
కొమురవెల్లి మల్లికార్జున స్వామి దేవాలయం
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లన్న జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. స్వామి వారి కల్యాణంతో మూడు నెలలపాటు జరిగే జాతరకు అంకురార్పణ జరగనుంది.
ఈనెల 18న ప్రారంభమై మార్చి 20తో ముగుస్తుంది. మూడు నెలలపాటు బ్రహ్మో త్సవాలు జరిగే ఏకైక శైవక్షేత్రంగా కొమురవెల్లి ప్రసిద్ధి గాంచింది. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. నేటి కల్యాణానికి మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment