
కొమురవెల్లి(సిద్దిపేట): దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా కొమురవెల్లి మల్లికార్జున స్వామి ఆలయంలో ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. బుధవారం గణపతిపూజ, స్వస్తివాచనం, రుద్రహోమం, అష్టోత్తర శతకళషాభిషేకం, అన్నపూజ, సహస్త్ర బిల్వార్చణ మొదలగు కార్యక్రమాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ దంపతులు హాజరై రుద్రహోమం, విశేష అభిషేక అర్చన నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్‌గీస భిక్షపతి, ఈవో బాలాజీ, ఆలయ ప్రధానార్చకులు మహదేవుని మల్లికార్జున్, ఏఈవోలు అంజయ్య, శ్రీనివాస్, పర్యవేక్షకులు నీల చంద్రశేఖర్, ఆలయ ధర్మకర్తలు సౌజన్య, గిరిధర్, బుచ్చిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

రుద్రహోమం నిర్వహిస్తున్న కలెక్టర్‌ప్రశాంత్ జీవన్ పాటిల్ దంపతులు
Comments
Please login to add a commentAdd a comment