తనవంతు వాటాగా రూ.25కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులను ఎన్సీఆర్ కన్స్ట్రక్షన్ విభాగానికి పంపించారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం వాటాగా మిగతా నిధులు మంజూరు కావాల్సి ఉంది. భూ సేకరణకు సంబంధించి ఇప్పటికే రెవెన్యూ, రైల్వే అధికారుల ఉమ్మడి సారథ్యంలో సర్వే పూర్తయ్యింది. ఈ మేరకు సర్వే రిపోర్టులను, సర్వే ల్యాండ్స్ అండ్ రెవెన్యూ అసిస్టెంట్ డెరైక్టర్‌కు పంపుతూ... సబ్‌డివిజన్ రికార్డులను తమకు అందజేయాలని కోరారు. కాని ఇంత వరకు అలాంటి రికార్డులు తయారు కాలేనట్లు తెలుస్తోంది. -
దశలవారీగా నియోజకవర్గ అభివృద్ధి
కర్నూలు(కలెక్టరేట్) : దశలవారీగా పార్లమెంట్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేస్తున్నట్లు కర్నూలు ఎంపీ బుట్టా రేణుక తెలిపారు. గురువారం ఆమె కలెక్టర్ సి.సుదర్శన్‌రెడ్డిని ఆయన చాంబర్లో కలిసి అభివృద్ధికి పూర్తి సహకారం అందించాలని కోరారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు భూ సేకరణ, కోడుమూరు-మంత్రాలయం రైల్వేలైన్ సర్వే వివరాలు తీసుకుని రైల్వే మంత్రిని కలుస్తామన్నారు. కేంద్ర విద్యా సంస్థలను జిల్లాకు తీసుకురావడానికి ప్రయత్నిస్తానని పేర్కొన్నారు. జిల్లాలో ఏ పరిశ్రమలు ఉన్నాయి, ఏ పరిశ్రమలు నెలకొల్పవచ్చు అనే దానిపై జిల్లా యంత్రాంగం నుంచి నివేదిక తీసుకుంటామని తెలిపారు. సీమాంధ్రలో జిల్లా అన్ని రంగాల్లో వెనుకబడిందని ఇక్కడ పరిశ్రమలతో పాటు విద్యా సంస్థలు నెలకొల్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. నీటి సమస్య పరిష్కారంపై తన వంతు కృషి చేస్తానన్నారు. నీటి సమస్య పరిష్కారం కోసం జిల్లాకు 24 టీఎంసీల నీటిని కేటాయిస్తే 16 టీఎంసీలు మాత్రమే వస్తుందని, కోటాను మరింత పెంచాల్సిన అవసరం ఉందని చెప్పారు. నీటి సమస్య పరిష్కారానికి అత్యవసరంగా తీసుకోవాల్సిన చర్యలను కలెక్టర్‌తో చర్చించినట్లు అందుకు కలెక్టర్ కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఎన్నికల సమయంలో నియోజకవర్గంలో పర్యటించి ప్రజా సమస్యలన్నింటినీ తెలుసుకున్నానని, వీటి పరిష్కారంపై దృష్టి సారిస్తామన్నారు. -
రైల్వే లైన్లపై రాష్ట్రం చిన్నచూపు
సాక్షి ప్రతినిధి, అనంతపురం : జిల్లాలో రైల్వే ప్రాజెక్టుల భవితను కిరణ్ సర్కారు ప్రశ్నార్థకం చేస్తోంది. రైల్వే, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త భాగస్వామ్యంతో చేపట్టిన ప్రాజెక్టులకు తన వాటా ధనాన్ని సర్కారు కేటాయించడం లేదు. ఇదే అలుసుగా తీసుకున్న రైల్వే శాఖ ఆ ప్రాజెక్టులకు నిధులు కేటాయించడం లేదు. అందుకు తార్కా ణం రాయదుర్గం- తుమకూరు రైలు మార్గమే. 2012-13, 2013-14 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఒక్క పైసా కేటాయించక పోవడంతో రైల్వే శాఖ కూడా నిధులు కేటాయించలేదు. 2014-15 బడ్జెట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించలేదు. ఈ నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు రైల్వే శాఖ నిధులు కేటాయించే అవకాశం లేదని ఆ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి. చిక్‌బళ్లాపుర-పుట్టపర్తి, పుట్టపర్తి-కదిరి రైల్వే మార్గాలదీ అదే పరిస్థితి. రాయదుర్గం-తుమకూరు, కదిరి-పుట్టపర్తి, పుట్టపర్తి-చిక్‌బళ్లాపుర రైల్వే మార్గాలను నిర్మించాలని దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి కేంద్రంపై తీవ్ర స్థాయిలో ఒత్తిడి తెచ్చారు. ఆ ప్రాజెక్టుల నిర్మాణానికి అయ్యే వ్యయంలో 50 శాతం రాష్ట్ర ప్రభుత్వం భరిస్తే.. చేపట్టడానికి సిద్ధమైనని రైల్వే శాఖ ప్రకటించింది. ఈ ప్రతిపాదనకు వైఎస్ ఏకీభవించడంతో 2008-09 బడ్జెట్లో ఆ మూడు మార్గాలను రైల్వే శాఖ మంజూరు చేసింది. వైఎస్ మరణంతో ఆ మూడు ప్రాజెక్టులకు గ్రహణం పట్టుకుంది. రాయదుర్గం-తమకూరు రైలు మార్గానికి 2010-11 బడ్జెట్లో ఒక్క పైసా కేటాయించలేదు. 2011-12 బడ్జెట్లో తన వాటా నిధులుగా రూ.40 కోట్లను మంజూరు చేస్తామని రాష్ట్ర ప్రభుత్వం హామీ ఇవ్వడంతో రైల్వే శాఖ అదే ఏడాది బడ్జెట్లో తన వాటాగా రూ.40 కోట్లు మంజూరు చేసింది. కానీ.. 2011-12లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయలేదు. దాంతో.. రైల్వే శాఖ 2012-13 బడ్జెట్లో ఈ రైలు మార్గానికి ఒక్క పైసా కూడా మంజూరు చేయలేదు. 2011-12 బడ్జెట్లో కేటాయించిన నిధులను కూడా వెనక్కి తీసుకుని, రైలుమార్గాన్ని రద్దు చేస్తామని అల్టిమేటం జారీ చేయడంతో 2012 నవంబర్ 16న తన వాటా నిధులు రూ.40 కోట్లను విడుదల చేసింది. దాంతో.. తొలి విడతగా రూ.50 కోట్లతో పనులకు టెండర్లు పిలిచారు. ఇటీవల రూ.30 కోట్ల వ్యయంతో రెండో దశ టెండర్లను పిలిచారు. కానీ.. 2013-14 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులను విడుదల చేయకపోవడంతో రైల్వే శాఖ కూడా నిధులను కేటాయించలేదు. 2014-15 బడ్జెట్లో రాష్ట్ర వ్యాప్తంగా చేపట్టిన రైల్వే ప్రాజెక్టులకు కేవలం రూ.100 కోట్లను మాత్రమే కిరణ్ సర్కారు కేటాయించింది. ఈ నేపథ్యంలో రాయదుర్గం-తుమకూరు రైలు మార్గానికి ఒకవేళ దక్కినా రూ.5 నుంచి రూ.పది కోట్లకు మించవనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇదే అభిప్రాయంతో ఉన్న రైల్వే శాఖ 2014-15 బడ్జెట్లో పెద్దగా నిధులు కేటాయించే అవకాశాలు లేవని ఆశాఖ వర్గాలు చెబుతున్నాయి. రాయదుర్గం- తుమకూరు రైలు మార్గానికి శంకుస్థాపన చేసిన సమయంలో ఆ మార్గాన్ని 2014 నాటికి పూర్తి చేస్తామని సీఎం కిరణ్ హామీ ఇచ్చారు. నిధుల కేటాయింపు ఇలా ఉంటే.. మరో రెండు దశాబ్దాల నాటికి కూడా ఈ ప్రాజెక్టు పూర్తయ్యే అవకాశం ఉండదు. పుట్టపర్తి-కదిరి, పుట్టపర్తి-చిక్‌బళ్లాపుర రైలు మార్గాల నిర్మాణం కోసం రైల్వే బోర్డు సర్వే చేయించింది. అంచనాలను రూపొందించే పనిలో నిమగ్నమైంది. కానీ.. రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడంతో అంచనాల్లోనే ఆ ప్రాజెక్టులను రైల్వే శాఖ పక్కన పెట్టేసింది. -
అటకెక్కిన రైల్వే ప్రాజెక్టులు
గుంతకల్లు, న్యూస్‌లైన్ : దక్షిణ మధ్య రైల్వే జోన్ పరిధిలోని రాయలసీమ ప్రాంతం సర్వతోముఖాభివృద్ధికి ఉద్దేశించిన నూతన రైల్వే ప్రాజెక్టుల నిర్మాణం అటకెక్కింది. ఇవి ఏళ్ల క్రితమే మంజూరైనా.. నిధులు విడుదల చేయడంలో రైల్వే శాఖ పూర్తి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. నూతన రైలు మార్గాలతో పాటు రైలు మార్గాల సర్వేలు, గేజ్ మార్పిడి, డబ్లింగ్, విద్యుద్దీకరణ, ప్రయాణికులు, సిబ్బంది సదుపాయాలకు సంబంధించిన ప్రాజెక్టులన్నింటిదీ ఇదే దుస్థితి. ఇప్పటికే పాలనాపరంగా, సాంకేతికంగా మంజూరైన పనులు చేపట్టాలంటే రూ.వేల కోట్లు అవసరమని రైల్వే అధికారులు చెబుతున్నారు. నిధుల గురించి ఎంపీలు పార్లమెంటులో కనీసం నోరు విప్పడం లేదు. త్రిశంకు స్వర్గంలో నూతన రైలు మార్గాలు మహానేత దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి మంజూరు చేయించిన కడప - బెంగళూరు (వయా బంగారుపేట్) రైలు మార్గం నిర్మాణం ఇప్పటికీ బాలారిష్టాలను అధిగమించలేకపోతోంది. 2008-09 బడ్జెట్లో మంజూరైన ఈ రైలు మార్గం నిర్మాణానికి రాష్ట్ర ప్రభుత్వం 50 శాతం, రైల్వే శాఖ 50 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంది. కడప నుంచి కోలార్ వరకు రైలు మార్గం నిర్మాణానికి రూ.1,760 కోట్లతో అంచనాలు రూపొందించారు. అప్పట్లో సర్వే కోసం రూ.29 కోట్లు కేటాయించారు. అక్కడితో ప్రాజెక్టు ప్రగతి ఆగిపోయింది. నడికుడి - శ్రీకాళహస్తి మధ్య 308.7 కిలోమీటర్ల రైలు మార్గం నిర్మించాలని భావించి 1997-98లోనే రైల్వే బోర్డు అనుమతులను మంజూరు చేసింది. ఇందుకు రూ.539.80 కోట్లు అవసరమని అప్పట్లో అంచనా వేశారు. ఈ వ్యయం నేడు మూడింతలు పెరిగిందని రైల్వే ఇంజనీరింగ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ మార్గం నిర్మాణానికి రాష్ర్ట ప్రభుత్వం ఉచితంగా భూమి ఇస్తామని చెప్పినప్పటికీ రైల్వే శాఖ ముందుకు రావడం లేదు. దీంతో 2004-05 నుంచి వరుసగా అంచనా వ్యయాన్ని సవరించి పంపుతూనే ఉన్నారు. 1996-97లో మంజూరైన నంద్యాల - ఎర్రగుంట్ల మార్గానికి నిధుల కొరత వేధిస్తోంది. దీనివల్ల ఈ మార్గంలోని బనగానపల్లి- నంద్యాల మధ్య పనులు పూర్తి కాలేదు. 1997-98 బడ్జెట్లో మహబూబ్‌నగర్ - మునీరాబాద్ మధ్య 246 కి.మీ మేర మంజూరైన రైలు మార్గం ఇప్పటి వరకు పూర్తి కాలేదు. మంత్రాలయం - కర్నూలు రోడ్డు (వయా ఎమ్మిగనూరు), పుట్టపర్తి-తిరుపతి(వయా కదిరి), గిద్దలూరు- భాక్రాపేట పనుల కోసం పూర్తి స్థాయిలో నిధులు విడుదల చేయడం లేదు. ఇక మార్కాపురం - శ్రీశైలం మధ్య 65 కిలోమీటర్ల రైలు మార్గానికి 2007లో సర్వే చేపట్టారు. సర్వే నివేదికను అదే ఏడాది నవంబరు 26న రైల్వే బోర్డుకు నివేదించారు. అయినప్పటికీ నిధులు మంజూరు కావడం లేదు. నత్తనడకన డబ్లింగ్, విద్యుద్దీకరణ పనులు ఓబుళవారిపల్లె -కృష్ణపట్నం పోర్టు మధ్య దాదాపు 114 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు నిధుల కొరతతో పడకేశాయి. వెంకటాచలం వరకు పనులు పూర్తి చేసి వదిలిపెట్టారు. సికింద్రాబాద్- బెంగళూరు ప్రధాన మార్గంలో సికింద్రాబాద్ నుంచి డోన్ వరకు డబ్లింగ్ చేయాలని రైల్వే శాఖ భావించింది. అయితే... 2006 ఫిబ్రవరిలో సర్వే చేసి చేతులు దులుపుకుంది. ఈ మార్గం డబ్లింగ్ కోసం రూ.534.32 కోట్లు అవసరం. ఇక ముంబయి - చెన్నై ప్రధాన మార్గంలోని రేణిగుంట - నందలూరు మధ్య 85 కి.మీ. విద్యుద్దీకరణ పనులను 2004 జూన్‌లో పూర్తి చేయాల్సి ఉండగా... అష్టకష్టాలు పడి గత ఏడాది పూర్తి చేశారు. నందలూరు - ముద్దనూరు మధ్య 55 కిలోమీటర్లు, ముద్దనూరు - కొండాపురం మధ్య 24 కి.మీ, కొండాపురం - గుంత కల్లు మధ్య 104 కి.మీ పనులు కూడా ఆ ఆర్థిక సంవత్సరంలోనే పూర్తయ్యాయి. నందలూరు - వాడి మధ్య 451 కి.మీ. రైలు మార్గం విద్యుద్దీకరణకు రూ.1,200 కోట్లను కేటాయించారు. ఈ పనులు 2010 డిసెంబరు నాటికే పూర్తి కావాలి. అయితే.. నత్తనడకన కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పూర్తి చేయాలని రైల్వే అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ముందుకు సాగని విద్యుత్తు లోకోషెడ్డు పనులు రైల్వే డివిజన్ కేంద్రమైన గుంతకల్లులో రూ.74.3 కోట్లతో విద్యుత్తు లోకోషెడ్డును ఏర్పాటు చేసేందుకు డీటైల్డు రిపోర్టును రైల్వేబోర్డుకు పంపారు. వంద విద్యుత్తు లోకో ఇంజన్ల సామర్థ్యం గల ఈ షెడ్డులో 600 మందికి పైగా సిబ్బందిని నియమించే అవకాశముంది. దీన్ని 2012 మార్చి 31 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ నిధుల కొరతతో పనులు ముందుకు సాగడం లేదు. దీంతో అంచనా వ్యయం కాస్తా రెటి ్టంపయ్యే అవకాశం ఉందని స్థానిక రైల్వే అధికారులు ఆందోళన చెందుతున్నారు. -
ఐదేళ్లలో రైల్వే పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తి
కేంద్ర మంత్రి మల్లికార్జున ఖర్గే రాయచూరు, న్యూస్‌లైన్ : పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామని రైల్వే శాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే తెలిపారు. శనివారం ఆయన రాయచూరు సమీపంలోని మటమారి రైల్వేస్టేషన్లో మటమారి-మంత్రాలయం రైల్వే స్టేషన్ల మధ్య రైల్వే డబ్లింగ్ (జంట మార్గం) పనులకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా 587 రైల్వే ప్రాజెక్ట్‌ల పూర్తికి రూ.4.50 లక్షల కోట్లు ఆవసరమవుతాయన్నారు. అనంతరం ఆయన రూ.65 కోట్ల వ్యయంతో తుంగభద్ర నదిపై రైల్వే వంతెన పునరుదరణ పనులకు కూడా శంకుస్థాపన చేశారు. రాయచూరులో ముఖ్యమైన ఈ రైల్వే బ్రిడ్జిని త్వరగా పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇప్పటికే జిల్లాలో రైల్వే పనుల జాప్యానికి బాధ్యులైన కాంట్రాక్టర్లను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలని ఆదేశించారు. మటమారి-మంత్రాలయం మధ్య 10 కిలోమీటర్ల డబ్లింగ్ పనులు 18 నెలల్లో పూర్తి అవుతాయన్నారు. సభలో మాట్లాడిన రాయచూరు రూరల్ ఎమ్మెల్యే తిప్పరాజు హవల్దార్... మంత్రి మల్లికార్జున ఖర్గేను హైదరాబాద్-కర్ణాటక అంబేద్కర్గా అభివర్ణించారు. కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే లు, ఎంపీ పక్కీరప్ప, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. -
చిక్కలళ్లాపురం ఇక శాటిలైట్ టౌన్
= సర్వతోముఖాభివృద్ధి చేస్తా = రైల్వే ప్రాజెక్టుల పూర్తికి దశలవారీ నిధులు = కోలారు వద్ద రైల్వేకోచ్ ఫ్యాక్టరీ నిర్మాణానికి త్వరలో చర్యలు = ఇచ్చిన 169 హామీల్లో 60 నెరవేర్చాం = మిగతావి నాలుగేళ్లలో పూర్తి చేస్తాం = చిక్కబళ్లాపురం- కోలారు రైలు ప్రారంభోత్సవ సభలో సీఎం చిక్కబళ్లాపురం, న్యూస్‌లైన్ : బెంగళూరులో జనసంఖ్య రోజురోజుకూ పెరుగుతోందని, తద్వారా తలెత్తుతున్న ఇబ్బందుల పరిష్కారం కోసం చిక్కబళ్లాపురాన్ని శాటిలైట్ టౌన్‌గా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య వెల్లడించారు. దీని వల్ల చిక్కబళ్లాపురంలో రోడ్లు, విద్యుత్, మంచినీటి సరఫరా వంటి మౌలిక సదుపాయాలు పెరుగుతాయని భరోసా ఇచ్చారు. నగరంలోని నందిరంగ మందిరంలో నైరుతి రైల్వే మండలి ఏర్పాటు చేసిన చిక్కబళ్లాపురం - కోలారు రైల్వే బ్రాడ్‌గేజ్, నూతన రైలును ముఖ్యమంత్రి శుక్రవారం ప్రారంభించి ప్రసంగించారు. చిక్కబళ్లాపురలో రైల్వేస్టేషన్ విస్తరణ కోసం ఇళ్లను కోల్పోయే చిక్కబళ్లాపురం, చామరాజపేట కాలనీ వాసులకు పునరావాసం కల్పించడానికి అవసరమైన ప్రణాళికలు పూర్తయ్యాయన్నారు. అందులో భాగంగా 13 ఎకరాల భూమిని ఇప్పటికే ప్రభుత్వం గుర్తించిందన్నారు. రాష్ట్రంలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్టులను పూర్తి చేయడానికి అవసరమైన రూ.10 వేల కోట్లను దశలవారీగా విడుదల చేస్తామన్నారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. కోలారు వద్ద రూ1,400 కోట్లతో రైల్వేకోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయడానికి రాష్ట్ర వాటా కింద రూ. 700 కోట్లు ప్రభుత్వం త్వరలోనే అందిస్తుందన్నారు. ఈ నెల 13 తేదీకి రాష్ర్టంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు పూర్తి చేసుకుంటుందని, ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన 169 హామీల్లో ఇంతవరకు 60 హామీలను నెరవేర్చామని తెలిపారు. మిగిలిన వాటిని నాలుగు సంవత్సరాల్లో పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారు. రైల్వే శాఖ మంత్రి మల్లికార్జునఖర్గే మాట్లాడుతూ రూ.440 కోట్లతో 87 కిలోమీటర్లు పొడవైన కోలారు - చిక్కబళ్లాపురం రైలు మార్గాన్ని ఏర్పాటు చేశామన్నారు. ఈ నిర్మాణంతో అన్ని వర్గాల వారికీ మేలు జరుగుతుందన్నారు. కార్యక్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి వీరప్పమొయిలీ, కేహెచ్ మునియప్ప, రాష్ట్ర ఆహార పౌరసర ఫరాల శాఖామంత్రి దినేశ్‌గుండూరావు, శాసనసభ డిప్యూటీ స్పీకర్ ఎన్‌హెచ్ శివశంకరరెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధాకర్, రాజణ్ణ, జేకే కృష్ణారెడ్డి, ఎస్ఎన్ సుబ్బారెడ్డి, ఎమ్మెల్సీలు నజీర్ అహ్మద్, వైఏ నారాయణస్వామి, జెడ్పీ అధ్యక్షుడు చిన్నప్ప, కలెక్టర్ ఆర్ విశాల్, ఎస్పీ శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రాధాన్యత క్రమంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి
= భూ సేకరణ పూర్తయిన వెంటనే గిణిగెర-మహబూబ్‌నగర్ రైలు మార్గం నిర్మాణ పనులు = రాష్ర్టంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు 12500 ఎకరాల భూమి అవసరం = రైల్వే మంత్రి మల్లికార్జున ఖర్గె రాయచూరు, న్యూస్‌లైన్ : ప్రాధాన్యతక్రమంలో రైల్వే ప్రాజెక్టులు పూర్తి చేస్తామని రైల్వే మంత్రిత్వశాఖ మంత్రి మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. నూతనంగా ఏర్పాటు చేసిన మార్గంలో రాయచూరు-గద్వాల, రాయచూరు-కాచిగూడ రైలు సర్వీసులను శనివారం ఆయన రాయచూరు రైల్వే స్టేషన్లో ప్రారంభించి మాట్లాడారు. వివిధ దశలలో ఉన్న రైల్వే ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తామని చెప్పారు. రాయచూరు రైల్వే స్టేషన్లో రూ. కోటితో ఎక్స్‌వేటర్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చినట్లు చెప్పారు. కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు రైలు మార్గం అనుసంధానానికి శ్రీకారం చుట్టామన్నారు. గిణిగెర- మహబూబ్‌నగర్ రైలు మార్గానికి 2190 ఎకరాల భూమి అవసరం కాగా ఇప్పటికే 1070 ఎకరాలు సేకరించామన్నారు. మిగతా భూ సేకరణ పూర్తయిన వెంటనే రైలు మార్గం పనులు చేపడతామన్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ఇచ్చేందుకు సీఎం సిద్ధరామయ్య ఆధ్వర్యంలోని మంత్రి వర్గం హామీ ఇచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. చిక్కమగళూరు- కడూరు, బీదర్- హుమ్నాబాద్ రైల్వే మార్గాల్లో సర్వే నిర్వహించి రెండు నెలల్లో రైల్వే సంచారం ప్రారంభిస్తామన్నారు. రాష్ట్రంలోని నీటి పారుదల పథకాలకు కేంద్రం రూ.5,500 కోట్లు మంజూరు చేసిందన్నారు. అప్పర్ కృష్ణ పథకం పూర్తి చేయడం రికార్డుగా చెప్పవచ్చన్నారు. 2016 నాటికి మూడున్నర లక్షల ఎకరాలకు నీటిపారుదల సౌకర్యం కలుగుతుందన్నారు. రాయచూరుకు సంబంధించిన వివిధ సమస్యలను పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సూచించారు. రైల్వే శాఖలో సీ, డీ గ్రూప్ ఉద్యోగులకు పదోన్నతి కల్పించి 53 రోజుల నిర్ధిష్ట దినాలను 58 రోజులకు పెంచే తీర్మానం చేశామన్నారు. దీని వల్ల రూ.వెయ్యి కోట్ల ఆర్థిక భారం రైల్వే శాఖపై పడనుందన్నారు. ఆర్టికల్-371(జే) అమలుతో హై-క అభివృద్ధి హై-క అభివృద్ధికి సంబంధించిన ఆర్టికల్-371(జే) సవరణకు రాష్ట్రపతి నుంచి వారం రోజుల్లో గ్రీన్ సిగ్నల్ రానుందన్నారు. దీంతో ఆరు జిల్లాలు అభివృద్ధి బాటలో నడుస్తాయన్నారు. ఈ మండలికి గవర్నర్ అధ్యక్షుడిగా ఉన్నందున అభివృద్ధికి, నిధులకు ఎలాంటి లోటు రాదన్నారు. హై-క అభివృద్ధి మండలి ప్రధాన కార్యాలయం గుల్బర్గాలో ఏర్పాటు కావడం వల్ల ఇతర జిల్లాల వారు అనుమాన పడాల్సింది ఏమి లేదన్నారు. లాభాల బాటలో రైల్వే అనేక సవాళ్ల మధ్య కూడా రైల్వే శాఖ 3 శాతం లాభాలు ఆర్జించిందని మంత్రి మల్లికార్జున ఖర్గే తెలిపారు. భారీ వర్షాలు, సమైక్యాంధ్ర వల్ల కొంత మేర నష్టం కలిగిందన్నారు. సమయపాలన, ప్రజా అవసరాల మేర మార్గాలను రూపొందించడం వల్ల నష్టాలను తగ్గించుకున్నామన్నారు. దేశంలో 16 జోన్లలో అనేక సమస్యలున్నాయని, వాటిని పరిష్కరించేందుకు చర్యలుతీసుకుంటున్నామన్నారు. రాష్ర్టంలో రైల్వే ప్రాజెక్టులు చేపట్టేందుకు 12500 ఎకరాల భూమి అవసరం ఉండగా 2000 ఎకరాల భూమి మాత్రమే లభ్యమైందన్నారు. మిగిలిన భూస్వాధీనానికి చర్యలు తీసుకున్నామని ఉన్నతాధికారి ఏకే.మిత్తల్ తెలి పారు. కార్యక్రమంలో మంత్రులు ఆర్వీ.దేశ్‌పాండే, మహదేవప్ప, శరణప్రకాష్ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు బోసురాజ్, పాపారెడ్డి, జిల్లా ఎమ్మెల్యేలు హంపనగౌడ, హంపయ్య నాయక్, ప్రతాప్‌గౌడ పాటిల్, డీసీసీ అధ్యక్షుడు వసంతకుమార్, జయణ్ణ పాల్గొన్నారు. -
నిధుల కొరత రానివ్వం
సాక్షి, బెంగళూరు : రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టుల నిర్మాణానికి నిధుల కొరత రానివ్వబోమని ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. ప్రస్తుత రైల్వే ప్రాజెక్టులకు రాష్ర్ట వాటాగా ఇవ్వాల్సిన రూ.550 కోట్లను విడుదల చేయాలని గురువారం జరిగిన సమీక్ష సమావేశంలో నిర్ణయించినట్లు వెల్లడించారు. సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఇందులో రూ.200 కోట్లు 2013-14 బడ్జెట్ కేటాయింపులకు అదనమన్నారు. మొత్తం నిధుల్లో రూ.150 కోట్లను ఈ నెలాఖరులోగా, మిగిలిన నిధులను సాధ్యమైనంత త్వరగా విడుదల చేస్తామని తెలిపారు. ప్రాథమిక సదుపాయాల కల్పన శాఖ మంత్రి సంతోష్ లాడ్ మాట్లాడుతూ... రైల్వే ప్రాజెక్టులకు అవసరమైన భూమిని ప్రభుత్వమే సమకూర్చడమే కాకుండా అవసరమైన నిధుల్లో 50 శాతాన్ని భరిస్తోందన్నారు. పదేళ్లలో రాష్ట్రానికి 14 రైల్వే ప్రాజెక్టులు కేటాయించగా మూడు పూర్తయ్యాయన్నారు. మల్లిఖార్జున ఖర్గే రైల్వే శాఖను చేపట్టాక రాష్ట్రానికి ఎనిమిది కొత్త ప్రాజెక్టులను కేటాయించారని చెప్పారు. రైల్వే పనులకు అవసరమైన భూ స్వాధీన ప్రక్రియ బాధ్యతలను కలెక్టర్లకు అప్పగించామన్నారు. రాష్ట్రంలో 2,193 కిలో మీటర్ల మేర రైల్వే లైన్ల నిర్మాణం అవసరం కాగా, 463 కిలో మీటర్లు మాత్రమే పనులు పూర్తయ్యాయన్నారు. ఏడాదికి 100 కిలో మీటర్ల రైల్వే పనులను పూర్తి చేయడానికి మాత్రమే అవసరమైన మౌలిక సదుపాయాలు, సాంకేతిక పరిజ్ఞానం రైల్వే శాఖ వద్ద ఉందన్నారు. ఖర్గే రైల్వే శాఖ మంత్రి అయిన తర్వాత ఏడాదికి 180 నుంచి 200 కిలో మీటర్ల మేర నిర్మాణం జరగాలని లక్ష్య నిర్దేశం చేశారని చెప్పారు. బెంగళూరు-మైసూరు మధ్య డబ్లింగ్ పనులు వచ్చే ఏడాది డిసెంబర్‌కు పూర్తి కావచ్చునని ఆయన ఒక ప్రశ్నకు సమాధానమిచ్చారు. కాగా బెంగళూరులో రైల్వే పనుల కోసం బీబీఎంపీ రూ.20 కోట్లను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు చెక్కురూపంలో అందించింది.