గోటి తలంబ్రాల దీక్షలో పాల్గొనడం అదృష్టం
గజ్వేల్‌రూరల్: భద్రాచల సీతారాముల కల్యాణోత్సవంలో వినియోగించే గోటి తలంబ్రాలను సిద్ధం చేసే కార్యక్రమంలో భాగస్వాములవడం తమ అదృష్టమని డీసీసీ అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి అన్నారు. భద్రాచలం నుంచి గోటి తలంబ్రాలను సిద్ధం చేసేందుకు వడ్లు శుక్రవారం గజ్వేల్‌కు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పట్టణంలోని మురళీకృష్ణాలయంలో రామకోటి భక్తసమాజం ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నర్సారెడ్డి మాట్లాడుతూ గజ్వేల్ ప్రాంతానికి 3వ సారి గోటి తలంబ్రాల కోసం వడ్లు రావడం అభినందనీయమన్నారు. ఈ సందర్భంగా రామకోటి రామరాజు సేవలను కొనియాడుతూ అభినందించారు. కార్యక్రమంలో సామాజిక సమరసతా వేదిక రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ నరేష్‌బాబు, ఏఎంసీ చైర్మన్ నరేందర్‌రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ రాజమౌళి, ఏఎంసీ వైస్‌చైర్మన్ సర్ధార్‌ఖాన్, దేవాలయ ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. ఇదిలా ఉంటే పోస్టాఫీస్ కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులో ఉండేలా కృషి చేసిన డీసీసీ అధ్యక్షుడుని పోస్టల్ అధికారులు శాలువ కప్పి సన్మానించారు.
డీసీసీ అధ్యక్షుడు నర్సారెడ్డి
Comments
Please login to add a commentAdd a comment