mallanna jathara
-
జగిత్యాల జిల్లా: 70వేల మందితో అంగరంగ వైభవంగా మల్లన్నకు బోనాలు (ఫోటోలు)
-
TS: కొండా సురేఖ, పల్లా వాగ్వాదం... ఎందుకంటే
సాక్షి,సిద్దిపేట: మంత్రి కొండా సురేఖ, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది. కొమురవెల్లి మల్లన్న జాతర ఏర్పాట్లపై సిద్ధిపేటలోని హరిత హోటల్లో మంత్రి కొండా సురేఖ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఓడిపోయిన కాంగ్రెస్ నాయకులను స్టేజిపైకి పిలవడమేంటని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో అలిగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి సమావేశం నుంచి వెళ్లిపోయారు. సంప్రదాయాలకు , ఆచారాలకు వ్యతిరేకంగా మల్లన్న జాతరపై సిద్దిపేటలో సమావేశం పెట్టడం ఏంటని పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఓడిన వ్యక్తిని స్టేజి మీదకు పిలవడం చాలా దురదృష్టకరం అన్నారు. శ్రీ మల్లికార్జున స్వామి గుడిలో దోచుకోవడానికి కాంగ్రెస్ నాయకులను పిలుస్తున్నారు. 30 ఏండ్ల చరిత్రలో ఎప్పుడు సమావేశం హోటల్లో పెట్టలేదని, ఈ సమావేశాన్ని తాను బహిష్కరించానని పల్లా చెప్పారు. పల్లా వ్యాఖ్యలపై మంతత్రి కొండా సురేఖ స్పందించారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ ఉండలేక సమావేశం నుంచి వెళ్లి పోయారన్నారు. తమకు ఎవరినైనా ప్రత్యేకంగా పిలుచుకునే అధికారం ఉంటుందన్నారు. పల్లా ప్రోటోకాల్ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇదీచదవండి..భట్టి పదే పదే అదే చెప్తున్నారు..జగదీష్‌రెడ్డి -
మల్లన్న ఆలయంలో ప్రత్యేక పూజలు
కొమురవెల్లి(సిద్దిపేట): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం గణపతిపూజ, స్వస్తివాచనం, రుద్రహోమం, అష్టోత్తర శతకళషాభిషేకం, అన్నపూజ, సహస్త్ర బిల్వార్చణ మొదలగు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దంపతులు హాజరై రుద్రహోమం, విశేష అభిషేక అర్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్గీస భిక్షపతి, ఈవో బాలాజీ, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ఏఈవోలు అంజయ్య, శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్, ఆలయ ధర్మకర్తలు సౌజన్య, గిరిధర్, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కొమురవెల్లి మల్లన్న జాతర
సాక్షి, సిద్దిపేట: సిద్దిపేట జిల్లా కొమురవెల్లిలో మల్లన్న జాతర ఆదివారం నుంచి ప్రారంభం కానుంది. స్వామి వారి కల్యాణంతో మూడు నెలలపాటు జరిగే జాతరకు అంకురార్పణ జరగనుంది. ఈనెల 18న ప్రారంభమై మార్చి 20తో ముగుస్తుంది. మూడు నెలలపాటు బ్రహ్మో త్సవాలు జరిగే ఏకైక శైవక్షేత్రంగా కొమురవెల్లి ప్రసిద్ధి గాంచింది. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక నుంచి భక్తులు భారీగా తరలివస్తారు. నేటి కల్యాణానికి మంత్రులు హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డి, జనగామ ఎమ్మెల్యే యాదగిరిరెడ్డి ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, తలంబ్రాలను సమర్పించనున్నారు. -
జగిత్యాల జిల్లా పెద్దాపూర్ లో వైభవంగా మల్లన్న బోనాల జాతర
-
భక్త జన సంద్రం.. మల్లన్న గుట్ట
కల్హేర్,న్యూస్‌లైన్: మాసాన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవునిపల్లి శివారులోని మల్లన్న జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి సంగారెడ్డి-నాందేడ్ ప్రధాన రహదారి పక్కనే దేవునిపల్లి గ్రామ శివారులో గుట్టపై వెలసిన మల్లన్న దేవుని జాతర ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేవునిపల్లి, మాసాన్‌పల్లి, మహదేవుపల్లి, బాచేపల్లి, ఖానాపూర్(బి), రాంరెడ్డిపేట, మీర్ఖాన్పేట, రాపర్తి, కల్హేర్, నిజామాబాద్ జిల్లా ఆరేడ్, అరేపల్లి, వెల్గనూర్, బ్రాహ్మణ్‌పల్లి, తదితర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో జాతరకు తరలివచ్చి మల్లన్న దేవునికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మల్లన్న జాతరతో ఇక్కడి పరిసరాలు భక్త జన సంద్రంగా మారాయి. గుట్ట పరిసరాల్లో ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడాయి. జాతరలో గిరిజన మహిళల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జాతరకు ముస్లింలు సైతం హాజరై మత సామరాస్యాన్ని చాటారు. జాతర సందర్భంగా పలు దుకాణాలు వెలిశాయి. భక్తులు మిఠాయిలు కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీరారు. మల్లన్న గుట్ట చుట్టూ బండ్ల ఊరేగింపు ప్రదర్శన జరిగింది. జాతరతో పరిసరాల్లో భక్తి పారవశ్యం అలుముకుంది. గుట్టపై ఉన్న మెట్ల ద్వారా మల్లన్న దేవుని వద్దకు చేరేందుకు వృద్ధులు, కొందరు భక్తులు ఇబ్బందులు పడ్డారు.ఈతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాగు నీటి సౌకర్యం కల్పించారు. పెద్దశంకరంపేటకు చెందిన శివకుమార్ జాతరలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్లూరి గోపాల్, మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి గ్రామ ప్రముఖులు నారాయణరావు, సంజీవరెడ్డి, నారాయణ, ఆగంగౌడ్, ద్యావల శ్రీనివాస్, యూత్ బాధ్యులు పాల్గొన్నారు. కల్హేర్,న్యూస్‌లైన్: మాసాన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవునిపల్లి శివారులోని మల్లన్న జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి సంగారెడ్డి-నాందేడ్ ప్రధాన రహదారి పక్కనే దేవునిపల్లి గ్రామ శివారులో గుట్టపై వెలసిన మల్లన్న దేవుని జాతర ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేవునిపల్లి, మాసాన్‌పల్లి, మహదేవుపల్లి, బాచేపల్లి, ఖానాపూర్(బి), రాంరెడ్డిపేట, మీర్ఖాన్పేట, రాపర్తి, కల్హేర్, నిజామాబాద్ జిల్లా ఆరేడ్, అరేపల్లి, వెల్గనూర్, బ్రాహ్మణ్‌పల్లి, తదితర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో జాతరకు తరలివచ్చి మల్లన్న దేవునికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మల్లన్న జాతరతో ఇక్కడి పరిసరాలు భక్త జన సంద్రంగా మారాయి. గుట్ట పరిసరాల్లో ఎటు చూసినా భక్తులతో కిటకిటలాడాయి. జాతరలో గిరిజన మహిళల నృత్యాలు ఆకట్టుకున్నాయి. జాతరకు ముస్లింలు సైతం హాజరై మత సామరాస్యాన్ని చాటారు. జాతర సందర్భంగా పలు దుకాణాలు వెలిశాయి. భక్తులు మిఠాయిలు కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీరారు. మల్లన్న గుట్ట చుట్టూ బండ్ల ఊరేగింపు ప్రదర్శన జరిగింది. జాతరతో పరిసరాల్లో భక్తి పారవశ్యం అలుముకుంది. గుట్టపై ఉన్న మెట్ల ద్వారా మల్లన్న దేవుని వద్దకు చేరేందుకు వృద్ధులు, కొందరు భక్తులు ఇబ్బందులు పడ్డారు.ఈతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాగు నీటి సౌకర్యం కల్పించారు. పెద్దశంకరంపేటకు చెందిన శివకుమార్ జాతరలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్లూరి గోపాల్, మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి గ్రామ ప్రముఖులు నారాయణరావు, సంజీవరెడ్డి, నారాయణ, ఆగంగౌడ్, ద్యావల శ్రీనివాస్, యూత్ బాధ్యులు పాల్గొన్నారు.