టెన్త్‌లో శతశాతంఉత్తీర్ణత సాధించాలి
జిల్లా విద్యాధికారి శ్రీనివాస్‌రెడ్డి
దుబ్బాక: పదో తరగతిలో శత శాతం ఉత్తీర్ణత సాధించేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక దృష్టిసారించాలని డీఈఓ శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దుబ్బాక మున్సిపల్ పరధిలోని దుంపలపల్లి, లచ్చపేటలోని పీఎస్‌తో పాటు చీకోడ్, గంభీర్‌పూర్, రామక్కపేట జెడ్పీహెచ్‌ఎస్ పాఠశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా టెన్త్ విద్యార్థులతో మాట్లాడి పాటు పలు సూచనలు ఇచ్చారు.విద్యార్థి జీవితంలో పదవతరగతి తొలిమెట్టు అన్నారు. బాగా కష్టపడి చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరారు. ఉపాధ్యాయులు విద్యార్థులను దత్తత తీసుకొని బాగా చదివించాలన్నారు. వంద శాతం ఉత్తీర్ణత సాధించేందకు ఉపాధ్యాయులు శక్తివంచన లేకుండా కృషి చేయాలన్నారు. స్లిప్ టెస్ట్‌లు, ప్రాక్టీస్ పరీక్షలు నిర్వహించి విద్యార్థులను సన్నద్ధం చేయాలన్నారు. విద్యార్థులకు ఉదయం, సాయంత్రం వేళ స్నాక్స్ అందించాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ ప్రభుదాసు తదితరులు ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment