
జాతీయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
హుస్నాబాద్: బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో జాతీయ అవార్డు కోసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ రాష్ట్ర కమిటీ సభ్యుడు ముక్కెర సంపత్ కుమార్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంస్థ 18వ సదస్సును మార్చి 25న మహారాష్ట్రలోని పూణెలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాలకు సంబంధించి 500 మంది దళిత బహుజన సాహితీ వేత్తలు సదస్సులో పాల్గొంటారని తెలిపారు. సామాజిక, సాహిత్య, వైద్య, క్రీడా, కళారంగాల్లో విశిష్ట సేవలందిస్తున్న మారుమూల ప్రాంతాల వ్యక్తులకు జాతీయ స్థాయిలో అవార్డులు ప్రదానం చేయనున్నట్లు ఆయన తెలిపారు.
ముదిరాజ్‌లను
బీసీ ఏ లోకి మార్చండి
చిన్నకోడూరు(సిద్దిపేట): ఎన్నికల ముందు ఇచ్చిన హామీకి కట్టుబడి కాంగ్రెస్ ప్రభుత్వం ముదిరాజ్‌లకు న్యాయం చేయాలని సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జంగిటి శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం చిన్నకోడూరులో ఆయన మాట్లాడుతూ ముదిరాజ్‌లను బీసీ డీ నుంచి ఏ లోకి మార్చాలన్నారు. పిల్లలను ఎక్కువగా పంపిణీ చేస్తామని చెప్పి ఒక్క చేప పిల్లను కూడా చెరువుల్లో వదలలేదన్నారు. ముదిరాజ్‌లకు న్యాయం చేసే వరకు ఆందోళనలు కొనసాగిస్తామన్నారు.
ఘనంగా మాతృభాషా దినోత్సవం
చిన్నకోడూరు(సిద్దిపేట): అంతర్జాతీయ మాతృ భాషా దినోత్సవం పురస్కరించుకుని మండల పరిధిలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. మాతృ భాషా గొప్పదనం గురించి విద్యార్థులకు వివరించారు. అనంతసాగర్ ఉన్నత పాఠశాలలో అ అక్షరాకృతిలో విద్యార్థులు కూర్చున్నారు.
నల్లాలకు మోటార్లు బిగించొద్దు
మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్‌కుమార్
ప్రశాంత్‌నగర్(సిద్దిపేట): నల్లాలకు మోటార్లు బిగించడం సరికాదని, ఎవరైనా బిగిస్తే చర్యలు తీసుకుంటామని మున్సిపల్ కమిషనర్ ఆశ్రిత్ కుమార్ హెచ్చరించారు. పట్టణంలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం ఆయన పర్యటించారు. పారిశుద్ధ్య పనులు, తాగునీటి సరఫరా తీరును పరిశీలించారు. రంగధాంపల్లిలో పలువురు తాగునీటిని వృథా చేయడం గమనించిన ఆయన నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు. నీటి సరఫరా ఖర్చుతో కూడుకున్నదని, వృథా కాకుండా చూడాలని చెప్పారు. అలాగే చెత్తను బహిరంగ ప్రాంతాల్లో వేయకుండా మున్సిపల్ వాహన సిబ్బందికి అందజేయాలని సూచించారు. ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కలు ఉండడం గమనించి ఆ స్థలం యజమానికి నోటీసులు జారీ చేయాలని టౌన్ ప్లానింగ్ సిబ్బందిని ఆదేశించారు.
బ్యాంకు ఉద్యోగుల నిరసన
సిద్దిపేటకమాన్: సమస్యలు పరిష్కరించాలంటూ బ్యాంకు ఉద్యోగులు సిద్దిపేటలోని యూనియన్ బ్యాంకు రీజినల్ కార్యాలయం ఎదుట శుక్రవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బ్యాంకు సిబ్బంది మాట్లాడుతూ.. బ్యాంకుల్లో తగినంత సిబ్బంది లేకపోవడంతో పని ఒత్తిడి పెరిగిందన్నారు. అవుట్ సోర్సింగ్ విధానం రద్దు చేయాలని, బ్యాంకుల విలీనం చేయకుండా ఆపాలని, ఐదు రోజుల పనిదినాలు, ఫిక్స్ డిపాజిట్లపై వడ్డీ రేట్లు పెంచాలని, పలు రకాల తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. కార్యక్రమంలో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ , కెనరా బ్యాంకు ఉద్యోగులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

జాతీయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం

జాతీయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
Comments
Please login to add a commentAdd a comment