భక్త జన సంద్రం.. మల్లన్న గుట్ట | great celebrations of mallanna jathara in mansanpally | Sakshi
Sakshi News home page

భక్త జన సంద్రం.. మల్లన్న గుట్ట

Published Sun, Dec 22 2013 11:46 PM | Last Updated on Sat, Sep 2 2017 1:51 AM

great celebrations of mallanna jathara in mansanpally

కల్హేర్,న్యూస్‌లైన్:  మాసాన్‌పల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని దేవునిపల్లి శివారులోని మల్లన్న జాతర ఉత్సవాలు ఆదివారం ఘనంగా జరిగాయి సంగారెడ్డి-నాందేడ్ ప్రధాన రహదారి పక్కనే దేవునిపల్లి గ్రామ శివారులో గుట్టపై వెలసిన మల్లన్న దేవుని జాతర ఉత్సవాలను ప్రతి ఏటా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. దేవునిపల్లి, మాసాన్‌పల్లి, మహదేవుపల్లి, బాచేపల్లి, ఖానాపూర్(బి), రాంరెడ్డిపేట, మీర్ఖాన్‌పేట, రాపర్తి, కల్హేర్, నిజామాబాద్ జిల్లా ఆరేడ్, అరేపల్లి, వెల్గనూర్, బ్రాహ్మణ్‌పల్లి, తదితర గ్రామాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో జాతరకు తరలివచ్చి మల్లన్న దేవునికి పూజలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. మల్లన్న జాతరతో ఇక్కడి పరిసరాలు భక్త జన సంద్రంగా మారాయి. గుట్ట పరిసరాల్లో ఎటు చూసినా  భక్తులతో కిటకిటలాడాయి. జాతరలో గిరిజన మహిళల నృత్యాలు ఆకట్టుకున్నాయి.

జాతరకు ముస్లింలు సైతం హాజరై మత సామరాస్యాన్ని చాటారు. జాతర సందర్భంగా పలు దుకాణాలు వెలిశాయి. భక్తులు మిఠాయిలు కొనుగోలు చేసేందుకు దుకాణాల వద్ద బారులు తీరారు. మల్లన్న గుట్ట చుట్టూ బండ్ల ఊరేగింపు ప్రదర్శన జరిగింది. జాతరతో పరిసరాల్లో భక్తి పారవశ్యం అలుముకుంది. గుట్టపై ఉన్న మెట్ల ద్వారా మల్లన్న దేవుని వద్దకు చేరేందుకు వృద్ధులు, కొందరు భక్తులు ఇబ్బందులు పడ్డారు.ఈతరం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తాగు నీటి సౌకర్యం కల్పించారు. పెద్దశంకరంపేటకు చెందిన శివకుమార్ జాతరలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సర్పంచ్ వల్లూరి గోపాల్, మాజీ సర్పంచ్ మోహన్‌రెడ్డి గ్రామ ప్రముఖులు నారాయణరావు, సంజీవరెడ్డి, నారాయణ, ఆగంగౌడ్, ద్యావల శ్రీనివాస్, యూత్ బాధ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement